May 30th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections 2024: May 30th Political Updates In Telugu | Sakshi
Sakshi News home page

May 30th AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Thu, May 30 2024 7:08 AM | Last Updated on Thu, May 30 2024 9:47 PM

AP Elections 2024: May 30th Political Updates In Telugu

May 30th AP Elections 2024 News Political Updates..

09:37 PM, May 30th, 2024
ఇక్కడి జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీ

  • పల్నాడు హింసకు సంబంధించి దాదాపు 1200 మందిని అరెస్టు 
  • ఇలాంటి ఘటనలతో దేశవ్యాప్తంగా పేరు కెక్కడం దురదృష్టకరం
  • జిల్లా ఘటనలపై నా స్నేహితులు సైతం ఆరా తీస్తున్నారు
  • కర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, దాడులు అవసరమా? 
  • నరసరావుపేట జైలులో ఖాళీలేక నిందితులను రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాం

మీడియాతో ఎస్పీ మలికా గార్గ్‌   

07:40 PM, May 30th, 2024
మెమో వెనక్కి అంటే తప్పు చేసినట్లే కదా: పేర్ని నాని

  • ఏపీ ఎన్నికల సీఈవో , కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయి
  • ఈ విషయాన్ని మేం ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నాం  
  • ఆధారాలతో టీడీపీ తప్పుల పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ఈనాడు,ఆంధ్రజ్యోతి పేపర్ లో వార్త వచ్చినా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు  
  • టీడీపీ పై పొరపాటున కేసులు కనిపిస్తే కలెక్టర్లను , ఆర్వోలను బెదిరిస్తున్నారు
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులపై సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు
  • టీడీపీ , బీజేపీ పై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు
  • పోస్టల్ బ్యాలెట్ విషయంలో నిబంధనలకు మీరి సీఈవో ముకేష్ కుమార్ మీనా వ్యవహరించారు  
  • స్టాంప్ వేయకపోయినా... డిజిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదని మెమో జారీ చేశారు .  
  • చట్టాన్ని మీరి రూల్స్ తయారు చేస్తున్నారు
  • ఈ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించారు
  • అందుకే మేము కోర్టులో లంచ్ మోషన్ వేశాం
  • దేశం లో ఏ రాష్ట్రం లో లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారు
  • తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ముకేష్ కుమార్ మీనా కోర్టుకు తెలిపారు
  • మెమో వెనక్కి తీసుకున్నారంటే ఆయన తప్పుచేసినట్లేకదా
  • ముకేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోను కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధించడం అన్యాయం
  • కేంద్ర ఎన్నికల సంఘం పై ఇచ్చిన వెసులు బాటు పై కోర్టులో పోరాడుతున్నాం 
  • ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది
  • చంద్రబాబు , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో ధర్మం గెలిచి తీరుతుంది

07:09 PM, May 30th, 2024
రేపు గవర్నర్‌ను కలవనున్న పురందేశ్వరి
 
  • ఏపీ రాజ్‌భవన్‌కు బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి
  • ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న పురంధేశ్వరి
  • శుక్రవారం రాజ్‌భవన్‌ వెళ్లనున్న పురంధేేశ్వరి

06:09 PM, May 30th, 2024
విజయవాడ గడ్డ- ఇక వైఎస్సార్ సీపీ అడ్డా

  • విజయవాడ పార్లమెంట్ సీట్‌లో సత్తా చాటనున్న వైఎస్సార్సీపీ 
  • పదేళ్లగా టిడిపి చేతిలోనే విజయవాడ ఎంపీ సీటు
  • ఈ సారి ఎన్నికలలో YSRCP గెలుస్తుందనే అంచనాలు
  • హాట్రిక్ దిశగా కేశినేని నాని
  • మహిళల ఓట్లే గెలుపునకు కీలకం
  • ఎవరిని కదిపినా.. సీఎం జగన్‌, ఫ్యాన్‌ పార్టీకే ఓటేశామని జపం
  • సంక్షేమ పధకాలతో తమ కుటుంబాలకి మేలు జరిగిందంటున్న జనం
  • తమ కుటుంబాలకి మేలు చేసిన వైఎస్ జగన్ కి కృతజ్ఞతగా ఓటేసామని చెబుతున్న బెజవాడ ప్రజలు

 

05:40 PM, May 30th, 2024
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది: సీఎం జగన్‌
తాడేపల్లి :

  • దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది
  • కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
  • ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. 

05:20 PM, May 30th, 2024

సీఈసీకి హైకోర్టు ఆదేశం

  • ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్ని పిటిషన్‌పై విచారణ
  • తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని పిటిషన్‌
  • పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయం తెలపాలని సీఈసీకి ఆదేశం
     

04:20 PM, May 30th, 2024

ఏపీ: పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో కొత్త ట్విస్ట్‌

  • సీఈవో జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
  • సీఈవో మెమోపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌
     

04:10 PM, May 30th, 2024

కృష్ణాజిల్లా: 

మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ సెంటర్లను పరిశీలించాం: సీఈవో ముకేష్ కుమార్ మీనా

  • కౌంటింగ్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
  • స్ట్రాంగ్ రూమ్‌ల  వద్ద పటిష్టమైన భద్రత ఉంది
  • కౌంటింగ్ డే తర్వాత గొడవలు జరిగే అవకాశమున్న ప్రాంతాల పై నిఘా పెట్టాం
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకం కలిగించినా అరెస్ట్ చేసి ...జైలుకి పంపిస్తాం
  • ర్యాలీలు..సెలబ్రేషన్స్ కు ఎలాంటి అనుమతి లేదు
  • పోస్టల్ బ్యాలెట్ నిబంధనల్లో ఎలాంటి గందరగోళం లేదు
  • సంతకం ఉండి...పేరు,హోదా లేకుంటే స్పెసిమెన్ సంతకం తీసుకోవాలని సూచించాను
  • ఈ గైడ్ లైన్స్ పై ఒక పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది
  • ఆ పార్టీ అభ్యంతరాన్ని ఎన్నికల కమిషన్ కు పంపించాను
  • ఈరోజు.. రేపట్లో ఒక క్లారిటీ వస్తుంది

02:25 PM, May 30th, 2024
చంద్రబాబు, రామోజీపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌

  • వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తోంది
  • అసైన్డ్‌ భూములను కొట్టేయటానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు రాశారు
  • అసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డు భూములు ఆక్రమించి కట్టలేదా?
  • ఆ ఆక్రమణల గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదు?
  • మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పని చేస్తుంది
  • చంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్టు తప్పుడు పనులు చేయం
  • కుట్రపూరితంగా వ్యవహరించం
  • అమరావతిలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసు
  • సీఎం జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అక్కున చేర్చుకున్నారు
  • సీఎం జగన్ వైజాగ్‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారు
  • చంద్రబాబు, రామోజీ ఏనాడూ దళితుల బాగోగుల గురించి ఆలోచించరు
  • వారిద్దరూ దళితుల వ్యతిరేకులు
  • వెర్రి కూతలు, వెర్రి వేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలి

11:16 AM, May 30th, 2024
తిరుపతి: చంద్రగిరి డీఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌పై చర్యలు

  • డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ డీజీపి  కార్యాలయంలో సరెండర్ కావాలంటూ ఆదేశాలు
  • మూడు నెలల క్రితమే చంద్రగిరి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శరత్ రాజ్ కుమార్
  • చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడటంలో డీఎస్పీ విఫలం
  • పోలింగ్‌ రోజు జరిగిన ఘర్షణలపై సిట్‌ నివేదిక ఆధారంగా చర్యలు

7:18 AM, May 30th, 2024
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం

  • 2019లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
  • అదే ఏడాది మే 30న ‘జగన్‌ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం
  • రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలన
  • ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచిన జనం
  • గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు

7:11 AM, May 30th, 2024
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి

  • 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి  24 రౌండ్లు
  • 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు
  • రాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటన
  • సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌కు ఏపీ సీఈవో మీనా వెల్లడి
  • జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి.. ఫలితాలు కచ్చితంగా ఉండాలి
  • ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండి
  • గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలి
  • రాష్ట్ర అధికారులకు నితీష్‌ వ్యాస్‌ ఆదేశం  

7:05 AM, May 30th, 2024
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి
  • ప్రత్యర్ధి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతతో ఉండాలి
  • వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది
  • జూన్‌ 9న సీఎంగా జగన్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు

7:02 AM, May 30th, 2024
‘సడలింపు’ని సరిదిద్దండి

  • కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
  • పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ
  • ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులు
  • అటెస్టింగ్‌ అధికారుల స్పెసిమన్‌ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం
  • ఇది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళన
  • సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని వినతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement