
సాక్షి, తిరుపతి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగే వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణ స్వామి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకి వైఎస్ జగన్ బయలుదేరారు. సమర శంఖారావ సభకు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో సభ జరిగే ఎస్వీజీఎస్ మైదానం వద్దకు జగన్ చేరుకోనున్నారు.