'ఆంటోని కమిటీని కేంద్రం తుంగలోకి తొక్కింది' | Antony Committee wrapped by the center says Pithani Satyanarayana | Sakshi
Sakshi News home page

'ఆంటోని కమిటీని కేంద్రం తుంగలోకి తొక్కింది'

Published Tue, Oct 15 2013 1:43 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'ఆంటోని కమిటీని కేంద్రం తుంగలోకి తొక్కింది' - Sakshi

'ఆంటోని కమిటీని కేంద్రం తుంగలోకి తొక్కింది'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం హైదరాబాద్లో పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కేంద్రం కంటే మొండిగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని సైతం పట్టించుకోలేదని పితాని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

 

అలాగే రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైయ్యే సమస్యలపై కేంద్రం ఆంటోని కమిటీని నియమించిందని, అఖరికి ఆ కమిటీని కూడా కేంద్రం తుంగలోకి తొక్కిందని పితాని ఆరోపించారు. జోవోఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటను వస్తుందో రాదో తెలియదని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యచరణపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలమంతా కలసి నిర్ణయం తీసుకుంటామని పితాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement