మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం
సాక్షి, విజయవాడ: మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. బడుగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికే 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వెలమ సామాజిక వర్గాన్ని కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచేయి చూపారు. టీడీపీ జాబితాలో ముస్లిం మైనార్టీ సీట్లు కేవలం మూడే కేటాయించారు. ఇప్పటివరకు 139 స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించగా, బీసీ-31, ముస్లిం మైనార్టీ-3, ఎస్సీ-26, ఎస్టీ-04, కాపు-09, కమ్మ 30, రెడ్డి-28, వైశ్య-02, క్షత్రియ-05, వెలమ-01 సీట్లు కేటాయించారు.
సామాజిక న్యాయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక
సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు సీఎం జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు.
జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment