ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సినిమా ‘ఆరో బడ్జెట్’ ప్లాప్ అయిందంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ‍్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన గురువారం మాట్లాడుతూ...తనది కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.