Anilkumar yadav
-
‘జన్వాడ ఫామ్‌హౌజ్’ అంటేనే వివాదం: ఎంపీ అనిల్ యాదవ్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అనిల్ యాదవ్ మంగళవారం(అక్టోబర్ 29) మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి బీఆర్ఎస్ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి.రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి.కేటీఆర్‌కు అసలు బినామీ విజయ్ మద్దూరి.గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు.జన్వాడ ఫామ్‌హౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒక సారి దీపావళి విందని,మరోసారి గృహ ప్రవేశం అని అంటున్నారు.తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటోంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు.రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు విజయ్మద్దూరి మాట మారుస్తున్నాడు.పామ్ హౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు.ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది.కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని అని ప్రజలు అడుగుతున్నారు’అని అనిల్ యాదవ్ గుర్తుచేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో: కేటీఆర్ -
బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం అల్ టైమ్ రికార్డ్ : అనిల్ కుమార్ యాదవ్
-
మీ వెంటే మేమంతా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. -
మా మధ్య విభేదాల్లేవు
సాక్షి, అమరావతి: తమ మధ్య విభేదాల్లేవని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ అనిల్‌కుమార్‌యాదవ్ స్పష్టం చేశారు. విభేదాలు మీడియా సృష్టేనన్నారు. తామంతా కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వారు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిల్‌కుమార్‌యాదవ్‌తోపాటు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పోరాటం చేశామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అనిల్‌తో కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషిచేశామన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, అనిల్‌ని వైఎస్సార్, తిరుపతి జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారని చెప్పారు. తమ మధ్య విభేదాలు సృష్టించాలనే సంఘవిద్రోహశక్తులు నెల్లూరులో ఫ్లెక్సీలను చింపేశాయన్నారు. నిప్పులేకుండానే పొగ సృష్టించడం ఎల్లో మీడియాకు అలవాటేనన్నారు. ‘సీఎం వైఎస్ జగన్‌ను కలిశాక మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోతే.. సీఎం వైఎస్ జగన్ చీవాట్లు పెట్టారు.. అందుకే కాకాణి మొహం చాటేశారు.. అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారు కాబట్టే మీడియాతో మాట్లాడుతున్నా..’ అని చెప్పారు. ‘కరువుకు మారుపేరు చంద్రబాబు.. సుభిక్షానికి మరోపేరు సీఎం జగన్.. ఏ కారణంతో రైతులు టీడీపీకి ఓట్లేస్తారో చంద్రబాబు చెప్పాలి..’ అని పేర్కొన్నారు. రైతులు, కౌలురైతులపై ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడటం తప్ప రైతుల గురించి పవన్‌కల్యాణ్‌కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. సీఎం మనుషులం.. ఆయన గీతగీస్తే దాటం.. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైనికులమని, ఆయన ఏది చెబితే అది చేస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించిన సీఎం జగన్‌కి కృతజ్ఞతలు చెప్పేందుకు కలిశానన్నారు. సీఎం జగన్ తనకు మూడేళ్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కాకాణికి ఇచ్చారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం, ప్రజల కోసం పనిచేస్తామన్నారు. వైఎస్సార్సీపీలో వర్గాలు ఉండవని, అంతా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వర్గమన్నారు. అధినేత మాటే తమకు శిరోధార్యమన్నారు. జగన్ మనుషులమైన తాము ఆయన గీతగీస్తే దాటబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోయిన 14 మందిమి మళ్లీ మంత్రులమవుతామన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఏ పార్టీ ఫ్లెక్సీలైనా తీసేశారంటే.. అది మునిసిపల్ కార్పొరేషన్ వాళ్లు తీసేసినవేనన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా గాలికి చిరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్రంట్ వారియర్స్‌గా ముందుకెళ్తామని, అందుకు సీఎం జగన్ తమను ఎంచుకుని పార్టీ బాధ్యతలు ఇవ్వడం గర్వంగా ఉందని అనిల్‌కుమార్‌యాదవ్ చెప్పారు. -
చంద్రబాబు పాపాల వల్లే జాప్యం
సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పాల్పడిన పాపాలే పోలవరం పనుల్లో జాప్యానికి కారణమని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. లేదంటే 2021 నాటికే ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్లమన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1941 నుంచి కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుకు 2004లో దివంగత సీఎం వైఎస్సార్ కార్యరూపం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో రూ.16 వేల కోట్ల అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని.. నిధులు ఇస్తామని కేంద్రం షరతు పెడితే దానికి 2016 సెప్టెంబర్ 30న చంద్రబాబు అంగీకరించడం దారుణమన్నారు. నిర్వాసితులకు న్యాయం ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు ఎవరైనా వస్తే పోలీసులతో గెంటేయించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ.6.50 లక్షల పరిహారం ఇస్తుంటే.. దానికి అదనంగా రూ.3.50 లక్షలు చేర్చి మొత్తం రూ.పది లక్షలు అందిస్తున్నారు. చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హతే లేదు.’ – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం -
పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పునరావాస కాలనీౖ నైనా నిర్మించారా? ఒక్క కుటుంబానికైనా పునరావాసం కల్పించారా? అని నిలదీశారు. పోలవరం డ్యామ్ ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదని, కావాలంటే టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చునని సవాల్ విసిరారు. గురువారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించే స్తున్నారనే అపోహలు రైతుల్లో నెలకొన్నాయని, నిర్మాణం ప్రశ్నార్థకంగా మా రిందన్నారు. దీనిపై మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..‘2014 నాటికే 32 శాతం పూర్తయిన ప్రాజెక్టులో ఆ తర్వాత మూడేళ్లు తట్టెడు మట్టి కూ డా వేయలేదు. 2017 ఫిబ్రవరిలో 50 వేల ఇళ్లను తరలిస్తే సరిపోతుందని కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఆ తర్వాత 90 వేలకు పెంచారు. అప్పుడే లక్ష ఇళ్లను తరలించాలని కేంద్రానికి నివే దించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. డ్యామ్ కట్టిన తర్వాత ఒకేసారి పూర్తిస్థాయి నీళ్లు నిలబెట్టరు. దానికో ప్రొటోకాల్ ఉంటుంది. ముందుగా మూడింట ఒక వంతు, ఆ తర్వాత 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లి 190 టీఎంసీల స్థాయి కి పెంచుతాం. ప్రస్తుతం 41వ కాంటూర్ వరకు పునరావాసం కల్పించాలనే ఆలోచనతోనే 17 వేల ఇళ్లను తరలించాలని నిర్ణయించాం. ఇప్పటికే 8 వేల ఇళ్లను తరలించడానికి సిద్ధం చేశాం’ అన్నారు. -
పోలవరం పనుల్లో వేగం పెంచండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే దిశగా పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరులశాఖ అధికారులకు మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. విజయవాడలో మంగళవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో కలిసి అన్ని ప్రాజెక్టుల సీఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయా ఫ్రమ్ వాల్‌ను పటిష్టం చేయడం, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్, ఇసుక పొరలను భర్తీచేయడం తదితరాలకు సంబంధిం చిన డిజైన్లను ఈనెల 20న జరిగే డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంలో ఆమోదింపజేసుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను వచ్చే జనవరి ఆఖరులో గా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వంశధార స్టేజ్–2 ఫేజ్–2, అవుకు టన్నెల్, వెలిగొండ పనులను వేగవంతం చేయాలన్నారు. -
ఓటర్లను ప్రలోభపెడుతున్నారు
నెల్లూరు సిటీ/దర్శి: కుప్పంలో కూడా ఘోర పరాజయం తప్పదనే విషయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అనేక ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు శనివారం నెల్లూరు నగరం, ప్రకాశం జిల్లా దర్శిలో వేర్వేరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లూరు, దర్శిలో మంత్రి బాలినేని మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. ఇక రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అందుకే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఎదురీదుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేష్ కుప్పంలో గెలిచేందుకు ఓటుకు రూ.5 వేలు చొప్పున పంచే పరిస్థితి వచ్చిందన్నారు. కుప్పాన్ని మునిసిపాలిటీ చేసింది సీఎం వైఎస్ జగన్ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దర్శిలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో రుణమాఫీలంటూ ఎడాపెడా హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్ అన్ని హామీలను నెరవేరుస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, విడదల రజిని, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం నిర్వాసితులకు వేగంగా పునరావాసం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్‌లో కుడి వైపున 96 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులు చేపట్టామని, నెలాఖరులోగా రక్షిత స్థాయికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఆలోగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయని మంత్రికి వివరించారు. ఆ తర్వాత రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సూచనల మేరకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టి..2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అనిల్‌కుమార్..గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో 5 వేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని అధికారులు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తాడ్వాయిలో పునరావాస కాలనీ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ పనులను వేగవంతం చేసి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. -
విరిగిన పులిచింతల గేటు
సాక్షి, అమరావతి బ్యూరో, సాక్షి, అమరావతి, అచ్చంపేట, జగ్గయ్యపేట : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా డ్యాంలో నీటి నిల్వను తగ్గించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ ఫ్లడ్ చేరింది. ఈ దృష్ట్యా అధికారులు, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 16వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్‌లో నీటి నిల్వను తగ్గిస్తున్నారు. దీంతో నీటి విడుదల క్రమంగా 6 లక్షల క్యూసెక్కుల వరకు పెరగనుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులో 34.68 టీఎంసీలు నిల్వ ఉండగా, సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 16వ నంబరు గేటు నుంచి పూర్తి స్థాయిలో, మిగతా గేట్ల నుంచి.. మొత్తంగా 5,05,870 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు తగ్గితేగాని మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. మరమ్మతులకు మార్గం సుగమం సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో క్రస్ట్ లెవల్ (గేటు బిగించే మట్టం) 36.34 మీటర్లకు నీటి నిల్వను తగ్గిస్తేనే.. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయవచ్చు. శుక్రవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 36.34 మీటర్లకు తగ్గుతుంది. అదే రోజు స్పిల్ వే 16, 17వ పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) మధ్య స్టాప్ లాగ్ గేటును దించి.. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్థాయి గేటును బిగిస్తామని చెప్పారు. ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతోనే.. నాగార్జునసాగర్ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 55,028 క్యూసెక్కులను విడుదల చేసిన తెలంగాణ అధికారులు.. దిగువకు వదిలే ప్రవాహాన్ని రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీలు నిల్వ ఉండటం... ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఏడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్పిల్ వే గేట్లను సంప్రదాయ పద్ధతి(రోప్)లో ఎత్తుతారు. ఒక్కో గేటును ఎత్తేందుకు ఒక్కో వైపు రెండు చొప్పున, నాలుగు రోప్(ఇనుప తీగ)లను అమర్చారు. 16వ గేటును రెండు అడుగుల మేర ఎత్తగానే ఎడమ వైపున ఉన్న ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతో గేటు ఊడిపోయి, వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టు గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. నిపుణుల కమిటీ వేస్తాం.. ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ శ్రీనివాస్ తదితరులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయన కమిటీ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామన్నారు. ఊడిపోయిన గేటును రేపు (శనివారం) సాయంత్రానికి పునరుద్ధరిస్తామని తెలిపారు. మూడు నాలుగు రోజులుగా ఈ గేటు ద్వారానే ప్రాజెక్టు దిగువకు లక్ష నుంచి రెండు లక్షల నీటిని విడుదల చేశారని, తెల్లవారు జామున నీటి ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గేటు ఊడినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని గేట్ల ద్వారా 5,05,870 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నామని చెప్పారు. గేట్ అమర్చేందుకు పోలవరం నుంచి ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కూడా వస్తున్నారన్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిలు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో మాట్లాడారు. -
తెలంగాణ వాళ్లు దాదాగిరి చేస్తున్నారు
నెల్లూరు(సెంట్రల్): మనకు రావాల్సిన నీటిని రానీయకుండా.. ఏకపక్షంగా నీటిని వదిలేస్తూ మనపై తెలంగాణ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నెల్లూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలసి సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో పలు అక్రమ కట్టడాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఏపీకి నేడు ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లందించేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ వాళ్లు ఏకపక్షంగా నీటిని తోడేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరుకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చేస్తామని సజ్జల స్పష్టం చేశారు. -
కర్రా గిరిజా హర్షవర్ధన్‌రెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కర్రా గిరిజా హర్షవర్ధన్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదలా శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 137 మంది చైర్మన్లను ఎంపిక చేయటం గొప్ప విశేషం అని కొనియాడారు. పార్టీకోసం కష్టపడినవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. మరో 30ఏళ్ళు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన తెలిపారు. ఇక గిరిజా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తామని గిరిజా హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రా రెడ్డి, ఆర్థర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీ ఎస్ ఐడీసీ ఎండీ పూర్ణ చంద్రరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హర్ష వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాంతీయ చిచ్చుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో రాయలసీమ లిఫ్ట్ ఆపించాలంటూ లేఖ రాయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు, ప్రసార మాధ్యమాల అధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు రాష్ట్రానికి దెయ్యాల్లా దాపురించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆ జిల్లాల అభివృద్ధికి వైఎస్సే కారణం ప్రకాశం, గుంటూరు జిల్లాలను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్ఎస్పీ ఆధునికీకరణతో అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తీసుకొచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయర్, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేశారు. కొర్సిపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు సామర్థ్యం పెంచడం వైఎస్సార్ కాలంలోనే జరిగాయి. ఈ జిల్లాలకు చంద్రబాబు చేసిందేంటి? వెలిగొండ పనులు వైఎస్సార్ కాలంలో 11.5 కిలోమీటర్లు పూర్తయితే.. చంద్రబాబు ఐదేళ్లలో 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. జగన్ 18 నెలల్లోనే మొదటి టన్నెల్‌ను 2.8 కిలోమీటర్లు, రెండో టన్నల్‌ను కిలోమీటరుకుపైగా పూర్తిచేశారు. రెండో టన్నెల్‌ను కూడా 2023లోగా పూర్తిచేసి నీరందించేందుకు కృషిచేస్తున్నారు. గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎన్ఎస్పీ కెనాల్‌కు పంపేందుకు ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుచేశారు. భయపడి తెలంగాణతో బాబు రాజీ తెలంగాణలో ఐదేళ్లలోనే పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టులు కట్టారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు తెలంగాణతో రాజీపడ్డాడు. అప్పట్లోనే చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల ఆలోచన చేసి ఉంటే బాగుండేది కదా? పోతిరెడ్డిపాడులోంచి నీరు తీసుకెళ్తుంటే ఒకప్పుడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేయించాడు. చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్లు కట్టి 8 నుంచి 10 టీఎంసీల నీరు నింపాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే.. రాజకీయభిక్ష పెట్టిన జిల్లాకే ప్రాజెక్టులు రాకుండా కేసులు వేయించి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఇంత దుష్ప్రచారమా? లేటరైట్‌ను బాక్సైట్ అంటూ చంద్రబాబు చేస్తున్నదంతా దుష్ప్రచారమే. ఈ ప్రభుత్వం లేటరైట్‌కు ఒక్క పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేసింది. 2015లో పర్యావరణ అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆయన ఎందుకు అడ్డుకోలేదు? తన పార్టీ వ్యక్తి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు గిరిజనుల పేరుతో మైన్లు తీసుకుని నడిపారు. వైఎస్ జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. నీటిహక్కు ఉన్నమేరే ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి. -
తెలంగాణ తీరును ప్రజల్లోకి తీసుకెళ్దాం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడమే పరమావధిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వ వాదన, ఆ నీటిపై ఆంధ్రప్రదేశ్ హక్కు, వాడుకుంటున్న నీటిపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు అవగాహన కల్పించేందుకు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 109 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. వాస్తవ విరుద్ధమైన వారి వాదననను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనకు రావాల్సిన నీటి వాటా కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని, దానిపై తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ తన పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే జల దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో పచ్చమీడియా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నదీ జలాల ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే.. మరోవైపు సందట్లో సడేమియాలా చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతూ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదానికి మూల కారకుడు, అసలు నేరస్తుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఆయన.. అప్పట్లో తెలంగాణ సర్కార్ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడదాం తెలంగాణ అబద్ధపు ప్రచారానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని అందరికి చాటి చెప్పేలా కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అందరూ బాగుండాలన్నదే సీఎం అభిమతం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ అడ్డగోలు వాదనకు గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా, సంయమనం పాటిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కేంద్రం పరిష్కారం చూపడం లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మనం రెచ్చిపోకుండా రైతులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దిగువన ఉన్న వారు ఎలా దోపిడీ చేస్తారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. వాస్తవ విషయాన్ని ప్రజలందరికి వివరించి, అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. మా కోటా నీటినే వాడుకుంటాం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో పలు ఒప్పందాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత 2015లో కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోంది. మేము చేపట్టింది ప్రాజెక్టు కాదు. కేవలం ఎత్తిపోతల పథకం మాత్రమే. అందువల్ల దాన్ని ఆపాలని చెప్పడం సరికాదు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు పైగా నీరుంటేనే.. పోతిరెడ్డిపాడు ద్వారా మనకు రావాల్సిన 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం సా«ధ్యమవుతుంది. మాకు కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోం. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నీరు ఉన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి దాకా 30, 40 టీఎంసీలు డ్రా చేశారు. అటు పులిచింతల నుంచి కూడా 14 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు వివరించాలి. –అనిల్ కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి -
పేదల కళ్లలో సొంతింటి వెలుగులు : అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ప్రైవేట్ లేఅవుట్ల కంటే మిన్నగా అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు తమ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే వారి కళ్లల్లో సంతోషం, ఆనందం కనిపిస్తోందని, ఏక కాలంలో ఇలా శంకుస్థాపనలు చేయడం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగర నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండ్లపూడి వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చరిత్ర అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయంలో భాగంగా తొలి విడతగా 17 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నగర నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన దాదాపు 14,500 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అందులో మొదటి విడతగా 7,600 ఇళ్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు నిర్మిస్తూ మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు ఆరు అంకణాలు మాత్రమేనని ఇచ్చారని, విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన టిడ్కో ఇళ్లు కేవలం నాలుగు అంకణాలు మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు సొంతిల్లు నిర్మించాలనే ఆలోచనతో అందుబాటులో ఉన్న స్థలాలను అభివృద్ధి చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. పట్టణ పరిధిలో తక్కువ భూమి అందుబాటులో ఉండడంతో వీలైనంత వరకు సేకరించి గత ప్రభుత్వం కంటే ఎంతో గొప్పగా పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన దాఖాలు లేవన్నారు. గతంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఇచ్చే క్రమంలో పేదలపై రూ.3 లక్షల భారం మోపారన్నారు. ఆ రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేసి ఉచితంగా ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తునామన్నారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్), అధికారులు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. పేద వారికి అండగా ఉండేది జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్, ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొణిదల సుధీర్, ఎండీ ఖలీల్ అహ్మద్, వేలూరు మహేష్, ఇంతియాజ్, గోగుల నాగరాజు, కుంచాల శ్రీనివాసులు, వందవాశి రంగా పాల్గొన్నారు. -
ఏపీ: ప్రజలను చూసి.. కాన్వాయ్ ఆపి
భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు. క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్‌కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు. -
మరింత వేగంగా ప్రాజెక్టుల పనులు
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం పెంచాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆయన 13 జిల్లాల చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ఆరు ప్రాజెక్టులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూలు ప్రకారమే చేస్తున్నామని సీఈ సుధాకర్ బాబు వివరించగా.. ఎగువ కాపర్ డ్యామ్ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి అనిల్ సూచించారు. వరద వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఓ.ఆనంద్‌ను ఆదేశించారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని సీఈ హరినారాయణరెడ్డి చెప్పగా.. వాటిని ఈ ఏడాదే సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడానికి సిద్ధం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనం ఫోర్ పూలింగ్ విధానంలో చేస్తున్నామని, ఆగస్టు నాటికి పూర్తవుతాయని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను ఈ ఏడాదే పూర్తి చేసి.. వాటిని ప్రారంభించడానికి సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘యాస్’ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
గురుమూర్తి నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 9 మంది రాష్ట్ర మంత్రులు, ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ తదితరులతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబుకు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. తొలుత నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మునిసిపల్ తీర్పు పునరావృతం ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ప్రజలు మునిసిపల్ ఎన్నికల ద్వారా బలమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు పునరావృతమవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తం చూసేలా భారీ మెజార్టీ తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు గురుమూర్తి ఒక వైపు, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలా హేమాహేమీలు మరోవైపు బరిలోకి దిగారని చెప్పారు. గురుమూర్తి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం ఆలోచించే రీతిలో భారీ మెజార్టీ సాధించడానికి తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తున్న సీఎం రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నెల్లూరులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షల మెజారిటీ సాధిస్తాం మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తేనే పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ సాధిస్తామన్నారు. ఈ ఎన్నికలు రెఫరెండం కాదని చెప్పి టీడీపీ ముందే చేతులెత్తేసిందన్నారు. జగన్ 21 నెలల పరిపాలనకు ప్రజలు భారీ మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ స్థానం కానుకగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన సామాన్యడైన గురుమూర్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ, బీజేపీ ఉనికి కాపాడుకోడానికి డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు. ర్యాలీకి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసనకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు జిల్లాను సుందరంగా తీర్చిదిద్దుతాం
-
తిరుపతి ఉపఎన్నికలో చరిత్ర సృష్టిస్తాం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో చరిత్ర సృష్టిస్తామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ 20 నెలల పాలనకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రెఫరెండంగా భావిస్తామన్నారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా స్టేల బతుకేనన్నారు. తప్పులు చేయకపోతే కోర్టుల్లో స్టే తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యంగా విచారణను ఎదుర్కొనే వారని, అలాంటి సామర్థ్యం లేనందునే ‘స్టే’ల బాబుగా మారాడన్నారు. -
చంద్రబాబు వల్లే డయాఫ్రంవాల్‌కు ముప్పు
పోలవరం రూరల్/రంపచోడవరం/దేవీపట్నం: చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్‌కు ముప్పు ఏర్పడిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆయన బుధవారం పోలవరం ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ కాఫర్ డ్యాం, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులతో పాటు ఎడమ కాలువకు, నావిగేషన్ కెనాల్‌కు సంబంధించిన సొరంగ మార్గాలను పరిశీలించారు. నిర్వాసితుల గృహాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, ప్రాజెక్టు పనుల పురోగతిపై మేఘ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ నిర్దేశించిన సమయానికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా స్పిల్‌వే పూర్తి చేసి.. కాఫర్ డ్యాం నిర్మించి.. వరదనీటిని మళ్లించాక డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉందన్నారు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోలేదన్నారు. దీంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెలిపారు. చంద్రబాబు తీరు వల్ల సమయం, డబ్బు.. వృథా అయ్యాయని మండిపడ్డారు. వరదల సమయానికి నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా 41వ కాంటూరు పరిధిలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మే నెలాఖరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేసి ఏడు మండలాల పరిధిలోని 17 వేల కుటుంబాలను తరలిస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ ఎం.సుధాకర్‌బాబు, స్పెషల్ కలెక్టర్ ఆనంద్, ప్రాజెక్టు ఎస్ఈ కె.నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, మేఘ జీఎం ఎ.సతీష్‌బాబు తదితరులున్నారు. -
ఘనంగా మూలపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం
-
టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్
-
బాబు బాగోతం వల్లే డయాఫ్రమ్ వాల్‌కు నష్టం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా చేయడం వల్ల 2018లోనే డయాఫ్రమ్ వాల్ వరదకు కొట్టుకుపోయిందని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. నిజం ఇలా ఉంటే.. ఈనాడు దినపత్రిక మాత్రం దాన్ని కప్పిపుచ్చుతూ కథనం రాసిందని మండిపడ్డారు. నిర్మాణ కాంట్రాక్టర్ రామోజీరావు బంధువే అనే నిజాన్ని వార్తలో దాచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలేం టో ఈనాడు తన కథనంలో చెప్పకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని దుష్ప్రచారం చేయడమే ఈ వార్త ఉద్దేశమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చేపట్టారని, దీనికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. అనిల్ ఇంకేమన్నారంటే.. ఆ తప్పు చంద్రబాబుదే.. ఓ ప్రణాళిక ప్రకారం.. పోలవరం ప్రాజెకు నిర్మిం చాల్సి ఉండగా టీడీపీ హయాంలో అతుకులతుకులుగా కట్టడం వల్లే ఇలాంటి దుష్ఫలితాలు వస్తున్నాయి. స్పిల్‌వే, స్పిల్ చానెల్ పూర్తి చేసి, వరద నీటిని మళ్లించాక కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయాలి. తర్వాత డయాఫ్రమ్ వాల్ చేపట్టాలి. కానీ వీటిని ఇష్టానుసారం అసంపూర్ణంగా చేశారు. లక్షలాది క్యూసెక్కుల వరద వస్తుందని తెలిసి కూడా అడ్డదిడ్డంగా కట్టడం వల్ల 1.4 కిలోమీటర్లున్న డయాఫ్రమ్ వాల్‌కు 185 మీటర్ల మేర నష్టం జరిగింది. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. జరిగిన నష్టాన్ని పోలవరం అథారిటీ గుర్తించింది. వారి సూచనల మేరకు ముందుకెళ్తాం. మే నాటికి స్పిల్‌వే, స్పిల్ చానెల్లను పూర్తిచేస్తాం. కాఫర్ డ్యామ్ నిర్మాణం గోదావరి వరదను మళ్లించి, వరద ప్రభావం ఆ ప్రాంతంపై పడకుండా చేస్తాం. విశాఖపై ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా? విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామంటే అడ్డుకున్న చంద్రబాబు, ఎల్లో మీడియాకు అకస్మాత్తుగా విశాఖపై ప్రేమ పుట్టుకురావడం విడ్డూరంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వైఎస్ జగనే కారణమన్న రీతిలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. 1999 నుంచి 2004 వరకు రాష్ట్రంలోనే 54 సంస్థలు మూతపడటమో, ప్రైవేటుపరం అవ్వడమో జరిగితే ఇదే ఈనాడు పత్రిక అప్పట్లో సమర్థించింది. -
సుబాబుల్ రైతుకు ప్రభుత్వం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన మార్కెటింగ్ సదుపాయం లేక తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని దాదాపు 66 వేల మంది సుబాబుల్, యూకలిప్టస్ ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనీల్‌కుమార్ స్పష్టం చేశారు. సుబాబుల్ రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో యూకలిప్టస్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుబాబుల్ ఎక్కువగా సాగవుతుంది. గతంలో నేరుగా పేపర్ మిల్లులే కొనుగోలు చేసేవి. 2017లో 45 మంది బయటి వారికి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చారు. ఈ ట్రేడర్స్ కంపెనీలతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కంపెనీలతో కుమ్మక్కవుతున్న ట్రేడర్స్‌ను గుర్తించి లైసెన్సులను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర పంటల మాదిరిగా ఈ పంటలనూ ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పంటను పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా పర్మిట్లు జారీ చేయాలని, వ్యవసాయ శాఖ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడండి: మంత్రి పెద్దిరెడ్డి రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తక్షణమే మొదలు పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పేర్ని నాని, అధికారులు పాల్గొన్నారు.