హెచ్‌పీసీఎల్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరుగురే చనిపోయారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు.
విశాఖ : హెచ్‌పీసీఎల్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరుగురే చనిపోయారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. నష్టపరిహార విషయాన్ని వీరప్ప మొయిలీ నిర్ణయిస్తారని ఆమె తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ కమిటీ వేశామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పనబాక చెప్పారు.
మరోవైపు హెచ్‌పీసీఎల్ అతిథిగృహంలో మంత్రి పనబాక లక్ష్మిని క్షతగాత్రుల బాధితులు ఘొరావ్ చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు సరైన సమాచారం ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పీసీఎల్లో శుక్రవారం సాయంత్రం కూలింగ్ టవర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఈరోజు మధ్యాహ్నం విశాఖ రానున్నారు.