రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి ఏం కావాలో చర్చించేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులందరం త్వరలో సమావేశం కానున్నామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్య, ఉద్యోగ, పరిశ్రమలు, నీటి కేటాయింపులుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఈ అంశాలపై ముఖ్యంగా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన జీవోఎమ్ను ఇంకా తాము కలవలేదని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు.