కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని దాదాపు 66 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనీల్‌కుమార్ స్పష్టం చేశారు. సుబాబుల్ రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో యూకలిప్టస్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుబాబుల్ ఎక్కువగా సాగవుతుంది. గతంలో నేరుగా పేపర్ మిల్లులే కొనుగోలు చేసేవి.
2017లో 45 మంది బయటి వారికి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చారు. ఈ ట్రేడర్స్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కంపెనీలతో కుమ్మక్కవుతున్న ట్రేడర్స్‌ను గుర్తించి లైసెన్సులను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర పంటల మాదిరిగా ఈ పంటలనూ ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పంటను పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా పర్మిట్లు జారీ చేయాలని, వ్యవసాయ శాఖ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు.
వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడండి: మంత్రి పెద్దిరెడ్డి
రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తక్షణమే మొదలు పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పేర్ని నాని, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment