Tirupati By-elections
-
తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలే అందుకు నిదర్శనం
-
పోలింగ్ తగ్గినా వైఎస్సార్సీపీకి పెరిగిన ఓట్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2019లో జరిగిన ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గినా వైఎస్సార్సీపీకి లభించిన మెజారిటీ భారీగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 79.76 శాతం పోలింగ్ నమోదైంది. వైఎస్సార్సీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ లభించింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కోవిడ్ నేపథ్యంలో 15 శాతానికిపైగా పోలింగ్ తగ్గింది. అయినా వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలకంటే వైఎస్సార్సీపీకి 1.64 శాతం మేర ఓట్లు పెరిగాయి. తాజా ఎన్నికల్లో 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది. -
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటర్లు సంక్షేమ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అపూర్వ విజయాన్ని అందించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 95 శాతం ఎన్నికల హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. సీఎంకు, అండగా నిలిచిన ప్రజలకు, వైఎస్సార్సీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 75 శాతం పోలింగ్ నమోదవుతుందని భావించామని, అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. పోలింగ్ శాతం పెరిగి ఉంటే అనుకున్న మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవన్నారు. అయినా గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గత ఎన్నికల్లో తిరుపతిలో తమ పార్టీ 55.03 శాతం, టీడీపీ 37.67 శాతం ఓట్లు సాధించగా.. ఈసారి వైఎస్సార్సీపీ 56.5 శాతం, టీడీపీ 32.01 శాతం ఓట్లు సాధించాయన్నారు. 5.66 శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ పాల్గొన్నారు. -
Maddila Gurumoorthy: ఇది ప్రజావిజయం
నెల్లూరు (సెంట్రల్)/తిరుపతి తుడా: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తన విజయం ప్రజా విజయమని ఎంపీగా గెలుపొందిన మద్దిల గురుమూర్తి చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో కలిసి నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం డీకేడబ్ల్యూ కళాశాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. అనంతరం అక్కడ, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద గురుమూర్తి విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని, సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు తనను దీవించారని చెప్పారు. ముఖ్యమంత్రికి తాను రుణపడి ఉంటానని, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజల మద్దతుతో గెలిపించిన సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల కోసం పనిచేస్తానని, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. సీఎం అడుగుజాడల్లో నడవడమే తన లక్ష్యమన్నారు. ఈ విజయం జగనన్నదేనని చెప్పారు. సాధారణ వ్యక్తి అయిన తనను పార్లమెంట్‌కు పంపించాలన్న జగనన్న సంకల్పం గొప్పదన్నారు. ఇలాంటి మంచి మనసున్న జగనన్న దేశ రాజకీయాల్లో సరికొత్త ముద్ర వేస్తున్నారని తెలిపారు. ధ్రువీకరణపత్రం అందుకునే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు పి.రూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Panabaka Lakshmi: మాకు ఓటేసినవారే ఓటర్లు..
తిరుపతి అర్బన్: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి అనంతరం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను అవమాన పరిచేలా మాట్లాడారు. ఆదివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఓటు వేసిన వారే నిజమైన ఓటర్లని, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారు కాదని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం నుంచి తాను పారిపోయినట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. -
Tirupati Election Results 2021: జననేత వైపే జనం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధిని ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 2.71 లక్షలకుపైగా ఓట్లతో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. 2019 ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ కట్టబెట్టడం గమనార్హం. తన 23 నెలల పాలన చూసి ఓటేయాలన్న సీఎం జగన్ మాటను గౌరవిస్తూ విశ్వసనీయతకే పట్టం కట్టారు. ఊహించిందే అయినప్పటికీ భారీ మెజారిటీ రావడం పార్టీ వర్గాల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఈ నెలాఖరుతో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెలువడ్డ ప్రజా తీర్పు సీఎం జగన్ పాలన పట్ల రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ దాదాపు 2.28 లక్షల మెజారిటీతో గెలుపొందడం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో అనివార్యంగా మారిన ఉప ఎన్నికలో రాజకీయ అనుభవం లేని, పాదయాత్రలో తన వెన్నంటి ఉన్న డాక్టర్ ఎం.గురుమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. ఫలించని ‘పచ్చ’రాజకీయం! స్థానిక ఎన్నికల్లో కుదేలైన టీడీపీ తాజాగా తిరుపతి ఎన్నికల్లో మరోసారి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. రోజుల తరబడి అక్కడే మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఉనికి కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. రకరకాల ఎత్తుగడలు వేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకూ వెనుకాడలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ తన బహిరంగ సభను రద్దు చేసుకుని ఓటర్లకు లేఖ రాస్తే విపక్షం దీన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలకు దిగింది. అయినప్పటికీ సీఎం సంయమనాన్ని పాటిస్తూ హుందాగా వ్యవహరించారు. ఫలితాల జోరు చూస్తే ఒక్క తిరుపతే కాదు లోక్‌సభ నియోజకవర్గం మొత్తం సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. -
నిన్ను నమ్మం బాబూ..
సాక్షి, అమరావతి: తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఎత్తులు పారలేదు. రాళ్ల రాజకీయం చేసినా.. ధర్నాలు చేసినా.. దొంగ ఓట్లంటూ డ్రామాలు వేసినా.. ఓటర్లు నమ్మలేదు. ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ స్పష్టంగా తీర్పు చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానంలో టీడీపీకి 37.65 శాతం ఓట్లు పడ్డాయి. అదే స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి 32.08 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు రెండేళ్లలో టీడీపీ ఓటు బ్యాంకు 5.57% పడిపోయింది. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఏడాదిగా కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను పట్టించుకోని చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం తనతోపాటు టీడీపీ శ్రేణులను రంగంలోకి దించారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన తనయుడు లోకేశ్‌తోపాటు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని టీడీపీ ఇన్‌చార్జ్‌లు వీధివీధికి తిరిగినా ప్రజల ఆదరణ దక్కలేదు. వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆడని డ్రామాలేదు. కోడ్ అమలులో ఉండగానే ఎన్నికల్లో లబ్ధి కోసం ఆయన చిత్తూరులో 5 వేలమందితో ధర్నా, నిరసనకు వెళ్లి రాజకీయ మైలేజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోవిడ్ నిబంధనలు, తిరుపతి ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చంద్రబాబు ఆందోళన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి కూర్చుని తిరుపతి ప్రజల సానుభూతి కోసం ఆడిన హైడ్రామా ఆయనకు రాజకీయ మైలేజీ తేలేకపోయింది. చివరకు బహిరంగసభలో చిన్న రాయిని పట్టుకుని.. తమపై రాళ్లు వేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ‘రాయి’ రాజకీయం రక్తికట్టలేదు. తనపై రాళ్లు విసిరి హత్యాయత్నం చేశారంటూ తిరుపతి ప్రజలను నమ్మించి సానుభూతి ఓట్లు పెంచుకోవాలన్న బాబు ఎత్తుగడ పారలేదు. అక్కడే నేలపై కూర్చుని ధర్నా చేసి దాన్ని లబ్ధిపొందాలన్న కుతంత్రం నెరవేరలేదు. చివరకు ఓట్ల వేటలో రాజకీయ మౌలిక సూత్రాలను సైతం పక్కన పెట్టి ‘వకీల్‌సాబ్’ పేరుతో సినిమా ట్రిక్కులకు తెరలేపారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత అయిన పవన్‌ను భుజానికెత్తుకున్న చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలో ఆ సామాజికవర్గ ఓట్లకు గాలం వేశారు. పవన్ నటించిన వకీల్‌సాబ్ సినిమాకు రేట్లు పెంచుకునేందుకు, ఎక్కువ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు.. పవన్ అనుకూల ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. అయినా బాబు వేసిన సినిమా ట్రిక్కులు తిరుపతి ప్రజల ముందు పారలేదు. చివరకు పోలింగ్ రోజున అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు పార్టీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. స్వేచ్ఛగా వచ్చి ఓటేసే ప్రజలను దొంగ ఓట్ల పేరుతో బెదరగొట్టి వైఎస్సార్సీపీకి వచ్చే మెజారీటిని తగ్గించేందుకు చంద్రబాబు హైడ్రామా నడిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి వచ్చే అనేకమంది బయటి భక్తులను సైతం దొంగ ఓటర్లుగా చూపించి మభ్యపెట్టేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన హడావుడికి తిరుపతి ప్రజలు గట్టి బదులిచ్చారు. చంద్రబాబు చీప్ ట్రిక్కులను నమ్మని తిరుపతి ఓటర్లు ఛీత్కరించడమే కాకుండా ఘోర పరాజయంతో గట్టి బదులిచ్చినట్టు అయింది. -
Tirupati Election Results 2021: ‘ఫ్యాన్’ హ్యాట్రిక్
సాక్షి, అమరావతి: వరుసగా మూడుసార్లు నెగ్గి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ సాధించింది. 2014 నుంచి తాజా ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినా భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. అప్పుడు 13,16,473 (79.76 శాతం) ఓట్లు పోల్ కాగా తాజా ఉప ఎన్నికలో 11,04,927 (64.42 శాతం) పోలయ్యాయి. అంటే ఈసారి 2,11,546 (15.34 శాతం తక్కువ) ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 55.03 శాతం ఓట్లతో 2,28,376 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు డాక్టర్ ఎం.గురుమూర్తి 56.67 శాతం ఓట్లతో 2,71,592 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీ మెజార్టీ శాతం 15.38 అయితే ఇప్పుడు మెజార్టీ శాతం 24.59 కావడం గమనార్హం. అంటే 23 నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ 9.21 శాతం పెరిగింది. టీడీపీ దీనావస్థ.. రెండు దఫాలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో 4,94,501 ఓట్లు సాధించగా ఈసారి ఆమెకు 3,54,516 ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో టీడీపీకి 37.65 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 32.08 శాతం మాత్రమే వచ్చాయి. అంటే 5.57 శాతం ఓట్లు తగ్గాయి. అది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డితే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ 20,971 (1.60 శాతం) ఓట్లు సాధిస్తే అప్పుడు బీజేపీకి 16,125 (1.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే 37,096 ఓట్లు (2.82 శాతం) వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 57,080 ఓట్లు (5.17 శాతం) సాధించింది. ఇదే అత్యధికం తిరుపతిలో 1989 సాధారణ ఎన్నికల దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి గురుమూర్తి సాధించిన మెజారిటీనే అత్యధికమని స్పష్టమవుతోంది. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, తిరుపతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. గత ఎన్నికలే కాదు 1989 నుంచి చూసినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిన పార్టీలు ఫ్యాన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. బీజేపీ – జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా టీడీపీ మరోసారి పరాజయం పాలైంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో గత నెల 17వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 11,04,927 ఓట్లు పోల్ కాగా 64.42 శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించింది. తిరుపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ అక్కడే మకాం వేసి రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. తాను అధికారం చేపట్టిన తరువాత 22 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రజలకు లేఖ రాశారు. 56.67 శాతం ఓట్లతో విజయభేరీ.. తిరుపతి ఉప ఎన్నికలో పోలైన మొత్తం 11,04,927 ఓట్లలో అధికార పార్టీకి సగానికిపైగా 56.67 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదు కాగా 55.03 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా పోలింగ్ శాతం తగ్గినా గత ఎన్నికల కంటే 1.64 శాతం ఓట్లను అధికంగా వైఎస్సార్సీపీ సాధించడం గమనార్హం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 5.57 శాతం ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనసేన జతకట్టడంతో బీజేపీ 5.2 శాతం ఓట్లతో ఎట్టకేలకు ‘నోటా’ను అధిగమించింది. కాంగ్రెస్ 1.78 శాతం ఓట్లను కోల్పోగా సీపీఎం 0.5 శాతం ఓట్లకే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఆధిక్యం.. ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సూళ్లూరుపేట, వెంకటగిరి గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైఎస్సార్సీపీ ఆధిక్యం కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లలో 809 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఖాతా తెరిచారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 35 నుంచి 40 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యం పూర్తి స్థాయిలో కొనసాగింది. ఆ సమయంలో గురుమూర్తితోపాటు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ రావడంతో పనబాక లక్ష్మి నిరుత్సాహంతో వెనుదిరిగారు. మారుమూల గ్రామం.. మధ్య తరగతి కుటుంబం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామం మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దెల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగు చేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ పూర్తి చేశారు. మహానేత స్ఫూర్తి.. జగనన్న వెన్నంటి.. గురుమూర్తి స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతగా నాడు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ కలిసేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే నడిచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించిన రోజే ఆయన విజయం ఖరారైంది. ప్రజలపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఉప ఎన్నిక ఫలితం ద్వారా మరోసారి నిరూపించారు. డిక్లరేషన్ అందుకున్న గురుమూర్తి.. ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎం.గురుమూర్తికి ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవిఎన్ చక్రధర్‌బాబు డిక్లరేషన్ అందజేశారు. గురుమూర్తితో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురుమూర్తి నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఘన విజయం అందరిదీ నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘23 నెలల పాలన తరవాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ ఘన విజయం ప్రజలందరిదీ. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజారిటీ ఇవ్వటం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పవి. ఇది నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ విజయం సాధ్యమైంది..’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. -
ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ
సాక్షి, తిరుపతి: ఏ ఎన్నిక చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణ ఎన్నికలు మొదలుపెట్టుకుని మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చి ఇప్పుడు అనివార్యంగా వచ్చిన తిరుపతి లోక్‌సభ ఎన్నికలోనూ ఓటర్లు వైఎస్సార్సీపీకి తిరిగి ఎంపీ స్థానం కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు ఉప ఎన్నికలోనూ సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ గురుమూర్తి తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందడం విశేషం. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారానికి రాకపోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకు వచ్చారు. రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' -
వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు ముగిసిన తరువాత రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకరేమో గెలుపు మనదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు.. పోలింగ్ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరు ప్రచారం పీక్ లెవెల్‌కు వెళ్లాక పార్టీ పరువు తీశారు. ఆ ఇద్దరు.. బీజేపీ, టీడీపీల రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు. ఈ ఇద్దరికీ పదవీగండం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ విస్తృత సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు సీరియస్‌నెస్ లేదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల అనంతరం వీర్రాజుకు పదవీగండం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. సైకిల్ గాలి తీసిన అచ్చెన్నాయుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేశ్ రెండు వారాలు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి్డలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించారు. ప్రచారం పీక్ లెవెల్‌కు చేరిందని భావిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒక్కసారి టీడీపీ సైకిల్ గాలి తీసింది. టీడీపీ బాధితుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆవేదన నిజమేనని, లోకేశ్ సరిగా వ్యవహరించరని ఆ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది. తండ్రీతనయుల శైలిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా వెల్లడించడం, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు.. బొ.. లేదని స్వయంగా చెప్పడంతో పార్టీ ఒక్కసారిగా డీలాపడింది. 2019 ఫలితాల కంటే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓట్లు గణనీయంగా తగ్గనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడికి పదవీగండం తప్పదని చంద్రబాబు సన్నిహితులుగా ఉన్న చిత్తూరు జిల్లా నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు టీడీపీ పెద్దలను నమ్మి మోసపోయినట్లు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. తనతో సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించారని, పోటీచేయనన్నా నిలబెట్టారని, పోలింగ్ సమీపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు చేతులెత్తేసి అవమానించారని చెప్పి ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. ఇక్కడ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓటమికి కారణాలు వెతుకుతున్న టీడీపీ తీవ్రస్థాయిలో విభేదాలు.. టీడీపీలో సస్పెన్షన్ల కలకలం -
Tirupati Lok Sabha Bypoll 2021: ఈవీఎంలలో తీర్పు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పారదర్శకంగా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 2వ తేదీ ఈ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దసంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను ఆరింటిలో మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. మొత్తం ఓటర్లు 17,10,699 మంది ఉండగా 10,99,814 ఓట్లు (64.29 శాతం) పోలయ్యాయి. పురుషులు 5,43,450 మంది, మహిళలు 5,56,341 మంది, ఇతరులు 23 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓట్ల కంటే 12,891 మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ అన్ని సెగ్మెంట్లలోను మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీటిలో తిరుపతి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలోను మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ గెలుపు నల్లేరుమీద నడకేనని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పథకంలోను మహిళలకు పెద్దపీట వేయడం, మహిళలు అన్ని రంగాల్లోను ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఆర్థికసాయం చేయడంతో పాటు, ప్రతి పేద మహిళ పేరుతో ఇంటి స్థలం కేటాయించడం వంటి చర్యలతో మహిళల ఓట్లు తమకే పడ్డాయని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ సరళిని చూసిన తరువాత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నిస్తేజంగా ఉన్నారు. -
ఓటమికి కారణాలు వెతుకుతున్న టీడీపీ
తిరుపతి తుడా/నగరి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక వీడియోని విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందుతారని అన్ని సర్వేలు తేల్చాయన్నారు. ఘోరాతి ఘోరంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు, లోకేశ్‌లు తిరుపతిలో సరికొత్త నాటకానికి దిగారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో ఇదే పద్ధతిని ఆ పార్టీ నేతలు అవలంబిస్తున్నారన్నారని గుర్తు చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని లోకేశ్ వీరప్పన్ అంటూ విమర్శించడం సిగ్గుచేటన్నారు. నీచ, దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని మండిపడ్డారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన ఖర్మ వైఎస్సార్సీపీకి గాని, సీఎం వైఎస్ జగన్‌కిగానీ లేదన్నారు. ఎక్కడా డబ్బులు పంచకుండా, ఎవరినీ ప్రలోభ పెట్టకుండా, ఏ విధమైన గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్పారు. -
ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ యత్నం
ముత్తుకూరు: తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికల సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో శనివారం జరిగిన పోలింగ్‌లో చదువురాని ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. టీడీపీ కార్యకర్తలు కొందరు ఓటు వేసేందుకు వెళ్లి ఈవీఎంలో సైకిల్ గుర్తుకు ఇరువైపులా చిక్కగా ఇంకు మార్కు వేశారు. అందరూ సైకిల్‌కే ఓటు వేస్తున్నారనే భ్రమలు కల్పించేందుకు, చదువురాని ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన ఈ ఎత్తుగడను వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెంటనే పసిగట్టారు. ఈ విషయాన్ని పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు కూడా అప్రమత్తమై సైకిల్ గుర్తుకు ఇరువైపులా ఉన్న సిరా గుర్తులను పూర్తిగా తుడిచి వేశారు. -
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి: డీజీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలు పాలుపంచుకున్నాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా వచ్చిన 250పైగా వాహనాలను తిప్పి పంపించామన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.76,04,970 నగదును, 6,884 లీటర్ల మద్యాన్ని, 94 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తినా తక్షణమే డయల్ 100, 112 ద్వారా సమాచారమివ్వాలని ప్రచారం చేసినట్టు చెప్పారు. -
ఓటమికి ముందే కారణాలు
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు ముందే కారణాలు వెతుక్కుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్సీపీపై అబద్ధపు ప్రచారం నెత్తికెత్తుకున్నారని మండిపడ్డారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంటే.. జగన్ పాలనకు సానుకూలంగా ఓటేయాలని ప్రజలు భావిస్తుంటే, చంద్రబాబు మాత్రం అబద్ధాల ప్రచారంతో తిరుపతిలో తన విశ్వరూపం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాల్నే ఇక్కడా అమలు చేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ బస్సుల్లో తిరుపతికి దొంగ ఓటర్లను తరలించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలను ఖండించారు. పుణ్యక్షేత్రం కావడంతో రోజూ లక్షమంది భక్తులు తిరుపతికి వస్తుండటంతో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే తన ఆరోపణలకు పదునుపెట్టారన్నారు. భక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనుకూల మీడియా చేసిన హడావుడిని ఖండించారు. ఆ బస్సుల్లోనే చంద్రబాబు తన మనుషులను పెట్టి.. తన అనుకూల మీడియాకు సానుకూలంగా చెప్పించారన్నారు. ఇదంతా పథకం ప్రకారం చేసిన కుట్ర అని స్పష్టం చేశారు. ‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో తన సొంత ఇంట్లో ఉన్నాడు. ఇదీ తప్పేనా? టీడీపీ ఆరోపిస్తున్నట్టు దొంగ ఓటు ఎక్కడేస్తారు? పోలింగ్‌బూత్‌లో కదా? అక్కడ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్లు ఉంటారు. అన్నీ తనిఖీ చేశాకే ఓటు వెయ్యనిస్తారు. దొంగ ఓటేస్తే పట్టుకోరా? అసలు దొంగ ఓట్లయితే పోలింగ్‌బూత్‌లో పట్టుకోవాలి. బస్సులను అటకాయించి, భక్తులను దొంగ ఓటేయటానికి వచ్చారనడం ఏమిటి? అంటే టీడీపీకి ఏజెంట్లే లేని దిక్కుమాలిన స్థితి వచ్చిందా? ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర బలగాలను దించారు. కేంద్ర పరిశీలకులూ ఉన్నారు. పోలింగ్ బూత్‌ల్లో వెబ్ కెమెరాలున్నాయి. వీటిని దాటుకుని పోవడం సాధ్యమా? ఎన్నికల్లో దెబ్బతినే ప్రతీసారి ముందే సాకులు వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటే’’ అని విమర్శించారు. దొంగ ఓట్ల చరిత్ర టీడీపీదే డిపాజిట్లు కూడా రాని పార్టీలు మాత్రమే దొంగ ఓట్లు వేయించాలనుకుంటాయని, అలాంటి పని టీడీపీనో, బీజేపీనో చేసే వీలుంది తప్ప వైఎస్సార్సీపీకి ఏం అవసరమని సజ్జల అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం ప్రజలు వైఎస్ జగన్ వైపే ఉన్నారని ఇటీవలి ఎన్నికలే రుజువు చేశాయి. ఏ అవకాశం వచ్చినా జగన్‌కు ఆశీస్సులివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తిరుపతిలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. ఓడిపోతామని తెలిసే టీడీపీ కారణాలు వెతుక్కుంటోంది. ఇందులో భాగమే దొంగఓట్ల నాటకం. ఫలితాలు వచ్చాక ఆ పార్టీ ఇదే చెప్పబోతోంది. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేయడంలో హేతుబద్ధత లేదు. ఇదే జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం తనను తాను అవమానించుకోవడమే. ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినా వైఎస్సార్సీపీకి ఓట్లు పెరుగుతాయే తప్ప తగ్గవు’’ అని స్పష్టం చేశారు. -
Tirupati Lok Sabha Bypoll 2021: ఆడలేక దొంగాట!
సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి ఖాయమనే నిర్థారణకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలంతా ఏకమై ‘దొంగ ఓట్లు’ రాగం అందుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ఆస్కారం లేకున్నా ఏదో జరిగిపోయిందని చిత్రీకరించేందుకు నానాపాట్లు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగితే ఓటర్లు దూరంగా ఉంటారనే వ్యూహంతో బరి తెగించిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారిని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు ఫోటోతో కూడుకుని ఉంటుంది. ఒకవేళ ఓటర్లకు అది లేకపోతే ఆధార్ చూపాలి. ఓటర్ స్లిప్పు, పోలింగ్ బూత్‌లో ఉండే ఓటర్ లిస్టులో కూడా ఫొటో ఉంటుంది. పోలింగ్ ఏజెంట్లుగా అన్ని పార్టీల వారుంటారు. ఫొటోలను, సదరు ఓటరును ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకున్నాకే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అనుమానం వస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇన్ని దశల్లో తనిఖీలు చేసి నిర్థారించుకునే ప్రక్రియ ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఓట్లు వేశారంటూ అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘పొరుగు ఊర్ల నుంచి వచ్చేవారు ఎలా దొంగ ఓట్లు వేస్తారు? అదెలా సాధ్యం? పోలింగ్ బూత్, చిరునామా, ఓటరు స్లిప్పు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఇవన్నీ లేకుండా దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యం? నిత్యం తిరుపతికి 50 వేల నుంచి లక్ష మంది దాకా భక్తులు వస్తుంటారు. అలాంటప్పుడు వీరంతా దొంగ ఓట్లు వేశారనేందుకు వచ్చారని ఆరోపణలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడులైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా అసత్య ప్రచారాలకు దిగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎత్తులు వేశారు. అందులో భాగంగా బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేసి పోలింగ్ రోజైన శనివారం కుట్రలను కార్యరూపంలోకి తెచ్చారు. ప్లాన్ ప్రకారం వీడియో చిత్రీకరణ.. తిరుపతిలో పోలింగ్ రోజు హైడ్రామా నెలకొంది. కొందరు విపక్ష నాయకులు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వీడియో ఆన్ చేయగానే క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి పారిపోయేలా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సదరు వ్యక్తి పరారయ్యే సమయంలో వీడియో చిత్రీకరించి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని తాము పట్టుకుంటున్నట్లు ప్రచారం కల్పించారు. మరి అదే నిజమైతే పారిపోతున్న వ్యక్తిని తాము పట్టుకోవడం గానీ లేదంటే కనీసం అతడిని పట్టుకోవాలని ఇతరులను ఎందుకు అప్రమత్తం చేయలేదన్నది ప్రశ్న! టార్గెట్ పెద్దిరెడ్డి! సాక్షి ప్రతినిధి, తిరుపతి: దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటకు బీటలు వారాయన్న నిర్వేదంతో తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రతి సందర్భంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలకు దిగారు. 1983 నుంచి కుప్పంలో టీడీపీ అభ్యర్థులు 9 పర్యాయాలు గెలుపొందగా చంద్రబాబు 7 దఫాలుగా నెగ్గుతున్నారు. అయితే టీడీపీకి గట్టి పట్టున్న కుప్పం నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 89 పంచాయితీలకుగానూ 74 సర్పంచ్‌లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం వహించిన టీడీపీ కేవలం 14 సర్పంచ్‌లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. (స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలుపొందారు) ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగే.. దొంగా దొంగా! దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహరించింది. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సులు, వాహనాలు నిలిపివేసి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారా?’ అంటూ నిలదీస్తూ ఆ పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. పథకంలో భాగంగా చంద్రబాబు అనుకూల మీడియాతో ఫోటోలు, వీడియోలు తీసి హంగామా సృష్టించారు. కొందరు మహిళలు వీరి వికృత చేష్టలకు భయపడి చేతులతో ముఖాన్ని కప్పుకోవడంతో వాటికి విస్తృత ప్రచారం కల్పించారు. ఫలితంగా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చేందుకు తటపటాయించారు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ అధికారులు, పోలీసులకు కూడా బీజేపీ, టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అయ్యాక మీపై చర్యలు ఉంటాయంటూ బెదిరిస్తూ పేర్లు రాసుకున్నారు. -
తిరుపతి ఉప పోరు ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి లోక్‌సభా స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ సజావుగా కొనసాగింది. మొత్తంగా 64.29 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతి సెగ్మెంట్లో 50.58 శాతం మేరకే పోలింగ్ జరిగింది. తిరుపతి నగరంలో టీడీపీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు అనుకూల మీడియా హంగామా చేశారు. ఇది తప్పించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సాయంత్రం 7 గంటలలోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో కొన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ రాత్రి 9.30 వరకు కొనసాగింది. పార్లమెంటరీ స్థానం పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా.. 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే.. శనివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలవద్ద పెద్దసంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు పోలింగ్ వేగంగానే కొనసాగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 7.80 శాతం, 11 గంటల వరకు 17.39 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.67 శాతం, 3 గంటలకు 47.42 శాతం, 5 గంటలకు 54.99 శాతం, రాత్రి 7 గంటలకు 64.29 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా చూస్తే.. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో 63.81 శాతం, సర్వేపల్లిలో 66.19 శాతం, సూళ్లూరుపేటలో 70.93 శాతం, వెంకటగిరిలో 61.50 శాతం, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో 50.58 శాతం, శ్రీకాళహస్తిలో 67.77 శాతం, సత్యవేడులో 72.68 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మన్నసముద్రం గ్రామంలో ఓటు వేసిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, అతని కుటుంబసభ్యులు స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు.. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పోలింగ్‌ను సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీఎస్ఎఫ్, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక బలగాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బలగాలతో సమ్యస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా పోలింగ్ చేపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఈవీఎంలను తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చారు. సూళ్లూరుపేటకు సంబంధించి నాయుడుపేట బాలికల జూనియర్ కళాశాల వసతి గృహం, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి విశ్వోదయ పాత డిగ్రీ కళాశాల, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు. ఆదివారం ఉదయం సర్వేపల్లి మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచిన ఈవీఎంలను నెల్లూరులోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఈ కేంద్రంలోనే జరుగుతుంది. ఎవరెవరు ఎక్కడ.. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులోని స్వగ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోట మండలం వెంకన్నపాళెంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె తిరుపతికి చేరుకుని అక్కడే మకాం వేశారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ తిరుపతికే పరిమితమయ్యారు. ► సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒక్కొక్క పోలింగ్ బూత్‌ను పూలు, బెలూన్లతో సర్వాంగ సుందరంగా అలంకరించడం విశేషం. పూర్తి పండుగ వాతావరణం తరహాలో పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ► నెల్లూరు జిల్లాలో కలువాయి మండలం పెరంకొండ 43ఏ పోలింగ్స్టేషన్లో పోలింగ్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించి పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి పోలింగ్‌ను యథావిధిగా కొనసాగించారు. చిట్టమూరు మండలం అరవపాళెం కాలనీ పోలింగ్ బూత్‌లో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడు రవి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. చిట్టమూరు మండలం బురదగల్లి కొత్తపాళెంలో శాశ్వత రోడ్డు కోసం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గూడూరు సబ్‌కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ నేరుగా గ్రామస్తులతో మాట్లాడినా, కలెక్టర్ సైతం ఫోన్లో స్థానికులకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు తమకు అందిన సమాచారం మేరకు 64.29 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. పోలింగ్ ముగిసే సమయానికి అంటే రాత్రి ఏడు గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్యూలైనులో ఉన్నవారందరికీ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. దీంతో తుది పోలింగ్ శాతానికి సంబంధించి రిటర్నింగ్ అధికారుల నుంచి పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పోలింగ్‌సరళిని పరిశీలిస్తే.. సర్వేపల్లిలో 66.19 శాతం, గూడూరు 63.81 శాతం, సూళ్లూరుపేట 70.93 శాతం, వెంకటగిరి 61.50 శాతం, తిరుపతి 50.58, శ్రీకాళహస్తి 67.77, సత్యవేడు 72.68 శాతం చొప్పున పోలింగ్ నమోదైందని తెలిపారు. -
ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్
-
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ అప్డేట్స్
-
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్
-
దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: తిరుపతికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లనటం దుర్మార్గం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. తనకు తిరుపతిలో సొంతిల్లు ఉంది అని, చంద్రబాబుకే అక్కడ సొంతిల్లు లేదన్నారు. బాబు జూమ్‌లో, లోకేష్ ట్విట్టర్లో మాత్రమే కనబడతారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చదవండి: దళిత ఓటర్లను అడ్డుకున్న టీడీపీ నేతలు -
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
-
దొంగ ఓట్లు వేసే అవసరం మాకు లేదు: సజ్జల
-
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ఊరందూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. ఓటేసేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామంలో దళితులపై ఆయన అనుచరులు ఆంక్షలు పెట్టారు. ఓటేసేందుకు వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పిస్తే ఓటింగ్‌లో పాల్గొంటామమని దళిత ఓటర్లు తెలిపారు. టీడీపీ మంత్రి అనుచరులు దళితవాడకు వచ్చి దాదాగిరి చేస్తున్నారని, ఓట్లు వేయడానికి వస్తే తమ అంతు చూస్తానంటూ హెచ్చరించారని బాధిత ఓట్లర్లు తెలిపారు. తాము ఓటు వేసి తీరుతామని దళిత ఓటర్లు పేర్కొన్నారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక.. లైవ్ అప్డేట్స్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ -
తిరుపతి ఉప ఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
-
దొంగ ఓట్లు వేసే అవసరం మాకు లేదు: సజ్జల
సాక్షి, అమరావతి : ప్రశాంత వాతావరణంలో తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. అయితే చంద్రబాబు ఈ రోజు కూడా అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలింగ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తిరుపతికి వచ్చే టూరిస్టులు దొంగ ఓటర్లని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ఆయన గతంలో చేసిన పనులను తమ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోతారని తెలిసే బాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మహన్రెడ్డి వెంట 75 శాతానికిపైగా ఓటర్లు ఉన్నారన్నారు. దొంగ ఓట్లు వేసే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డిపాజిట్ కూడా దక్కదనే భయంతోనే చంద్రబాబు దొంగ డ్రామాలు ఆడుతున్నారని, ఓటమిని ఊహించిన బాబు ముందుగానే సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. చదవండి: ‘పవన్ కళ్యాణ్ నటుడు, చంద్రబాబు సహజ నటుడు’ -
తిరుపతి ఉపఎన్నిక: మధ్యాహ్నం ఒంటి గంటకు 40.76 పోలింగ్
-
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు..
-
కొనసాగుతున్న తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్
-
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
‘సాహో చంద్రబాబు’పై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి/ సత్యవేడు: సాహో చంద్రబాబు పేరుతో సోషల్ మీడియా వేదికగా తిరుపతి ఉప ఎన్నికలపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి నారాయణరెడ్డి, లీగల్‌సెల్‌కు చెందిన శ్రీనివాసులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌లకు, చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎస్ఐ నాగార్జునరెడ్డికి ఫిర్యాదు అందజేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సోషల్ మీడియా (ఫేస్ బుక్) వేదికగా సాహో చంద్రబాబు పేరుతో చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. వైఎస్సార్సీపీ నాయకులైన పెద్దిరెడ్డి, వేమిరెడ్డి కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు సెజ్ కోసం భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని నష్టపరిచే విధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి అసత్య ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లపై, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ పరువుకు భంగం కలిగించడమేగాక తమ మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. -
Tirupati Lok Sabha Bypoll Election 2021: ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
TIME 7:00PM తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 55% పోలింగ్ నమోదైంది. మే 2న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. TIME 5:00PM తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 54.99% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. ► సర్వేపల్లి నియోజకవర్గంలో 57.91% పోలింగ్ ► గూడూరు నియోజకవర్గంలో 51.82% పోలింగ్ ► సూళ్లూరుపేట నియోజకవర్గంలో 60.11% పోలింగ్ ► వెంకటగిరి నియోజకవర్గంలో 55.88% పోలింగ్ ► తిరుపతి నియోజకవర్గంలో 45.84% పోలింగ్ ► శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 57% పోలింగ్ ► సత్యవేడు నియోజకవర్గంలో 58.45% పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42% పోలింగ్ నమోదైంది. సత్యవేడు నియోజకవర్గంలో 52.68% పోలింగ్ నమోదైంది. వెంకటగిరి నియోజకవర్గంలో 45.25% పోలింగ్, తిరుపతి నియోజకవర్గంలో 38.75% పోలింగ్ నమోదైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 49.82% పోలింగ్, సర్వేపల్లి నియోజకవర్గంలో 46.98% పోలింగ్ జరిగింది. గూడూరు నియోజకవర్గంలో 49.82%, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 50.68% పోలింగ్ నమోదైంది. TIME 3:00PM తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. మ.3 గంటల వరకు సత్యవేడు నియోజకవర్గంలో 52.68 శాతం పోలింగ్ నమోదైంది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం. తిరుపతి నియోజకవర్గ పరిధిలో 32.1 శాతం. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 32.9 శాతం పోలింగ్ నమోదైంది. TIME 1:37 PM తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం గూడూరు నియోజకవర్గ పరిధిలో 36.84 శాతం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 35 శాతం సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 36 శాతం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు.. తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓటర్లంటూ ఆందోళన చేస్తూ ఓటర్లను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. TIME 12:44 PM మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పోలింగ్ సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 27 శాతం గూడూరు నియోజకవర్గ పరిధిలో 24.5 శాతం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 25 శాతం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 26.2 శాతం సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 22.6 శాతం TIME 12:14 PM ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ నమోదైంది. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. TIME 10:59 AM ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పక్రియ జరుగుతోందన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల పరిధిలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. TIME 10:04 AM ఉదయం 9 గంటల వరకు 7.8 శాతం పోలింగ్ నమోదు.. తిరుపతి ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 7.8 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం ఇలా.. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 11.35 శాతం గూడూరు నియోజకవర్గ పరిధిలో 3.49 శాతం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 9.40 శాతం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 8 శాతం తిరుపతి నియోజకవర్గ పరిధిలో 6.5 శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 8.30 శాతం సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 8.0 శాతం TIME 9:20 AM సత్యవేడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ.. సత్యవేడు పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సెందిల్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక డిఎస్పీ, 4 సీఐలు, 8 మంది ఎస్ఐలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను ముందుగానే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. TIME 9:13 AM మొరాయించిన ఈవీఎంలు.. నెల్లూరు: గూడూరులోని 47,48,49 కేంద్రాల్లోని సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించాయి. అగ్రహారం పుత్తూరులో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాదలూరులో కిలివేటి సంజీవయ్య ఓటు వేశారు. TIME 8:41 AM పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడులో పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు క్యూ కట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు ప్రదేశాలలో ఈవీఎంలు మొరాయించాయి. వాటిని మార్చి అధికారులు పోలింగ్ ప్రారంభించారు. సత్యవేడు పోలింగ్ బూత్‌ను ఎమ్మెల్యే ఆదిమూలం పరిశీలించారు. TIME 8:06 AM ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి డా.గురుమూర్తి శ్రీకాళహస్తిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మన్నసముద్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డా.గురుమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు వేశారు. సత్యవేడులో రెండు ఈవీఎంలలో సాంకేతిక లోపం గుర్తించి అధికారులు సరిచేశారు. ఇప్పంతాంగాలు, తిరుమట్టియం కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి నెల్లూరు: ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. చిట్టమూరు మండలం అరవపాలెం దళితవాడ పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. TIME 7:56 AM ఉపఎన్నికలో టీడీపీ హైడ్రామా దొంగ ఓటర్లు వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హల్చల్ చేశారు. అనుకూల మీడియాను తీసుకుని పీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద హడావుడి చేశారు. ఫంక్షన్ హాల్ సిబ్బందిని కూడా ఎందుకున్నారంటూ ప్రశ్నించారు. తిరుమలకు వచ్చే భక్తులను కూడా సుగుణమ్మ అడ్డుకున్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీస్తున్నారు. TIME 7:00 AM తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్ పాజిటివ్ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు. గతంలో ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ బూత్ ఉండగా క్యూలైన్లలో ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17,11,195 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఈ ఎన్నికలను అమరావతి సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామని, ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించడానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. దినేష్పాటిల్ సాధారణ అబ్జర్వర్‌గా, రాజీవ్‌కుమార్ పోలీసు అబ్జర్వర్‌గా, ఆనందకుమార్ ఎన్నికల వ్యయ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. వీరికి అదనంగా 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఓటువేసే విధంగా ఏర్పాట్లు చేశామని విజయానంద్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరారు. -
ఆ ఫేస్బుక్ పేజీని నడిపిస్తుంది లోకేశే.. డీజీపీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సాహో చంద్రబాబు' అనే ఫేస్బుక్ పేజీ మీద వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫేస్బుక్ పేజీ నారా లోకేశ్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తోందని తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా వుంటే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోవిడ్ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ ఏప్రిల్ 17న జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్ సాగనుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉండగా, అందులో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షలమంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునే విధంగా ‘మే నో పోలింగ్ స్టేషన్' యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. చదవండి: ‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం తిరుపతిలో టీడీపీ డీలా -
లోకేష్, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/ సాక్షి, అమరావతి: పార్టీ పరిస్థితి, లోకేష్ తీరుపై కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో బహిర్గతమై తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు దానిపై మౌనముద్ర దాల్చారు. మిగిలిన అన్ని విషయాలపై మీడియాలో ఎడతెగకుండా మాట్లాడే నాయకులు.. ఈ వీడియో విషయమై నోరు మెదప లేదు. మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందోనని ముఖ్య నాయకులు నోటికి తాళం వేసుకున్నారు. కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా స్పందించడానికి ఇష్టపడ లేదు. చంద్రబాబు సైతం దీనిపై నోరు మెదపలేదు. కానీ అచ్చెన్నాయుడుతో ఈ వీడియో గురించి చర్చించినట్లు తెలిసింది. అందులో మాట్లాడిన విషయాలపై అచ్చెన్న ఆయనకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు లోకేష్ కూడా లోలోన దీనిపై రగిలిపోతున్నా, పైకి మాత్రం అందులో మాట్లాడింది తన గురించి కాదన్న రీతిలో బిల్డప్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో బుధవారం ఒక కార్యక్రమంలో అచ్చెన్నాయుడిపై చేయి వేసి మరీ హడావుడి చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టారనడం మినహా, చివరి వరకూ ఇరువురూ ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించారు. లోకేష్ మీడియాతో మాట్లాడే సమయంలో అచ్చెన్నాయుడు వెనుక ఉండిపోయారు. ఎమ్మెల్యే రామానాయుడు మాత్రమే పక్కన నిల్చొన్నారు. అంతేగా.. అంతేగా.. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పరిస్థితి ఏమిటో ఆ వీడియోతో తేటతెల్లం అయ్యిందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. లోకేష్‌పై తెలుగుదేశం నేతల్లో ఏమాత్రం నమ్మకం లేదన్న విషయం నిజమేనని, ఇప్పటికే ఆయన అనేక రకాలుగా అభాసుపాలయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోవడం, మాట్లాడే పద్ధతి ఇప్పటికీ అలవాటు కాకపోవడం పెద్ద మైనస్ అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ముగిస్తే తెలుగుదేశం కార్యకలాపాలు మరింత డీలా పడతాయన్న అచ్చెన్నాయుడు మాటలు అక్షర సత్యం కానున్నాయని వివరిస్తున్నారు. అచ్చెన్నాయుడిలో ఇంకా చాలా అసంతృప్తి ఉందని, వీడియోలో కొంత వరకే బయటకు వచ్చిందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్ వల్ల పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉందని విజయవాడకు చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. పార్టీ క్యాడర్ దీనిపై ఆందోళనకు గురవుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అధ్యక్షుడి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడే పార్టీ పట్ల అంత అసంతృప్తితో ఉంటే ప్రజలను ఎలా మెప్పించగలమని వాపోతున్నారు. ఇక్కడ చదవండి: 17 తర్వాత పార్టీ లేదు.. టీడీపీ పని అయిపోయింది: అచ్చెన్నాయుడు చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. పార్టీ ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ -
తిరుపతిలో టీడీపీ డీలా
సాక్షి, అమరావతి: తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. వరుస ఓటములతో నీరుగారిపోయిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేక ఇబ్బందులు పడుతోంది. గెలిచే అవకాశం ఏ కోశానా కనిపించక పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు ప్రచారం చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు. వారం రోజుల నుంచి చంద్రబాబు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి కొన్ని చోట్ల ఇంటింటి ప్రచారం చేసినా స్పందన కనిపించలేదని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. అంతకు ముందు లోకేష్ ప్రచారం చేసినప్పుడు కూడా జనం పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో మరింత నిస్తేజం ఆవరించింది. వారి సభలకు జనాన్ని సమీకరించడమే స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. సభలకు వచ్చేందుకు జనం ఆసక్తి చూపించ లేదని, బలవంతంగా తీసుకువచ్చిన జనం కూడా చంద్రబాబును పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. దీనికితోడు వచ్చిన వారిని చంద్రబాబు తిట్టడం, సంబంధం లేకుండా మాట్లాడడం మరీ ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. కింజరపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ వంటి నేతలు హడావుడిగా తిరుగుతూ సమీక్షలు నిర్వహించడం, మీడియాలో హడావుడి చేయడం తప్ప తమకు ప్రజల్లో ఎటువంటి అనుకూలత కనిపించడం లేదని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో అయోమయం మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించేదెవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా సత్యవేడు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించే సరైన నాయకులే లేరు. దీంతో క్యాడర్ నిస్తేజంలో ఉంది. గూడూరు నియోజకవర్గం.. ప్రస్తుతం పోటీలో ఉన్న పనబాక లక్ష్మి సొంత ప్రాంతం కావడంతో ఆమె పరిచయాలు కొంత ఉపయోగపడతాయనే ఆశతో ఉన్నారు. సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని జనం పట్టించుకునే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుదీర్‌రెడ్డి అంత చురుగ్గా లేకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం డీలా పడ్డాయి. చంద్రబాబు తిరుపతి నియోజకవర్గంపైనే ఆశలన్నీ పెట్టుకున్నా అక్కడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుగుణమ్మపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎదురీదుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 55 శాతానికిపైగా ఓట్లు రాగా, టీడీపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో 25 శాతం ఓట్లు రావడం కూడా కష్టమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సానుభూతి కోసం రాళ్ల డ్రామాకు చంద్రబాబు, ప్రమాణ నాటకానికి లోకేష్ తెరతీసినా ఫలితం కనిపించలేదు. -
పాదయాత్రలో పేదల కష్టాలు చూశా: డా. గురుమూర్తి
సాక్షి, చిత్తూరు: అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి పాదయాత్ర చేసే భాగ్యం తనకు దక్కిందని తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తి అన్నారు. పాదయాత్రలో అడుగడుగునా పేదల కష్టాలు చూశానన్నారు. బుధవారం శ్రీకాళహస్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. వెంకటగిరిలో నేత కార్మికుల కష్టాలు చూసి సీఎం వైఎస్ జగన్ చలించిపోయారని గుర్తు చేసుకున్నారు. నేతన్నలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆయన ఆనాడే పూనుకున్నారని, కానీ దీన్ని తెలుగుదేశం తప్పుపట్టిందని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సొంత జిల్లా చిత్తూరును అభివృద్ధి చేయలేని చంద్రబాబుకు కనీసం చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బాబు కొత్త డ్రామాలకు తెర లేపారని దుయ్యబట్టారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ గురుమూర్తి మంచి విద్యావేత్త అని, అందుకే ఈయనకు సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. 17వ తారీఖున సంపన్నులకు పేదవాడికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చదవండి: టీడీపీ– జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా? తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే -
చంద్రబాబు పిలుపు: మందు తాగండి.. ఓటు వేయండి
గూడూరు/తిరుపతి అర్బన్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చే మందు తాగి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. అమ్మఒడి పథకం.. నాన్న బుడ్డికే సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్ షో నిర్వహించారు. అలాగే తిరుపతి టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఉగాది సంబరాలు జరుపుకున్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మార్కెట్ సమీపంలో మాట్లాడుతూ.. మద్యం వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలవుతున్నాడన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తాను 54 పరిశ్రమలు తీసుకువచ్చానని, నేడు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారని.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఉన్న ఎంపీలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని నిలదీశారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావును ఎమ్మెల్యేను చేసి మంత్రిని కూడా చేశానని, ఇప్పుడు ఆయన ఎంపీగా మృతిచెందితే వారి కుటుంబంలో వారికి స్థానం కల్పించకుండా మరొకరికి టికెట్ ఇవ్వడంతోనే తాము పోటీ చేస్తున్నామన్నారు. సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఏర్పేడులో ఐఐటీ పెట్టానని, ఒకప్పుడు తాను పెట్టిన బయోటెక్ వల్లే కరోనా టీకా వచ్చిందన్నారు. గతంలో అలిపిరిలో జరిగిన బాంబు దాడులకే భయపడలేదని.. రాళ్ల దాడులను లెక్కచేయనని పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పనబాక కృష్ణయ్య తదితరులు ఉన్నారు. -
బాబుపై రాళ్ల దాడి అవాస్తవం
నెహ్రూనగర్ (గుంటూరు): తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి అంటూ ఆరోపణలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. గుంటూరులో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రాళ్ల దాడిచేసే అవసరం లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు చెప్పినదంతా అవాస్తవమని పేర్కొన్నారు. ప్రజలు నమ్మకపోవడంతో రాళ్ల దాడి పేరుతో ప్రజల నుంచి సానుభూతి పొంది ఓట్లు వేయించుకునే ఉద్దేశంలో ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ పరిధిలో ఉందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీబీఐ కోరితే రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును కేంద్రంలో ఉన్న బీజేపీ త్వరితగతిన తేల్చాలని కోరారు. -
ఓటమి భయంతోనే బాబు డ్రామా
తిరుపతి తుడా : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలకు దిగాడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం రాత్రి మంత్రి పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి పర్యటనలో రాళ్లు వేశారని, దానికి వైఎస్సార్సీపీ నేతలే కారణమని చంద్రబాబు నిందలు వేయడం సరైంది కాదన్నారు. మిద్దెపై నుంచి రాయి విసిరారని చెబుతున్న చంద్రబాబు.. అది ఎవరికి తగిలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న నాటకాన్ని ప్రజలు ఎవరూ విశ్వసించబోరన్నారు. రాళ్ల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జోడించి విమర్శించడం చంద్రబాబుకు తగదన్నారు. సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. నాడు అమిత్‌షాపై రాళ్లు వేయించిందెవరు? టీడీపీని దక్కించుకునేందుకు నాడు మామ మీద చెప్పులు వేయించిన నీచ సంస్కృతి చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. అదే విధంగా అమిత్‌షా మీద రాళ్లు వేయించి లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి కూడా చంద్రబాబే అన్నారు. మీటింగ్ ముగింపు సమయంలో తనపై రాళ్ల దాడి జరిగిందని ఎస్పీ ఆఫీసు ముందు నిరసన చేయడం, ఆ వెంటనే టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించడం, పచ్చ మీడియాలో వరుసపెట్టి ప్రసారాలు చేయడం పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిందని చెప్పారు. పోలీసులు విచారణ జరిపి, ఈ నాటక సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణలో తమ పార్టీ వారి పాత్ర ఉందని తేలితే వారిని తామే పట్టిస్తామని చెప్పారు. చచ్చిన పామును కర్రలతో కొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. చంద్రబాబు వయసుకు తగ్గట్టు నడుచుకుంటే మంచిదని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మందుబాబులు నాకే ఓటు వేయాలి
తిరుపతి అర్బన్, అన్నమయ్య సర్కిల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరలను విపరీతంగా పెంచారని, అందుకే మందు బాబులంతా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన కృష్ణాపురం ఠాణా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తనకు సీఎం పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదని, ప్రజా సేవే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. తాను నిర్మించిన హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తయారైందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్, కేంద్ర వర్సిటీని స్థాపించానని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రేణిగుంటలో వందకుపైగా పరిశ్రమలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవల అన్యాయంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తనను తొమ్మిది గంటలు నిర్బంధించారని చంద్రబాబు వాపోయారు. తాను అనుకుని ఉంటే జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. తన సభలకు జనస్పందన ఉన్నా, ఓట్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిలదీయడం వల్లే ఆలయాలపై దాడులు తగ్గాయని చెప్పారు. బంగారు బాతు అయిన అమరావతిని మూడు రాజధానుల పేరుతో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో సినిమాలకు రాయితీలు ఇచ్చి, టికెట్ ధరలు పెంచుకోమని ప్రోత్సహించానని చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా ఆదాయాన్ని తగ్గించేందుకే ఈ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచలేదన్నారు. ఈ ప్రాంతంలో పాయ బావుంటుందని, దోసెలు బావుంటాయని కబుర్లు చెప్పినా జనం వెళ్లిపోతుండటంతో అసహనానికి గురయ్యారు. చివరలో పోలీసులపై కూడా చిందులేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు. -
ఎన్నికల వేళ ఎన్నెన్ని వేషాలో!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక వేళ చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. రాజకీయ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన ఈ ఎన్నికలో డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళనలో తనపై రాయి విసిరారంటూ సోమవారం రాత్రి అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లారు. అది నిజమని నమ్మించేందుకు అక్కడే బైఠాయించి హంగామా సృష్టించారు. జాతీయ మీడియాని రప్పించి ఏపీలో ఏదో జరిగిపోతోందంటూ పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు జరిపించాలని కొత్త డిమాండ్‌తో నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు టీడీపీ నేతల్ని పంపి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఇంతా చేస్తే.. రాయి ఎవరికి తగిలిందో.. ఎవరికేం అయిందో చెప్పలేక తుదకు అభాసుపాలయ్యారు. అసలు ఏం జరిగిందంటే.. సోమవారం సాయంత్రం తిరుపతిలో రోడ్‌షో అనంతరం కృష్ణాపురం ఠాణా వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే, సభకు వచ్చిన అద్దె జనం తిరుగుముఖం పట్టారు. జనం గుంపుగా వెళ్తున్న సమయంలో ఒక చిన్న రాయి ఓ మహిళ పాదరక్షకు తగిలి.. ప్రక్కన నడుస్తున్న మరో మహిళ కాలుకు తగిలింది. ఆ మహిళ కిందకు వంగి చూసుకోవడంతో తోటి మహిళలు ఏమైందంటూ గుమికూడారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. హైడ్రామాకు తెరలేపారు. ‘అక్కడెవరో రాళ్లతో కొట్టారు. ఆ రాళ్లు ఇటు తీసుకురండి’ అని తెలుగు తమ్ముళ్లను మైకులో ఉసిగొల్పారు. వారు వెంటనే అక్కడున్న చిన్న చిన్న రాళ్లను వెతికి తీసుకొచ్చి చంద్రబాబు చేతికి అందించారు. రాయి తగిలిన మహిళ తన వద్దకు రావాలని బాబు పదే పదే మైకులో పిలిచినా ఎవరూ రాలేదు. దీంతో అసహనంతో సీఎంను, ప్రభుత్వాన్ని దూషిస్తూ అక్కడే బైఠాయించారు. రాళ్ల దాడి నుంచి తాను తృటిలో తప్పించుకున్నట్లు, తమ కార్యకర్తలకు గాయాలైనట్లు అప్పటికప్పుడు ఒక కట్టుకథ అల్లేశారు. ప్రచారం వాహనం నుంచి దిగి రోడ్డుపై బైఠాయించారు. రాళ్లతో దాడి చేసిన వారిని 5 నిమిషాల్లో పట్టుకోవాలని, రౌడీ రాజ్యం నశించాలని నినాదాలు చేశారు. ‘నా సభలో రాళ్లు రవ్వుతారా? మీకెంత ధైర్యం.. యూజ్లెస్ ఫెలోస్.. మీ అంతు చూస్తాం.. పోలీసులు 5 నిమిషాలల్లో జవాబు చెప్పకపోతే మీ కథ తేలుస్తాం. ఇక్కడే పడుకుని నిరశన చేపడతా..’ అంటూ కేకలు వేశారు. పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని దుర్భాషలాడారు. తర్వాత సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న బాబు అక్కడ ధర్నా నిర్వహించారు. తర్వాత తాను బస చేసిన హోటల్‌కి వెళ్లిపోయారు. పోలీసులను బెదిరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సానుభూతి కోసం డ్రామా డ్రామాలు సృష్టించడంలో దిట్టగా పేరొందిన ఆయన ఎన్నికల వేళ కావాలని దీన్ని సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఎన్నికలో టీడీపీ గెలవడం సంగతి అటుంచి అసలు డిపాజిట్లయినా వస్తాయో లేదోననే ఆందోళన ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. జనం తన ప్రసంగాలు వినకుండా వెళ్లిపోతుండడంతో చంద్రబాబు వారిపైనే విరుచుకుపడి తిడుతుండడం గత నాలుగు రోజుల ప్రచారంలో కనిపిస్తోంది. దీంతో చవకబారు రాజకీయాలు, డ్రామాలకు మళ్లీ పదును పెట్టారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లెల బాబ్జితో మొదలైన చంద్రబాబు డ్రామా రాజకీయం నిరంతరం కొనసాగుతోంది. గత నెల ఒకటో తేదీన తిరుపతి ఎయిర్‌పోర్టులో హైడ్రామా సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని అలజడులు సృష్టించే ప్రయత్నంలో చిత్తూరు వెళుతున్న ఆయన్ను పోలీసులు ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో అక్కడే మూడు గంటలు బైఠాయించి నాటకాన్ని రక్తి కట్టించారు. గత ఏడాది జనవరి 8న అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్ర ప్రారంభించే పేరుతో విజయవాడ బెంజి సర్కిల్ వద్ద బైఠాయించి హడావుడి చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 27న విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద నాలుగు గంటలు కార్యకర్తలతో బైఠాయించి హడావుడి చేశారు. -
తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే
తిరుపతి అన్నమయ్య సర్కిల్ (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధమని, టీడీపీ ఓడితే ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా టీడీపీ ఎంపీలు ముగ్గురూ రాజీనామాకు సిద్ధమేనా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం వైఎస్ జగన్ ప్రచారసభ రద్దయిందని తెలిపారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఆదివారం తిరుపతిలో ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ఉనికి చాటుకునేందుకు ఆలయాలపై దాడులు చేసి, రోడ్లపైకి వచ్చి అరాచకాలు సృష్టిస్తూ ప్రభుత్వంపై నిందలు మోపడం హేయమైనచర్య అని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని, అందుకే శ్రీవారి సాక్షిగా మోదీ చెప్పిన ప్రత్యేక హోదా హామీపై వారు స్పందించలేదని చెప్పారు. పవన్‌కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా మారారని, అందుకే పాచిపోయిన లడ్డూలు తాజాగా మారాయని విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలపై విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే సంస్కృతి లేదని, అందుకే ఎన్నికలొస్తే పొత్తు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రతి ఇంటికీ అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి తానే స్వయంగా పోస్టు ద్వారా ప్రజలకు లేఖలు పంపారని తెలిపారు. ఓటర్లు 90 శాతం పోలింగ్ నమోదు చేసేందుకు సహకరించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బాబురావు, పార్టీ నాయకులు పోకల అశోక్‌కుమార్, ఎంఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలకు ఓటడిగే హక్కు లేదు
తిరుపతి ఎడ్యుకేషన్: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో తిరుపతిలో నిర్వహించిన బహిరంగసభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన చట్టాన్ని నెరవేరుస్తామని, 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు ప్రత్యేక హోదా పొడిగిస్తామని ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. అదే వేదికపై పవన్‌కల్యాణ్ కూడా ఉన్నారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బీజేపీ విక్రయానికి పెట్టిందన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాను సాధించలేక ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుందని విమర్శించారు. ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో సామాన్య కార్యకర్త, నిరుపేద దళితుడైన డాక్టర్ గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. ఆలయాల ధ్వంసం కేసుల్లో టీడీపీ హస్తం ఉన్నా బీజేపీ ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో లోకేశ్ ముఖ్యమంత్రిని విమర్శిస్తుండటాన్ని వారి అనుకూల మీడియాలో ప్రచారం చేస్తూ అతడిని హీరో చేయాలనుకుంటున్నారని, ప్రజలు అతడిని కమెడియన్లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యతగల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి సభను రద్దు చేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న పారదర్శక పాలన, అవినీతి రహిత ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజలు వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారని, తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, హఫీజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం
మీరంతా నావాళ్లే. మీ అందరి ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. మీ అందరి కుటుంబాలూ చల్లగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేను. ఈ పరిస్థితిలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, బాధ్యత గల స్థానంలో ఉన్న ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తిరుపతిలో నా బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నాను. సాక్షి, అమరావతి: కరోనా ఉధృతి కారణంగా, ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభకు రాలేకపోతున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రచారం కన్నా తిరుపతి పార్లమెంటు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి తన బహిరంగ సభను రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అందరి కుటుంబాల ఆరోగ్యం దృష్ట్యా తాను రాలేకపోయినా, మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమందరి అభ్యర్థి, తన సోదరుడు డాక్టర్ గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాద్‌కు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తిరుపతి పార్లమెంటు ఓటర్లకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. మీరంతా నా వాళ్లే.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో మనందరి అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాల్సిందిగా నేను రాసిన ఉత్తరం మీ ఇంటికి చేరిందని భావిస్తున్నాను. ఈ నెల 14న నేనే పాల్గొనాలనుకున్న తిరుపతి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ సభకు రావటం ద్వారా మీ ఆత్మీయతను, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించాను. అయితే తాజా హెల్త్ బులెటిన్ చూసిన తర్వాత ఈ లేఖ రాస్తున్నాను. దేశంతో పాటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి బులెటిన్ ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో 31,892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2,765 మందికి పాజిటివ్ అని తేలింది. పాజిటివిటీ రేటు 8.67 శాతంగా కనిపిస్తోంది. ఇది మన రాష్ట్ర సగటు పాజిటివిటీ రేటు అయిన 5.87 శాతం కంటే ఎక్కువ. ఇందులో చిత్తూరులో 496 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. నెల్లూరులోఒక్క రోజులోనే 292 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల వ్యవధిలో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న తిరుపతి పార్లమెంటులో నేను వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరైతే అభిమానంతో, ఆప్యాయతతో వేలాదిగా తరలి వస్తారు. ఈ పరిస్థితిలో మీ ఆరోగ్యం నాకు ముఖ్యం కాబట్టి, తిరుపతి సభను రద్దు చేసుకుంటున్నా. మీ కోసం ఏం చేశానో ప్రతి ఇంటికీ ఉత్తరం రాశా నేను వ్యక్తిగతంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా, మనందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం, మన అవ్వా తాతల కోసం, మన అక్కచెల్లెమ్మల కోసం, మన రైతుల కోసం, మన గ్రామాలు, పట్టణాల కోసం మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం, మన అక్క చెల్లెమ్మల కోసం ఏం చేసిందన్నది మీ అందరికీ వివరిస్తూ లేఖ రాశాను. ప్రతి కుటుంబంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు వ్యక్తిగతంగా, మీకు కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో, నా సంతకంతో, ఇంటింటికి అందేలా ఉత్తరం రాశాను. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాకుండా ఆగిపోయినా, మనందరి ప్రభుత్వం ఈ 22 నెలల్లో ఇంటింటికీ మనిషి మనిషికీ చేసిన మంచి మీ అందరికీ చేరిందన్న నమ్మకం నాకుంది. గతంలో కంటే మంచి మెజార్టీ ఇవ్వాలి.. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండె నిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను. మనందరి అభ్యర్థి, నా సోదరుడు డాక్టర్ గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ (2.28 లక్షల) కన్నా ఇంకా ఎక్కువగా, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ, అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకూ, మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. -
టీడీపీ ఉనికికే ప్రమాదం
సాక్షి, అమరావతి: తిరుపతి ఎన్నికల్లో ఫలితాలెలా ఉంటాయనే ఉత్కంఠ ఎవరికీ లేదని, ఎవరు రెండో స్థానాన్ని ఆక్రమిస్తారు.. వైఎస్సార్సీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిపైనే అందరి దృష్టీ ఉందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ ఉనికికే ప్రమాదం వచ్చిన సందర్భంలో బాబు, ఆయన కుమారుడు వీధి వీధి తిరుగుతున్నారని, అయినా కూడా జనం రావడంలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ఎక్కడైనా గెలిచి.. అప్పుడు సీఎం జగన్‌పై సవాల్ చేయాలన్నారు. లోకేశ్ ఒక ఐరన్ లెగ్ అని.. ఎక్కడ కాలు పెడితే అక్కడ టీడీపీ మటాష్ అని అంబటి చెప్పారు. వెంకన్న సాక్షిగా మోదీ, చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన పాత మిత్రులేనని.. విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలన్నారు. వకీల్‌సాబ్ సినిమాకు.. ఎన్నికలకు సంబంధం ఏమిటని నిలదీశారు. బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు లేదని.. సినిమా ప్రచారానికి వచ్చినట్లు ఉందని చెప్పారు. తిరుపతిలో సొంతంగా గెలిచిన చరిత్ర టీడీపీకి లేదన్నారు. ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలుచేస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే వ్యక్తిగత విమర్శలు ఓటమి భయంతో సీఎం జగన్‌పై బాబు, లోకేశ్, పవన్‌లు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలవటం ఖాయమన్నారు. వివేకా హత్యపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారని.. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. -
ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కులేదు
తిరుపతి తుడా: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీతో పాటు ఆయన జంటపక్షులు పవన్, చంద్రబాబు పోటీపడి ప్రకటించి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ముంచారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. తిరుపతిలో బుధవారం కాపు/బలిజ నేతలతో సమావేశమైన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించుకుందామని వారికి సూచించారు. చంద్రబాబు బలిజల్ని ఓటు బ్యాంక్‌గా చూసి ఇన్నాళ్లు మాయమాటలతో మోసగించారని చెప్పారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బలిజలు చంద్రబాబుకు గుర్తురారన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎవరు ఓటేసినా అది బూడిదలో పోసిన పన్నీరులా వృధా అవుతుందన్నారు. ప్రత్యేక హోదా నినాదం బలపడాలన్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన నినాదం నిలవాలన్నా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఉండాలని చెప్పారు. తనది కమ్యూనిస్ట్ సిద్ధాంతమని చెప్పుకొనే పవన్‌కల్యాణ్ బీజేపీతో కలవడం సిగ్గుచేటన్నారు. ఈ పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీని బలపరిచి ఫ్యాన్‌గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఆయన గత 3 రోజులుగా నియోజకవర్గాల వారీ బలిజ నేతలతో సమావేశమవుతున్నారు. నైనారు శ్రీనివాసులు, మురళి, జయకృష్ణ, రవి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో నేతలు రామచంద్రయ్యను సత్కరించారు. -
పనబాకను గెలిపిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తా..
నాయుడుపేట: తిరుపతి ఎంపీగా పనబాకను గెలిపిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ఉద్ఘాటించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బుధవారం రాత్రి ఆయన ర్యాలీగా ప్రచారం చేశారు. గడియారం సెంటర్లో ఓ టీ స్టాల్ వద్ద ఆగిన లోకేశ్ ‘టీ తాగుదామా’ అనడానికి బదులు ‘తీ తాకుతామా’ అనడంతో అర్థంకాని నాయకులు ఒకరినొకరు చూసుకున్నారు. సార్ టీ తాగుతారంట అని టీ స్టాల్ యజమాని చెప్పడంతో వారికి విషయం అర్థమైంది. లోకేశ్ టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకాశవీధుల్లో తిరుగుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాకను గెలిపిస్తే వీధుల్లో తిరిగేందుకు వస్తారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్రెడ్డి అభివృద్ధి చేయడం లేదని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అమ్మ ఒడి ఇస్తూ నాన్న బుడ్డి పేరుతో డబ్బు గుంజుకుంటున్నారని మందుబాబులు గమనించాలన్నారు. ప్రభుత్వ పథకాలు కనిపించకుండా చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపైనా లోకేశ్ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
14న సీఎం జగన్ తిరుపతి పర్యటన
సాక్షి, అమరావతి / రేణిగుంట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే పూర్తి స్థాయిలో పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న జరుగనుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం గత 21 నెలలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పర్యటిస్తే రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చిత్తూరు జిల్లా ఇన్చార్జి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తదితరులు బుధవారం రేణిగుంట మండలం ఎల్లమండ్యం వద్ద ఉన్న యోగానంద కళాశాల సమీపంలో బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి తిరుపతి ప్రచారానికి రూట్ మ్యాప్‌పై కూడా చర్చించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ సమర శంఖారావం మొదటి సభ కూడా ఈ ప్రాంగణంలోనే చేపట్టడంతో పార్టీ నేతలు ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ
రేణిగుంట (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట నుంచి సుమారు 2 వేల బైక్‌లతో ఏర్పేడు, శ్రీకాళహస్తి పట్టణం, ఆయా మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా పాపానాయుడుపేట వరకు 30 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఉదయం ప్రారంభమైన ఈ ర్యాలీ రాత్రి వరకు కొనసాగింది. రేణిగుంట ఓవర్ బ్రిడ్జి వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తి ర్యాలీని ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీగా వస్తున్నారని తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ‘జై జగన్’ అంటూ నినదించారు. వైఎస్సార్సీపీని ఆశీర్వదించండి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. శ్రీకాళహస్తికి చెందిన గురుమూర్తికి పార్టీ అధినాయకత్వం ఎంపీ టికెట్ ఇవ్వడం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని, ఆయనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడుతారన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలు నివ్వెరపోయేలా గురుమూర్తిని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
గాజు గ్లాసు గుర్తు రద్దు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
నరసరావుపేట: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికల్లో నవతరం పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం తెలిపారు. గాజు గ్లాసు గుర్తు రద్దు కోసం కేంద్ర మంత్రులు ప్రయత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ నవతరం పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గోదా రమేష్‌కుమార్‌తో కలిసి మంగళవారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీకి బీజేపీ నేతలతో కలిసి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీజేపీ అనుబంధ సంస్థల సహకారంతో నవతరం పార్టీ అభ్యర్థిపై దాడులు చేయించే ప్రమాదం ఉందన్నారు. అందువలన పోటీలో ఉన్న అభ్యర్థి రమేష్‌కుమార్‌కు భద్రత కల్పించాలని కోరారు. బత్తుల అనిల్, చాట్ల సాగర్ పాల్గొన్నారు. -
ద్వితీయ స్థానం కోసం.. బీజేపీ, టీడీపీ పోటాపోటీ ఖర్చు
సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ద్వితీయ స్థానం కోసం పోటీపడుతున్న బీజేపీ, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నాయి. ఒక్కో పార్టీ రూ.100 కోట్లు వరకు ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాయి. డబ్బుల పంపిణీ, రోజువారీ ఖర్చు కోసం ఇప్పటికే కొందరికి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంతోపాటు చిత్తూరు జిల్లాలో మరో అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని ఓ మహిళా వైద్యురాలికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె సోదరుడి ద్వారా టీడీపీ పెద్దలు ఈ ప్రతిపాదన పంపినట్లు సమాచారం. దీంతో ఆమె నుంచి తిరుపతి ఉప ఎన్నికకు అయ్యే మొత్తం ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తాను ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేనని అధినేత చంద్రబాబుకు ముందే తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఒప్పుకుంటేనే తాను బరిలో ఉంటానని మాజీమంత్రి ద్వారా సమాచారం అందించారు. ఎన్నికకు అయ్యే ఖర్చు పెట్టేందుకు సదరు మహిళా డాక్టర్ ముందుకొచ్చాకే పనబాక లక్ష్మి ప్రచారంలోకి దిగినట్లు పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాగా, గత కొద్దిరోజులుగా ప్రతి బూత్ పరిధిలో ఖర్చుల కోసం రోజుకు రూ.25 వేలు చొప్పున వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఖర్చుకు సై అయితే, ద్వితీయ స్థానం దక్కించుకునేందుకు టీడీపీ భారీ మొత్తంలో ఖర్చుకు వెనుకాడడంలేదని తెలుసుకున్న కమలనాధులు తాజాగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తే ఢిల్లీ పెద్దల వద్ద మాటపడాల్సి వస్తుందని, అందుకని వారు కూడా ఖర్చుకు తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొందరు పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఎన్నికలకు అయ్యే ఖర్చులో తాము భాగస్వాములం అవుతామని హామీ ఇచ్చారు. చివరికి టీడీపీకి ఏ మాత్రం తగ్గకుండా ఖర్చుచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మరోవైపు.. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ, టీడీపీ శ్రేణులు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున మద్యం దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. -
భాషా పరిజ్ఞానాన్ని మరోసారి రుచిచూపిన నారా లోకేష్
సాక్షి, ముత్తుకూరు: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన తెలుగు భాషా పరిజ్ఞానాన్ని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మరోసారి రుచిచూపారు. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రోడ్‌షో నిర్వహించిన లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోతే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ‘పరామర్శించారా’ అనాల్సింది.. ‘పరవశించారా’ అంటూ నవ్వులు పూయించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని పునరుద్ఘాటించారు. రామాయపట్నంతోపాటు కృష్ణపట్నం పోర్టు కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదంటూ తన పరిజ్ఞానాన్ని చాటారు. అదే సమయంలో ‘ఏం పీకారు.. ఎంత దొబ్బారు’’ అంటూ సీఎంపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ‘సైకోరెడ్డి’గా మారుస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పిల్లులతో పోల్చారు. వారు మ్యావ్..మ్యావ్ అంటున్నారని గేలి చేశారు. తాము అధికారంలోకి వస్తే తన తండ్రి చంద్రబాబుకున్న పెద్ద మనసు తనకు లేదని, అధికారులను, పోలీసులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. సభలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఈ సభలో పాల్గొనలేదు. చదవండి: (లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి) -
ఆ స్థాయి సోము వీర్రాజుకు ఉందా?: ఎమ్మెల్యే భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్ధి డా.గురుమూర్తి పాల్గొన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని భూమన నిప్పులు చెరిగారు. చదవండి: లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి ‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’ -
డా. గురుమూర్తితో ప్రపంచ ప్రవాసాంధ్రుల ముఖాముఖి
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తితో వైస్సార్సీపీ అభిమానులు, తెలుగు వారు శనివారం (ఏప్రిల్ 3న) జూమ్ టెలీకాన్ఫెరెన్స్ ద్వారా ‘మీట్ & గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. వైస్సార్సీపీ అమెరికా ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి అనేకమంది అభిమానులు, ఎన్నారైలు పాల్గొని గురుమూర్తి గెలుపు, తిరుపతి అభివృద్ధికి మలుపు’ అని నినాదించారు. వైస్సార్సీపీ అమెరికా కన్వీనర్ డా. వాసుదేవ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తిని అందరికి పరిచయంతో చేయడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ అందిస్తుందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలంతా వైయస్ఆర్ సీపీకే ఓటు వేయాలనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ ప్రముఖ ఎన్నారై కేవీ రెడ్డి మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రంలో వైఎస్సార్సీపీ అమెరికా కన్వీనర్లు డా. వాసుదేవ రెడ్డి, డా. శ్రీధర్ కొరసపాటి, చంద్రహాస్ పెద్ధమల్లు, నార్త్ అమెరికా సలహాదారు & గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ వల్లూరు రమేష్ రెడ్డి, డా. ప్రభాకర్ రెడ్డి , డా. పవన్ పాముదుర్తి , సుబ్బా రెడ్డి చింతగుంట, శ్రీధర్ నాగిరెడ్డి, రమణారెడ్డి దేవులపల్లి, డా. రామిరెడ్డి కేసరి, మెదలగు వారు మాట్లాడుతూ.. రాజకీయాలు అంటేనే డబ్బు, అంగ, అర్ధ బలం తప్పనిసరైన ఈ రోజుల్లో ఒక సామాన్య రైతు బిడ్డ, విద్యావంతుడు, యువకుడు అయిన డా. గురుమూర్తిని తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలలో నిలబెట్టడం నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహోన్నత వ్యక్తిత్వానికి, పేద బడుగు, బలహీన వర్గాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనము అని తెలిపారు . భారత రాజ్యాంగంకు నిజమైన నిర్వచనం ఇచ్చే విధంగా వైఎస్సార్ కుటుంబం ఎప్పుడు పేద బడుగు, బలహీన వర్గాల అభివృధి కోసం పరితపిస్తారు అని, ఇచ్చిన మాట, విశ్వసనీయత కోసం వారి ప్రతి చర్య, మాట ఉంటాయని తెలిపారు. డా. గురుమూర్తి గెలుపు కోసం ఎన్నారై కమిటీ కార్యాచరణ రూపొందించుకొని ‘మినిట్ టు మినిట్’ రూపంలో పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను తమ మూలాల ద్వారా అందరిని అభ్యర్థిస్తామని తెలిపారు. డా. గురుమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహోన్నత వ్యక్తిత్వానికి తనలాంటి ఒక్క సామన్య యువకుడికి టికెట్ ఇవ్వడం ఒక్క ఉదాహరణ అని, పార్టీ పెద్దలు, వైస్సార్ అభిమానులు, కార్యకర్తలు, తిరుపతి ప్రజల ఆశీర్వాదంతో ఉప ఎన్నికలలో ప్రజల ముందుకు వస్తున్నట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులు సహాయసహకారాలు అందించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకమైన నాయకుడని ఉప ఎన్నిక ద్వారా దేశానికి తెలియచెబుతామని ప్రజలే అంటున్నారన్నారు. సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే రాష్ట్ర ప్రజానీకమంతా ఉందని, 22 నెలల పాలనలోనే దేశంలోనే తిరుగులేని ముఖ్యమంత్రిగా పేరుప్రతిష్టలు పొందారని అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలలలోనే కాకుండా, తరువాత తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రవాసాంధ్రుల ఐటీ, ఐటీ ఆధారిత ఇండస్ట్రీస్, ఇతర పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వైస్సార్సీపీ అమెరికా కమిటీ మెంబెర్స్ రమణారెడ్డి క్రిస్టపట్టి, కృష్ణ కోడూరు, పరమేశ్వర రెడ్డి, సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిబొట్ల, జగన్ యాడికి, దుశ్యంత్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డివారి, పవన్, విష్ణు, నరసింహ యాదవ్, నరేంద్ర బుచ్చిరెడ్డి గారి, కృష్ణ చైతన్య (న్యూజిలాండ్), సుబ్బారెడ్డి బొర్రా, అనిల్ రెడ్డి, వాసు మొదలుగు వారు మాటాడుతూ.. సామన్య యువకుడికి టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి.. సంక్షేమ పాలనకు మరింత బలాన్ని చేర్చాలని, వారి గెలుపుకు సమిష్టిగా ప్రవాసాంధ్రులు కృషి చేస్తారని ముక్తకంఠంతో ప్రతిన బూనారు. భారీ మెజారిటీతో గెలవబోతున్న గురుమూర్తికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. -
‘ఉప ఎన్నికనూ బహిష్కరిద్దామా.. సార్!’
సాక్షి, తిరుపతి: ‘పరిషత్’ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించడమంటే తమ గొయ్యి తాము తవ్వుకున్నట్టేనని పనబాక తన అనుచరుల వ ద్ద వాపోతున్నారని సమాచారం. చంద్రబాబు నిర్ణ యం వల్ల ఈ నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీకి పడే సానుభూతిపరుల ఓట్లు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనూ పనబాక లక్ష్మి నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘మీరు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించినట్టే.. నన్ను కూడా పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికను బహిష్కరించమంటారా సార్’ అని పనబాక లక్ష్మి చంద్రబాబును కడిగేశారని సమాచారం. చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో పనబాక లక్ష్మి ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, ఓ మాజీ ఎమ్మెల్యే సైతం ఎంపీ అభ్యర్థి పనబాకను సమర్ధించినట్టు భోగట్టా. అనేక మంది నాయకులు చంద్రబాబుకు ఫోన్‌చేసి పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంపై నిలదీయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమల దళంలోనూ ఆందోళన మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల రాజకీయ తెరపై రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీనీ కలవరపెడుతున్నాయి. ఇక్కడ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నవతరం పార్టీ అభ్యర్ధికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఇది జనసేన పార్టీ గుర్తు కావడంతో జనసేన, బీజేపీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలింగ్ రోజున జనసేన అభిమానులు గాజు గ్లాస్ గుర్తును చూసి దానికి ఓటేస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు తాజాగా చోటు చేసుకున్న మరో పరిణామం టీడీపీ నేతలనూ కలవరపెడుతోంది. జనసేన నేతలు కొందరు ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేలా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తరుణంలో టీడీపీకి పడే ఓట్లు కూడా గాజు గ్లాస్ గుర్తుకు పడే అవకాశముందనే ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది. -
లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి
సాక్షి, తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సైతం ఎమ్మెల్సీ లోకేష్ ప్రసంగం షరా మామూలుగా అపస్వర వాక్కులతో సాగింది. సోమవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. తిరుపతి గాంధీరోడ్డు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్డుషో నిర్వహించి అక్కడే జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వైఎస్సార్సీపీ నుంచి 22 మంది లోక్‌సభ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులున్నారని, వారు రోబోలుగా మారి ప్రధాని మోదీ ఎదురు పడితే వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో తిరుపతిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదన్నారు. టీడీపీ తరపున ఒక రాజ్యసభ, ముగ్గురు లోకసభ సభ్యులు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై, ప్రత్యేక హోదాపై సింహంలా గర్జిస్తున్నారని తెలిపారు. పుడచ్చేరి (పుదుచ్చేరి)లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అక్కడ ప్రత్యేక హోదా ప్రకటించిందన్నారు. పుదుచ్చేరిని పుడచేరి అంటూ ప్రసంగిస్తున్నప్పుడు సభలో నవ్వుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని జగన్ టాక్స్, కరప్షన్, బాదుడు(జేసీబీ) ప్రభుత్వంగా అభివర్ణించారు. ట్రాక్టర్ ఇసుక గతంలో రూ.1500 ఉండగా నేడు 5 వేలకు పెరిగి బంగారు ధరను మించిందన్నారు. మద్యనిషేధమంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ బ్రాంది, బూంబూం బీర్లతో సామాన్యుల నడ్డి విరిచి వేల కోట్లు దండుకుంటోందని విమర్శించారు. ఎన్నికల హామీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్న జగన్‌రెడ్డి ఇప్పటికీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. టీడీపీ పాలనలో 5లక్షల 16 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రస్తుత వలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలేనని, రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తిరుమలలో జరిగిన ఓ సమావేశంలో దళితుడైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి కూర్చునేందుకు కుర్చీ ఇవ్వకుండా.. అగ్ర వర్ణానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించారని తెలిపారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. చదవండి: (జనాన్ని విసిగించిన నారా లోకేష్) అధికారుల అంతు చూస్తాం.. టీడీపీ కార్యకర్తలపై దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారుల అంతుచూస్తామని లోకేష్ హెచ్చరించారు. 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అతిగా వ్యవహరించిన అధికారులకు వడ్డీతో సహా తగిన బుద్ది చెబుతామన్నారు. -
‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’
సాక్షి, నెల్లూరు: ఇంటి వద్దకే సంక్షేమాన్ని చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మంత్రులు అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో చేతులెత్తేయాలని మేం చెప్పలేదు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చేతులెత్తేయాలని తాము చెప్పలేదని.. పల్లె, నగర పోరులో ఫలితాలు చూసి టీడీపీకి భయం పట్టుకుందన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో డా.గురుమూర్తికి అనూహ్య మెజారిటీ వస్తుందని.. ప్రచారంలో వైఎస్సార్సీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయం మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ, రాజకీయ విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులను అవమానించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని నారాయణ స్వామి అన్నారు. వాళ్లే టీడీపీకి దిక్కుగా నిలిచారు.. టీడీపీకి రాష్ట్ర ప్రజలు సమాధి కట్టేశారని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులే మిగిలారన్నారు. నాలుగైదు సార్లు జనం ఓడించిన వాళ్లే టీడీపీకి దిక్కుగా నిలిచారని ఎమ్మెల్యే కాకాణి ఎద్దేవా చేశారు. పెళ్లాలను మార్చినట్టే పార్టీలను మారుస్తున్నాడు.. నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే చిత్తశుద్ధి సీఎం జగన్‌దని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడి గుండె ఆపరేషన్ని కూడా రాజకీయం చేసే వక్రబుద్ధి చంద్రబాబుదన్నారు, పవన్ పెళ్లాలను మార్చినట్టే పార్టీలను మారుస్తున్నాడని మంత్రి బాలినేని దుయ్యబట్టారు. వారే ట్రెండ్ సెట్టర్స్.. ప్రజాసమస్యలు తెలిసిన అభ్యర్థినే సీఎం జగన్ బరిలోకి దించారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్, ఎన్టీఆర్, వైఎస్ జగన్ ట్రెండ్ సెట్టర్స్ అని, ఈ ముగ్గురిని మించిన నేతలు ఎవరూ లేరన్నారు. ఒక పార్టీలో పప్పు, మరో పార్టీలో కామెడి యాక్టర్ ఉన్నారంతేనంటూ రవీంద్రనాథ్‌రెడ్డి చలోక్తులు విసిరారు. నవరత్నాలతో నవశకానికి నాంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలతో నవశకానికి నాంది పలికారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం జగన్ వెంటే జనం ఉన్నారన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు మించిన మెజారిటీ డా.గురుమూర్తికి రాబోతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: ‘ఆ భయంతోనే టీడీపీ కుంటిసాకులు’ ‘పవన్, లోకేష్.. ఇదో అజ్ఞానపు సంత’ -
తిరుపతిలో అత్యధిక మెజార్టీ సాధిద్దాం
-
తిరుపతిలో అత్యధిక మెజార్టీ సాధిద్దాం
చిల్లకూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగేలా మెజార్టీ సాధిద్దామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలునిచ్చారు. పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తితో కలిసి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. వరగలి క్రాస్ రోడ్డు నుంచి మోమిడి వరకు సాగిన రోడ్ షోలో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. అంకులపాటూరులో ఏఎంసీ చైర్మన్ నల్లారెడ్డి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాధికారం ధనవంతులదే కాదని, పేదలదని సీఎం పేద కుటుంబాల్లో వారిని ఎంపిక చేసి వారికి పార్టీ టికెట్లు ఇచ్చి ఉన్నతస్థాయి కల్పిస్తున్నారని, ఇందుకు గురుమూర్తి నిదర్శనమని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. తాను, చంద్రబాబు ఒకచోటే చదువుకున్నామని, అతడికి రెండెకరాల పొలం మాత్రమే ఉండేదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఈ రోజు లక్షల కోట్లు సంపాదించి జగన్‌ని వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే ప్రజలే సహించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి దేశ చరిత్రలో చెప్పుకొనేలా మెజార్టీ ఇవ్వాలని కోరారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ అందరూ సైనికుల్లా పనిచేసి భారీ మెజార్టీ సాధించాలన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ మాట్లాడుతూ బీజేపీ మరో తోక నాయకుడిని చేర్చుకుని ప్రచారం చేసుకుంటోందనివిమర్శించారు. గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీకి అందరూ కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్, రాప్తాడు ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని విసిగించిన నారా లోకేష్
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తానని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం వరదయ్యపాళెంలో నిర్వహించిన రోడ్‌షోలో లోకేష్ ప్రజలకు ఈ మాయమాటలు చెప్పారు. మాజీ సీఎం తనయుడి సభకు వెయ్యి మంది కూడా జనం హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఉపఎన్నికల ప్రచారంలో లోకేష్.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పదేపదే విమర్శించడంపై జనం విసిగిపోయారు. పనబాక లక్ష్మి గెలుపునకు పెట్రోల్, గ్యాస్ ధరల తగ్గింపుకు సంబంధమేముందని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం విచిత్రంగా ఉందని జనం గుసగుసలాడారు. మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకనే రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలతో తన ప్రసంగాన్ని ముగించారు లోకేష్. -
రికార్డు మెజార్టీతో గెలిపిద్దాం
నాయుడుపేటటౌన్: చంద్రబాబు మోసకారి.. దగాకోరని.. 600 హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శనివారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య తదితర నాయకులతో కలిసి తిరుపతి లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి మద్దతుగా నిర్వహించిన ప్రచార యాత్రలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో యువతను, రుణ మాఫీ పేరుతో రైతులు, పొదుపు మహిళలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరిట టీడీపీ కార్యకర్తలను నియమించి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేసిన మోసకారి చంద్రబాబని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చారని కొనియాడారు. మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు నెరవేర్చడమే కాకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని ప్రజా రంజక పాలన అందిస్తున్నట్టు తెలిపారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఐదు లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇద్దామని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల బహిష్కరణ పెద్ద డ్రామా చంద్రబాబు పరిషత్ ఎన్నికల బహిష్కరణ పెద్ద డ్రామా అని పెద్దిరెడ్డి విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని, పరిషత్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారని చెప్పారు. ఎన్నికల బహిష్కరణ అంటూనే వాళ్లకు బలం ఉన్న కొన్ని చోట్ల విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుది మొదటి నుంచి రెండు కళ్ల సిద్ధాంతమేనని దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ డాక్టర్ గురుమూర్తికి దేశ చరిత్రలోనే చెప్పుకునేంత మెజారిటీ అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ గురుమూర్తికి రికార్డు స్థాయిలో మెజారిటీ తీసుకొచ్చేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తిలు మాట్లాడారు. -
మెజార్టీ వీరి లక్ష్యం.. రెండో స్థానం వారి గమ్యం
సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. భారీ మెజారిటీనే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు ఊరూ వాడా తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. బీజేపీ నేతలు తిరుపతి, శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు, నాయకులు.. తిరుపతి, సత్యవేడులో ప్రచారం చేశారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి డాక్టర్ గురుమూర్తితో కలిసి చిత్తూరు జిల్లా పార్టీ ఇన్చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయక వీధి వీధిలో ప్రచారం చేశారు. ఫ్యాను గుర్తుకే మా ఓటు.. తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ నాయకుల ప్రచారానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కొర్లగుంటకు చెందిన వృద్ధుడు రాధాకృష్ణ యాదవ్ ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ‘వైఎస్ జగన్ సీఎం అయ్యాకే నాకు పింఛను వస్తోంది.. అందుకే ఇలా ఆయన రుణం తీర్చుకుంటున్నా’ అని స్పష్టం చేశారు. ఇలా అనేక మంది స్థానికులు వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఓ వైపు, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి మరో వైపు సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. స్థానికుల కోరిక మేరకు ఎమ్మెల్యే పలు గ్రామాల్లో ఎడ్లబండిపై ప్రచారం చేపట్టారు. మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పిచ్చాటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో బీజేపీ, టీడీపీపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు ఎవరికి వారు గురుమూర్తికి అధిక మెజార్టీ తెప్పించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ద్వితీయ స్థానం కోసం పోటాపోటీ బీజేపీ, టీడీపీ ద్వితీయ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తిరుపతి నగరంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోసం ఆ పార్టీ నేతలు సత్యవేడులో ప్రచారం చేపట్టారు. సీపీఎం అభ్యర్థి యాదగిరి తరఫున ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ప్రచారం నిర్వహించారు. అయితే వీరందరి ప్రచారానికి స్థానికుల నుంచి స్పందన లేకపోవటం గమనార్హం. -
తిరుపతి ఉపఎన్నిక: బీజేపీ అభ్యర్థిపై ఫిర్యాదు
నెల్లూరు(దర్గామిట్ట): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కె.రత్నప్రభపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ జనతాదళ్(యు) నేత ఏవీ రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు బుధవారం ఫిర్యాదు చేశారు. రత్నప్రభ నామినేషన్ పత్రాల్లో తనపై ఎలాంటి కేసు లేదని పేర్కొన్నారని, అయితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, సైఫాబాద్, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్స్టేషన్లలో ఆమెపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రమణ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు అందించారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలకు రికార్డులు లేవన్నారు. అందువల్ల రత్నప్రభ నామినేషన్‌ను తిరస్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. -
విభజన చట్టంలోని అంశాలు, హామీలు ఏమయ్యాయి?
సాక్షి, విజయవాడ : 20 నెలల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి విజయవాడలో బుధవారం మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు ఉన్న సంబంధం ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వాటిపై తాము స్పందించనవసరం లేదని, పాదయాత్రలు, తలకిందులు యాత్రలు చేసినా తమకు నష్టం ఏం లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎవరిని తెచ్చుకున్నాసీఎం జగన్‌కు ప్రజా బలం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై బీజేపీ ఏం చెబుతుందని, విభజన చట్టంలోని అంశాలు, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నెరవేర్చామా లేదా అనేది వారికి వారు ఆలోచించుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కాబట్టే తిరుగులేని విజయాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. మోసాలు, మాయలను ఎవరూ నమ్మరని, 13 జిల్లాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశామని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుని కోర్టుకు వెళ్లాయని, న్యాయ స్థానానికి అన్ని అంశాలను వివరిస్తామని అన్నారు. ఏ క్షణమైనా పరిపాలన రాజధానికి వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. చదవండి: నిత్య పెళ్లికొడుకు అరాచకం.. ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని అనుమానం పెనుభూతమై.. భార్య గొంతు కోసి! -
బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ దాఖలు
నెల్లూరు (అర్బన్): తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ తరుఫున రత్నప్రభ సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి, తమ పార్టీకి నడుమ జరుగుతోందని, రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రాయలసీమకు నీటి కరువు లేకుండా చేస్తామని చెప్పారు. నామినేషన్ వేసిన సీపీఎం అభ్యర్థి యాదగిరి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సీపీఎం అభ్యర్థి యాదగిరి సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఎం ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తోందన్నారు. బీజేపీ దుర్మార్గాలన్నింటినీ ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. -
గురుమూర్తి నామినేషన్ దాఖలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 9 మంది రాష్ట్ర మంత్రులు, ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ తదితరులతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబుకు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. తొలుత నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మునిసిపల్ తీర్పు పునరావృతం ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ప్రజలు మునిసిపల్ ఎన్నికల ద్వారా బలమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు పునరావృతమవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తం చూసేలా భారీ మెజార్టీ తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు గురుమూర్తి ఒక వైపు, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలా హేమాహేమీలు మరోవైపు బరిలోకి దిగారని చెప్పారు. గురుమూర్తి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం ఆలోచించే రీతిలో భారీ మెజార్టీ సాధించడానికి తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తున్న సీఎం రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నెల్లూరులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షల మెజారిటీ సాధిస్తాం మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తేనే పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ సాధిస్తామన్నారు. ఈ ఎన్నికలు రెఫరెండం కాదని చెప్పి టీడీపీ ముందే చేతులెత్తేసిందన్నారు. జగన్ 21 నెలల పరిపాలనకు ప్రజలు భారీ మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ స్థానం కానుకగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన సామాన్యడైన గురుమూర్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ, బీజేపీ ఉనికి కాపాడుకోడానికి డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు. ర్యాలీకి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసనకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు గురుమూర్తి నామినేషన్
-
సామాన్యులకే వైఎస్సార్సీపీలో పెద్దపీట
-
సామాన్యులకే వైఎస్సార్సీపీలో పెద్దపీట
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యులకే పెద్దపీట వేస్తున్నారు. అందుకు నిదర్శనమే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎం. గురుమూర్తి ఎంపిక. అక్కడి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎం.గురుమూర్తి పేరును సీఎం ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలకూ షాక్ ఇచ్చారు. దీంతో గురుమూర్తి ఎవరన్నదీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సోమవారం నెల్లూరులో నామినేషన్ వేయనున్న గురుమూర్తి నేపథ్యం ఇదీ.. గురుమూర్తి దంపతులకు స్వగృహం ముందు హారతి ఇస్తున్న ఆయన సోదరీమణులు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు చెందిన గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగుచేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఐదుగురు అక్క చెల్లెళ్లు్ల ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. 2017లో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు. తిరుపతి ఉపఎన్నిక రావడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గురుమూర్తి పేరును సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇది తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ సామాన్యులకు పెద్దపీట వేస్తున్నారని వినేవారమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.ఎంపీ అభ్యరి్థగా తమ కొడుకుని సీఎం ఎంపిక చేస్తారని ఊహించలేదని గురుమూర్తి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
తిరుపతిలో బంపర్ మెజార్టీ సాధిస్తాం
తిరుపతి అన్నమయ్య సర్కిల్(చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంటుందని.. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి బంపర్ మెజార్టీ సాధిస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాభివృద్ధే ఫలితాన్ని నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో మంత్రి పెద్దిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నామని.. ప్రజలు కూడా వాడవాడలా వైఎస్సార్సీపీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇందుకు సీఎం జగన్ పరిపాలనే కారణమన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి.. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూసేలా తిరుపతి పార్లమెంట్ ఫలితం ఉంటుందన్నారు. కుప్పం రెస్కో స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని.. దానిని ఏపీ ట్రాన్స్‌కోలో ఎట్టి పరిస్థితిలోనూ విలీనం చేయబోమన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన, శ్రీనివాసులు, చెవిరెడ్డి, చింతల, కె.ఆదిమూలం, ఎంఎస్ బాబు, వెంకటే గౌడ,ద్వారకనాథ్‌రెడ్డి, నవాజ్ బాషా పాల్గొన్నారు. -
Tirupati Bypoll 2021: తిరుపతిలో టీడీపీ డీలా
సాక్షి, అమరావతి: వరుసగా ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీడీపీలో ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికను ఎదుర్కోవడం కష్టమని పార్టీ శ్రేణులు, నాయకులు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనా నేతలు ఎవరూ ఆ ఊసే ఎత్తడంలేదు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో టీడీపీలో నిర్వేదం ఏర్పడింది. అంతకుముందు పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీ యంత్రాంగం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కుదేలైపోవడంతో ఆ పార్టీ కేడర్ డీలా పడిపోయింది. అచ్చెన్నాయుడుతోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ ఎటువంటి ప్రభావం చూపించలేక చతికిలపడింది. అనుకూల మీడియాలో హడావుడే తప్ప పార్టీపట్ల ప్రజల్లో ఆదరణలేదన్న విషయం పంచాయతీ ఎన్నికల్లోనే స్పష్టమైనట్లు పార్టీ సీనియర్ నాయకులు విశ్లేషించారు. చంద్రబాబు చేసే ఉద్యమాలు కూడా ప్రజలకు సంబంధించినవి కాకుండా తన సొంత ప్రయోజనాలున్న అమరావతి రాజధాని వ్యవహారం, పార్టీ నేతలకు సంబంధించినవే ఎక్కువ ఉండడంతో జనంలో ఉన్న ఆదరణ తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు సంయమనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడడంతో పార్టీ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఈ తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక రావడంతో ఏం చేయాలో టీడీపీ నేతలకు అంతుపట్టడంలేదు. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు అవినీతి కేసులు చుట్టుముట్టడంతో ఓ రకంగా చంద్రబాబు కూడా నిర్వేదానికి లోనైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికకు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ప్రకటించినా అది మొక్కుబడేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఎదురైన పరాజయాల భారంతో తీవ్రంగా కుంగిపోయిన చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు కూడా ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని చర్చించుకుంటున్నారు. -
నేడు గురుమూర్తి నామినేషన్
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం. గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఉ.9.30 గంటలకు నామినేషన్ పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, గౌతమ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
తిరుపతి ఉప ఎన్నికల్లో కుడిచేతి వేలికి సిరా
సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కుడిచేతి చూపుడువేలికి సిరా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానానికి వచ్చే నెల 17న జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతి ఎన్నికల్లో ఓటేసే ఓటరుకు అధికారులు ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఓటర్ల ఎడమచేతి వేలికి వేసిన ఇండెలిబుల్ సిరా ఇంకా కొందరికి చెరిగిపోలేదు. అటువంటి వారు ఓటు వేసేందుకు వెళితే పోలింగ్ అధికారులు వెనక్కుపంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికలసంఘం నుంచి ఉత్తర్వులు అందాయి. 29న వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈనెల 29న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ బరిలో ఉన్నారు. జనసేన మాత్రం తటస్థంగా ఉంది. పవన్‌కళ్యాణ్ బీజేపీపై అసంతృప్తిగా ఉండటంతో జనసేన వర్గాలు లోపాయకారీగా టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
ఒక్క సీటు గెలిచినా టీడీపీకి ఒరిగేదేమీ లేదు: పనబాక
సాక్షి, నెల్లూరు(అర్బన్): ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ తరఫున మాజీ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలతో కలసి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలతో కలసి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు రెండు సెట్ల నామినేషన్లను అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదన్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాడాలంటే తమను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. -
29న గురుమూర్తి నామినేషన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి ఈ నెల 29న నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ చిత్తూరు జిల్లా ఇన్చార్జి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం తిరుపతిలోని పీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని వారికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేసి గురుమూర్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా అఖండ మెజారిటీ సాధించేలా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 21 నెలల సంక్షేమ పాలన గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు. కులం, మతం, పారీ్టలతో ప్రమేయం లేకుండా అర్హులందరికీ పథకాలను అందించిన ఘనతను చాటాలన్నారు. ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలసి వారి ఆశీస్సులు కోరాలన్నారు. బీసీ, ఎస్సీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని, వారిని సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ క్రమంలోనే డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారని ఆయన వివరించారు. వలంటీర్ వ్యవస్థకు ప్రపంచస్థాయి కీర్తి అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థకు ప్రపంచస్థాయి కీర్తి దక్కిందన్నారు. సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీకి వస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు చేసిన నకిలీ ఓటరు కార్డుల ఆరోపణలను కొట్టిపడేశారు. అలాంటి కర్మ తమకు పట్టలేదని, ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పాలనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు మట్టికరిచాయని ఆయన అన్నారు. ప్రజాదీవెనలతో డాక్టర్ గురుమూర్తి 4 లక్షలకుపైగా మెజారిటీ సాధిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆదిమూలం, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
29న నామినేషన్ వేస్తా: డాక్టర్ గురుమూర్తి
సాక్షి, తిరుపతి : ఈ నెల 29న తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ వేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. తనకు పార్టీ నాయకులు, కార్యకర్తల సపోర్ట్ బాగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఇంత మంచి అవకాశం ఇస్తారని అసలు ఊహించలేదని, సీఎం ప్రోత్సాహంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఓట్లడుగుతానని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానని అన్నారు. మెజారిటీ ఎంతనేది ఓటరు దేవుళ్లే నిర్ణయిస్తారురని పేర్కొన్నారు. చదవండి: సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి! -
సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి!
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీని అభద్రతా భావం వెంటాడుతోంది. ఆ పార్టీ నేతలు వేసే ప్రతి అడుగూ బెడిసికొడుతోంది. ఒక వ్యూహం పన్నితే అది కాస్తా బూమరాంగ్ అవుతోంది. ఒకరిని ఇన్చార్జిగా నియమిస్తే శ్రేణులే వేలెత్తి చూపే పరిస్థితి ఏర్పడుతోంది. నియోజవకవర్గాల్లో ప్రచారానికి వెళితే కార్యకర్తలే నిలదీస్తుండడంతో నాయకుల్లో ఆత్మస్థైర్యం దిగజారిపోతోంది. తమ్ముళ్ల వైఖరి ఆ పార్టీ అగ్రనేతలను సైతం డైలమాలో పడేస్తోంది. సాక్షి, తిరుపతి: టీడీపీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇవి ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. కార్యకర్తల్లో అంతర్గతంగా జీర్ణించుకుపోయిన అంశాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేతలను అవి నిగ్గదీసి కడిగేస్తున్నాయి. పనబాక.. పట్టించుకోబాక! తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును ఆ పార్టీ అధిష్టానం మూడు నెలలు ముందు ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఎవరికీ చెప్పలేదు. కనీసం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నేతలకు, ఇన్చార్జిలకు తెలియజేయ లేదు. ఆమె బీజేపీలో చేరిపోతారనే అభద్రతా భావంతో టీడీపీ నేత చంద్రబాబునాయుడు ముందే ప్రకటించేశారు. ఆ ప్రకటన తర్వాత ఆమె ఇంతవరకు ప్రజల మధ్యకు రాలేదు. పంచాయతీ, పుర ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఉప పోరుకు నోటిఫికేషన్ వెలువడడంతో తాజాగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒకడుగు ముందుకువేస్తే, మూడడుగులు వెనక్కి పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. నిలదీత.. అంతా రోత పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల టీడీపీ నేతలు ప్రచారాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీయడం మొదలుపెట్టారు. మండల, నియోజకవర్గాలకు ముందు ఇన్చార్జీల విషయం తేల్చాలని భీష్మించుకుంటున్నారు. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత వర్గీయుల మధ్య వివాదం బహిర్గతమైంది. వారిని సర్దిచెప్పేందుకు టీడీపీ సీనియర్ నేతలకు తల ప్రాణం తోకకు వచ్చినట్టయ్యింది. తిరుపతిలో తెలుగు యువత అధ్యక్షుడుగా రవినాయుడు నియామకంపై కొందరు పెదవి విరిచారు. ఎంతో కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని వస్తున్న నేతలను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో టీడీపీ ఉనికి నామరూపాల్లేకుండా పోతోంది. అక్కడ ఆ పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. సోమిరెడ్డి..ఓడగొడతావేంటి! తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బాధ్యుడిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని నియమించడంపై టీడీపీ అభ్యర్థి పన బాకలక్ష్మితో సహా ఆయా నియోజకవర్గాల కేడర్ కినుకు వహించినట్లు సమాచారం. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు సర్వేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. ప్రజల మెప్పు పొందడంలో విఫలమయ్యారు. అలాంటి నాయకుడ్ని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎలా నమ్ముతారని పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమా చారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల మొత్తంగా పరిశీలిస్తే టీడీపీ ప్రతిచర్య భూమ్‌రాంగ్ అవుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చదవండి: బరిలో ఉమ్మడి అభ్యర్థి -
బరిలో ఉమ్మడి అభ్యర్థి
తిరుపతి అర్బన్: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థినే బరిలో నిలుపుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పేర్కొన్నారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీటీడీకి చెందిన భూములను ధారదత్తంగా విక్రయిస్తున్న యాజమాన్య తీరును అడ్డుకున్నది బీజేపీనే అని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక పాలసీ తప్పుదోవ పడుతోందని విమర్శించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేశాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇసుక పాలసీని రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇసుకను అందజేయాలని డిమాండ్ చేశారు. -
తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 30 చివరి తేదీ కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3. ఏప్రిల్ 17న ఎన్నిక నిర్వహించి, మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.