హెచ్పీసీఎల్ యాజమాన్యానికి పనబాక క్లీన్చిట్ | panabaka lakshmi Panabaka hand over compensation to families of HPCL blast victims | Sakshi
Sakshi News home page

హెచ్పీసీఎల్ యాజమాన్యానికి పనబాక క్లీన్చిట్

Published Thu, Jan 2 2014 12:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

హెచ్పీసీఎల్ యాజమాన్యానికి పనబాక క్లీన్చిట్

హెచ్పీసీఎల్ యాజమాన్యానికి పనబాక క్లీన్చిట్

విశాఖ : విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) లో పేలుడు ప్రమాద దుర్ఘటనపై యాజమాన్యానికి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి క్లీన్చిట్ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మంత్రి పనబాక గురువారం 20 లక్షల నష్టపరిహారం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కాగా హెచ్పీసీఎల్కు వ్యతిరేకంగా కేసు వేసిన విషయం తనకు తెలియదని పనబాక చెప్పుకొచ్చారు. కాగా గత ఏడాది ఆగస్ట్లో హెచ్పీసీఎల్లో జరిగిన పేలుడు ప్రమాదంలో 25మంది మృతి చెందారు. మృతులతో పాటు, క్షతగాత్రుల్లో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్‌ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement