ఈనెల 23న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ | YS Jagan will visit Guntur,YSR District on October 23rd | Sakshi
Sakshi News home page

ఈనెల 23న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

Published Mon, Oct 21 2024 8:12 PM | Last Updated on Mon, Oct 21 2024 9:49 PM

YS Jagan will visit Guntur,YSR District on October 23rd

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్టోబ‌ర్ 23న (బుధ‌వారం) గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అఘాయిత్యాలకు గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు.

టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తెనాలికి చెందిన యువతిని వైఎస్ జ‌గ‌న్ పరామర్శించనున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌  పరామర్శించనున్నారు.

ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం పరామర్శించనున్నారు వైఎస్‌ జగన్‌. అనంతరం వైఎస్‌ జగన్‌ నేరుగా పులివెందులకు వెళ్ల‌నున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement