హైదరాబాద్: తమిళనాడు తరహాలో రాష్ట్రం లో కూడా దామాషా ప్రాతిపదికన రిజర్వే షన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 50%నికి పెంచాలని, లేనిప క్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో బీసీల పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ విషయాలపై మే 28న నగరంలో బీసీల సమర శంఖా రావం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బీసీలంతా ఈ శంఖారా వానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ప్రకారం రిజర్వే షన్లు పెంచాలని తాము పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. మా విషయంలో చూపని తొందర మైనార్టీ రిజర్వేషన్లలో మాత్రం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు.