25కు చేరిన హెచ్‌పీసీఎల్‌ మృతుల సంఖ్య | HPCL Visakha refinery toll rises to 25 | Sakshi
Sakshi News home page

25కు చేరిన హెచ్‌పీసీఎల్‌ మృతుల సంఖ్య

Published Fri, Sep 6 2013 8:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

HPCL Visakha refinery toll rises to 25

విశాఖ : విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 25కు చేరింది. ఓల్డ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంట్రాక్ట్ కార్మికుడు అప్పల్రాజు శుక్రవారం మృతి చెందాడు. గత నెల 23వ తేదీన హెచ్పీసీఎల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ఆ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే చనిపోగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మృతులతో పాటు, క్షతగాత్రుల్లో చాలామాంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్‌ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement