అఘాయిత్యానికి, హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలకు పరామర్శ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 23న (బుధవారం) గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అఘాయిత్యానికి, హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతిని బుధవారం ఉదయం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆ యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోనున్నారు. ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం పరామర్శించనున్నారు. అనంతరం నేరుగా పులివెందులకు వెళ్లనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment