May 14th AP Elections 2024 News Political Updates
06:06 PM, May 14th, 2024
విశాఖ:
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్స
- అన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించింది
- మహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారు
- తమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.
- ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నింది
- ప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.
- ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి
- వైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు
- ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారు
- మాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదు
- నేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించింది
- ఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ట
- మాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారు
- చంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసు
- మాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్
- సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారు
- టీడీపీ నేతలు సహనం కోల్పోయారు
- మా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాం
- ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
06:00 PM, May 14th, 2024
వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం చెమటోడ్చిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.
-సీఎం వైఎస్ జగన్
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024
05:50 PM, May 14th, 2024
అనంతపురం:
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత
వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి యత్నించిన టీడీపీ నేతలు
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నం
వైఎస్సార్‌సీపీ - టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
పరస్పరం రాళ్ల దాడి,ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలు
03:50 PM, May 14th, 2024
విజయవాడ
సీఈవో ఎంకే మీనాతో మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ నేతల భేటీ
పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు
నిన్న జరిగిన ఘటనలు చాలా దారుణం: మంత్రి అంబటి రాంబాబు
- పల్నాడు జిల్లాలో పోలీసులు దారుణంగా వ్యవహరించారు
- టీడీపీ నాయకులు ప్రజల పై దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదు
- కొత్త గణేశునిపాడు లో మహిళలపై టీడీపీ నేతలు దాడి చేశారు
- మహిళలు గుడిలో దాక్కుంటే టీడీపీ నేతలు దాడులు చేశారు
- అనిల్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి పరమర్శకి వెళితే వల్ల కార్ల పై దాడికి యత్నించారు
- పోలీసులు ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి టీడీపీ నేతలు కల్పించారు
- నా నియోజకవర్గంలో 6 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశారు
- వాటిలో రీ పోలింగ్ చెయ్యాలని కోరాం
- వెబ్ కాస్టింగ్ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరాం
- నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడే మేము ఫిర్యాదు చేశాం
- కన్నా లక్ష్మీనారాయణ రాడ్లు, కర్రలతో మనుషులను దించారు
- పల్నాడులో పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారు
- ప్రజల ప్రాణాలు కాపాడమంటే పోలీసులు స్పందించడం లేదు
02:24 PM, May 14th, 2024
మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- ఓటమి భయంతోనే జేసీ సోదరులు తమపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు
- అడిషనల్ ఎస్పీ రామకృష్ణ టీడీపీ నాయకులకు తొత్తుగా మారారు
- రామకృష్ణపై ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం
02:02 PM, May 14th, 2024
ఓటమి భయంతోనే టీడీపీ నేతల దాడులు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
- టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
- ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
- నియోజకవర్గంలో వార్ వన్ సైడ్‌గా ఉందని.. చింతమనేని కనుసనల్లో గ్రామాల్లో దాడులక పాల్పడ్డారు.
- ఒక రౌడీ షీటర్‌కి బీఫామ్ ఇచ్చి దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు అరాచకాలు నిద్రలేపాడు
- వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో దూసుకుపోతుందని వారు జీర్ణించుకోలేకపోతున్నారు
- వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా కర్రలు, కత్తులతో దాడులు చేశారు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రౌడీయిజంతో గెలవలనుకున్నాడు
- దెందులూరు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపింది
- రానున్న ఫలితాల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలవబోతోంది
- ఈ సారి టీడీపీకి 23 సీట్లు కూడా రాని పరిస్థితి ఉంది
- దెందులూరులో భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ జెండా ఎగర వేయబోతున్నాం
01:32 PM, May 14th, 2024
81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు: ఏపీ సీఈవో
- మీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్ చాట్
- కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది
- 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.
- 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదు
- ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకూ 78.25 నమోదైనట్లు అంచనా
- 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ తో 79.4 శాతం నమోదు.
- మధ్యాహ్నానికి పూర్తి వివరాలు వస్తాయి
- మా అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు
- రాత్రి 12 తర్వాత కూడా కొనసాగిన పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశాం
- సుమారు 20 కేంద్రాల్లో కొత్త ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించాం.
01:15 PM, May 14th, 2024
మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు: మంత్రి అంబటి రాంబాబు
- ఉదయం 6గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది
- ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక
- రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక
- చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది
- మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు
- తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు
- ఓట్లశాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి ఓటు వేశారు
- ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
- మహిళలు 70శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు
- అమ్మఒడి, ద్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేసారు
- ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు
- జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైసీపీ వైపే ఉన్నారు
- సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీ తో గెలవబోతున్నాను
- ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది
- డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు
- ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు
- లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు
- గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు
- పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు
- దాడులు జరిగిన తర్వాత చాలసేపటికి పోలీసులు వచ్చారు
- నకిరేకల్ ఎస్సై నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదు అన్నారు
- ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు
- కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు
- కన్నా కుమారుడు మీ అంతు తేల్చుతా అని ఓటర్లను బెదిరించారు
- రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు
- టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు
- దమ్మాలపాడు బూత్ లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు
- ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసాను
- రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను
- నా అల్లుడు ఉమేష్ కారు పై దాడి చేశారు
- చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు
- ఎలక్షన్ కమిషన్ ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను
- కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు
- ఎవరి ఓటు వాళ్ళు వేస్తే సమస్య లేదు
- అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అధారిటీస్ కి ఫిర్యాదు చేసాను
- చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు
- ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నెరవేర్చిన మొనగాడు జగన్
- మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు
11:37 AM, May 14th, 2024
జమ్మలమడుగులో బీజేపీ, టీడీపీ నేతల గూండాగిరి
- పట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 116,117లో బీజేపీ, టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బూత్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రాళ్ల దాడి.. వాహనంపైనా దాడి
- బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిల డైరెక్షన్‌లో దాడి
- రౌడిల్లా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి
- పోలీసులు అడ్డుపడినా ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైకి దూసుకొచ్చిన కడప టిడిపి ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డి
- అడ్డుపడిన పోలీసులపై భూపేష్ గూండాగిరి
10:57 AM, May 14th, 2024
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు.. అనిల్‌కుమార్ ఆగ్రహం
- పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడింది
- కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు
- టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదు
- ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు
- మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు
- పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు
- పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు
- పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు
- పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు
- టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డి
- కొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారు
- కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు
- నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
10:50 AM, May 14th, 2024
కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకం
- చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకం
- సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలు
- సర్పంచ్ ఇల్లు పూర్తిగా దగ్ధం, పలు కార్లు ధ్వంసం
- కూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
9:43 AM, May 14th, 2024
జేసీ కుటుంబంపై కేసు..
- టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు చేసిన పోలీసులు
- పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించిన జేసీ కుటుంబ సభ్యులు
- తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి లపై ఎఫ్ ఐ ఆర్
- జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు
- తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసిన టీడీపీ నేతలు
- ఐదు వాహనాలు ధ్వంసం, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలు
- ఈ ఘటనలపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు
9:20 AM, May 14th, 2024
రెచ్చిపోయిన జనసేన
- కోనసీమ జిల్లాలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు
- కపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన కార్యకర్తల వీరంగం
- వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్ కారును ధ్వంసం చేసిన జనశ్రేణులు
- అర్థరాత్రి విధ్వంసం సృష్టించిన జనసేన నేత లీలాకృష్ణ
- లీలాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
8:41 AM, May 14th, 2024
పల్నాడు జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు
- తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు
- సత్తెనపల్లి నియోజకవర్గం లోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం
- గురజాల మండలం కొత్త గణేషని పాడులో తెలుగుదేశం విధ్వంసం
- కర్రలు రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడి
- పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు
- కొత్త గణేష్ ని పాడు లో బీసీల పైన దాడి చేసిన తెలుగుదేశం గుండాలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు ధ్వంసం
- సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీసులు
7:48 AM, May 14th, 2024
పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనా
- ఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లు
- ఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులు
- సా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్
- గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా
- పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్
- చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
- హింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదు
- ఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్ కోరుతూ అభ్యర్థనలు రాలేదు
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
7:32 AM, May 14th, 2024
పచ్చ ముఠాల విధ్వంస కాండ
- ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు
- రాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతం
- యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేన
- చంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచన
- ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనత
- శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లు
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలు
- అన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజం
- వైఎస్సార్ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసం
- జంగాలపల్లి పోలింగ్ బూత్‌లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలు
- చిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసం
- కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు
7:30 AM, May 14th, 2024
పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- ఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులు
- మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్‌పై దాడి
- తంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలు
- పాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసం
- ముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసం
- నూజెండ్ల మండలంలో దళితులపై అరాచకం
- కేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు
7:24 AM, May 14th, 2024
ఆగని టీడీపీ అరాచకాలు
- దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలు
- గణబాబు, శ్రీభరత్ చిత్రాలతో స్లిప్‌ల పంపిణీ
- అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు
- పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు
7:17 AM, May 14th, 2024
నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపు
- వైఎస్సార్‌సీపీ ఏజెంట్ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్
- పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకున్న
- కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ
7:15 AM, May 14th, 2024
ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లు
- అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు
- సీఎం రమేష్ ఓవరాక్షన్.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం
- టీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్
- క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర
7:07 AM, May 14th, 2024
మరోసారి ఫ్యాన్ సునామీ
- పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులు
- ఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు
- పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదు
- గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీ
- పలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్.. 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడి
- ఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్.. ప్రభుత్వ సేవలను బట్టే 80
- శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్ మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తా
- సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలు
- సంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సరళి
- ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment