
సాక్షి, విజయవాడ: కూటమికి విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏతోనే తమ ప్రయాణం అని.. ఇవాళ ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నానని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, కానీ ఇది చారిత్రాత్మక ఎన్నికగా పేర్కొన్నారు.
రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయన్న చంద్రబాబు.. కూటమికి 58 శాతం ఓట్లు వచ్చాయని.. ఇది ఊహించని పరిణామం అన్నారు. కమిట్‌మెంట్, త్యాగాల ఫలితమే కూటమి గెలుపు. సూపర్ సిక్స్ ఇచ్చాం. మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయి’’ అని చంద్రబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment