
తిరుపతి అర్బన్: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి అనంతరం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను అవమాన పరిచేలా మాట్లాడారు. ఆదివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఓటు వేసిన వారే నిజమైన ఓటర్లని, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన వారు కాదని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం నుంచి తాను పారిపోయినట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు.