peddireddy ramachandrareddy
-
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
‘ప్రశాంత్ కిషోర్‌ను మేం వదిలేశాక బాబు పట్టుకున్నారు’
సాక్షి, చిత్తూరు: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ప్రశాంత్ కిషోర్‌ను మేము వదిలేశాక బాబు పట్టుకున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉందని మండిపడ్డారు. ‘‘2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయి. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుయుక్తులు పన్నిన వచ్చే ఎన్నికల్లో తిరిగి సీఎం జగనేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్ -
రాష్ట్రంలో కొత్తగా 100 ఎకో టూరిజం ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వంద పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) ప్రాజెక్టులను ప్రారంభించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అటవీ శాఖ డివిజన్ పరిధిలో కనీసం 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు నెలకొల్పాలని సూచించారు. విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి చెప్పారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామ్ లేదా రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జన నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో నాటేందుకు మొక్కలను సమకూర్చాల్సి ఉందన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెరగాలి రాష్ట్రంలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ విద్యుత్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఇంధనశాఖ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని చెప్పారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వా జోన్ పరిధిలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనిపై సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్‌ను సబ్సిడీపై అందిస్తున్నాం, జోన్ పరిధిలో ఎంత డిమాండ్ ఉందనే వివరాలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. -
‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుంది. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. టీడీపీ అధినేత డైరెక్షన్లోనే పాదయాత్ర నడుస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు. మరోవైపు, మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు భయపడి వారి గొంతు నొక్కేసుకుంటున్నారు’ అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు అంటూ కామెంట్స్ చేశారు. -
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే నేను..
-
AP New Cabinet: ముచ్చటగా మూడు.. చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం
రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. చదవండి: జయ, రాజేంద్రలకు మళ్లీ మంత్రి యోగం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పార్టీ పదవులతో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రి వర్గంలో జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, దళితులకు మంత్రి పదవుల్లో పెద్దపీట వేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం హోదాను సైతం జిల్లాకే కట్టబెట్టారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచి, రాయలసీమ జిల్లాల్లోనే పెద్దాయనగా పిలిచే సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పార్టీ కష్టకాలంలో జిల్లా అ«ధ్యక్షుడుగా అందరినీ కలుపుకుని పార్టీని నడిపించిన కళత్తూరు నారాయణస్వామికి తొలి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఏ జిల్లాకూ దక్కని అరుదైన గౌరవాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కట్టాబెట్టారు. పెద్దాయన పెద్దిరెడ్డి స్థానం పదిలం చేశారు. నారాయణస్వామి విధేయతను సుస్థిరం చేశారు. ఇద్దరినీ తిరిగి మంత్రులుగా కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు జిల్లాకు బోనస్‌గా మూడో మంత్రి రూపంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. పునర్‌వ్యవస్తీకరణలోనూ మంత్రి పదవుల కేటాయింపుల్లో ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి, దళితులకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, రెడ్డి సామాజికి వర్గానికి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రులుగా బెర్త్ ఖరారు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మూడు మంత్రి పదవులతో అరుదైన గౌరవం కల్పించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంబరాన్నంటిన సంబరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వైఎస్ జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితోపాటు రోజా అభిమానులు, నేతలు విజయవాడకు తరలివెళ్లారు. రోజా వికాసం.. వెల్లువెత్తిన హర్షం నగరి/నిండ్ర/పుత్తూరు రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు స్థానం దక్కడంపై నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. నిండ్రలో సైతం పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పరస్పరం తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రారెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్పన్, నగరి కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ తిరుమలరెడ్డి, పార్టీ రాష్ట్ర యవజన విభాగం ప్రదాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నిండ్ర ఎంపీపీ దీప, పార్టీ మండల కనీ్వనర్ వేణురాజు పాల్గొన్నారు. పుత్తూరులో నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. అ‘ద్వితీయ కళ’త్తూరు కార్వేటినగరం/వెదురుకుప్పం/పెనుమూరు : డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామికి రెండో పర్యాయం మంత్రి పదవి దక్కడంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ ధనంజయవర్మ, కో–ఆప్షన్ సభ్యుడు పట్నం ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ సుమతి, నేతలు శేషాద్రి, సుమతి పాల్గొన్నారు. పెనుమూరులో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మహాసముద్రం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నేతలు దూది మోహన్, బండి కమలాకరరెడ్డి, కండిగ మధు, పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాలినడకన కొండకు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడికి కేబినెట్లో మళ్లీ స్థానం దక్కాలని కోరుతూ కార్వేటినగరం ఎంపీపీ లతాబాలాజీ దంపతులు ఆదివారం అలిపిరి మార్గం గుండా తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఎంపీపీ లతాబాలాజీ మాట్లాడుతూ పెద్దిరెడ్డి, నారాయణస్వామికి మంత్రి పదవులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. విధేయతకు పట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయత చూపే అతికొద్ది మంది నాయకుల్లో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఒకరు. నిజాయతీ, వైఎస్సార్ కుటుంబంపై విధేయత ఆయనకు అభరణాలు అని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. అందుకే తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవికి నారాయణస్వామిని తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉపముఖ్యమంత్రి హోదాను సైతం కల్పించారు ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్తీకరణలోనూ ఆయనకు రెండోసారి మంత్రి మండలిలోకి తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి రెండోసారి మంత్రిమండలిలో చోటుదక్కడంపై హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మూడేళ్ల పాటు మంత్రిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తొలిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాయన ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. వైఎస్సార్ దివంగతులయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ప్రప్రథమ జిల్లా అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రత్యేకించి దళిత సామాజికర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మళ్లీ చోటు కల్పించారు. రెండోసారి మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సమర్థతకు గౌరవం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ చోటుదక్కింది. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా అధికారంలో ఉన్న టీడీపీకి దీటుగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ కుప్పం మినహా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో విడత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలోనూ చోటుదక్కించుకుని, తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత చేసుకున్నారు. సేవకు అందలం రాజకీయంగా ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా వెన్నుచూపని ధీరురాలుగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రాష్ట్రవ్యాప్తంగా పేరు ఉంది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం ఆమె పారీ్టలో కీలకభూమిక పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత ఆయన వెంట నడిచారు. 2014, 2019లో నగరి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, పాలకులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఆసెంబ్లీలో తన వాగ్ధాటితో అధికార పక్షానికి ఆమె ముచ్చెమటలు పట్టిస్తూ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు. అసెంబ్లీలో ఉంటే కష్టమని భావించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆమెను అక్రమంగా ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా నిషేధం విధించారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ఆశించినా సామాజిక సమతుల్యత వల్ల చోటు దక్కలేదు. అయినా ఆమె సేవలను గుర్తించి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. తాజాగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు మంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చోటకల్పించారు. తొలిసారి మంత్రిగా ఆమె సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంచి వ్యక్తికి అవకాశం కోవిడ్ సమయంలో ఎమ్మెల్యే ఆర్కేరోజా సేవలు ప్రత్యక్షంగా చూశా. అందరికీ అందుబాటులో ఉంటూ, ఎందరినో ఆదుకున్నారు. పారీ్టలను పట్టించుకోకుండా సాయం అందించారు. అలాంటి మంచి వ్యక్తికి మంత్రిగా అవకాశమివ్వడం ఆహ్వానించాల్సిన అంశం. కేబినెట్ ఎంపికలో ముఖ్యమంత్రి చక్కటి కసరత్తు చేశారని అర్థమవుతోంది. – పి. బాలసుబ్రమణ్యం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పుత్తూరు సమ న్యాయం చేశారు కేబినెట్ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారు. ప్రధానంగా 75శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ అభినందనీయం. కొత్త మంత్రులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నాం. – రాజరత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు ఎంపిక బాగుంది నూతన మంత్రులను పక్కాగా ఎంపిక చేశారు. సీనియర్ల అనుభవాన్ని వదులుకోకుండా అవకాశం కల్పించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కొత్తవారిని తీసుకున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాకు మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉంది. -విజయశేఖర్, చిత్తూరు సమర్థతకు పట్టం నూతన మంత్రి వర్గంలో ఎస్సీలపై ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. అనుభవజు్ఞడైన నారాయణస్వామికి మళ్లీ అవకాశం కలి్పంచి సమర్థతకు పట్టం కట్టారు. ప్రజలకు సేవ చేసే నాయకులను మరువకుండా పదవులు కట్టబెట్టారు. ఇది హర్షించదగ్గ విషయం. – వినాయకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
బి.కొత్తకోట/బెంగళూరు/చిత్తూరు కలెక్టరేట్: తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో శనివారం అందించారు. కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడవారిపల్లె వచ్చారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహనలను పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. లాన్స్‌నాయక్ సాయితేజ విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సాయితేజ చేసిన సేవ గొప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. శ్యామల విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మదనపల్లెలో ఇంటిస్థలాన్ని కేటాయిస్తామన్నారు. పిల్లల చదువుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం సాయితేజ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. నేడు ఎగువరేగడలో అంత్యక్రియలు కాగా, సాయితేజ భౌతికకాయం శనివారం బెంగళూరు చేరుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తరలించగా.. అక్కడ ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం వరకు సాయితేజ పార్థివదేహం బెంగళూరులోనే ఉండనుంది. అనంతరం బెంగళూరు నుంచి స్వగ్రామమైన ఎగువరేగడ గ్రామానికి పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు సుకుమార్, రామమోహన్ పరిశీలించారు. కడవరకు దేశ సేవలోనే ఉంటా: మహేష్‌బాబు తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్‌బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్‌బాబు కురబలకోట మండలం రేగడవారిపల్లెలో శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘డిసెంబర్ 8న మేం పనిచేస్తున్న రెజిమెంట్ ఏఎస్పీ క్రోర్ డే వేడుకలు జరుపుకుంటుండగా మధ్యాహ్నం సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే సమాచారం వచ్చింది. ఆ వెంటనే వేడుకల్ని నిలిపివేశారు. టీవీల్లో చూస్తుండగా సాయితేజ కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తల్లో వచ్చింది. సాయితేజ అంటే ఎంతోమంది ఉండవచ్చు, అన్నపేరు బి.సాయితేజ కదా అని సర్దిచెప్పుకొన్నా. తర్వాత వదిన శ్యామలకు ఫోన్‌చేసి అన్న ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పాడా అని అడిగితే.. లేదని సమాధానం వచ్చింది. అన్న మిత్రులైన జవాన్లకు ఫోన్‌చేస్తే సెలవుల్లో ఉన్నామన్నారు. అన్న మొబైల్ స్విచ్చాఫ్ వస్తోంది. టెన్షన్ భరించలేకపోయా. చివరికి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే నిజమైంది. ప్రమాదంలో మరణించిన సాయితేజ నా సోదరుడేనని తెలిసింది. మా అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. అన్న మరణం తీరని లోటే అయినా, నేను జవానుగానే కొనసాగుతాను. తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తా. సాయితేజ మృతి నాకే కాదు.. ఎందరో యువకులకు తీరని లోటు’ అన్నారు. -
చంద్రబాబుకు చేతనైతే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తోంది: సజ్జల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆది మూలపుసురేష్ ,సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు పాదయాత్రల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు.. వైఎస్సార్సీపీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా ముక్తకంఠంతో తమ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని సజ్జల అన్నారు. కాగా, నిజమైన ప్రజల పక్షంగా ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించిందని సజ్జల అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సజ్జల పేర్కొన్నారు. -
తిరుపతి లో నేడు 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
-
‘కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారు’
చిత్తూరు: చంద్రబాబుకు పిచ్చి పతాకస్థాయికి చేరుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియడంలేదని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుకు బాగా తెలిసిన విద్యలని దుయ్యబట్టారు. మొదటినుంచి మోసాలు చేయడం చంద్రబాబుకు అలవాటని ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని హెచ్చరించారు. కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. 17న ఫలితాలు వస్తాయని, అప్పుడు చంద్రబాబు ఏం చెప్తారో చూస్తామని అన్నారు. ఆయనతో పాటు ప్రచారంలో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
-
యాప్ ద్వారా పారదర్శకంగా ఇంటి పన్ను వసూలు: పెద్దిరెడ్డి
-
గ్రామాల్లో మొబైల్ యాప్‌తో ఇంటిపన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఇక నుంచి గ్రామాల్లో ఇంటి పన్నును అన్లైన్ విధానంలోనే వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఇంటిపన్ను పూర్తి పారదర్శకంగా నూరు శాతం వసూలవుతుందని తెలిపారు. గ్రామాల్లోని సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సేకరించి, ఆ వివరాలను యాప్‌తో ఇప్పటికే అనుసంధానం చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామాల్లో మాన్యువల్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇలా అన్లైన్ విధానంలో పన్ను చెల్లించిన వెంటనే అన్లైన్లోనే రశీదు తయారై, ఆ రశీదు వెంటనే పన్ను చెల్లించిన వారి మొబైల్ నెంబరుకు వెళ్తుందని మంత్రి చెప్పారు. అంతేకాక.. ఇంటి యజమానులకు ఎంత పన్ను చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలి అనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా ఆయా పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని వివరించారు. పొదుపు సంఘాల కార్యక్రమాలపైనా సమీక్ష పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పెన్షన్ల పంపిణీ అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సచివాలయంలోని తన ఛాంబరులో సెర్ప్ అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో నవరత్నాల నిలయం
-
చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: పశువుల పేడ, ఇతర వ్యవసాయ వ్యర్థాల ద్వారా పెద్ద తరహా (కస్టర్ బేస్డ్) బయోగ్యాస్ తయారీ యూనిట్లను పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీతోపాటు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్–ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ , మరో 12 రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గోబర్–ధన్ పథకంలో రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ల ఏర్పాటుకు కృష్ణా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అవకాశం ఉందని గుర్తించినట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో కనీసం 50 కంటే ఎక్కువగా పశువులున్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం గుర్తించినట్టు చెప్పారు. వాటిలో మొదట పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి, తర్వాత మిగిలిన మూడు జిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో గోబర్–ధన్ పథకం కింద పశువ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్ధతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం డీపీఆర్‌లను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించామని, వారి ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకం కింద ఏర్పాటుచేసే ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్, కంపోస్ట్‌లను మార్కెట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు.. గోబర్–ధన్ పథకం కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నామని, ఇంకా అవసరమైతే 15వ ఆర్థికసంఘం నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత గృహాల మోడల్, క్లస్టర్ మోడల్, కమ్యూనిటీ మోడల్, కమర్షియల్ మోడళ్లలో ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవికాకుండా రాష్ట్రమంతటా ఘన వ్యర్థాలను శుద్ధిచేసేందుకు, సేంద్రియ ఎరువులుగా మార్చేందుకు ఉపాధిహామీ పథకం కింద 10,645 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1,042 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలైందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
బొగ్గు మైనింగ్‌లో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: సొంతంగా బొగ్గు తవ్వకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కీలకమైన ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలోని 1,298 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించింది. ఈ వారంలోనే అక్కడ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవనుంది. మొదటగా దాదాపు రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుల్యారీ గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును లీజు సమయం ఉన్న 22 ఏళ్ల పాటు వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు తవ్వకం వల్ల ఆ ప్రాంతంలో నిర్వాసితులవుతున్న 1,250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిజర్వు చేయాలని నిర్ణయించారు. మైనింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు రాష్ట్ర పురోభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు.. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలు కావడానికి సీఎం దూరదృష్టే కారణం. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాజెక్టులను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుల్యారీ ప్రాజెక్టును త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చిన ఏపీఎండీసీ అధికారులను అభినందిస్తున్నా. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మైనింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొగ్గు తవ్వకాలతో సంస్థ పరిధిని విస్తరిస్తాం బెరైటీస్ మైనింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించుకున్న ఏపీఎండీసీ.. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సుల్యారీలో బొగ్గు తవ్వకాల ద్వారా సంస్థ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ సౌత్ బ్లాక్, జార్ఖండ్‌లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌లను ఏపీఎండీసీ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అక్కడ కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్, సిలికాశాండ్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ భేటీ
-
నేటినుంచి సర్పంచులకు శిక్షణ
సాక్షి, అమరావతి: ఏపీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై గురువారం నుంచి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఆగస్టు 14 వరకు పంచాయతీరాజ్‌శాఖ, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్ఐఆర్డీ) ఆధ్వర్యంలో కొనసాగే ఈ శిక్షణ తరగతులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని ఎస్ఐఆర్డీ డైరక్టర్ జె.మురళి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 60 కేంద్రాల్లో ఈ తరగతులు మొదలవుతాయన్నారు. సర్పంచులకు రెసిడెన్షియల్ పద్ధతిలో వారి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రతి తరగతికి 20 మందే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కో బ్యాచ్‌లో ప్రతి జిల్లాలో 120 మందికి మాత్రమే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఒక్కో బ్యాచ్‌కి 3 రోజులపాటు 14 అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి జిల్లాలో గరిష్టంగా 7 బ్యాచ్‌లు ఉంటాయని చెప్పారు. ఈ తరగతుల నిర్వహణకు మొదటి విడతగా జిల్లాలకు రూ.1,77,63,998 విడుదల చేసినట్టు చెప్పారు. సర్పంచుల్లో గర్భిణులకు మినహాయింపు ఇచ్చామని, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చే 14 అంశాలు తొలిరోజు 1. గ్రామ పంచాయతీలు, మన స్థానిక ప్రభుత్వాలు– గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత 2. సర్పంచ్, వార్డుసభ్యులు, సిబ్బంది అధికారాలు, విధులు, బాధ్యతలు 3. స్థానిక స్వపరిపాలన– గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలు, కార్యచరణ కమిటీలు 4. మౌలిక వసతుల కల్పనతో గ్రామాభివృద్ధి – తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, వీధిదీపాలు మొదలైనవి 5. పారిశుధ్యం – జగనన్న స్వచ్ఛ సంకల్పం రెండో రోజు 6. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్1 7. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్ 2 8. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు 9. గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయాలు– వ్యయ నియమాలు– బడ్జెట్, అభివృద్ధి ప్రణాళికలు 10. ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు– నవరత్నాలు– గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న వివిధ పథకాలు మూడో రోజు 11. పారదర్శక పాలన– పంచాయతీలపై పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ 12. పంచాయతీ రికార్డులు, నివేదికలు 13. గ్రామ పంచాయతీలో జవాబుదారీతనం– క్రమశిక్షణ 14. కేంద్ర ఆర్థికసంఘం నిధులు, ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ -
గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గృహ వినియోగదారుల విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన గ్రామ ఉజాలా పథకాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సీడ్కోల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఈ ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ పథకం అమలుపై చర్చించేందుకు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య బుధవారం రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉందని మహువా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పటికే బిహార్, యూపీలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. ఎల్ఈడీ లైట్లు 75 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని వివరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతానికి వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, వేదికను ఖరారు చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. అమలు ఎలా? ► ఈ పథకంలో భాగంగా అర్హులైన గ్రామీణ ప్రజల నుంచి వాళ్ల ఇళ్లలో ఇప్పుడు వినియోగిస్తున్న 60 వాట్, 100 వాట్ బల్బులను తీసుకొని వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. ► ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. ► బహిరంగ మార్కెట్లో 7 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.70, 12 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.120 ధర ఉండగా.. కేవలం రూ. 10కే వాటిని అందజేస్తారు. లాభం ఇలా.. పథకం అమలుతో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 600 నుంచి రూ.700 వరకు విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఏస్‌ఈసీఎం) అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి 1,144 మెగా వాట్ల మేర తగ్గి, డిస్కంలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 81,55,316 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని తెలిపారు. -
గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో పల్లె ముంగిట్లోకే పాలన వచ్చిందన్నారు. గ్రామ సర్పంచ్‌లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో "జగనన్న స్వచ్ఛ సంకల్పం" అమలుపై చర్చించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రూ.1312.04 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్‌లంతా గ్రామసచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా.. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛసంకల్పానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ‘‘గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయి. ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్ పదవి తొలిమెట్టు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి. పట్టణాలకు ధీటుగా గ్రామాలను తీర్చిదిద్దాలి. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలి. స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని’’ మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్ -
మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి తక్షణ నష్టపరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎంజీ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదన్నారు. చిన్న తరహా ఖనిజ నియమావళి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు చదవండి: ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి పూలింగ్.. భారీ కుట్ర -
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి
సాక్షి, అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించామని చెప్పారు. రూ.1,486 కోట్ల ఖర్చుతో గ్రామాల్లో 1,944 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. బోర్వెల్ డ్రిల్లింగ్కు రూ.2,340 కోట్లు, పంపుసెట్లకు రూ.1,875 కోట్లు, విద్యుత్ పరికరాలకు రూ.1,500 కోట్ల మేర అంచనాలతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎస్సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, వాటర్‌షెడ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ ఆదాయ లక్ష్యాన్ని సాధించాలి
సాక్షి, అమరావతి: మైనింగ్ ఆదాయ లక్ష్యాలను సాధించాలని అధికారులను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. గనుల శాఖ అధికారులతో విజయవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో కూడా అధికారుల కృషి వల్ల రూ.2,917 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 81 శాతం ఆదాయాన్ని సాధించిపెట్టిన అధికారులను అభినందించారు. 2021–22లో రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని వారు అంచనా వేశారు. ఈ ఏడాది ఆదాయ లక్ష్యాలను చేరేందుకు తగిన కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఏపీకి వలస వచ్చిన వారు కరోనా భయంతో వెనక్కి వెళ్లిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు. గతేడాది నిర్వహించిన తనిఖీల్లో అక్రమ మైనింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 10,736 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.42.66 కోట్ల జరిమానాలు విధించినట్టు వివరించారు. మూడంచెల విధానంలో మైనింగ్ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని.. ఇతర జిల్లాల్లో త్వరలో ప్రవేశపెడతామన్నారు. అలాగే శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను ప్రయోగాత్మకంగా అవుట్ సోర్సింగ్ విధానంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. -
గ్రామ పాలనకు గౌరవం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 17 అవార్డులు పొందిన రాష్ట్రంలోని పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగా పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది రాష్ట్రానికి 15 అవార్డులు రాగా.. ఈసారి 17 వచ్చాయి. అవార్డుల పరంగా ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి రెండో అవార్డుతోపాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈసారి రాష్ట్రానికి దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి అందించారు. గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభం కావాలి: ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అలాగే మరో బటన్ నొక్కి 7 రాష్ట్రాల్లోని 5 వేల గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గతేడాది నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందువల్ల పంచాయతీలు అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ–పంచాయత్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, కమిషనర్ గిరిజా శంకర్ అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, జిల్లా స్థాయిలో.. గుంటూరు, కృష్ణా జిల్లాలు పొందిన అవార్డులు (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం) ఆ జిల్లాల జెడ్పీ సీఈవోలు డి.చైతన్య, పీఎస్ సూర్యప్రకాశరావు, మండలాల స్థాయిలో.. చిత్తూరు జిల్లా సొడెం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవోలు అవార్డులు అందుకున్నారు. అలాగే పంచాయతీల స్థాయిలో.. కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పుగోదావరి జిల్లా జి.రంగంపేట, ప్రకాశం జిల్లా కొడెపల్లి పంచాయతీలకు సీఎం పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్తోపాటు వివిధ జిల్లాలు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
‘ఢిల్లీ వరకు ఆ రీసౌండ్ వినిపించాలి’
సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్‌లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్‌కు పంపించిన ఘనత సీఎం జగన్‌దన్నారు. మాధవి, నందిగం సురేష్‌లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్‌కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు. చదవండి: కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి