వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమరశంఖారావం సమావేశాలుంటాయిని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమరశంఖారావం పేరుతో పార్టీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో పార్టీ సమావేశాలు ఉంటాయి. 4న తిరుపతి, 5న కడప, 6న అనంతపురంలో పార్టీ సమావేశాలుంటాయి.