రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు:పనబాక | Congress party no loss on state bifurcation, says panabaka lakshmi | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు:పనబాక

Published Sun, Oct 20 2013 8:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు:పనబాక - Sakshi

రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు:పనబాక

రానున్న లోక్సభ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ఆదివారం స్పష్టం చేశారు.బాపట్ల నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఆమె బాపట్ల చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం లాంటిందని ఆమె అభివర్ణించారు.

 

డబ్బు,అధికారం కోసం ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడిన పార్టీకి కలిగే నష్టం ఏమీ ఉండబోదని పేర్కొన్నారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం కొంచం కూడా ఉండదని పనబాక లక్ష్మీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర పార్టీ మాత్రమే కాదని జాతీయ స్థాయి పార్టీ అని గుర్తుంచుకుంటే మంచిదని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement