ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.