‘జన్వాడ ఫామ్‌హౌజ్‌’ అంటేనే వివాదం: ఎంపీ అనిల్‌ యాదవ్‌ | MP Anil Kumar Yadav Comments On Janwada Farmhouse Party Issue | Sakshi
Sakshi News home page

‘జన్వాడ ఫామ్‌హౌజ్‌’ అంటేనే వివాదం: ఎంపీ అనిల్‌ యాదవ్‌

Published Tue, Oct 29 2024 1:02 PM | Last Updated on Tue, Oct 29 2024 1:19 PM

MP Anil Kumar Yadav Comments On Janwada Farmhouse Party Issue

సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అనిల్‌ యాదవ్‌ మంగళవారం(అక్టోబర్‌ 29) మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి బీఆర్‌ఎస్‌ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి.రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలి.కేటీఆర్‌కు అసలు బినామీ విజయ్ మద్దూరి.గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు.జన్వాడ ఫామ్‌హౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒక సారి దీపావళి విందని,మరోసారి గృహ ప్రవేశం అని అంటున్నారు.

తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటోంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు.రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు విజయ్‌మద్దూరి మాట మారుస్తున్నాడు.పామ్ హౌస్ దొర కేసీఆర్‌ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు.ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది.కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని అని ప్రజలు అడుగుతున్నారు’అని అనిల్‌ యాదవ్‌ గుర్తుచేశారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌, బీజేపీ మధ్య క్విడ్‌ ప్రో కో: కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement