
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్‌సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్‌సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది.
వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్‌సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్‌బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్‌సీపీ కేడర్ నిలిచింది.
దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ కేడర్ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.
