panabaka lakshmi
-
మహిళా నేతలనూ వంచించిన బాబు
సాక్షి, అమరావతి : చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలకూ అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహిస్తానని, వారి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ వంచనపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు మహిళలకు ఆయన అవమానకర రీతిలో సీట్లు నిరాకరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను అవమానకర రీతిలో పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుని చింతలపూడి సీటు ఇవ్వకపోగా, ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ అవమానించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు వంటి నేతల అహంకారానికి దళిత మహిళనైన తాను బలైనట్లు ఆమె వాపోతున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోలేదనే కారణంతోనే చంద్రబా బు సీటు తిరస్కరించారన్న వాదన పార్టీలో ఉంది. పనబాకను మోసం చేసిన బాబు టీడీపీలో మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మొండిచేయి చూపారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు మాట విని పార్టీ కోసం ఓటమికి సిద్ధమయ్యే పోటీకి దిగారు. వాస్తవంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. ఉప ఎన్నికలో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఆమె భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని చంద్రబాబు మభ్యపెట్టి పనబాకను పోటీకి దింపారు. అసలు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఆమెను వంచించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కనపెట్టేశారు. బాపట్ల, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీ వెంట నిలబడ్డ తనను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా భారతికి మొండిచేయి టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికీ బాబు సీటు నిరాకరించారు. ఆమె తన కుమార్తె గ్రీష్మకు శ్రీకాకుళం జిల్లా రాజాం సీటు ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. గ్రీష్మ టీడీపీ మహానాడులో తొడకొట్టి మరీ వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతలకు పార్టీలో అవకాశాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ చివరికి రాజాం సీటును కొండ్రు మురళీమోహన్కి ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచి టీడీపీని నమ్ముకున్న ఆమె కుటుంబానికి టీడీపీలో న్యాయం జరగలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోనూ ఆది నుంచి పార్టీకి దన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానంలో ధనబలం ఉన్న గొండు శంకర్‌కు సీటిచ్చారు. అప్పుడు మభ్యపెట్టారు.. ఇప్పుడు మోసగించారు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పాడేరు, రంపచోడవరం, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలను మభ్యపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ముగ్గురూ ఓడిపోయినా నియోజకవర్గాల్లో తిరుగుతూ పనిచేశారు. కానీ సమీకరణలు, ధన బలం లేదనే కారణంతో ఈ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకుండా అవమానించారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు సీటు లేకుండా చేశారు. చంద్రబాబు మోసం చేశారనే ఉద్ధేశంతో రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు అర్థమైందంటూ ఆమె ఎక్స్(ట్విటర్)లో వాపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఈసారి సీటు లేకుండా చేశారు. భవానీ బదులు ఆమె భర్తకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మకు కూడా హ్యాండిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
Panabaka Lakshmi: మాకు ఓటేసినవారే ఓటర్లు..
తిరుపతి అర్బన్: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి అనంతరం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను అవమాన పరిచేలా మాట్లాడారు. ఆదివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఓటు వేసిన వారే నిజమైన ఓటర్లని, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారు కాదని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం నుంచి తాను పారిపోయినట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. -
‘ఉప ఎన్నికనూ బహిష్కరిద్దామా.. సార్!’
సాక్షి, తిరుపతి: ‘పరిషత్’ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించడమంటే తమ గొయ్యి తాము తవ్వుకున్నట్టేనని పనబాక తన అనుచరుల వ ద్ద వాపోతున్నారని సమాచారం. చంద్రబాబు నిర్ణ యం వల్ల ఈ నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీకి పడే సానుభూతిపరుల ఓట్లు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనూ పనబాక లక్ష్మి నేరుగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘మీరు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించినట్టే.. నన్ను కూడా పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికను బహిష్కరించమంటారా సార్’ అని పనబాక లక్ష్మి చంద్రబాబును కడిగేశారని సమాచారం. చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుతో పనబాక లక్ష్మి ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, ఓ మాజీ ఎమ్మెల్యే సైతం ఎంపీ అభ్యర్థి పనబాకను సమర్ధించినట్టు భోగట్టా. అనేక మంది నాయకులు చంద్రబాబుకు ఫోన్‌చేసి పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంపై నిలదీయడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమల దళంలోనూ ఆందోళన మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల రాజకీయ తెరపై రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీనీ కలవరపెడుతున్నాయి. ఇక్కడ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నవతరం పార్టీ అభ్యర్ధికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఇది జనసేన పార్టీ గుర్తు కావడంతో జనసేన, బీజేపీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలింగ్ రోజున జనసేన అభిమానులు గాజు గ్లాస్ గుర్తును చూసి దానికి ఓటేస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు తాజాగా చోటు చేసుకున్న మరో పరిణామం టీడీపీ నేతలనూ కలవరపెడుతోంది. జనసేన నేతలు కొందరు ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేలా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తరుణంలో టీడీపీకి పడే ఓట్లు కూడా గాజు గ్లాస్ గుర్తుకు పడే అవకాశముందనే ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది. -
జనాన్ని విసిగించిన నారా లోకేష్
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తానని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం వరదయ్యపాళెంలో నిర్వహించిన రోడ్‌షోలో లోకేష్ ప్రజలకు ఈ మాయమాటలు చెప్పారు. మాజీ సీఎం తనయుడి సభకు వెయ్యి మంది కూడా జనం హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఉపఎన్నికల ప్రచారంలో లోకేష్.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పదేపదే విమర్శించడంపై జనం విసిగిపోయారు. పనబాక లక్ష్మి గెలుపునకు పెట్రోల్, గ్యాస్ ధరల తగ్గింపుకు సంబంధమేముందని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం విచిత్రంగా ఉందని జనం గుసగుసలాడారు. మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకనే రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలతో తన ప్రసంగాన్ని ముగించారు లోకేష్. -
ఒక్క సీటు గెలిచినా టీడీపీకి ఒరిగేదేమీ లేదు: పనబాక
సాక్షి, నెల్లూరు(అర్బన్): ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ తరఫున మాజీ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలతో కలసి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలతో కలసి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుకు రెండు సెట్ల నామినేషన్లను అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక్క సీటు గెలిచినంత మాత్రాన టీడీపీకి ఒరిగేదేమీ లేదన్నారు. అయితే ప్రజా సమస్యలపై పోరాడాలంటే తమను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. -
నాకెందుకీ తలనొప్పి.. ఏ మొహంతో ఓట్లడగాలి!
‘ఎందుకు నాకు ఈ తలనొప్పి. క్షేత్రస్థాయిలో పార్టీకి గడ్డు పరిస్థితులున్న సమయంలో అభ్యర్థిత్వాన్ని చెప్పాపెట్టకుండా ప్రకటించారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకుంటే ఇదొక భారాన్ని నెత్తినపెట్టారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేలో అర్థం కావడం లేదు. ఆయన (చంద్రబాబు) తీరు ఏం బాగోలేదు.. నా డిమాండ్లు పరిష్కరిస్తేనే తిరుపతి ఎంపీగా పోటీ చేస్తా’నన్నట్టు ఉంది ఆ పార్టీ అభ్యర్థి పనబాకలక్ష్మి మనోగతం. అభ్యర్థిత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తే ఆమె తమ పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, తిరుపతి: తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని మాత్రం అందరికంటే ముందే ప్రకటించింది. ఉప ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పనబాకలక్ష్మిని ముందే ప్రకటించడానికి కారణం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో టీడీపీకి గడ్డు రోజులు నడుస్తున్న తరుణంలో మాజీ మంత్రి పనబాకలక్ష్మి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు నెరిపి తేదీ కూడా ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. షాక్ ఇచ్చిన చంద్రబాబు పనబాకలక్ష్మి బీజేపీలో చేరుతుందని తెలుసుకున్న చంద్రబాబు ఆమెను సంప్రదించకుండా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు తీరుతో ఆమె షాక్‌కు గురైనట్లు సమాచారం. టీడీపీ అధినేతపై తీవ్ర అంసతృప్తితో మౌనంగా.. కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అభ్యర్థిత్వం ప్రకటించినా ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. తనను సంప్రదించకుండా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకునే అవకాశందని ఉందని టీడీపీ అధిష్టానానికి సమాచారం అందింది. వెంటనే చంద్రబాబు సోమిరెడ్డిని రంగంలోకి దింపారు. అందులో భాగంగా ఆయన పనబాకలక్ష్మితో భేటీ అయ్యారు. అయితే ఆమె కొన్ని డిమాండ్లు టీడీపీ అధిష్టానం ముందుంచింది. వాటిని ఆమోదించాలా? వద్దా? అనే సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు) బీజేపీతో లోపాయికారి ఒప్పందమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ముందు నొయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. వైఎస్సార్సీపీ ధాటికి తట్టుకోలేక బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పనబాకలక్ష్మి డిమాండ్లను ఆమోదించినట్లే ఆమోదించి.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అటు బీజేపీ, ఇటు టీడీపీకి సన్నిహితంగా ఉండే మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పట్ల మొగ్గుచూపుతున్నట్లు కమలం శిబిరం నుంచి అందిన సమాచారం. ఆయన్ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు కూడా ఆయనకే మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు టీడీపీ క్యాంప్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా పనబాకలక్ష్మికి చంద్రబాబు మరో సారి షాక్ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. -
'బాబు దళితులను బెదిరిస్తున్నారు'
అమరావతి : ప్రభుత్వం నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకాకపోతే అభివృద్ధి ఫలాలు అందవంటూ దళితులను సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ కార్యక్రమాలకు రాని వారికి అభివృద్ధి పథకాలను అందకుండా చేయటం ద్వారా వారిని భయపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ.. దళితుల సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని విస్మరిస్తున్నాయని పనబాక లక్ష్మి అన్నారు. -
భవిష్యత్ కోసం హోదా అవసరం
మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నెల్లూరు, సిటీ : భవిష్యత్ తరాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు పనబాక లక్ష్మి అన్నారు. నెల్లూరులోని టీకేడబ్ల్యూ కళాశాలలో గురువారం ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలపై ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ఒక్కటే చేయలేదన్నారు. అప్పుడు అన్నీ పార్టీలతో చర్చించి వారి అంగీకారంతోనే చేసినట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు అమలుకాలేదన్నారు.ఽ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీవీ శేషారెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచలబాబుయాదవ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు కేశవనారాయణ, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షులు మల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం
–కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి విమర్శ తాళ్లపూడి: ప్రత్యేక హోదాపై ద్రోహం, హమీల అమలులో వంచన, పాలనలో అన్నింటా వైఫల్యాలు ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన సాగించిన తీరని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి పనబాక లక్ష్మి విమర్శించారు. మండలంలోని పెద్దేవంలో బుధవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీలు ఇచ్చిన లేఖలు, టీడీపీ, బీజేపీ రెండేళ్ల పాలన లోపాలను తెలుపుతూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 15 ఏళ్లు హోదా ఇవ్వాలని తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు డిమాండ్ చేశారని, వీరంతా ప్రసుత్తం ప్రజలను మోసం చేశారన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రజాబ్యాలెట్లో 99 శాతం మంది ప్రత్యేక హోదా కావాలన్నారని, 97 శాతం మంది ఎన్నికల హమీలను ప్రభుత్వం అమలు చేయడంలేదని తీర్పు ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగాభవానీ, డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీఉల్లాబేగ్ మాట్లాడుతూ పింఛన్లు, ఇళ్లు, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు జన్మభూమి కమిటీలు చెప్పిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాకలపాటి సుభద్ర, పీసీసీ కార్యదర్శులు గెడ్డం సాయిబాబా, జ్యేష్ట సతీష్, తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు మండలాల అధ్యక్షులు పోసిన రాజారావు, వెంపాటి సూర్యారావు, గండ్రోతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హోదాపై మాటమార్చిన నేతలు అచ్చన్నపాలెం (నల్లజర్ల): ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్‌జైట్లీ మాట మార్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ పనబాక లక్ష్మి అన్నారు. గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం అచ్చన్నపాలెంలో కన్వీనర్ ఖండవల్లి కష్ణవేణి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు లేఖలు అనుకూలంగా ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సరికాదన్నారు. కంబాల గంగాభవానీ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్ జహభేగం, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
'ప్రత్యేక హోదాపై స్పష్టత లేదు'
బాపట్ల : ఏపీకి ప్రత్యే హోదాపై సీఎం చంద్రబాబు నాయుడుకు స్పష్టత లేదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఆమె శనివారం ఉదయం గుంటూరు జిల్లా బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. -
పీహెచ్డీ అందుకోనున్న పనబాక, వట్టి
విశాఖ : ఈనెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం జరగనుంది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోడీ శాస్త్రీయ సలహాదారు, ఆచార్య రాఘవన్ హాజరు కానున్నారు.ఆయనను గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయనుంది. కాగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వట్టి వసంత్ కుమార్, ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ శ్రీనరేష్, జివిఎమ్‌సి చీఫ్ ఇంజినీర్ జయరాంరెడ్డి తదితరులు పీహెచ్డీ అందుకోనున్నారు. -
వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం ఈ నెల 29న జరగనుంది. చాన్సలర్ హోదాలో హాజరుకానున్నగవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్య అతిధిగా కేంద్ర శాస్త్రసాంకేతిక సలహాదారు ఎస్వీ రాఘవన్ పాల్గొననున్నారు. ఈ ఏడాది డాక్టరేట్స్ అందుకోనున్నవారిలో మాజీ కాంగ్రెస్ మంత్రులు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మీ ఉన్నారు. ఎస్వీ రాఘవన్‌ను డాక్టర్ ఆఫ్ సైన్స్‌తో ఏయూ సత్కరించనుంది. -
వీర విధేయులకు...దక్కలేదు
నిన్న మొన్నటి వరకు వాళ్లిద్దరూ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు. తమ సహచరులు చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్ అయినా.. వారు మాత్రం కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. అయినా అలాంటి వీర విధేయులకు కూడా ఆ పార్టీ మొండిచేయి చూపింది. సిట్టింగులైనా సరే.. టిక్కెట్ ఇవ్వకుండా దాదాపు నెట్టేసినంత పని చేసింది. దీంతో ఇద్దరూ తీవ్ర అవమాన భారంతో ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరు ? ఎక్కడి వారు ? ఏమా కథ.... ఒకరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి కాగా.. మరొకరు తాజా మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇద్దరూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. పార్టీ కోసమే పని చేస్తూ వచ్చారు. కానీ.. ఏరు దాటాక బోడ మల్లన్న.. అయిన్నట్టు మారింది వీరిద్దరి పరిస్థితి. పార్టీనే నమ్ముకుని.. ఎంతో కాలంగా పని చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు నేతలకు రిక్త హస్తం చూపించింది. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి అస్సలు బాగా లేకపోయినా.. ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినా ఆ మాట పార్టీ అధిష్టానానికి చెప్పినా టికెట్లు మాత్రం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గాదె వెంకటరెడ్డి.. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి మూడు సార్లు, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఆయనకు టికెట్ నిరాకరించింది పార్టీ. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పాపానికి ఆ పార్టీ గాదెపై అలా వేటు వేసింది. ఇదే కాకుండా మరో కారణం కూడా వినిపిస్తోంది. తన వియ్యంకుడైన కడప జిల్లా నేత డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి టీడీపీలోకి వెళ్లాలని గాదె కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అటు వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటంతో ఇక సైకిల్ ఎక్కటం లాంఛనమని అంతా భావించారు. దీంతో ఎటూ పార్టీ వీడే మనిషే కదా..? అని కాంగ్రెస్ అధిష్టానం గాదె గురించి పట్టించుకోవటం మానేసింది. అయితే పచ్చ పార్టీతో డీల్ కుదరక పోవటంతో గాదె సైలెంట్ అయ్యారు. బాపట్ల నుంచి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ మాత్రం ఈ పెద్దాయనను పట్టించుకోలేదు. టికెట్ కాస్తా చేజారింది. ఇక తాడికొండ నుంచి గెలవటమే కాదు.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు కూడా ఆశాభంగమే కలిగింది. ఈ తాజా మాజీ మంత్రికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. డొక్కాకు రాజకీయ గురువైన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌ను వదిలి సైకిల్ ఎక్కారు. ఇప్పుడాయన నరసరావుపేట నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు. అయితే రాయపాటి తనతోపాటు తన శిష్యుడు డొక్కా కూడా పచ్చపార్టీలో చేరుతాడంటూ మొదట్లో చెప్పుకొచ్చారు. కానీ డొక్కా మాత్రం తాను కాంగ్రెస్ ను వీడేదిలేదంటూ భీష్మించుక్కూర్చున్నారు. ఆయన గారి విధేయత చూసిన కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ సహ కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది. అలాంటి పెద్ద పదవి పొందిన డొక్కాకు ఎమ్మెల్యే టికెట్ చాలా ఈజీ అనుకున్నారంతా. అదే సమయంలో సొంత నియోజకవర్గమైన తాడికొండ నుంచి కాకుండా వేమూరు నుంచి పోటీ చేయాలని డొక్కా ఆశించారు. అయితే చాప కింద నీరులా కేంద్ర మంత్రి పనబాక ప్రవేశించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు వేమూరు టికెట్ దక్కకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వకపోవడం ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాంగ్రెస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రం.. ఇది కామన్ అంటున్నారు. -
బాపట్ల కాంగ్రెస్ లో టు-లెట్ బోర్డు!
* బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ *అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం ఎదురుచూపు *సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లోకి జంప్ *మండలాల వారీగా ప్రధాన నాయకులదీ తలోదారి *చేసేది లేక నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీల నియామకం * అధికార పార్టీకి పెద్దదిక్కుగా మిగిలిన కేంద్ర మంత్రి పనబాక చీమకుర్తి : బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా మిగిలింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నట్లు సీబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ప్రకటించడంతో సీమాంధ్రలో ఆ పార్టీ ఖాళీ అయింది. ఏతా వాతా ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు వైఎస్సార్ సీపీలోకి, ఒకరిద్దరు నాయకులు టీడీపీలోకి వెళ్లారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ముందు టు-లెట్ బోర్డు వేలాడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేవారు ఎవరైనా ఉన్నారా.. అని బాపట్ల ఎంపీ, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పనబాక లక్ష్మి భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లా బాపట్ల, రేపల్లె, వేమూరు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీరాల, పర్చూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గాదె వెంకటరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బీఎన్ విజయ్‌కుమార్, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. గాదె వెంకటరెడ్డి పార్టీ నుంచి రేపోమాపో బయటకు వెళ్లనున్నారు. మోపిదేవి వెంకటరమణ, గొట్టిపాటి రవికుమార్‌లు గతంలోనే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరగా బీఎన్ విజయ్‌కుమార్ మంగళవారం టీడీపీలో చేరారు. దగ్గుబాటి ఏకంగా రాజకీయాల నుంచే విరమించుకున్నట్లు ప్రకటించారు. ఆమంచి చూపులు టీడీపీ, వైఎస్సార్సీపీ వైపు ఉన్నాయి. మొత్తం మీద బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరిదారి వారు చూసుకోవడంతో పనబాక ఒంటరై పార్టీని ఎలా కాపాడుకోవాలబ్బా.. అని ఆలోచిస్తున్నారు. కార్యకర్తలూ ఇతర పార్టీల్లోకి .. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై పనబాక దృష్టి కేంద్రీకరించి ఇటీవల చీమకుర్తికి వరుసగా రెండుమూడు సార్లు వచ్చి ఉన్న కొద్దిమందితో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పట్లో కేంద్రమంత్రి పనబాక.. చీమకుర్తి వచ్చారంటే నేరుగా బూచేపల్లి నివాసంలోకి వెళ్లి కార్యకర్తలతో సమావేశమయ్యేవారు. బూచేపల్లి కుటుంబం వైఎస్సార్ సీపీలోకి వెళ్లడంతో కొంతకాలం ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి నివాసమే కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించే వారు. ప్రస్తుతం ఆయన కూడా వైఎస్సార్ సీపీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చేసేది లేక పనబాక తన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. బాపట్లకు కె.నారాయణరెడ్డి, రేపల్లెకు మోపిదేవి శ్రీనివాసరావు, వేమూరుకు నత్తల భరత్, సంతనూతలపాడుకు వేమా శ్రీనివాసరావు, అద్దంకికి జి.శ్రీలక్ష్మి, చీరాలకు ఎం.నిశాంత్, పర్చూరుకు నుసుం కృష్ణారెడ్డిలను ఏపీసీసీ అనుమతితో ఇన్చార్జిలుగా నియమించుకున్నారు. వారి ద్వారా పార్టీని ముందకు తీసుకెళ్లేందుకు పనబాక నానాతంటాలు పడుతున్నారు. -
రక్షమాం.. పాహిమాం
ఏలూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు పూనుకుని కష్టాల్లో మునిగిపోరుున కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే ఆదుకోవాలని కేంద్ర మంత్రి, పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కొణిదల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా బస్సుయూత్ర చేపట్టిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి ఆదివారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. స్థానిక మర్చంట్ చాంబర్ కల్యాణ మండపం వద్ద చిరంజీవికి, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రఘువీరారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో సభ వెలవెలబోరుుంది. అతికొద్ది మంది కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు హాజరుకాగా, వారితోనే సభ నడిపించారు. చిరంజీవి అభిమానులు ‘సీఎం చిరంజీవి, జై చిరంజీవా’ అంటూ నినాదాలు చేయడంతో అలా అనొద్దని చిరంజీవి సైగలతో వారిని వారించారు. ఈ నినాదాల మధ్య సభను నడ పలేక మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా మీకిది మర్యాద కాదంటూ చిరంజీవి అభిమానులను హెచ్చరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, ఉంగుటూరు నుంచి వసంత్‌కుమార్ పోటీ చేయాలని పలువురు కేకలు వేశారు. కాంగ్రెస్‌కు శీల పరీక్ష కేంద్ర మంత్రులు చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన పాపం కాంగ్రెస్‌ది కాదని చెప్పుకొచ్చారు. దీనికి టీడీపీ సహా పలు పార్టీలు మద్దతు పలకడం వల్లే సీడబ్ల్యుసీ తీర్మానం చేసిందన్నారు. విభజన భాధాకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శీఘ్రంగా కోలుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. పాతనీరు పోతే పోయిందని.. కొత్త వారికి అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహించడం.. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అందులో చేరిపోవడం వారి అనైతికతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సమైక్య చాంపియన్ అయిపోదామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోయూక కొత్తపార్టీ పెట్టి నవ్వుల పాలయ్యూరని రఘువీరా నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ద్వారా పార్టీల కుతంత్రాలను ప్రజలకు వివరిస్తున్నామని, రథయూత్ర తరహాలో సాగుతున్న దీని చక్రాల కింద ఇతర పార్టీలు నలిగిపోరుు నాశనం అవుతాయని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ శీల పరీక్ష ఎదుర్కొంటోందని, ఈ గండం నుంచి పార్టీని గట్టెక్కించి నవ్యాంధ్రప్రదేశ్ కోసం అందరూ పనిచేయాలని కోరారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సీమాంధ్రను దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, కొండ్రు మురళి, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయూలని కోరారు. ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గ, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఆర్‌కే చౌదరి, పీసీీసీ ప్రధాన కార్యదర్శి రాజనాల రామ్మోహన్రావు, అలగా రవికుమార్, బీవీ రాఘవయ్య చౌదరి, బద్దా ఆనంద్‌కుమార్, కమ్ముల కృష్ణ, చిట్టిబొమ్మ వెంకటస్వామి పాల్గొన్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులకు వీడ్కోలు పలికిన చిరంజీవి బస్సుయాత్ర విజయవాడకు బయల్దేరింది. -
‘తుస్సు’మన్న బస్సుయాత్ర
కాకినాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ‘మామిడి పండు తిన్న నోటితోనే మేడిపండును చవి చూడాల్సి వచ్చినట్టు’ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పీసీసీ కొత్త సారథి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి తలపెట్టిన బస్సుయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పేలవంగా సాగింది. తునిలో ప్రారంభమై అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురంల మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్న యాత్రకు ఆశించిన స్పందన కానరాక పోగా పిఠాపురంలో చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తునిలో పార్టీ శ్రేణులు స్వాగత సన్నాహాలు చేసినా అక్కడి నుంచి జరిగిన పర్యటనలో ప్రజా స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. ముఖ్యంగా పిఠాపురం వద్ద కె.బాబ్జి అనే ఓ కార్యకర్త ‘ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి నట్టేట ముంచేశావు’ అంటూ బస్సుయాత్ర వద్ద ఒకప్పటి పీఆర్పీ కరపత్రాలను నేలకేసి కొట్టి నిరసన తెలియజేశాడు. చిరు అభిమానుల సందడే.. కాకినాడ సూర్యకళామందిరంలో జరిగిన డీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చిరంజీవి అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారే తప్ప నిజమైన పారీశ్రేణులు లేక సభ వెలవెలపోయింది. రఘువీరా, చిరంజీవిలతో పాటు కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, వంగా గీత మాత్రమే హాజరయ్యారు. రఘువీరా తొలిసారిగా హాజరైన డీసీసీ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్, ఎన్.శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పాముల రాజేశ్వరీదేవి రాలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ మాత్రం హాజరయ్యారు. విభజనకు కారణమైన పార్టీలు కాంగ్రెస్‌ను నిందిస్తున్న తీరుపై ప్రతి కార్యకర్తా మరో ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి.. అలా ప్రచారం చేయాలంటూ చిరంజీవి తాను నటించిన ఁస్టాలిన్* సినిమాలోని చైన్‌లింక్ విధానాన్ని ఊదరగొట్టారు. కిరణ్ సమైక్య చాంపియన్ కావాలని చేసిన రాజకీయంలో ఆయన హీరోగా, తాము జీరోలుగా ప్రజల్లో చులకన కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా చివరి బంతి మిగిలే ఉందంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందన్నారు. కిరణ్ నిర్వాకమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబుది అధికార దాహం.. ఒక ఓటు, రెండు రాష్ట్రాల నినాదంతో 18 ఏళ్ల క్రితం కాకినాడ సమావేశంలో రాష్ట్ర విభజనకు బీజం వేసిన మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహం తేటతెల్లమవుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సారథి, కేంద్రమంత్రి చిరంజీవి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక సూర్యకళామందిరంలో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అనేక పార్టీలు విభజనను కోరుకున్నాక కాంగ్రెస్ చివరిపార్టీగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ శ్రేణులు స్తబ్దతను వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ ప్రజారంజక పాలన కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కేంద్రమంత్రి కృపారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలకు కృషి చేసింది కాంగ్రెసేనన్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత, పంతం గాంధీమోహన్, ఎమ్మెల్సీలు రత్నాబాయి, లక్ష్మీశివకుమారి, మండలిలో విప్ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కొండ్రు మురళి, నాయకులు బుచ్చి మహేశ్వరరావు, కొప్పన మోహనరావు, పి.వి.రాఘవులు, పంతం నానాజీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఫణీశ్వరరావు పాల్గొన్నారు. -
'పురందేశ్వరి వెళ్లినంతమాత్రాన నష్టం లేదు'
గుంటూరు: కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన పురందేశ్వరిపై కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని ఆమె సోమవారమిక్కడ అన్నారు. పురందేశ్వరి బీజేపీలోకి వెళితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందేమోనని పనబాక వ్యంగ్యంగా విమర్శలు చేశారు. పురేందశ్వరి ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. -
'విభజన సమయంలో అయితే కేంద్రం గుర్తించేది'
గుంటూరు: బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం 2 వేల ఎకరాల స్థలాన్ని గుర్తించాలని వ్యవసాయ కళాశాలకు కేంద్రం లేఖ రాసినట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. పనిలో పనిగా ఆమె మరోసారి సొంతపార్టీ నేతలకు చురకలు అంటించారు. కాంగ్రెస్‌ను వీడేవారు విభజన సమయంలో వీడి ఉంటే కేంద్రం గుర్తించేది అని పనబాక అన్నారు. ముగ్గురు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (ఎన్ఐడీ) సంస్థను విజయవాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీమాంధ్రలోని విజయవాడలో ఎన్ఐడీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం మొత్తం రూ. 434 కోట్లు మంజూరు చేసింది. అంటే.. విజయవాడలో దాదాపు రూ. 108 కోట్ల వ్యయంతో ఎన్ఐడీని ఏర్పాటు చేయనున్నారు. -
మొహం తిప్పేశారు
కిరణ్‌కుమార్ సమావేశానికి జిల్లా నేతలు డుమ్మా బాపట్ల ఎమ్మెల్యే గాదె ఒక్కరే హాజరు పదవులు పొందిన నేతలు సైతం దూరం కొత్త పార్టీ వైపు ఇతర పార్టీల్లోని అసమ్మతి నాయకుల చూపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాజధానిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా నుంచి మాజీ మంత్రి, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి గాదె మినహా ఎవరూ హాజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు జిల్లాకు చెందిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య భూమిక వహించారు. వీరిలో ఎక్కువ మంది కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుచరులు, సన్నిహితులుగా మెలిగారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత వారంతా పక్కకు తప్పుకున్నారు. ఎంపీలు, మంత్రులతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒక్కరే హాజరయ్యారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మీ, జెడి శీలంలు అధిష్టానంకు దగ్గరగా ఉంటూ సీఎంకు దూరంగా మెలిగారు.తాజాగా, ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం మినహా కొత్త పార్టీ పెట్టలేరని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎద్దేవా చేశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరించగా, కాసు కృష్ణారెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ, అధిష్టానానికి వ్యతిరేకంగా లేరు. ఇక ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గాలకు అధికంగా నిధులు తెచ్చుకోవడమే కాకుండా వ్యక్తిగత పనులు చేయించుకుని లబ్ధిపొందారు. వారంతా సోమవారం నాటి సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే సమావేశానికి హాజరైనప్పటికీ గాదె వెంకటరెడ్డి కూడా కిరణ్‌కుమార్‌రెడ్డిని పూర్తిగా అనుసరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెడితే ఎలా ఉంటుంది..పెట్టకపోతే ఎలా ఉంటుంది అనే అంశాలపై చర్చ జరిగిందని గాదె ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. ప్రజలు, కార్యకర్తల సహకారంతో గెలిచిన తాను వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా, వారి అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోబోనని స్పష్టం చేశారు. ఈ నెల 26న ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నానని, ఆ తరువాతే తన నిర్ణయం ఉంటుందని గాదె చెప్పారు. ఇదిలావుంటే, నామినేటెడ్ పదవులు పొందిన మరి కొందరు నేతలు కూడా సీఎం కొత్త పార్టీకి దూరంగా ఉంటున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో ఉడా చైర్మన్ పదవి పొందిన వణుకూరి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించడం లేదు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ పదవిలో కొనసాగాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతల ఆశలు కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీపై ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లో సీటు రాని నేతలు ఈ పార్టీలో సీటు పొంది పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
'విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన'
గుంటూరు : రాష్ట్ర విభజన అంకం ముగిసిన నేపథ్యంలో తాజాగా సీమాంధ్రకు కొత్త రాజధాని ఎక్కడనే దానిపై ఇప్పుడు ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి మంగళగిరిలోని నాగార్జున యూనివర్శిటీ ప్రాంతాన్ని ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కేంద్రం గోప్యంగా ఉంచుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. తాజాగా పనబాక వ్యాఖ్యలతో నాగార్జున వర్శిటీ ప్రాంతంలోనే కొత్త రాజధాని ఏర్పాటు అయ్యే సూచనలకు బలం చేకూర్చుతున్నాయి. మరోవైపు నాగార్జున వర్సిటీని ఒంగోలు పీజీ సెంటర్‌కు తరలించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పల్నాడులో ఇప్పటికే ఏపీఎస్పీ బెటాలియన్‌ను కేంద్రం తరలించింది. మరోవైపు కర్నూలును రాజధాని చేయాలని సీమ నేతలు, ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
'విభజన జరిగినా కాంగ్రెస్‌లోనే ఉంటా..'
గుంటూరు : పార్లమెంట్లో ఎంపీల మధ్య జరిగిన సంఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. సభలో తెలంగాణ బిల్లు పెడుతున్న సమయంలో తాను కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే వెనకనే ఉన్నానని...అది అందరికి తెలిసే జరిగిందన్నారు. గుంటూరు జిల్లా పరుచూరులో కమ్యూనిటీ కార్యాలయాన్ని కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పనబాక మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని... బాపట్ల నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలనే యోచన ఉన్నట్లు ఆమె అన్నారు. ఇక వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానం తొలగించేందుకు త్వరలోనే జీవో జారీ చేస్తామని పనబాక తెలిపారు. -
పనబాకపై భగ్గు..భగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రమంత్రి పనబాక లక్ష్మిపై జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా..సమైక్యాంధ్రకు కూడా మద్దతు ఇవ్వలేకపోయిన ఆమె వైఖరిపై భగ్గుమంటున్నారు. జిల్లాలోని చీరాల, అద్దంకి, పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు శాసనసభా నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఆమె చేపట్టకపోవడాన్ని జనం దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె నియోజకవర్గాల్లో పర్యటించకపోయినా.. ఇక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. జౌళి శాఖా మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజున, చీరాలలోని నేత కార్మికులు తమకు మంచి రోజులు వచ్చాయని భావించారు. అయితే చీరాల ప్రజలను పనబాక కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల సమీపంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012 బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనిపై పలుసార్లు ఇక్కడి చేనేత కార్మికులు పనబాకను కోరగా..రెండేళ్ల తరువాత శుక్రవారం (ఈనెల 14) శంకుస్థాపన చేసేందుకు అంగీకరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అది కూడా రాష్ట్ర విభజన హోరులో కొట్టుకుపోయింది. టెక్స్టైల్ పార్కును రూ. 70 కోట్లతో ఏర్పాటు చేయదలచుకుని, దానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించినా..పనబాక లక్ష్మి అలసత్వం వల్ల కార్యరూపం దాల్చలేకపోయింది. కనీసం భూసేకరణ కూడా చేయలేదు. టెక్స్టైల్ పార్కు వల్ల కొత్తగా ఉపాధి లభించకపోయినా..జౌళి రంగంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం లభించి ఉండేదని అంటున్నారు. గతంలో జౌళి పరిశ్రమకు పుట్టినిల్లుగా ఉన్న చీరాలలోని ఈ వృత్తివారు ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నారు. చీరాలలో ప్రస్తుతం వంద మంది కూడా జౌళి ఉత్పత్తిదారులు లేకపోవడానికి ప్రభుత్వ చిన్నచూపే కారణమని నిపుణులంటున్నారు. విభజనకు అనుకూలతపై భగ్గుమంటున్న జనం... ఇదిలా ఉండగా సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో పాఠశాల విద్యార్థులు కూడా సమైక్యాంధ్ర కోసం రోడ్డు మీదకు వస్తుంటే, జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విభజనకు అనుకూలత తెలియజేయడంపై తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలోకి వస్తే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాదని భావిస్తున్న పనబాక, ఉన్నంత వరకు అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఆమె స్వంత ప్రయోజనం చూసుకోవడం తప్ప, జిల్లాకు ఒరిగిందేమీలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అవసరమైతే సోనియా గాంధీ ఆశీస్సులతో రాజ్యసభలో సభ్యత్వం సంపాదించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. పనబాక నియోజకవర్గంలోకి అడుగు పెడితే కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఆమెను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
పనబాక ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు
-
పనబాక దర్శన భాగ్యం కష్టమే!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశ రాజధాని నగరంలో ఉద్యమిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులకు కేంద్ర మంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి దర్శన భాగ్యం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కేంద్ర మంత్రిని కలవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. తమకు మద్దతు చెబుతారేమోనన్న ఆశతో ఏపీఎన్జీవో నాయకులు కొందరు ఢిల్లీలోని పనబాక లక్ష్మి నివాసానికి బుధవారం నాడు వెళ్లారు. కానీ, కలిసేందుకు మంత్రిగారి నుంచి ముందస్తు అనుమతి మీకు లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపేశారు. ఒక్కసారి కలిసి మాట్లాడి వెళ్లిపోతామని చెప్పినా ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని ఏపీఎన్జీవో నాయకులు సమైక్య నినాదాలు చేసుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
బీజేపీలో చేరేది లేదు
తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు విచ్చేసిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను తుది శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు తనకు సహకరించడం లేదని పనబాక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తనకు రాజ్యసభ సీటు కేటాయిస్తే కాదనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ బీజేపీలో చేరతారని ఊహగానాలు ఊపందుకున్నాయి. దాంతో గుంటూరు విచ్చేసిన పనబాకను ఆ అంశంపై ప్రశ్నించారు. దీంతో పనబాక లక్ష్మిపై విధంగా స్పందించారు. -
ఇక ఆనం ఒంటరే !
నెల్లూరు : అధికార పార్టీ నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. ఆనం సోదరుల వైఖరితో విభేదించి కొందరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పుట్టిమునిగి కాంగ్రెస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని చూసి మరికొందరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీకి ప్రస్తుత మున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. మునిగేనావలో తాము ఎందుకనుకుంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వలసబాట పట్టారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీకి, ఆనం సోదరులకు గుడ్‌బై చెప్పి బయటకెళ్లిపోగా, మిగిలిన వారు ముహుర్తాలు, అవకాశాలు చూసుకుంటూ తట్టాబుట్టా సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ మొదట వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపినప్పటికీ, అక్కడ బెర్తులు దక్కవని భావించి టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొందరు సీఎం కొత్తపార్టీ పెడతాడనే ఆశలో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ జిల్లాలో ఆనం సోదరుల హవాకు గండికొడుతున్నాయి. గ్రూప్ రాజకీయాలకు పేరుగాంచిన ఆనం సోదరులు ఒంటరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై , పార్టీ విలీనంలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడిగా మారిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఆనం సోదరులకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటి నుంచి టీడీపీ నేతే అయిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీలో చేరారు. ఆనం సోదరుల మద్దతుతో చివరి నిమిషంలో విజయం సాధించారు. అప్పటి నుంచి వారికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే ఉంటే నష్టం తప్పదని భావించిన ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ముంగమూరు కోరిన సిటీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చే అవకాశం లేకపోవడంతో చివరకు టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కిరణ్ సొంతపార్టీ పెడితే అటువైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అయితే నెలాఖరులో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఇటీవల ఆదాల హాజరవుతున్న అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణులు పాల్గొంటుండటం అందుకు బలం చేకూరుస్తోంది. మొదట టీడీపీలోనే ఉన్న ఆదాల సోమిరెడ్డిని విభేదించి 2004లో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆనం సోదరులతో సత్సంబంధాలు కొనసాగించినా తర్వాత విభేదాలు పొడచూపాయి. సహకార ఎన్నికల్లో అవి ముదిరిపాకాన పడ్డాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడు. మొదట వైఎస్సార్సీపీలో చేరే ప్రయత్నం చేసిన ఆయన సర్వేపల్లి లేనిపక్షంలో నెల్లూరు రూరల్ నుంచి అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఇవి రెండు దక్కే పరిస్థితి లేకపోవడంతో చివరకు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా అదే దారిలో ఉన్నారు. గతంలో టీడీపీ నేతే అయిన పోలంరెడ్డి కాంగ్రెస్‌ను వీడి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు. కోవూరు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోటీ చేసిన ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆనం సోదరులు చేయివ్వడంతోనే తనకు ఘోర పరాజయం ఎదురైందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కావలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి సైతం ఆనం సోదరుల వైఖరిని పూర్తిస్థాయిలో విభేదిస్తున్నారు. కేవలం సీఎం కిరణ్‌తోనే ఉన్న సాన్నిహిత్యంతోనే ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఓ వైపు ఆనం సోదరులతో విభేదాలు, మరోవైపు సీమాంధ్రలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు విష్ణును వైఎస్సార్సీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. దీని వెనుక ఆనం సోదరుల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది. మనస్థాపానికి గురైన వాకాటి నారాయణరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సీఎం పార్టీ పెడితే జిల్లా అధ్యక్షుడిగా వాకాటి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మంత్రి ఆనం అండదండలతో కాంగ్రెస్ చేరిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సైతం ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో కొనసాగితే భవిష్యత్తు ఉండదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సైతం ఆనం సోదరులను విభేదిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పనబాక కృష్ణయ్య విజయానికి అక్కడి ఆనం వర్గీయులు అడ్డుపడినట్లు ప్రచారం ఉంది. -
ఏడాదికి ఆరు సిలిండర్లు చాలు: పనబాక లక్ష్మి
బాపట్ల, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కేంద్ర పెట్రోలియంశాఖ చేయించిన సర్వేలో వినియోగదారులు ఏడాదికి 6.5 సిలిండర్లు మాత్రమే వాడుతున్నట్లు తేలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. మిగిలిన సిలిండర్లను శుభకార్యాలకు, వంటశాలలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల కొందరు వినియోగదారులు, డీలర్లు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో వేయటం వలన సిలిండర్ల బుకింగ్ తగ్గిపోయి బుక్‌చేసిన వెంటనే గ్యాస్ అందుతోందన్నారు. ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మించి ఇవ్వటం అనవసరమన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు డీలర్లు అక్రమ మార్గాలు వెతుకుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు నమోదు జరిగితే అవకతవకలు ఉండవ న్నారు. గ్యాస్ సరఫరాలో ఆధార్ కార్డు లింకేజీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్డులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టవచ్చా..? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఆయన సమైక్యావాది అని, అయినా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ విషయం తనకు తెలియదన్నారు. -
సీఎం రాజీనామా వార్తలు రూమర్లే: పనబాక లక్ష్మి
కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీడుతున్నారంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఖండించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కొత్త పార్టీని పెడుతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పనబాక లక్ష్మి అన్నారు. సీఎం కిరణ్ తండ్రి, తాతలు కాంగ్రెస్ పార్టీకి నిబద్దులైన నేతలని ఆమె వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని బాపట్లలో మీడియాతో ముచ్చటిస్తూ.. జనవరి 23 తర్వాత రాజీనామా సమర్పిస్తారని వస్తున్న వార్తలు రూమర్లు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షంచుకోవాలని సీఎం కేంద్రానికి విజ్క్షప్తి చేసిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రం కోసం తాను పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్దమే అని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు:పనబాక
బాపట్ల(గుంటూరు): కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఏడాదికి రాయితీ సిలెండర్లను ఆరు నుంచి తొమ్మిది పెంచిన సంగతి తెలిసిందే. ఆ తొమ్మిది నుంచి మరో మూడు సిలెండర్లు పెంచాలని కూడా కేంద్రం యత్నాలు చేస్తున్న నేపథ్యంలో పనబాక మాత్రం విడ్డూరంగా మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజక వర్గం బాపట్ల కు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబానికి ఆరు సిలెండర్లు కేంద్రం అందిస్తే చాలని పేర్కొన్నారు. ఆ విషయాన్ని సర్వే నే తెలిపిందంటూ వ్యాఖ్యానించారు. ఎక్కువగా సిలెండర్లు ఇస్తే దారిద్ర్యానికి దిగువన ఉన్న(బీపీఎల్)కుటుంబాలు అమ్మేసుకుంటున్నాయంటూ నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై నిరసన గళం పెళ్లుబికింది. తొమ్మిది సిలెండర్లతో ఎలా నెట్టుకు రావాలని సామాన్య ప్రజలు తర్జన భర్జన పడుతుంటే..ఆమె ఇలా మాట్లాడటం మంచిది కాదని ఆందోళన కారులు హెచ్చరించారు. -
''ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు''
-
'బాబు నీ రాజకీయ చరిత్ర కాంగ్రెస్‌తోనే మొదలైంది'
-
'బాబు నీ రాజకీయ చరిత్ర కాంగ్రెస్‌తోనే మొదలైంది'
ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని అనకొండ అనటంపై ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు తన రాజకీయ చరిత్ర కాంగ్రెస్‌తోనే మొదలు అయ్యిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పనబాక లక్ష్మి అన్నారు. మొదట రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి....ఇప్పుడు సమన్యాయం అనటం బాబుకు తగదని ఆమె విమర్శించారు. పనిలో పనిగా పనబాక సొంతపార్టీ ఎమ్మెల్యేలకు చురకలు వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలక్లోకి తీసుకువెళ్లటంలో ఎమ్మెల్యేలు విఫలం అయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లటం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటం లాంటిదేనని పనబాక అన్నారు. -
పదవులు అనుభవిస్తూ... విమర్శలా?
సీఎం, ఎంపీలపై పనబాక విమర్శలు సాక్షి, ఒంగోలు: ‘‘కాంగ్రెస్ పార్టీపరంగా ప్రభుత్వంలో అన్ని పదవులు చివరివరకు అనుభవించి... స్వలాభం కోసమే పార్టీలో ఇంకా కొనసాగుతూ... చివరి నిముషంలో పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్న మా పార్టీ నేతలే అసలైన దొంగలు’’అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి విమర్శించారు. ఆమె శనివారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని జలగల్లా పట్టుకుని వేళ్లాడుతున్నారని ఆమె వారిని దుయ్యబట్టారు. తాను మొదటినుంచి చెప్తున్నట్లుగానే వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినా పార్టీపరంగా తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విభజన జరిగినా జరగకపోయినా తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. పనబాకకు సమైక్య సెగ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఒంగోలులో శనివారం విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒంగోలు కలెక్టరేట్లో ఆమె సమావేశంలో ఉండగా విద్యార్థి జేఏసీ నేతలు బయట ధర్నా చేశారు. ‘పనబాక లక్ష్మి సమైక్యాంధ్ర ద్రోహి’అని నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో పోలీసులు విద్యార్థి జేఏసీ నేతలను అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
'అద్భుతం జరిగితే తప్ప తెలంగాణ బిల్లు ఆగదు'
గుంటూరు: పార్లమెంట్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, తెలంగాణ బిల్లు ఆగదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. ఉదయం ఒంగోలులో మాట్లాడుతూ సొంత పార్టీ ఎంపిలపై ధ్వజమెత్తిన మంత్రి సాయంత్రం గుంటూరులో కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తారు. కేంద్రమంత్రులు ఎవరిదారిలో వారు వెళ్లినందునే తమని అధిష్టానం పట్టించుకోవడంలేదన్నారు. వేరే పార్టీలోకి వెళ్లేందుకు తమ వాళ్లు చాలామంది గోడమీద పిల్లిలా కూర్చుని ఉన్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఉదయం పనబాక లక్ష్మి ఒంగోలులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి రాజీనామాలు చేసేవారే అసలు దొంగలని విమర్శించారు. స్వలాభం కోసం పార్టీలో కొనసాగుతున్న నేతలు బయటకు వెళితేనే పార్టీ బాగుపడుతుందన్నారు. -
ఒంగోలులో పనబాక లక్ష్మీకి సమైక్య సెగ
-
సొంతపార్టీ ఎంపీలపై పనబాక లక్ష్మి ధ్వజం
ఒంగోలు : కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సొంత పార్టీ ఎంపీలపైనే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి రాజీనామాలు చేసేవారే అసలు దొంగలు అని ఆమె విమర్శించారు. స్వలాభం కోసం పార్టీలో కొనసాగుతున్న నేతలు బయటకు వెళితేనే పార్టీ బాగుపడుతుందని పనబాక లక్ష్మి వ్యాఖ్యానించారు. శనివారం ఆమె ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ పనబాక లక్ష్మి ఎదుట సమైక్య నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలు
-
అంతా మా ఇష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారు.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పనికానిచ్చేద్దామని అనుకుంటున్నారు.. ఎన్నికల కోసం అనుకూల అధికారులు కావాలనుకుంటున్నారు.. వెరసి... జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్ను తహశీల్దార్లపై పడింది. అధికార పార్టీ నేతలు కోరడం చాలు.. అన్నీ చేసిపెట్టే ఉన్నతాధికారి ఎలాగూ ఉన్నారు. ఇంకేముందీ.. జిల్లాలో తహశీల్దార్ల బదిలీల జాతర మొదలైంది. ఆ తీరు ఇదిగో ఇలా ఉంది. ప్రజాప్రతినిధులు తాన.. ఉన్నతాధికారి తందాన... కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభీష్టానికి అనుగుణంగా తహశీల్దార్ల బదిలీల ప్రహసం మొదలైంది. అధికారులను ఎంపిక చేసుకుని మరీ వారినే నియమించాలని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. చెప్పింది తు.చ. తప్పకుండా పాటించే అధికారులనే ఏరికోరి పోస్టింగ్ వేయించుకుంటున్నారు. నిబంధనల మేరకు పనిచేస్తామనే అధికారులపై బదిలీ వేటు వేయిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారి తీరు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంది. జిల్లాలో కొనసాగడంపై పట్టుదలగా ఉన్న ఆయన.. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నారు. తాను జిల్లాలో ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మానసిక స్థైర్యం దెబ్బతిన్నా ఫర్వాలేదన్న రీతిలో సదరు ఉన్నతాధికారి వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిందే తడవుగా బదిలీలు చేసేస్తున్నారు. దీంతో తహశీల్దార్ల బదిలీ అంతా రాజకీయ ప్రహసనంగా మారిపోయింది. అదెలాగంటే.. అన్నా! అన్నన్నా..! గిద్దలూరులో ఇష్టారాజ్యం గిద్దలూరు ప్రజాప్రతినిధి తహశీల్దార్ల నియామకం అంతా తన ఇష్టారాజ్యంగా మార్చుకున్నారు. గత రెండు వారాల్లో ఆ నియోజకవర్గంలో ఏకంగా ఆరుగురు తహశీల్దార్లను బదిలీ చేయడం గమనార్హం. పూర్తిగా తనకు అనుకూల అధికారులను నియమించేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రభావితం చేశారు. అసైన్మెంట్ కమిటీలో తన మాట వినలేదనే ఆగ్రహంతో కొమరోలు తహశీల్దార్‌ను ఆయన పట్టుబట్టి మరీ బదిలీ చేయించినట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధికారికి తన నియోజకవర్గంలోని రాచర్లలో పోస్టింగ్ ఇప్పించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా మిగిలిన ఐదుగురిలో నలుగురి బదిలీలు ఆయన అభీష్టం మేరకే జరిగాయి. గతంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారికి ఆయన ఏరికోరి తన నియోకజవర్గంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కొమరోలుకు తాజాగా బదిలీ చేసిన తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి అయిష్టంగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కనిగిరిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దని చెప్పిన ఆయన్ను తన నియోజకవర్గంలో ఎందుకు వేశారని సదరు ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని మార్చి బేస్తవారిపేట తహశీల్దార్కే కొమరోలు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కనిగిరిలో అంతా కిరికిరే! అధికారులపై ‘ఉగ్ర’తాండవం కనిగిరి నియోజకవర్గంలో తహశీల్దార్ల బదిలీల ప్రక్రియ అంతా రాజకీయ కిరికిరిగా మారిపోయింది. నియోజకవర్గంలో ఐదుగురు తహశీల్దార్లను ఈ రెండు వారాల్లో బదిలీ చేయడం గమనార్హం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి హుకుం మేరకు జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించారు. అసైన్మెంట్ భూములు, ప్లాట్ల కేటాయింపు విషయంలో నిబంధనల మేరకు వ్యవహరించినందున వెలిగండ్ల తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి కినుక వహించారు. ఫలితం.. ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇలా నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పామూ రు తహశీల్దార్లను మార్చారు. అంతటితో ఆ ప్రజాప్రతినిధి సరిపుచ్చుకో లేదు. పీసీపల్లి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు కూడా తాను ఇటీవల నియమించుకున్న పొరుగు మండల తహశీల్దార్‌కు అప్పగించాలని పట్టుబడుతున్నారు. అంతా నా ఇష్టం.. అన్న రీతిలో ఆ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. అద్దంకిలో మేడమ్ అనుచరులదే హవా కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అనుచరులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. అందుకు సంతమాగులూరు తహశీల్దార్ బదిలీ తీరే నిదర్శనం. సంతమాగులూరు తహశీల్దార్‌గా ఉన్న నాసరయ్యను మార్చి టి.ప్రశాంతిని నియమించారు. దీనిపై పనబాక లక్ష్మి అనుచరులు భగ్గుమన్నారు. జిల్లా ఉన్నతాధికారిపై చిందులు తొక్కారు. దాంతో రోజుల్లోనే అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంతమాగులూరు తహశీల్దార్ టి.ప్రశాంతిని బదిలీ చేసి అధికార పార్టీ నేతల ఆగ్రహాన్ని చల్లార్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంతటితో సరిపుచ్చుకోలేదు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా రంగప్రవేశం చేశారు. తమ అనుకూల అధికారులను నియమించాలని పట్టుబడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ లక్ష్యాలతో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ నేతల మాటలకు అగ్గిమీదగుగ్గిలం అవుతున్న సీమాంధ్రులు
-
సరైన ప్యాకేజీ ఇస్తే విభజనకు సిద్ధం: పనబాక లక్ష్మీ
సీమాంధ్రను మరో సింగపూర్... బాపట్లను మరో భాగ్యనగరం తీర్చిదిద్దతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ వెల్లడించారు. సొంత నియోకవర్గమైన బాపట్లో పర్యటించేందుకు మంగళవారం ఉదయం ఆమె గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్బంగా పనబాక లక్ష్మీ మాట్లాడుతూ... మంచి ప్యాకేజీ ఇస్తే విభజనకు తాము సిద్ధమన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని పనబాక స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లదని ఆమె భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనపై భారతీయ జనతా పార్టీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె ఆ పార్టీని దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు తాము ఓటు వేస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తనదైన శైలీలో దూసుకుపోతుంది. అయితే రాష్ట్ర విభజనతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని సీమాంధ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని 13 జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్ర వాసులు కేంద్ర మంత్రులు, ఎంపీలు వెంటనే తమ పదవులకు రాజీనామ చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని డిమాండ్ చేశారు. దాంతో కేంద్రమంత్రులు ఎటుపాలు పోని పరిస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్ర విభజన తథ్యమని కేంద్రం స్పష్టం చేయటంతో తమ ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజీలు కావాలని సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఇప్పటికే ప్రధాని, ఆంటోని, దిగ్విజయ్ సింగ్... తదితరులను కలసి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. -
చిరంజీవి, పనబాకలకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్ : కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. భారీ వర్షాలవల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను పరామర్శించేందుకు సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చిరంజీవిని అడుగడుగునా సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిమ్మాపురం, సర్పవరం, కొవ్వాడలలో బాధితులను పరామర్శించే సమయంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నారు. చిరంజీవిని జై సమైక్యాంధ్ర నినాదాలు చేయమని పట్టుబట్టినప్పటికీ నవ్వుతూ వెళ్లిపోయారు. సర్పవరంలో అయితే చిరంజీవి కాన్వాయ్‌ను చుట్టుముట్టి సమైక ్యనినాదాలు చేశారు. కారు నుంచి దిగిన చిరంజీవిని చూసి మరింతగా నినాదాలు చేయడంతో పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే ఆయన్ను అక్కడ నుంచి పంపించివేశారు. ఇక, ప్రకాశం జిల్లాలో స్వయంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే కేంద్రమంత్రి పనబాకలక్ష్మికి వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు హోరెత్తించారు. ముంపు బాధితులను పరామర్శించేందుకు చీరాల సాయికాలనీలో సీఎంతో పాటు ఆమె కూడా వచ్చారు. ఆ సందర్భంలో సీమాంధ్ర ద్రోహి పనబాక డౌన్..డౌన్... అంటూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
విభజనకు అనుకూలంగా ఓటేస్తా: పనబాక
గుంటూరు: వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పునరుద్ఘాటించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేస్తే విభజనకు అనుకూలంగా ఓటేస్తానని ఆమె వెల్లడించారు. భద్రాచలాన్ని సీమాంధ్రకే చెందేలా రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీకి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక విమర్శించారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని ఆమె నిన్న కోరారు. సీమాంధ్రలో పలు సంస్థలు స్థాపించాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేస్తానని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు. -
మరో ఇండోనేసియాగా సీమాంధ్ర
గుడివాడ/బాపట్ల, న్యూస్‌లైన్: తడ నుంచి ఇచ్ఛాపురం వరకు ఎనిమిది లైన్ల రోడ్డు వేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. ఆ రోడ్డు పూర్తయితే సీమాంధ్ర మరో ఇండోనేసియాగా మారుతుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు జిల్లా బాపట్లల్లో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని కోరారు. సీమాంధ్రలో పలు సంస్థలు స్థాపించాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేస్తానని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు. -
రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు:పనబాక
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ఆదివారం స్పష్టం చేశారు.బాపట్ల నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఆమె బాపట్ల చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం లాంటిందని ఆమె అభివర్ణించారు. డబ్బు,అధికారం కోసం ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడిన పార్టీకి కలిగే నష్టం ఏమీ ఉండబోదని పేర్కొన్నారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం కొంచం కూడా ఉండదని పనబాక లక్ష్మీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర పార్టీ మాత్రమే కాదని జాతీయ స్థాయి పార్టీ అని గుర్తుంచుకుంటే మంచిదని ఆమె వ్యాఖ్యానించారు. -
కేంద్రమంత్రులంతా సమావేశం అవుతున్నాం: పనబాక
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి ఏం కావాలో చర్చించేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులందరం త్వరలో సమావేశం కానున్నామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్య, ఉద్యోగ, పరిశ్రమలు, నీటి కేటాయింపులుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఈ అంశాలపై ముఖ్యంగా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన జీవోఎమ్ను ఇంకా తాము కలవలేదని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. -
'రాష్ట్ర విభజన ఆగదు.. నేను విభజనవాదినే'
-
'రాష్ట్ర విభజన ఆగదు.. నేను విభజనవాదినే'
తాను విభజనవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం అన్నారు. రాష్ట్ర విభజన ఆగదని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టే తాను నడుచుకుంటానని తెలిపారు. సీమాంధ్రకు కావాలంటే ప్యాకేజీ ఇస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో తీవ్ర ఉద్రిక్తత, బంద్ కొనసాగుతుండగా అదే ప్రాంతానికి చెందిన మంత్రి విభజనకు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఇదిలావుండగా కేంద్ర మంత్రి పల్లంరాజు మరోసారి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. -
ఇంధన పొదుపుపై ప్రచారం: పనబాక లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆయిల్, గ్యాస్ పొదుపుపై భారీ ప్రచార కార్యక్రమాన్ని గురువారం ఆమె హైదరాబాద్‌లో ప్రారంభించి మాట్లాడారు. ‘ఇంధన పొదుపుపై విద్యార్థులతో ప్రచారం చేస్తాం. దేశంలో ఏటా రూ. 5,33,900 కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను వినియోగిస్తున్నాం. ఇది మొత్తం జీడీపీలో 7% సమానం. 25% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 75% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. దీనిపై 7 వారాలపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి బుధవారం కార్లను వినియోగించరాదని పెట్రోలియంశాఖ ఉద్యోగులంతా నిర్ణయించారు. ఆ రోజు బస్సుల్లో లేదా నడుచుకుంటూ కార్యాలయాలకు వస్తారు’ అని మంత్రి వివరించారు. కార్యక్రమంలో గెయిల్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ హరిప్రసాద్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ అనుసంధానం కాకున్నా వంట గ్యాస్ సబ్సిడీ ఆధార్ అనుసంధానం కాకపోయినా వంటగ్యాస్‌కు సబ్సిడీ వర్తింపజేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పనబాక తెలిపారు. ఆధార్ లేదన్న కారణంతో ప్రజలకు పథకాలను నిలిపివేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు ‘నేను సమైక్య వాదిని. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’ అంటూ నిష్ర్కమించారు. -
సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. రోజురోజుకూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ ఆందోళనలు శుక్రవారంతో 52వ రోజుకు చేరుకున్నాయి. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండో రోజు వరుసగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఒంగోలు నగరంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీఓల ఉద్యమంతో నగరంలోని బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు రెండవ రోజు తలుపులు తెరుచుకోలేదు. అలాగే గురువారం ఒంగోలు వచ్చిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యవహరించిన తీరుకు, సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు పనబాక లక్ష్మి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కింద మంట పెట్టిన పెద్ద పాత్రల్లో కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు 500 అడుగుల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై ఆటలు ఆడి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని, అంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండో రోజూ తెరుచుకోని కార్యాలయాలు, బ్యాంక్‌లు: ఉద్యోగుల ఉద్యమంలో వరుసగా రెండో రోజు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. అద్దంకిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూయించారు. అనంతరం ఆర్టీసీ, ఎన్జీఓ జేఏసీ నాయకులు మూతికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు, మేదరమెట్ల - నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మానవహారం, రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బంగ్లారోడ్‌లో చేపట్టిన ఉద్యోగుల రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఇక రాష్ట్ర విభజనను నిరసిస్తూ అద్దంకిలో ముస్లింలు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. కొరిశపాడు మండలం రావినూతలలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులతో ర్యాలీ, ఆంధ్రప్రదేశ్ ఆకారంలో మానవహారం నిర్వహించారు. బల్లికురవలో ఉపాధ్యాయుల నిరసన దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇక చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి. మాలమహానాడు ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. పర్చూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. మార్టూరు మండలంలోని కోలలపూడిలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా వరినాట్లు వేసి నిరసన తెలిపారు. యద్దనపూడిలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్యోగులు మానహారం చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో గిద్దలూరు మండలంలోని క్రిస్టియన్ సమైక్యాంధ్ర అసోసియేషన్ సభ్యులు దీక్షలు చేపట్టారు. కంభంలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. జేఏసీ నాయకులు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, టెలిఫోన్ కార్యాలయాలను మూయించారు. కొమరోలులో ఆర్య మరాఠీలు భారీ ర్యాలీ, వంటావార్పు, వివిధ వేషధారణల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు తెలిపారు. కందుకూరులో వరుసగా రెండవ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. టంగుటూరులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు 9వ రోజుకు చేరాయి. శింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలో జన చైతన్యయాత్ర: కనిగిరిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్య ఆరో గ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది రిలే దీక్షలో కూర్చున్నారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగి పాఠశాలలు మూయించడం, సమైక్యాంధ్రకు మద్దతుగా పం చాయతీల్లో తీర్మానాలు చేయించడం, ప్రజలను చైతన్యం చేసేందుకు జన చైతన్య యాత్రను చేపట్టారు. గ్రామీణ ఆటో కార్మికులు రాష్ట్ర విభజనకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ రిలే దీక్షలు పదో రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తల దీక్షలు 12వ రోజు కొనసాగాయి. హనుమంతునిపాడులో సమైక్యాంధ్రకు మద్దతు జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, బ్యాంక్‌లు మూయించారు. సీఎస్ పురం మండలం డీజీపేటలో ఉపాధ్యాయులు రోడ్డుపై విద్యార్థులకు విద్యాబోధన చేపట్టారు. పామూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. పొదిలి చేరిన ఆత్మఘోష పాదయాత్ర: ఆర్యవైశ్యులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర పొదిలి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ దోర్నాలలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 130 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
మంత్రి పదవికి రాజీనామా చేయను:పనబాక
తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. అయితే మంత్రి పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి విధేయురాలినని, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక తెలిపారు. పనబాక లక్ష్మీ గురువారం సొంత నియోజకవర్గమైన బాపట్ల విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమెను రైల్వే స్టేషన్లో సమైక్యవాదులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని అనాలని సమైక్యవాదులు పనబాకపై ఒత్తిడి తెచ్చిన....అందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల భద్రత మధ్య పనబాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు బాపట్లలోని పనబాక నివాసం వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. -
పనబాక కాన్వాయ్ ని అడ్డుకున్న సమైక్యవాదులు
బాపట్ల : కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగలింది. బాపట్లలో ఈరోజు తెల్లవారుజామున ఆమె కాన్వాయ్ ని సమైక్యవాదులు అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పనబాక లక్ష్మి రాకపై సమాచారం అందుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున బాపట్ల రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే వారి ప్రయత్నాలను ముందే పసిగట్టిన పోలీసులు సమైక్యవాదులను రైల్వేస్టేషన్ లోకి రాకుండా అడ్డుకున్నారు. దాంతో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ గడియారం స్తంభం సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. కాగా పనబాక లక్ష్మి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు కూడా ఏలూరు వచ్చిన సందర్భంగా సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. -
'సీమాంధ్ర' సమావేశానికి దూరంగా పలువురు మంత్రులు, ఎంపిలు
హైదరాబాద్: పలువురు కేంద్ర మంత్రులు, ఎంపిలు ఈ ఉదయం జరిగిన సీమాంధ్ర నేతల సమావేశానికి హాజరుకాలేదు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌజ్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణితోపాటు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్, హర్షకుమార్ సబ్బం హరి, టి.సుబ్బరామిరెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి, బొత్స ఝాన్సీ, రత్నాబాయి సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు,జేడీ శీలం, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్ర రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. -
జనంతో ఏం పనిలే..!
చీరాల, న్యూస్‌లైన్: ‘మా ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కనిపించడం లేదు..అదృశ్యమైంది’ అంటూ చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పురోహితుడు రామాంజనేయ శాస్త్రి ఫిర్యాదు చేశారు. పనబాక లక్ష్మి కనిపించడం లేదని ప్లకార్డులతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమైక్యవాదులు నిరసన ర్యాలీలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు ఆమె దిష్టిబొమ్మను దహనం చేసి దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి 45 రోజులుగా అన్ని వర్గాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఉద్యమబాట పట్టినా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఓట్లేసి పదవులు కట్టబెట్టిన ప్రజలను కనీసం శాంతింపజేసే ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గతంలో ఏవైనా సభలు, సదస్సులకు అప్పుడప్పుడూ వచ్చి మొఖం చూపించి వెళ్లేవారు. ప్రస్తుతం ప్రజల నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడుతుండటంతో నియోజకవర్గ ఛాయలకు కూడా ఆమె రావడం మానేశారు. ఢిల్లీలో కూర్చొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ఆమె సహకారం కూడా... రాష్ట్ర విభజన జరుగుతుందని కేంద్ర మంత్రులందరికీ ముందే తెలుసునని సుస్పష్టమైంది. కేంద్ర మంత్రులు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిసినప్పుడు ఆమె పనబాక లక్ష్మిని ఉద్దేశించి ‘మీకు ఎప్పుడో చెప్పాను కదా.. రాష్ట్ర విభజన జరుగుతుందని. అప్పుడు మౌనంగా ఉండి మరలా ఇప్పుడు మాట్లాడటం ఏమిటి’ అని సోనియా అన్నట్లు ప్రచారం జరిగింది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని పనబాకకు ముందే తెలిసినా ఆమె కేవలం పదవి కోసం మిన్నకుండిపోయి విభజనకు సహకరించారని ప్రజలు విమర్శిస్తున్నారు. రాజ్యసభ వైపు చూపు... బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గుంటూరు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పనబాక ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆమె నియోజకవర్గాభివృద్ధికి పాటుపడింది నామమాత్రమే. పార్టీలో ఉన్న క్యాడరే ఆమెకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడటం, ఆమె కేంద్ర మంత్రి పదవికి కానీ, ఎంపీ పదవికి కానీ రాజీనామా చేయకపోవడం, పెపైచ్చు అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని తేల్చి చెప్పడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఐదు రోజుల క్రితం ఢిల్లీలో బొత్స సత్యనారాయణ... ఎంపీ రాయపాటి సాంబశివరావునుద్దేశించి పార్టీ ఎప్పుడు పెడుతున్నారని అడగ్గా ఆయన ‘మా పార్టీ కన్వీనర్ ఆమే’నంటూ పనబాక లక్ష్మిని ఉద్దేశించి అన్నారు. ఆమె మాత్రం నేను ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. దీన్నిబట్టి సీమాంధ్ర ప్రజలపై ఆమెకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే ఆమె అనుచరులు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం ఎదురవుతుందని, మేడం ఆశీస్సులు మెండుగా ఉండటంతో రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో పనబాక ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. -
కాంగ్రెస్ నేతలకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్ : కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ వేదికపైకి మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్‌తోపాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు రాగా, సమైక్యవాదులు జోక్యం చేసుకుని వేదికపై నుంచి దిగిపోవాలని, లేదంటే దాడి చేస్తామంటూ చెప్పులు పైకి ఎత్తి చూపారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని ఉద్యమకారులు ముట్టడించి ధర్నా చేపట్టారు. నెల్లూరులో విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. కర్నూలుకు వచ్చిన మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే ఊర్లోఉన్న పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పార్టీకి రాజీనామాచేయాలని న్యాయవాదులు డిమాండ్ చేయడంతో ఆయన, మైకుతో ఓ న్యాయవాది ముఖంపై కొట్టారు. దీంతో న్యాయవాదులు తిరగబడ్డారు. క్షమాపణ చెప్పాలని కోరగా, ‘చెప్పే ప్రసక్తే లేదు. ఏం పీకుతారో చూస్తా’నంటూ వెళ్లిపోయారు. న్యాయవాదులు తనపై దాడి చేశారన్నారు. -
హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో ఆరుగురే చనిపోయారు
విశాఖ : హెచ్‌పీసీఎల్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరుగురే చనిపోయారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. నష్టపరిహార విషయాన్ని వీరప్ప మొయిలీ నిర్ణయిస్తారని ఆమె తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ కమిటీ వేశామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పనబాక చెప్పారు. మరోవైపు హెచ్‌పీసీఎల్ అతిథిగృహంలో మంత్రి పనబాక లక్ష్మిని క్షతగాత్రుల బాధితులు ఘొరావ్ చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు సరైన సమాచారం ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పీసీఎల్లో శుక్రవారం సాయంత్రం కూలింగ్ టవర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఈరోజు మధ్యాహ్నం విశాఖ రానున్నారు. -
హెచ్‌పీసీఎల్ బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ శనివారం సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటన వివరాలకు సంబంధించి విశాఖపట్నంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్180042500002 ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య శనివారం ఉదయానికి నాలుగుకు చేరింది. అయితే ఆ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
టాలీవుడ్ సినిమా చానల్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వినోదంతో పాటు తెలుగు సినీరంగంలో తెరవెనుక ఉన్న సమస్యలను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు టాలీవుడ్ సినిమా చానల్ కృషి చేయనుందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అగ్రిగోల్డ్‌కు చెందిన టాలీవుడ్ చానల్ లోగోను శుక్రవారం ఆమె ఆవిష్కరించారు. టాలీవుడ్ చానల్ యాంటీ పైరసీ ఫోర్స్ కాంపెయిన్‌ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, హీరోలు శ్రీకాంత్, అల్లరి నరేష్‌లు ప్రారంభించారు. సినిమా న్యూస్ బులెటిన్లను కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, అగ్రిగోల్డ్ చైర్మన్ వీఆర్ రావు అవాస్, టాలీవుడ్ సినిమా చానల్ చైర్మన్ సీతారామారావు, నటీ నటులు సమంత, కాజల్, తమన్నా, మనోజ్, తరుణ్, నిఖిల్, అలీ తదితరులు పాల్గొన్నారు.