![Ap Elections 2024 May 21 Political Updates Telugu](/styles/webp/s3/article_images/2024/05/21/Ap-Elections-2024-May-21-Po.jpg.webp?itok=2gXl4GZA)
May 21st AP Elections 2024 News Political Updates
5:17 PM, May 21st, 2024
సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్ చేస్తున్నా: మంత్రి కాకాణి
- బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?
- నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా
- ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది
- ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి
- బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా
- బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?
- రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..
- బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు
- రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు
- పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది
- కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను
- రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు
- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్
- బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- నాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలి
- ఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారు
- రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది
- సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి
- నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు
- యూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది
- నా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉంది
- కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా
5:08 PM, May 21st, 2024
మేం గెలుస్తామని...జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పాం: మంత్రి బొత్స సత్యనారాయణ
- ఎన్నికలు పూర్తయ్యాయి...భవితవ్యం బ్యాలెట్ బాక్సులలో ఉన్నాయి
- ఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాం
- ప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు
- రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారు
- ఏపీ విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నోకీలక మార్పులు తెచ్చాం
- ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్,జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం
- విద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు
- మాపై బురద జల్లుతున్నారు
- విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన
- మా విధానాలు నచ్చ పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం
- మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు
- నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు
- ప్రధాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు
- సీఎం జగన్ ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లారు
- వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?
- చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు
- చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు
- చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి
- చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు విదేశాలకి వెళ్లారు
- రాష్ట్ర ప్రజలని కోరుతున్నా....సంయమనం పాటించాలని కోరుతున్నా
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండి
- రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే
- ఎందుకు హర్రీ అండ్ వర్రీ
- చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకి వెళ్తే తప్పేంటి?
- ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు
- భయంతో చంద్రబాబు విదేశాలకి పారిపోయారా?
- సిఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు?
- అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి?
- సిఎం వైఎస్ జగన్‌ని అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి?
- ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు
- మాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా
- మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినా చెప్పారా?
- తన పాలన చూసి ఓటేయాలని ప్రధాని మోదీనే అడగలేకపోయారు
- మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ మాత్రమే అడిగారు
- సీఎం జగన్ రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు
- నా తప్పులని దిద్దుకుంటానని అధికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు
- రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా
- చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు
- దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం
- మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది
- గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం
- వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు
- కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం
- ప్రజలకి కావాల్సిన విధానాలని...సంస్కరణలనే సిఎం వైఎస్ జగన్ అమలు చేశారు
- అందుకే సీఎం జగన్‌కి మళ్లీ పట్టం కట్టారని భావిస్తున్నాం
- ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మానా...ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి
- ఆ రోజు భ్రమలలో ఉండి ప్రశాంత్ కిషోర్‌ని తీసుకొచ్చాం
- సిఎం వైఎస్ జగన్ పర్మినెంట్‌గా ఉండే విధానాలనే నమ్ముతారు
- ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నాం
2:32 PM, May 21st, 2024
ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్
- దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?
- చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతు
- టీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.
- కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారు
- ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయి
- చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
- చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలి
- పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే
2:24 PM, May 21st, 2024
ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్‌డీఎస్
- ఏపీలో మేం పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాం
- మా సర్వే రిపోర్ట్ నాలుగు రోజుల్లో వస్తుంది
- టీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవం
- సెఫాలజిస్ట్ సంజయ్‌కుమార్ మాటలు కూడా నిరాధారమే: సీఎస్‌డీఎస్ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్
2:01 PM, May 21st, 2024
జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
- జూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్ర
- అభివృద్ది చేసే చరిత్ర మాది
- సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దం
- ఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డి
- జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు
- 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడు
- వైఎస్సార్‌సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి
- నీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి
11:32 AM, May 21st, 2024
ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు
- ఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారు
- వదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారు
- పోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారు
- ఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయి
- చంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడు
- పాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారు
- సీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవు
- పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారు
- పేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారు
- ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబు
- బీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు
- బీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారు
- ఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు
10:43 AM, May 21st, 2024
కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక
- 150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్
- ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక
- పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్
- 1370 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, 124 మంది అరెస్ట్
- ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదిక
- ఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్
8:40 AM, May 21st, 2024
దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడి
- కోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి
- చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టు
- పలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్ పైనా నిషేధం
- ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారు
- అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోంది
- గుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు
- గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడు
- అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటు
- ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు
- ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడు
- ఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది
- వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు
- 2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసింది
- అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారు
- అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి
- మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.
7:52 AM, May 21st, 2024
సిట్ నివేదికలో సంచలన విషయాలు
- ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు
- 150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్
- సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలు
- పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు
- నాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్
- 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలు పరిశీలన
- ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులు
- ఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్
- 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్
- దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్
- రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్
- రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్
- ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపు
- దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక
- ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదిక
- పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచన
- కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్
- సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ
7:16 AM, May 21st, 2024
ఇట్లు.. ఇటలీకి!
- వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులు
- అబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేత
- టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారం
- గతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు
- స్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధం
- ఈసారి అదే షెల్ దందాయేనా..!
- గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే
7:07 AM, May 21st, 2024
కుమ్మక్కుతో విధ్వంసకాండ
- కాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలి
- సిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలు
- కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారు
- టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలి
- దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి
7:05 AM, May 21st, 2024
పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?
- మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహం
- నిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖ
- రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణం
- ఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం
6:53 AM, May 21st, 2024
బదిలీలతో బరితెగింపు
- ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక
- దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం
- పోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండ
- దర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి
Comments
Please login to add a commentAdd a comment