
సాక్షి, నెల్లూరు: ఈ నెల 19వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఎన్నికల ముందు కీలక సమావేశం కానుందని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.
అనంతరం నెల్లూరు వైఎస్సార్ సీపీ జిల్లా ఇంచార్జి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సదస్సులో బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నేతలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment