
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో చరిత్ర సృష్టిస్తామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ 20 నెలల పాలనకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రెఫరెండంగా భావిస్తామన్నారు.
నెల్లూరులో ఆదివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా స్టేల బతుకేనన్నారు. తప్పులు చేయకపోతే కోర్టుల్లో స్టే తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యంగా విచారణను ఎదుర్కొనే వారని, అలాంటి సామర్థ్యం లేనందునే ‘స్టే’ల బాబుగా మారాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment