Antony Committee
-
'ఓటమిపై ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చా'
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు ఆపార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దిగ్విజయ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు పడుతుందని దిగ్విజయ్ స్పష్టం చేశారు. కాగా దిగ్విజయ్ సింగ్ ఏ రాష్ట్రంలో కాలు పెడితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ఆపార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి ఈ కమిటీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి బతికించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా రఘువీరా ఇంతకు ముందే సోనియాకు నివేదిక ఇచ్చారు. దానిపై ఆంటోనీ కమిటీ ఇప్పుడు భేటీ అయ్యింది. -
'పొత్తుల వ్యవహారం ఆంటోనీ కమిటీదే'
-
'పొత్తుల వ్యవహారం ఆంటోనీ కమిటీదే'
న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారాన్ని ఆంటోనీ కమిటీ చేసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆంటోనీ కమిటీలో తాను సభ్యుడిని కాదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్టీఆలతో పొత్తు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని దిగ్విజయ్ అన్నారు. రాజ్యసభ ఎన్నికలపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన ఆందోళనలను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఆంటోని కమిటీ ఏమైంది?: మంత్రి కాసు కృష్ణారెడ్డి
నరసరావుపేట: రాష్ట్ర విభజన నిర్ణయం సీడబ్ల్యుసీలో తీసుకున్న తరువాత సీమాంధ్రలో సమస్యల గురించి చర్చించాలని వేసిన ఆంటోని కమిటీ ఏమైందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన ఇంటివద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంటోని కమిటీ సీమాంధ్రలో పర్యటించకుండానే మళ్లీ జీవోఎం అంటూ మరో కమిటీని వేశారని, 10 శాఖల మంత్రులు ఉండాల్సిన కమిటీలో ఐదుగురు మాత్రమే ఉండటం ఏమిటని అడిగారు. ఎన్ని కమిటీలు వేసినా సమైక్యాంధ్రప్రదేశ్ తమ నినాదమని స్పష్టం చేశారు. ఆంటోని కమిటీ సీమాంధ్రలోని ముఖ్య పట్టణాలన్నీ తిరిగి అక్కడ నాయకుడు లేకుండా ఉద్యమాలు జరిగిన పరిస్థితిని గమనించాలని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అధికశాతం ప్రత్యేక తెలంగాణ కోరుకోవడంలేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అవసరమైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తమకు సమ్మతమేనన్నారు. తెలంగాణ నాయకులు కూడా దీనిపై పునరాలోచన చే యాలని కోరారు. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్ర ముఖ్యమంత్రి రేసులో మీరున్నారా అని విలేకరులు ప్రశ్నించగా తమ కుటుంబం ముఖ్యమంత్రులను తయారుచేసిన కుటుంబమని చెప్పారు. పదవుల కోసం పాకులాడే అలవాటు తనకు లేదని, సమైక్యాంధ్రప్రదేశ్ కోసమే తాను చివరివరకు పోరాడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సభ్యత్వం ఉండటమే పెద్ద పదవిగా భావిస్తానన్నారు. ఇప్పటివరకు నీతి, నిజాయితీలతో ఉన్నానని, అవి తప్పాల్సివస్తే రాజకీయాల నుంచే తప్పుకొంటానని చెప్పారు. -
దిగ్విజయ్ మాటలను ఎవరూ నమ్మరు: గంటా
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని....ఆయన మాటలను ఎవరూ నమ్మరని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. దిగ్విజయ్ ఏది చెబితే ....దానికి వ్యతిరేకంగా జరుగుతుందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. అంతకు ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పారని... అయితే ఇంతవరకూ పర్యటించలేదన్నారు. దిగ్విజయ్ చెప్పిన అంశాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుందన్నారు. సీఎంను మార్చి కాంగ్రెస్ మరో తప్పు చేస్తుందని తాను అనుకోవటం లేదని గంటా అన్నారు. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రం ఏర్పడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి రబ్బరు స్టాంప్‌లా కాకుండా క్రియాశీలకంగా ఉన్నారని గంటా అన్నారు. విభజన ప్రక్రియను రాష్ట్రపతి అడ్డుకుంటారని భావిస్తున్నామని ఆయన తెలిపారు. మరో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విభజనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజల మనస్సులో నుంచి కాంగ్రెస్ పూర్తిగా చెరిగిపోతుందన్నారు. -
సహాయ బృందాలకు బదులు టాస్క్‌ఫోర్సా?: రోజా
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రోజా ఆక్షేపణ సాక్షి, హైదరాబాద్: జలవిలయంతో రాష్ట్రంలోని 3 ప్రాంతాలూ తీవ్రంగా నష్టపోతే కేంద్రం సహాయక బృందాలను పంపడం మాని.. రాష్ట్రాన్ని నిలువునా చీల్చడానికి టాస్క్‌ఫోర్స్‌ను పంపడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ఆక్షేపించారు. రాష్ట్రాన్ని బలివ్వడానికి ఆంటోనీ కమిటీ, మంత్రుల బృందం, టాస్క్‌ఫోర్స్‌ల పేరిట కత్తులు దూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు 80 రోజులకు పైగా ఉద్యమిస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని రోజా పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు కేంద్రం రోజుకో కమిటీ వేస్తూ, రోజుకో ప్రకటన చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ రోజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మన రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ కక్షగట్టిందని దుయ్యబట్టారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే కాంగ్రెస్, టీడీపీలు పనిగా పెట్టుకున్నాయని రోజా విమర్శించారు. చంద్రబాబు ‘చెంబుగ్యాంగ్’ పొద్దున లేచింది మొదలు జగన్‌పై బురద చల్లడం, వారి భజన చానళ్లు ప్రసారం చేయడం, వాటినే కాంగ్రెస్ నేతలు వల్లె వేయడం.. అంతా ఒక పథకం ప్రకారం ఒకరి మనసులోని భావాలను మరొకరు వ్యక్తపరుస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య శంఖారావం సభకు రూ.200 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చెబుతున్న మాటలు చూస్తుంటే... పచ్చకామెర్లు వచ్చిన రోగికి లోకమంతా పచ్చగా కనబడినట్లుందని రోజా ఎద్దేవా చేశారు. వారు నిర్వహించే సభలకు అలాగే ఖర్చు చేస్తున్నట్లున్నారని, అందుకే అదే ఆలోచనతో మాట్లాడుతున్నట్లుందని అన్నారు. టీడీపీ వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు మతితప్పినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ ఒక్క రోజూ రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డిని వైస్సార్సీపీలోకి చేర్చుకోవడం లేదనే అక్కసుతోనే జగన్మోహన్రెడ్డిపై ఆయన బురద చల్లుతున్నారని రోజా అన్నారు. దివాకర్‌రెడ్డి తన బంధువుల ద్వారా రాయబారం పంపితే జగన్ తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత తమ్ముడు ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ ఎంపీ టిక్కెటు, తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెటు ఖాయం కావడంతో జేసీ వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. -
సమస్యలన్నింటినీ జీవోఎం పరిష్కరిస్తుంది: దిగ్విజయ్‌సింగ్
రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సీమాంధ్రులు చింతించాల్సిన పని లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. వారి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మంత్రుల బృందం పని చేస్తుందని చెప్పారు. సీమాంధ్రకు తగిన న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బుధవారం ఆయన కొన్ని తెలుగు చానళ్లతో మాట్లాడారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంటోనీ కమిటీ ఇప్పటికే ముసాయిదా తయారు చేసిందని, దాన్ని ఒకట్రెండు రోజుల్లో జీవోఎంకు అందిస్తామని చెప్పారు. రాజీనామా చేసిన ఎంపీలను పిలిచి మాట్లాడతానన్నారు. ‘‘వారంతా పార్టీ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, దానికి కట్టుబడాలి. పార్టీ నిర్ణయానికి కట్టుబడతామన్న హామీని గుర్తుంచుకోవాలి’’ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాల్సి వస్తుందా అని ప్రశ్నించగా, భద్రాచలం హోదాలో ఎలాంటి మార్పూ ఉండదని బదులిచ్చారు. అది తెలంగాణలో ఉన్నంతమాత్రాన పోలవరానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయమై తానెవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చా చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, దీనిపై జీవోఎం చూసుకుంటుందని బదులిచ్చారు. విభజన ఆగదని మీరు పదేపదే చెబుతున్నా, సీఎం కిరణ్ మాత్రం తన హయాంలో విభజన జరగబోదంటుండటాన్ని ప్రస్తావించగా, ‘సీఎంగా ఉన్నంతవరకు ఆయన హయామే. చూద్దాం (లెట్స్ సీ)’ అని బదులిచ్చారు. తాము ప్రాంతాలను విడగొట్టమన్నామే తప్ప ప్రజలను కాదన్న బీజేపీ వ్యాఖ్యలతో తానూ ఏకీభవిస్తానన్నారు. -
'ఆంటోని కమిటీని కేంద్రం తుంగలోకి తొక్కింది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం హైదరాబాద్‌లో పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కేంద్రం కంటే మొండిగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని సైతం పట్టించుకోలేదని పితాని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైయ్యే సమస్యలపై కేంద్రం ఆంటోని కమిటీని నియమించిందని, అఖరికి ఆ కమిటీని కూడా కేంద్రం తుంగలోకి తొక్కిందని పితాని ఆరోపించారు. జోవోఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటను వస్తుందో రాదో తెలియదని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యచరణపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలమంతా కలసి నిర్ణయం తీసుకుంటామని పితాని పేర్కొన్నారు. -
అటకెక్కిన ఆంటోనీ కమిటీ
తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన ఆందోళనలను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ఆంటోనీ కమిటీ కాస్తా అటకెక్కేసింది. కమిటీలో ఉన్నదే ఇద్దరు సభ్యులు. వారిలో ఒకరు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కాగా.. మరొకరు చమురుశాఖ మంత్రి వీరప్పమొయిలీ. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, ఇతరులు వెళ్లి, రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు ఏంటన్న విషయాన్ని చెప్పుకోడానికి వీలుగా ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేశారు. కానీ కొన్నాళ్ల పాటు నాయకులు వెళ్లి వచ్చిన తర్వాత.. ఆంటోనీ అనారోగ్యం పాలయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఆయన ఆస్పత్రి పాలు కావడం, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో కమిటీ పని దాదాపుగా ఆగిపోయింది. తొలుత రాష్ట్రానికి కూడా ఆంటోనీ కమిటీని ఆహ్వానిస్తున్నట్లు సీమాంధ్రప్రాంత కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతా చెప్పారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో 11 మందితో ఏర్పాటుచేసిన బృందం నుంచి తర్వాత కొంతమందిని తొలగించి, మరికొందరిని కలిపి చివరకు ఏడుగురితోనే సరిపెట్టేశారు. కేవలం సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఉన్న నిరసన జ్వాలలను చల్లార్చేందుకు, తెలంగాణ విషయంలో మరింత కాలయాపన చేసేందుకే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆంటోనీ కమిటీ ఏమైందని, దాని పరిస్థితి ఏంటని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. కమిటీ స్టేటస్ ఏంటో కూడా తనకు తెలియదని మొయిలీ అన్నారు. ఇప్పటికిక మంత్రులే చూసుకుంటారని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు మాత్రం ఇంకా ఆంటోనీ కమిటీ ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వేసిన కమిటీ చివరకు తూతూమంత్రంగానే తేలిపోయింది. -
అటకెక్కిన ఆంటోనీ కమిటీ.. జీవోఎం రాకతో హుష్ కాకి
-
ముందే ఊహించి మాట్లాడను: బొత్స
హైదరాబాద్ : తెలంగాణపై కేబినెట్ నోట్‌పై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా జరిగాకే మాట్లాడానని.... ముందే ఊహించి మాట్లాడనని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ నోట్‌కు ముందే ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వచ్చి ఉంటే బాగుండేదని బొత్స అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.... అందుకోసం రాజీనామాలు మాత్రం చేసేది లేదంటున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యల పరిష్కరానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని హై కమాండ్‌ను కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేది లేదని హై కమాండ్ స్పష్టం చేస్తున్న నేపధ్యంలో సేవ్ ఎపి.... సేవ్ కాంగ్రెస్ అంటున్న నేతలు తమ భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకునేందుకు వారంతా మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు. 33మంది ఎమ్మెల్యేలు...తొమ్మిది మంది ఎమ్మెల్సీలు...పలువురు మంత్రులు, ఎంపీలు ఈ భేటీ పాల్గొన్నారు. -
‘విభజన’పై సవరణ ఉంటుంది : కావూరి సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలో పెల్లుబికిన ప్రజాగ్రహం, విభజనతో జరిగే నష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని, ఈ సమాచారం తనకు కూడా అందిందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని, విభజన ప్రకటనపై సవరణ కూడా చేసే అవకాశం ఉందని అన్నారు. జాతీయ టెక్స్టైల్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసిన ‘ఇండియన్ రిపబ్లిక్’ బ్రాండ్ దుస్తుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఇక్కడ జరిగింది. దీనికి వచ్చిన కావూరి కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రూ. 2 వేల కోట్లతో రాష్ట్రంలో 4 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కావూరి వెంట కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తదితరులున్నారు. -
సీఎంకు వ్యతిరేకంగా సమావేశం పెట్టలేదు
-
సీఎంకు వ్యతిరేకంగా సమావేశం పెట్టలేదు
హైదరాబాద్ : కేంద్ర మంత్రుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే రాష్ట్రంలో పరిస్థితి చక్కబడుతుందని... రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తేవాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో మంగళవారం మంత్రులు డొక్కా మాణిక్య వర ప్రసాద్, బాలరాజు, మహీధర్ రెడ్డి, రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేంద్ర మంత్రుల కమిటీ రాష్ట్రంలో పర్యటించేలా చూసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అప్పగించారు. బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ సేవ్ ఆంధ్ర ప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ నినాదంతో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జీవోలు ఉద్యమాన్ని విరమించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తాము ఈ సమావేశం పెట్టలేదని ....ముఖ్యమంత్రి మార్పు ఊహాజనితమేనని ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. -
మా ఒత్తిడి వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ: పురంధేశ్వరి
ఢిల్లీ: తమ ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని కేంద్రమంత్రి పురంధేశ్వరి చెప్పారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దలేదని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ సిఫారసులు కూడా కేబినెట్ నోట్లో ఉంచాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. -
ఆంటోనీ కమిటీని పంపమని సోనియాను కోరిన బొత్స
న్యూఢిల్లీ: ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపమని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. రాష్ట్ర విభజన అంశంపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ అనారోగ్యంతో ఉన్నందున కమిటీలోని మిగిలిన ముగ్గురు సభ్యులను రాష్ట్రానికి పంపాలని కోరారు. బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఆంటోనీ కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు వివరించారు. తెలంగాణ నోట్ కేంద్ర మంత్రి మండలి ముందుకు రాకముందే రాష్ట్రానికి రావాలని ఆయనను కోరారు. -
ఆంటోనీ నివేదిక సిద్ధం
* కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడి * టీడీపీ మనుగడ కోసమే కాంగ్రెస్‌పై బాబు విమర్శలు * జగన్‌కు కోర్టు ద్వారా వచ్చిన బెయిల్‌ను కాంగ్రెస్‌కు అంటగట్టడం దారుణం సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, వారి సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ తన నివేదికను సిద్ధం చేసిందని కమిటీ సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కమిటీ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పిస్తామని, ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలను మొయిలీ ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్‌కు అంటగట్టడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ మనుగడ కోసమే చంద్రబాబు.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఉండవచ్చు.. ఉండకపోవచ్చు’’ అని బదులిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు విధిగా ‘ఆధార్’ కార్డును కలిగి ఉండాలనే నిబంధన సరికాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆధార్ ఆవశ్యకతను, ప్రయోజనాలను కోర్టుకు వివరిస్తామని మొయిలీ తెలిపారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వ్యక్తిగత గుర్తింపు కచ్చితత్వానికి ఎంతో అవసరమని తెలిపారు. -
ఎవరి వాదన వారిదే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే వద్ద మరోమారు ఇరు ప్రాంత నేతలు ఎవరి వాదనలు వారు వినిపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు షిండేను గట్టిగా కోరగా, సీమాంధ్ర అభ్యంతరాలను పరిశీలిస్తున్న ఆంటోనీ కమిటీ తన నివేదిక ఇచ్చేవరకు ప్రక్రియపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్రమంత్రులు విన్నవించారు. ప్రక్రియ నెమ్మదించడంతో తెలంగాణ ప్రాంతంలో లేని అపోహలు కలుగుతున్నాయని, ఈ దృష్ట్యా వీలైనంత త్వరగా విభజన నోట్‌ను కేబినెట్ ముందు పెట్టాలని తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మాత్రం కమిటీ నివేదించే అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కేబినెట్ నోట్‌పై ఓ నిర్ణయానికి రావాలని కోరారు. షిండే మాత్రం ఇరు ప్రాంత నేతల్లో ఎవరికీ ఏ హామీ ఇవ్వలేదు. కాకపోతే నోట్ ఇప్పటికే తయారైందనే సంకేతం మాత్రం ఇచ్చారు. అయితే నోట్లో ఏముందో తాను చూడలేదని, దానిపై తానింకా సంతకం కూడా చేయలేదని ఆయన వారికి చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్‌పై మూడు రకాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయంటూ వస్తున్న వార్తలను తెలంగాణ నేతల వద్ద షిండే తోసిపుచ్చినట్టు కూడా తెలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని షిండే చెప్పినట్టు తెలంగాణ నేతలు తెలిపారు. షిండేతో మొదట తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడి 55 రోజులు గడుస్తున్నా ప్రక్రియపై కేంద్రం స్థాయిలో అడుగు ముందుకు పడకపోవడంతో తెలంగాణలో ఆందోళనలు నెలకొన్నాయని, అపోహలు కలుగుతున్నాయని దామోదర, జానా చెప్పారు. ఇక ఆలస్యం చేయకుండా విభజన నోట్‌ను కేబినెట్ ముందు పెట్టాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావించారు. ‘దానిపై మూడు ప్రతిపాదనలు హోంశాఖ ముందున్నాయంటూ భిన్న వార్తలు వస్తున్నాయి. కానీ సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణే ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఏది చేసినా తెలంగాణకు నష్టమే’ అని వివరించారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా హైదరాబాద్ రెవెన్యూ పరిధికే పరిమితం చేయాలని కోరారు. మూడు ప్రతిపాదనలు మీడియా సృష్టేనని షిండే చెప్పారు. ‘అలాంటి ప్రతిపాదనలేవీ మా ముందు లేవు. అసలు కేబినెట్ నోట్‌ను నేనింకా చూడలేదు. దానిపై సంతకమూ చేయలేదు’ అని అన్నట్టు సమాచారం. తెలంగాణ నోట్‌ను వీలైనంత త్వరగా కేబినెట్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తామని కూడా అన్నారని చెబుతున్నారు. విభజన తర్వాత శాసనమండలి రద్దవుతుందన్న వార్తలను కొందరు ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. యూపీ, బీహార్‌ల్లో విభజన తర్వాత కూడా మండలిని కొనసాగించారని, రాష్ట్రంలోనూ అలాగే చేయాలని కోరారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని ఖమ్మం జిల్లా నేతలు కోరారు. అనంతరం కొందరు తెలంగాణ నేతలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిశారు. తారసపడ్డ కిరణ్, తెలంగాణ నేతలు: షిండేతో భేటీ ముగించుకుని తెలంగాణ నేతలు బయటకు వస్తున్న తరుణంలో కిరణ్, మంత్రులు బాలరాజు, పితాని సత్యనారాయణ హోం శాఖ కార్యాలయంలోకి వెళ్లారు. డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి మినహా మరెవరూ కిరణ్‌ను పలకరించలేదు. సీమాంధ్రలో సమైక్యోద్యమం ఉధృతంగా ఉన్నందున విభజనపై ఎలాంటి ముందడుగేసినా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని షిండేకు కిరణ్ వివరించారు. కాబట్టి ప్రక్రియను మరికొంత కాలం ఆపాలని, కనీసం ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకానైనా ముందుకు పోరాదని కోరినట్టు తెలిసింది. హైదరాబాద్‌పైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. అన్ని హంగులతో అభివృద్ధి చెందిన హైదరాబద్‌ను వదులుకునేందుకు సీమాంధ్రులు ఏమాత్రం సిద్ధంగా లేరని కిరణ్ చెప్పారంటున్నారు. భేటీకి ముందు సీమాంధ్ర ఎంపీలు, బొత్స ఏపీభవన్‌లో కిరణ్‌తో చర్చించారు. ‘రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రయోజనముండదు. విభజనపై కేంద్రం వెనక్కు తగ్గదని స్పష్టంగా తెలుస్తున్న తరుణంలో రాజీనామాలెందుకు?’ అని కిరణ్ అన్నట్టు తెలిసింది. భేటీ సమయంలోనే బయటకు వచ్చిన సీబీఐ డెరైక్టర్: షిండేతో కిరణ్ భేటీ అయిన కాసేపటికే సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా హోంశాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చారు. పలు కేసుల విషయమై హోం శాఖ కార్యదర్శి గోస్వామితో ఆయన భేటీ అయ్యారని తెలిసింది. కిరణ్‌కు దొరకని సోనియా అపాయింట్మెంట్: కిరణ్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ లభించలేదు. ఎన్ఐసీ సమావేశంలో, రాజస్థాన్ ఎన్నికల ప్రచారం తదితరాలతో ఆమె తీరిక లేకుండా ఉండటమే కారణమని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. సోనియాను కలవకుండానే మంగళవారం సాయంత్రం కిరణ్ హైదరాబాద్ ప్రయాణమయ్యారు. -
వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు : వీరప్ప మొయిలీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆంటోనీ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రాంత నేతలు వీరప్ప మొయిలీని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాక వాటిని మార్చడం అసాధ్యమని, తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నొక్కిచెప్పారు. విభజన విషయంలో వెనక్కి వెళ్లలేమని సీమాంధ్ర నేతలకు సైతం ఇదివరకే తేల్చిచెప్పామన్నారు. అయితే, సీమాంధ్రులు లేవనెత్తిన పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతపై చర్చించాల్సి ఉందని మొయిలీ చెప్పినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల, డీకే అరుణ, సునీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీలు సురేశ్ షెట్కార్ పొన్నం ప్రభాకర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, రాజయ్య, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, నర్సారెడ్డి, ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, భూపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి నేతలు దయాసాగర్, తదితరులు మొయిలీని కలిశారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు పరచాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. నిర్ణయం అమలు జాప్యంతో తెలంగాణలో లేని అపోహలు తలెత్తుతున్నాయని వివరించారు. తెలంగాణపై నిర్ణయంతో కాంగ్రెస్‌కు మంచి మైలేజీ వచ్చిందని, త్వరగా కేబినెట్ ముందు నోట్ పెడితే మేలని కోరారు. సీమాంధ్ర ఉద్యమాన్ని తెరవెనుక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో పాటు ఇతర పార్టీల నేతలు క్రియాశీలంగా నడిపిస్తున్నారని వివరించారు. అనంతరం జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపై నోట్‌ను వెంటనే కేబినెట్ ముందు పెట్టాలని తామంతా మొయిలీని కోరినట్లు తెలిపారు. -
ఆంటోనీ పర్యటనపై దిగ్విజయ్‌తో బొత్స చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణ శనివారం సాయుంత్రం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజకీయుంగా పార్టీకి జరుగుతున్న నష్టంపై దిగ్విజయ్‌కి బొత్స వివరించినట్టు తెలిసింది. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని, ప్రజలకు ఉపశవునం కలిగించే ప్రకటన చేయూలని బొత్స కోరినట్టు సమాచారం. ఆంటోనీ కమిటీ సభ్యులుగా వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ రాష్ట్రంలో పర్యటించే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ నెల చివరికల్లా తాను, మెయిలీ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయుని, ఏఏ ప్రాంతాల్లో పర్యటించాలో, సూచించాలని బొత్సను దిగ్విజయ్ కోరినట్టు సమాచారం. -
మీ వల్లనే ఈ నిర్ణయం..: దిగ్విజయ్‌సింగ్
ఇదిలావుంటే.. తెలంగాణపై 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటన తర్వాత లభించిన విరామాన్ని సీమాంధ్ర నేతలు సద్వినియోగం చేసుకోలే కపోయారని ఆంటోనీ కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆ ప్రాంత కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం సీమాంధ్ర నేతలతో భేటీ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. ప్రతి సందర్భంలోనూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంగీకరించిన ‘మీ వల్లనే ఈ నిర్ణయం వెలువడిందనటంలో వాస్తవం లేకపోలేద’ని కూడా వ్యాఖ్యానించినట్లు చెప్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా రాష్ట్ర విభజన అనివార్యమని దిగ్విజయ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించే వాదనతో ముందుకొస్తే ఇకపై తనను కలవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారని.. ఈ విషయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలిసే అవకాశం లేదని స్పష్టంచేశారని సమాచారం. కేంద్ర మంత్రి పదవులకు, పార్లమంటు సభ్యత్వాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినా అధినేత్రి మనసు మారే అవకాశం లేద ని దిగ్విజయ్ పేర్కొన్నట్లు చెప్తున్నారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర శాసనసభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే ప్రకటన అయినా చేయాలని సీమాంధ్ర నేతలు కోరారని, ఆ అవకాశం లేదని దిగ్విజయ్ నిరాకరించారని సమాచారం. శాసనసభలో తెలంగాణ తీర్మానం నెగ్గదని తమకు తెలుసు కాబట్టే దానితో నిమిత్తం లేకుండా విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం జరిగిపోయిందని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. హైదరాబాద్ విషయంలో ప్రత్యామ్నాయ పరిష్కారాలను ప్రతిపాదించకపోతే కేంద్రం తాను మంచిదనుకొన్న నిర్ణయం తీసుకుని అమలు చేస్తుందని కూడా దిగ్విజయ్ చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు ఇష్టాగోష్టి సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. -
అన్యాయం జరిగిన రోజు నుంచి పదవుల్లో ఉండం:పల్లంరాజు
ఢిల్లీ: ఏ రోజైతే తమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ రోజు నుంచి తాము తమ పదవుల్లో ఉండం అని కేంద్ర మంత్రి పల్లంరాజు చెప్పారు. ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌లో పర్యటించాలని కోరినట్లు తెలిపారు. మూడు ప్రాంతాల వారికి నష్టం జరగకూడదని చెప్పామన్నారు. తాము పదవుల్లో ఉన్నందున తమపై వ్యతిరేకత వస్తుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు సీమాంధ్ర మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
రాజీనామాల్లేవ్!
* రాజీనామా డిమాండ్ మీడియా సృష్టే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల అసహనం * పదవుల నుంచి వైదొలగమని ప్రజలెవరూ అడగడం లేదు.. * ఎప్పుడు ఏం చేయాలనే తెలివితేటలు మాకున్నాయి * మా ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చింది.. త్వరలో మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు * సమైక్యంగా ఉంచాలని సోనియా, రాహుల్‌గాంధీలను కోరతాం * హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది * పరిణామాలను చూస్తే విభజన ప్రక్రియ ఆగినట్లే కనిపిస్తోంది * హైదరాబాద్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల భేటీ ‘‘సీమాంధ్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని మీడియా కాకమ్మ కథలు అల్లుతోంది. ప్రజాభిప్రాయుంపై మీడియా స్పందించటం లేదు. ప్రజల పేరుతో, మీడియానే స్పందిస్తోంది.’’ - కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ‘‘మేం రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారు? పేర్లు చెప్పండి? రాజీనామా ఎవరూ అడగటం లేదు. ఇదంతా మీడియా సృష్టి. చానళ్లు, పత్రికల మధ్యనున్న పోటీ, ఇతర కారణాలవల్లే ఇదంతా జరుగుతోంది.’’ - మరో కేంద్రమంత్రి జె.డి.శీలం ‘‘కావూరి సాంబశివరావు మాటపైనే మేమంతా నిలబడ్డాం. అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం తప్ప మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆందోళన, ఆకాంక్షల ముందు మా పదవులు చాలా చిన్నవి. ఏదో ఒక కారణంతో పదవులను చంకలో పెట్టుకుని తిరిగే గాడిదలు ఎవరూ లేరిక్కడ.’’ - టీటీడీ చైర్మన్ బాపిరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ జరిగిన ప్రచారమంతా వట్టిదేనని తేలింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు శనివారం హైదరాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజీనామాలు చేసే ఉద్దేశమే వారికి లేదని తేటతెల్లమవుతోంది. తమ రాజీనామాల డిమాండ్ అనేది మీడియా సృష్టేనంటూ వారంతా కొట్టిపారేశారు. తమను ఎవరూ రాజీనామాలు అడగటం లేదన్నారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయంపై తమ ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చిందని చెప్పారు. ఆ కమిటీ సీమాంధ్రలో పర్యటించి ప్రజల ఆందోళనలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితులను చూస్తే విభజన నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సహా మొత్తం 16 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యూరు. ఢిల్లీ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రవుంత్రి కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలపై ప్రజల ఒత్తిళ్ల గురించి, విలేకరులు ప్రస్తావించగా ఆయున అసహనం వ్యక్తంచేశారు. రాజీనామాల డిమాండ్ మీడియా సొంత అభిప్రాయమేనని.. ప్రజా స్పందనను మీడియా పేర్కొనటం లేదని తప్పుపట్టారు. తాము ఏ త్యాగాలకైనా సిద్ధవుని, ఎప్పుడు ఏం చేయాల నే తెలివితేటలు, సమర్ధత తమకున్నాయన్నారు. పార్టీ మా సర్వస్వం.. ప్రజలే ముఖ్యం... టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆనాడు ఇంకా దీక్ష కొనసాగిస్తే చనిపోతారనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిందని, కేసీఆర్ దీక్ష నటనేనని తాము చెప్పినా కేంద్రం వినలేదని కావూరి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేంద్రం ప్రకటనతో సీమాంధ్రలో తలెత్తిన ప్రజాందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ క్షేత్రస్థారుు అధ్యయనంతో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. దీనిపై తాము ఒత్తిడి తేవటం వల్లే ఆంటోనీ కమిటీ వచ్చిందని.. మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను పట్టింటుకోకుండా పదవులను అంటిపెట్టుకోవాలన్న ఆశ తమకు లేదన్నారు. తామంతా మళ్లీ ఢిల్లీ వెళ్తావుని, రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్ర ఆందోళనలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆంటోనీ కమిటీకి చెప్తామని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నాం. పార్టీయే వూకు సర్వస్వం. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప మరేదీ సమ్మతం కాదని సోనియూగాంధీ, రాహుల్‌గాంధీలకు చెప్తాం’’ అని తెలిపారు. రాజీనామా చేస్తామంటే పెద్దలు వద్దన్నారు... హైకమాండ్ పెద్దలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, వారిలో మార్పు వస్తుందని మరో కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని గురించి ఆంటోనీ కమిటీతోనే హైకమాండ్‌కు చెప్పిస్తామన్నారు. ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారని, తాము కూడా రాజీనామా చేస్తామంటే హైకమాండ్ పెద్దలు వద్దన్నారని మరో మంత్రి పురందేశ్వరి పేర్కొన్నారు. విభజన ఆగుతుందనుకుంటే రాజీనావూలకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారంటూ వుంత్రి శీలం మీడియాను ఎదురు ప్రశ్నించారు. పదవుల్లో ఉంటే, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవచ్చన్నారు. సోనియా, రాహుల్ అపాయింట్మెంట్ కోసం మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన కనుమూరి బాపిరాజు చెప్పారు. రాజీనామాలపై సమష్టి నిర్ణయం తీసుకుంటామని, కావూరి మాటపైనే తావుు నిలబడ్డామని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంలేని విభజన నిర్ణయంతో దేశం అల్లకల్లోలం అవుతోందని, ప్రస్తుత పరిణామాలను చూస్తే, విభజన ప్రక్రియ ఆగినట్టే కనిపిస్తోందని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. విభజన ఆగినట్టేనని, కేంద్రం పునరాలోచనలో పడిందని ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకోబోవుని హైకమాండ్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేయబోమని చెప్పండి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సవాల్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలు, మంత్రులకు ధైర్యం ఉంటే, తాము రాజీనామాలు చేయబోవుంటూ ప్రజలకు చెప్పాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సవాల్ విసిరారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల డిమాండ్‌తోనే ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైందన్నారు. రాజీనామాలకు ఏపీఎన్జీవోలు ఒత్తిడి తేలేదన్న ఎంపీల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నుంచి తిరిగి వెళ్తూ, బస్సులపై జరిగిన దాడిలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న రాజమండ్రి ఉద్యోగి సత్యనారాయణను ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలతో కలిసి అశోక్ బాబు శనివారం పరావుర్శించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సంఘం హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. చికిత్సకు ఇప్పటికే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్య ఖర్చులను తమ సంఘమే భరిస్తోందని చెప్పారు. -
విభజనపై కేంద్రం ముందుకెళితే రాజీనామాలే
-
విభజనపై కేంద్రం ముందుకెళితే రాజీనామాలే
హైదరాబాద్ : విభజనపై కేంద్రం ముందుకెళితే రాజీనామాలకు వెనకాడేది లేదని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఏడుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలను ఆమోదించుకుంటామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. కొందరు కేంద్రమంత్రులు రాజీ నామాలకు సుముఖంగానే ఉన్నారని లగడపాటి వెల్లడించారు. సమైక్యవాదులు తమని రాజీనామా చేయమనడంలో అర్ధముందన్నారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు రాజీ నామా చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందేమీ ఉండదని లగడపాటి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీ నామా చేస్తే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడం కష్టం అవుతుందన్నారు. తెలంగాణపై నోట్ సిద్ధమైతే ఏం చేయ్యాలన్నదానిపైనే సమావేశమం అవుతున్నట్లు తెలిపారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని రాష్ట్ర విభజనపై కేంద్రం అడుగు ముందుకు వేస్తే కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేస్తారన్నారు. తమ అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమేనని లగడపాటి స్పష్టం చేశారు. కాగా తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ భేటీ కానున్నారు. ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ సమావేశం నిర్వహించాలని భావించినా ఎంపీలు, కేంద్రమంత్రులకే పరిమితమైంది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. -
సోనియాగాంధీతో డీఎస్ సమావేశం
-
ఉద్యమాలపై ఆరా తీసిన సోనియాగాంధీ
న్యూఢిల్లీ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనపై ఆంటోనీ కమిటీ నేడు తన నివేదినను కాంగ్రెస్ కోర్ కమిటీకి సమర్పించనుంది. ఆంటోనీ కమిటీ నివేదికపై కోర్ కమిటీలో చర్చ జరగనున్న నేపథ్యంలో డీఎస్.... పార్టీ అధినేత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య భేటీ సుమారు 45 నిమిషాల పాటు సాగింది. తెలంగాణతో పాటు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలపై సోనియా ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై సోనియాకు ఈ సందర్భంగా డీఎస్ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, ఆంటోనీ కమిటీ నివేదికపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. -
కోర్ కమిటీ భేటీ ముందుకు కేబినెట్ నోట్?
-
నేడు కాంగ్రెస్ కోర్‌కమిటీకి ఆంటోనీ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ : కాంగ్రెస్ కోర్ కమిటీకి నేడు ఆంటోనీ కమిటీ నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర విభజన ప్రకటనతో తలెత్తిన సమస్యలు... వాటి సంప్రదింపుల వివరాలపై కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సందర్భంగా చర్చించనుంది. మరోవైపు తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైందని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సోనియాగాంధీ తిరిగి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ ఏకగ్రీవ తీర్మానం చేయటంతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమంపై కోర్ కమిటీ దృష్టి సారించినట్లు సమాచారం. ఆంటోనీ కమిటీ తుది నివేదికపైనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
'అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడలేదు'
హైదరాబాద్ : అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడిన దాఖలాలు లేవని యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ ఏ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగింది, త్వరలోనే తదుపరి చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన జరుగుతుందన్నారు. ఇదే కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఓ స్పష్టత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి చవిచూడనున్న కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆంటోనీ కమిటీని వేసిందని ప్రభాకర్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన యూపీఏ సమిష్టి నిర్ణయమన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమని ఆయన ఆరోపించారు. ఏపీఎన్జీవోలను కొంతమంది పెట్టుబడిదారులు పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజయ్య అన్నారు. -
ఆంటోని కమిటీ అటకెక్కేనా..?
-
ఆంటోనీ డ్రామా కమిటీ!
విభజనను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చూస్తోంది: షర్మిల ఆంటోనీ కమిటీలో తెలుగువారే లేరు.. అలాంటప్పుడు తెలుగువారి మనోభావాలు ఆ కమిటీకెలా తెలుస్తాయి? ఆ కమిటీతో సంబంధం లేకుండానే విభజన బిల్లు తయారైపోతోంది సాక్షాత్తూ హోం మంత్రి షిండేనే ఈ మాట చెప్పారు అంటే ఈ ఆంటోనీ కమిటీ ఓ పెద్ద డ్రామా కమిటీ అన్నమాట.. అందులో సీఎం, బొత్స, మంత్రులు క్యారెక్టర్ లేని యాక్టర్లు టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే సీమాంధ్రులపై దాడులు చేస్తున్నారు ఇక విభజనంటూ జరిగితే హైదరాబాద్‌లో బతకనిస్తారా? ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ విభజనకు యత్నిస్తుంటే చంద్రబాబు వంతపాడుతున్నారు.. బాబు తన లేఖను వెనక్కు తీసుకుని రాజీనామాలు చేసేదాకా ప్రజలంతా నిలదీయండి టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు సై అంటున్నాయి వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యంగా ఉండాలంటున్నాయి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా భావిస్తోందని, సొంత పార్టీ నేతలతో ఆంటోనీ కమిటీ వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘ఇక్కడ రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే, కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే.. అదేదో తమ సొంతపార్టీ వ్యవహారమన్నట్లు ఒక సొంత పార్టీ కమిటీని వేసింది కాంగ్రెస్. దాని పేరు ఆంటోనీ కమిటీ. ఆ కమిటీలో కేరళకు చెందిన ఆంటోనీ ఉన్నారు. కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీ ఉన్నారు. తమిళనాడుకు చెందిన చిదంబరం ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. గుజరాత్‌కు చెందిన అహ్మద్ పటేల్ ఉన్నారు. కానీ ఈ కమిటీలో ఒక్క తెలుగువాడూ లేడు. తెలుగుజాతి గురించి తెలిసినవాడే లేడు. వీళ్లంతా తెలుగువాళ్ల మనోభావాలను అర్థం చేసుకుంటారా?’’ అని షర్మిల నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నడిమాండ్తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఏడో రోజు ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగింది. జిల్లాలో ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కావలి సభలకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని ప్రకటిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. వీళ్లంతా ఓవరాక్షన్ చేసే యాక్టర్లు.. ‘‘సరే ఆంటోనీ కమిటీ అంతా ఒక తోలుబొమ్మ ఆట అనుకుందాం. ఈ కమిటీకి సంబంధం లేకుండా విభజన బిల్లు తయారైపోతోందని, కేబినెట్ ఆమోదం కూడా పొదుతుందని స్వయంగా హోం మంత్రి షిండే చెబుతున్నారు. అంటే ఈ కమిటీ ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఈ కమిటీ అభిప్రాయలు సేకరించడం ఒక పెద్ద డ్రామా, వాటిని పరిశీలించడం ఒక పెద్ద డ్రామా.. పరిశీలించి ఒక నివేదిక తయారు చేయడమన్నది ఇంకా పెద్ద డ్రామా. ఈ డ్రామాలో మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఓవరాక్షన్ చేసే యాక్టర్లన్నమాట. ‘మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగినా ఫరవాలేదు.. మా పదవులు మాకుంటే చాల’నే క్యారెక్టర్‌లేని యాక్టర్లు వీళ్లంతా. చంద్రబాబు వల్లే విభజన.. మన రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉంటే.. అందులో 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంత మందికి అన్యాయం జరుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో మటుకు చలనం లేదు. అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు. తెలంగాణ ఇచ్చేయండి అని.. ఒక బ్లాంక్ చెక్‌లా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు చంద్రబాబు.. అసలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తోందీ అంటే దానికి కారణం చంద్రబాబు ఇచ్చిన మద్దతే. పట్టపగలే సీమాంధ్రుల గొంతుకోసి ఇంకా ఏ మొహం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. ఇప్పటికీ ఎందుకు రాజీనామాలు చేయలేదని, ఎందుకు లేఖ వెనక్కు తీసుకోలేదని నిలదీయాలి. కాంగ్రెస్, టీడీపీ క్షమించలేని పాపం చేస్తున్నాయి.. మన ఖర్మ ఏమిటంటే.. ఓట్ల కోసం, సీట్ల కోసం, తెలంగాణను తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసం.. కాంగ్రెస్ పార్టీ కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తుంటే.. మరోవైపు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని నోరు విప్పడం లేదు చంద్రబాబు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి, నాశనం చేయడానికి వెనుకాడడం లేదు. ఇద్దరూ కలిసి క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే.. వీరూ చేసుంటే... హఠాత్తుగా ఏ పరిష్కారమూ చూపించకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నామని సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన అంత మంది ఎమ్మెల్యేలు, అంత మంది నాయకులూ రాజీనామాలు చేసి తమ నిరసన తెలియజేశారు. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా రాజీనామాలు చేసి.. నిరాహార దీక్షలు చేశారు.. ఇది అన్యాయం.. రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసినప్పుడే అందరూ రాజీనామాలు చేసి ఉంటే దేశమంతా ఇటు తిరిగిచూసేది.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ నిలిచిపోయేది. ఈ కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యం..: కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకటే మాట చెప్పింది.. ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఒక తండ్రిలా ఆలోచన చేయాలి.. ఆ ఆలోచన మీద మీ ఉద్దేశం ఏమిటో చెప్పండంటూ అందర్నీ పిలిచి చర్చలు జరపండి అని పదే పదే కోరింది. పదేపదే లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి.. వ్యవహరించింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ చెబుతోంది.. మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తోంది. అప్పటిదాకా జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి ఎందాకైనా పోరాటం చేస్తుందని ప్రజలకు మాటిస్తున్నాం.’’ విభజిస్తే.. టీఆర్ఎస్ నేతలు పాస్‌పోర్టులు అడగరా? టీఆర్ఎస్ నాయకులు మొన్న మానవహారంగా ఏర్పాటు కావాలనుకున్న లాయర్లపై సాక్షాత్తూ హైకోర్టులోనే దాడి చేశారు. నిన్న ఎన్జీవోలు సమైక్యవాదాన్ని వినిపించడానికి సభ నిర్వహించుకుని వెనక్కు వస్తుంటే.. వాళ్ల మీదా ఈ నాయకులు దాడిచేశారు. సీమాంధ్రులు వాళ్ల గొంతువిప్పి.. మాకు అన్యాయం జరుగుతోందీ అని చెప్పాలనుకుంటుంటే.. పాపం విభజన జరక్కముందే వాళ్ల మీదా ఈ టీఆర్ఎస్ నాయకులు దాడి చేయిస్తున్నారు. ఇక విభజన జరిగాక.. మాకు అన్యాయం జరుగుతోందీ అని.. వారు గొంతు విప్పితే.. ఈ నాయకులు వారి మీద కేసులు పెట్టరా? వారిని జైల్లో పెట్టరా? విభజన జరక్కముందే సీమాంధ్రులను ద్వితీయ శ్రేణి పౌరుల్లా(సెకండ్ క్లాస్ సిటిజన్స్‌లా) చూస్తున్నారే.. ఇక విభజన జరిగితే.. సీమాంధ్రులను టీఆర్ఎస్ నాయకులు పరదేశీయుల్లా చూడరా? హైదరాబాద్ రావాలంటే.. మా పర్మిషన్లు ఉండాలి.. మీరు పాస్‌పోర్టులు తీసుకొని రావాలి అని ఈ నాయకులు ఆంక్షలు పెట్టరా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల ఆస్తులను లాగేసుకుంటామని టీఆర్ఎస్ నాయకులు అనడం వాస్తవం కాదా? సీమాంధ్ర ఉద్యోగస్తులను వెళ్లగొడతామని ఈ నాయకులు అనడం వాస్తవం కాదా? విభజన జరగకముందే వీరి మాటలు, వీరి వైఖరి ఇలా ఉంటే.. ఇక విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకడం అంటే.. భారతీయుడు పాకిస్థాన్‌లో బతికినంత కష్టమైపోదా?’’. నేడు యాత్రకు విరామం వినాయక చవితి సందర్భంగా షర్మిల యాత్రకు సోమవారం రోజు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. తిరిగి మంగళవారం యాత్ర పునఃప్రారంభమవుతుందని, అదే రోజు యాత్ర ప్రకాశంలో జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. వీళ్లంతా రాజీనామాచేస్తేగాని విభజన ఆగదు.. పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ నాయకులంతా ఎప్పుడు మేలుకుంటారో.. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ రాజీనామా చేస్తే తప్ప ఈ విభజన ఆగదని ఎప్పుడు అర్థం చేసుకుంటారో.. ఏమిటి మనకీ ఖర్మ! వీళ్లు పాలకులా లేక రాక్షసులా? పచ్చిగా ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక జాతినే చీల్చేస్తారా? ఒక్క ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక.. ఒక్క పాలనలో ప్రజలిచ్చే తీర్పును వినే ధైర్యం లేక ఒక కుటుంబంలోనే చిచ్చు పెడతారా? దానికి చంద్రబాబులాంటి దుర్మార్గులు మద్దతిస్తారా? ఏమిటీ అన్యాయం.. ఏమిటి మన రాష్ట్రానికి ఈ ఖర్మ? టీడీపీ అయితేనేమి, చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలైతేనేమి, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలైతేనేమి.. అసలు వీళ్లందరూ మనుషులేనా? లేక మానవ జాతికి మాయని మచ్చలా? - షర్మిల -
'విభజన ప్రక్రియను దేశ విభజనగా మార్చారు'
హైదరాబాద్ : సాధారణంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియను దేశ విభజనగా మార్చారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించి విభజనపై ముందుకు వెళ్లాలన్నారు. అలాగే ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావాలని మూడు ప్రాంతాల ప్రజలు కోరుకోవటం లేదని పెద్దిరెడ్డి అన్నారు. రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మాట్లాడుతూ కేబినెట్ నోట్ తయారయిపోతే.... ఇక ఆంటోనీ కమిటీని ఎందుకు వేసినట్లని ప్రశ్నించారు. -
రాజీనామాలా....సోనియాకు లేఖనా?
-
రాజీనామాలా....సోనియాకు లేఖనా?
న్యూఢిల్లీ : సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రలు, ఎంపీలు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీ ముందు వాదించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలా.... లేక సోనియాగాంధీకి లేఖ రాయాలా అనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు. అయితే రాజీనామాలపై పలువురు కేంద్ర మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉండదంటూ కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై ముందుకే వెళతామని కేంద్రం స్పష్టం చేయడంతో.. ఆంటోనీ కమిటీతో ఇవాళ జరగబోయే సీమాంధ్ర ఎంపీల భేటీ ఆసక్తికరంగా మారింది.ఆంటోనీ కమిటీ ముందు సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించడానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన ఎంపీలంతా.. కమిటీ ముందు ఉంచాల్సిన డిమాండ్లపై ముమ్మర కసరత్తు చేశారు. రోజురోజుకూ ఉధృతమవుతున్న సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీవ్ర మైంది. విభజనకు కాంగ్రెస్ కారణమైనందున ఆ ప్రాంత ప్రజలంతా తమను దోషులుగా పరిగణిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు రాజీనామాలు చేసి రావాలని చెబుతున్న సమైక్యవాదులు తాజాగా రాజీనామాలను ఆమోదించుకున్న తరువాతే నియోజకవర్గంలో కాలుపెట్టాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. -
ఢిల్లీ నేతలతో టీఆర్ఎస్ భేటీలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేయటానికి టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. తమ ప్రత్యర్థులు చేస్తున్న గట్టి ప్రయత్నాలవల్ల తెలంగాణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముందని టీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యుల బృందం ఢిల్లీలో మకాం వేసి వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలుస్తూ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా వాదనలు వినిపిస్తోంది. అయితే.. ఆంటోనీ కమిటీని కానీ, కాంగ్రెస్ పెద్దలను కలిస్తే అది తప్పుడు సంకేతాలు పుతుందని వారు భావిస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్ నాయకత్వం వివిధ జాతీయ నాయకులతో భేటీ అవుతుండటంతో.. తనకు గల ‘రాజకీయ అవకాశాలను’ పరిశీలిస్తోందా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భేటీల వివరాలను టీఆర్ఎస్ నాయకత్వం మీడియా కంటపడకుండా రహస్యంగానే కొనసాగిస్తుండటం విశేషం. -
అందరూ అంగీకరించాకే విభజన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షునితో సహా రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులంతా అంగీకరించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గత రెండేళ్లుగా సాగించిన విస్తృతస్థాయి సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. అయితే, తొలుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మాటపై నిలబడకుండా వెనక్కు తగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, హడావుడిగా నిర్ణయం తీసుకొన్నదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో చూశానన్న దిగ్విజయ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాసిన లేఖను అద్వానీ ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం... తాను గతంలో చేసిన సూచనలను పట్టించుకోకుండా, తమను సంప్రదించకుండానే అధిష్టానం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విమర్శించడాన్ని ప్రస్తావించగా... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ అధిష్టానం నిర్ణయానికి బద్ధులమై ఉంటామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఆంటోనీ కమిటీతో గురువారం కొన్ని రాజకీయేతర సంఘాల ప్రతినిధులు, ఇతరులు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో వాయిదా పడినట్లు చెప్పారు. వచ్చే నెల మూడోతేదీన తిరిగి సమావేశం కానున్న కమిటీ ఆ రోజున రావాల్సిందిగా వారిని ఆహ్వానించిందని ఆయన తెలిపారు. -
త్యాగాల ఫలితం ఇదేనా!
సాక్షి, కడప: ‘ఎందుకు విభజిస్తున్నారో చెప్పకుండా ప్రకటన చేశారు. సీమాంధ్రులు ఉద్యమిస్తే ఆంటోని కమిటీ వేస్తామన్నారు. కమిటీ ఏం చేస్తుంది? విశాలాంధ్ర కోసం బళ్లారిని కోల్పోయాం. కర్నూలు నుంచి రాజధాని కేంద్రాన్ని కోల్పోయాం..తద్వారా రాయలసీమలో 50ఏళ్ల అభివృద్ధి ఆగిపోయింది. ఇవన్నీ వెనక్కి తెచ్చివ్వగలరా? ఇవన్నీ త్యాగం చేసినందుకు రాయలసీమకు ఇచ్చే బహుమతి ఇదేనా?’ అని కడప వాసులు ముక్తకంఠంతో నినదించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం హరిత ఫంక్షన్‌హాలులో జరిగిన‘ఎవరెటు’ చర్చా కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. రాయలసీమ సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని నినదించారు. సీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ‘మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కృష్ణాబ్యారేజ్, తుంగభద్ర డ్యాం నిర్మించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ నిర్మించారు. వర్షపు నీటి వనరులు ఉన్న ప్రాంతాలకే సాగునీటి వనరులు కల్పించారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే సీమ ప్రాంతాలకు నీరివ్వలేకపోయారు. పైగా భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కలిసి ఉండాలనే ఏకైక కాంక్షతో తుంగభద్ర డ్యాంను కోల్పోయాం. ఇప్పుడు విడిపోతే కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులవుతాయి. ఇదే జరిగితే మిగులుజలాలపై ఆధారపడి నిర్మించిన గాలేరునగరి, హంద్రీనీవాతో పాటు తెలుగుగంగ, వెలిగొండకు చుక్కనీరు అందదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. విభజన తప్పదంటే కృష్ణా పరివాహక ప్రాంతాలైన నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంలను కలిపి 16జిల్లాలను ఒక రాష్ట్రంగా.. తక్కిన ఏడుజిల్లాలను మరో రాష్ట్రంగా విభజించాలి’ అని అన్నారు. న్యాయవాది కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తెలంగాణ అంశంపై గతంలోనే వైఎస్ ఓ లేఖను ఇచ్చారని, అందులో ఓ సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య ఉత్పన్నం కాకూడదని చెప్పారన్నారు. చిత్తశుద్ధితో సమైక్యం కోసం ఉద్యమించి ఏ పార్టీకైనా అండగా ఉంటామన్నారు. ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయపార్టీల నేతలు ప్రజలతో చర్చించకుండా పార్టీల తరఫున లేఖలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కడపలో ఏడేళ్లుగా కలెక్టరేట్ నిర్మించలేదని, రాజధానిని 30ఏళ్లయినా నిర్మించలేరని జయరామయ్య అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. డైట్ అధ్యాపకులు కృష్ణ, న్యాయవాది విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిన చర్చలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యాంధ్రనే కొనసాగించాలని ముక్తాయింపు ఇచ్చారు. -
అందరినీ సంప్రదించాకే విభజన నిర్ణయం
తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్... ఇలా అన్ని పార్టీల నాయకులూ అంగీకరించిన తర్వాత మాత్రమే రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మొదట విభజనకు అనుకూలంగా మాట్లాడిన ఈ పార్టీలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ (వైఆర్ఎస్ అని ఆ సమయంలో పొరపాటుగా చెప్పారు) పార్టీల సభ్యులు మాత్రం మాటమార్చడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆంటోనీ కమిటీని పలువురు పార్టీల నాయకులు, రాజకీయాలతో సంబంధం లేనివాళ్లు కూడా కలుస్తున్నారని, ఈరోజు కూడా తాము కొంతమంది నాయకులతో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. బుధవారం కూడా కొంతమంది తమను కలవాలనుకున్నారని, కానీ బుధవారం జన్మాష్టమి కావడం వల్ల మళ్లీ సెప్టెంబర్ మూడో తేదీన ఆంటోనీ కమిటీ సమావేశం అవుతోందని ఆయన తెలిపారు. ఆరోజు రావాల్సిందిగా వారికి సూచించారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరుప్రాంతాల నాయకులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో కూడా కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా చర్చించారని, అప్పట్లో వాళ్లంతా కూడా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి బద్ధులై ఉంటామని చెప్పడంతోనే తాము విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని.. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి వాళ్లంతా కూడా ఎదురు తిరగడం భావ్యం కాదని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా విమర్శిస్తున్నారని, కానీ స్వయంగా బీజేపీ కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయం ఆయనకు గుర్తులేదా అని దిగ్విజయ్ ప్రశ్నించారు. -
అందరినీ సంప్రదించాకే విభజన నిర్ణయం: దిగ్విజయ్ సింగ్
-
దాడులను అరికట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని హైదరాబాద్‌లో వరుసగా సీమాంధ్ర ఉద్యోగులపై జరుగు తున్న దాడులను అరికట్టాలని ఆంటోనీ కమిటీని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కోరారు. తెలంగాణలోని సీమాంధ్రులకు ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని తెలంగాణ నేతలు చేస్తున్న ప్రకటనలు కేవలం మాటల్లోనే తప్ప చేతల్లో కన్పించడం లేదన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో సోమవారం రాత్రి వారు గంటకు పైగా భేటీ అయ్యారు. సమైక్యవాదంతో ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు నాలుగు రోజులుగా దాడులకు దిగుతున్నా వాటి కట్టడికి ప్రభుత్వపరంగా, తెలంగాణ నేతల పరంగా ఎలాంటి చర్యలూ లేవని ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం తక్షణం జోక్యం చేసుకొని దాడులను కట్టడి చేయాలని కోరారు. దాంతో దిగ్విజయ్ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డిలతో ఫోన్ మాట్లాడారు. అందరితో మాట్లాడి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వారాయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, జి.వి.హర్షకుమార్ తదితరులు కమిటీ ముందు గంటకు పైగా వాదనలు విన్పించారు. హైద్రాబాద్ లో చోటుచేసుకొంటున్న హింసాత్మక సంఘటనలు, అభద్రతా భావం నెలకొన్న సీమాంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ క ల్పించేందుకు కేంద్రం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపైనే కమిటీతో వారు మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణవాదులను అదుపు చేయలేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా విషమిస్తాయన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఇటీవల వరుసగా జరుగుతున్న ఘర్షణలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘‘రెండు రోజుల కింద ఎపీఎన్జీవో కార్యాయంలో తెలంగాణ ప్రాంత న్యాయవాదులు దాడికి ఇగారు. , సోమవారం జలసౌధ, దేవాదాయ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు దిగారు. తెలంగాణ నేతలు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టజూస్తున్నారు. ఘర్షణ జరుగుతున్న చోట్లకు వెళ్లి ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న తలపెట్టిన బహిరంగ సభ విషయంలోనూ తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థుల ధోరణి పూర్తి రెచ్చగొట్టేలా ఉంది’’ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా తామెలాంటి మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని ఎంపీలు పునరుద్ఘాటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వచ్చి పలు అంశాలపై వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్నా లోక్‌సభలో ఆహార భద్రతపై చర్చ, ఓటింగ్‌తో రాలేకపోయారు. మరోవైపు ఏపీ ఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు కూడా విభజనను వ్యతిరేకిస్తూ మంగళ, బుధవారాల్లో ఆంటోనీ కమిటీని, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలవనున్నారు. దౌర్జన్యం చేస్తే ఫలితం అనుభవిస్తారు: ఉండవ ల్లి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశామని అనంతరం విలేకరులకు ఉండవల్లి వివరించారు. ‘హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై జరుగుతున్న దాడులను కమిటీకి వివరించాం. వారు స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. హైదరాబాద్‌లో తెలంగాణ వారికి నిరసన తెలిపే హక్కు ఎంతుందో, సీమాంధ్రులకూ అంతే ఉంది. రౌడీయిజం, గూండాగిరీ చేస్తామంటే రాజ్యాంగం దాని పని అది చేస్తుంది. సీమాంధ్రల ప్రదర్శనలను దౌర్జన్యం చేసి అపగలమనుకుంటే దాని దుష్ఫలితాలను అనుభవిస్తారు’’ అని హెచ్చరించారు. -
సమైక్యంగా ఉంచాలనే హక్కు మాకూ ఉంది: ఉండవల్లి అరుణ్‌కుమార్
ప్రత్యేక తెలంగాణ కోరుకునే హక్కు వాళ్లకు ఎంత ఉంటుందో, సమైక్యంగా ఉంచాలనే హక్కు అవతలివాళ్లకి కూడా ఉంటుందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు కాంగ్రెస్ వార్ రూంలో ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. అంతకుముందు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కార్యాయలంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంటోనీ కమిటీతో ఏం చెప్పాలన్న విషయమై వారు తీవ్రంగా చర్చించుకున్నారు. అసలు.. ఈ సమావేశాల్లోనే కాదు, ఏ పార్లమెంటు సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లు వస్తుందా లేదా అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తాము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందుకే తామిక్కడ ఉన్నాం తప్ప.. ఆందోళనలకు భయపడి సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లడంలేదన్నది సరికాదని ఆయన అన్నారు. ఇక ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం కూడా ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. రాజధాని హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా కొంతమంది నాయకుల ప్రవర్తన గర్హనీయమని, దీన్ని వెంటనే ఆపాలని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకునే హక్కు వారికి ఎలా ఉందో, సమైక్యంగా ఉండాలని కోరుకునే హక్కు అవతలివాళ్లకు కూడా అంతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దాన్ని రౌడీయిజంతోనో, దాదాగిరితోనో ఆపాలనుకుంటే కుదరదని తెలిపారు. ఈ విషయాన్ని ఆంటోనీ కమిటీకి తెలిపామని, వెంటనే సంబంధితులందరికీ దీన్ని తెలియజేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని.. దానికి కమిటీ కూడా సానుకూలంగా స్పందించిందని అరుణ్‌కుమార్ అన్నారు. రాజధాని నగరంలో ఏ విధమైన శాంతియుత ప్రదర్శన జరిగినా దాని మీదకు వెళ్లే అధికారం ఎవరికీ లేదని, ఉంటే గింటే ప్రభుత్వానికే ఉంటుందని ఆయన చెప్పారు. విద్యుత్ సౌధ, జలసౌధతో పాటు ఏపీ ఎన్జీవో కార్యాలయంలో లాయర్ల సమావేశంలో జరిగిన గొడవను కూడా ఆంటోనీ కమిటీ దృష్టికి సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లారు. సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలా లేదా అనే హక్కు కేవలం ప్రభుత్వానికే ఉంటుందని, అడ్డుకోవాలంటే పోలీసులు అడ్డుకోవాలి తప్ప వ్యక్తులు, పార్టీలు వాటిని అడ్డుకోవాలని చూడటం సరికాదని ఉండవల్లి అన్నారు. దౌర్జన్యం చేయాలనుకుంటే దాని దుష్ఫలితాలు వారే అనుభవిస్తారని చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత గురించి ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని, మీ అందరి (మీడియా) దయవల్ల అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుస్తోందని ఆయన అన్నారు. ఇంత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం తాను పుట్టాక భారతదేశంలో ఇంతవరకు ఎన్నడూ లేదని, ఇకముందు కూడా జరుగుతుందన్న నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఆంటోనీ కమిటీతో చెప్పాల్సిందంతా చెప్పామని, తొందర్లోనే మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు మళ్లీ ఓసారి కమిటీతో సమావేశమై, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిస్థితులు వివరిస్తామని అన్నారు. ఈరోజే సమగ్రంగా చెబుదామనుకున్నా, ఆహారభద్రత బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ ఉండటం వల్ల ఈరోజు కుదరలేదని ఆయన చెప్పారు. -
'ఆందోళనలు ఆపండి.. చర్చలకు సిద్ధం'
-
సీమాంధ్రలో ఆందోళనలు ఆపండి.. చర్చలకు సిద్ధం: దిగ్విజయ్ సింగ్
సీమాంధ్రలో ఆందోళనలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ విజ్క్షప్తి చేశారు. ఆంటోని కమటితో సీమాంధ్ర నేతలు సమావేశం అనంతరం మీడియాతో దిగ్విజయ్ మాట్లాడుతూ...ఆందోళనల వల్ల పిల్లలు, బ్యాంకులు, స్కూళ్లు మూతపడ్డాయని, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు, ప్రజలు ఆంటోనీ కమిటీ ముందుకు వచ్చి తమ వాదనలు వినిపించాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. బిల్లులో కాని, తీర్మానంలో కాని ఏముండాలో చెప్పాలని దిగ్విజయ్ చెప్పారు. 'సీమాంధ్రలో ఉద్యమాలకు స్వస్తి చెప్పాలన్నారు. చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష గురించి మాట్లాడటానికి నిరాకరించారు. జగన్ దీక్ష గురించి టీవీల్లో చూశాను గానీ, దాని గురించి హోం మంత్రిని అడగండి.. నన్ను కాదు' అని వ్యాఖ్యానించారు. 'రాష్టంలోని పరిస్థితులపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడతా. అందరూ కలిసి పనిచేయాలి అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి గొడవలు జరగకూడదు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకూడదు. ప్రశాంతంగా ఉండాలి' అని దిగ్విజయ్ అన్నారు. -
ఆంటోనీ కమిటీని కలవనున్న ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు
హైదరాబాద్ : ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు ఆంటోనీ కమిటీకి తమ వాదనను వినిపించేందుకు నేడు ఢిల్లీకి పయనం అయ్యారు. రాష్ట్ర విభజన వద్దని... అలాగే రూ.5వేల కోట్ల ఆర్టీసీ అప్పులు మాఫీ చేయాలని వారు ఈ సందర్భంగా ఆంటోనీ కమిటీకి విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే సీమాంధ్ర ఆర్టీసీకి రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎన్ఎంయూ నేతలు కోరనున్నారు. విభజన సెగల దెబ్బ ఆర్టీసీని నష్టాల్లో ముంచింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో గత 20 రోజులుగా ఆర్టీసీకి 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపు 120కు పైగా డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దాదాపు 60 వేలమంది సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నారు. విభజనకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్టు అంతంత మాత్రంగా నడుస్తున్న ఆర్టీసీని కృంగదీసింది. అవసరమైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసినా, ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ సంస్థలకు బేరం పెట్టేస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆజమాయిషీ అయ్యేపనికాదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. -
ఎన్ని కమిటీలేసినా.. సమైక్యమే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఎన్ని కమిటీలు వేసినా సమైక్యవాదాన్నే వినిపిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ‘విభజన విషయంలో ప్రభుత్వ కమిటీ వేస్తారన్న విషయంపై మాకు సమాచారం లేదు. కమిటీ వేసినా అది ఏ ప్రాతిపదికన వేశారు? దాని విధివిధానాలు ఏమిటి? ప్రభుత్వ కమిటీ సైతం ఆంటోనీ కమిటీ వంటిదేనా? అన్న విషయాలను ముందే తేల్చాలి’ అని చెప్పారు. హైదరాబాద్, నీటి సమస్యలు పరిష్కారించాకే విభజనపై నిర్ణయం చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నమిక్కడ కేంద్ర మంత్రి చిరంజీవి ఇంట్లో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీల విందు సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, కనుమూరి బాపిరాజు, బొత్స ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులరెడ్డి, కేవీపీ రాంచంద్రరావు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. సస్పెన్షన్ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఆంటోనీ కమిటీని మరోమారు కలిసే అంశాలపై చర్చించారు. సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లోక్‌సభకు వెళ్లిన చిరంజీవి సమావేశం ముగిసిన అనంతరం తిరిగొచ్చారు. శుక్రవారం తాను సోనియాగాంధీతో జరిపిన భేటీ విషయాలు నేతలకు ఆయన వివరించారు. ఎంపీలందరూ సోమవారం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. అన్ని వర్గాలవారితో ఆంటోనీ కమిటీ భేటీ: పళ్లంరాజు సాక్షి, హైదరాబాద్: అన్నివర్గాల ప్రజలతో ఆంటోనీ కమిటీ భేటీ అవుతుందని కేంద్రమంత్రి పళ్లంరాజు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చే ఈ కమిటీ విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలవారితో సమావేశమై వారికున్న భయాందోళనలపై వివరాలు తీసుకుంటుందన్నారు. -
అన్ని వర్గాల వారితో అంటోనీ కమిటీ భేటీ: పల్లంరాజు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల వారితోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో అంటోనీ కమిటీ భేటీ అవుతుందని కేంద్ర మంత్రి ఎం.ఎం. పల్లంరాజు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చే ఈ కమిటీ హైదరాబాద్‌లోని విద్యార్థులు, ఉద్యోగులు వివిధ వర్గాల వర్గాల వారితో సమావేశమై వారికున్న భయాందోళనలపై వివరాలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని, నీటి పంపకాలపై సమాచారం సేకరిస్తుందని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పల్లంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రా, రాయలసీమ ప్రజల్లో ఆందోళననెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకొని కొన్ని సవరణలు చేయడానికి అవకాశం ఉందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆంటోనీ కమిటీ ఏం చేస్తుందనే వాదనలు తలెత్తుతున్నాయని, అయితే కమిటీ తాము సేకరించిన అంశాలను సీడబ్ల్యూసీకి అందజేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల సస్పెన్షన్‌పై స్పందిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, పరిస్థితులను సభ్యులు పార్లమెంటులో వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వారిని సస్పెండ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో వారిని సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో మీరు పదవికి రాజీనామా చేస్తారా? అని పల్లంరాజును విలేకరులు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. -
ఛలో హైదరాబాద్ నిర్వహిస్తాం: ఏపీఎన్జీవో
హైదరాబాద్ : ప్రభుత్వం అనుమతించకపోయినా సెప్టెంబర్ 7వ తేదీన తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ను నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవోల సంఘం స్పష్టం చేసింది. తాము శాంతియుతంగా నిరసన తెలియచేస్తామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవాలని నిర్ణయించారు. వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధులతో ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. సమైక్య వాదాన్ని ఢిల్లీ నేతలకు గట్టిగా వినిపిస్తామని చెప్పారు. ఆంటోనీ కమిటీని కలిసి తమ వాదనలు వినిపిస్తామని అశోక్ బాబు వెల్లడించారు. -
'బొత్సకు ముఖ్యమంత్రి కావాలని తహతహ'
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ శనివారం ఆంటోనీ కమిటీకి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని.... హైదరాబాద్‌లో వచ్చే ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు పంచాలని కిషోర్ చంద్రదేవ్ విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా కిషోర్ చంద్రదేవ్... తన లేఖలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ధ్వజమెత్తారు. సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని బొత్స సత్యనారాయణ తహతహలాడుతున్నారని విమర్శించారు. సీఎం కిరణ్ మిగిలిన పదవీ కాలాన్ని అనుభవించాలనుకుంటున్నారని కిషోర్ చంద్రదేవ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి గులాం నబీ ఆజాదే కారణమని వ్యాఖ్యలు చేశారు. ఆయన కేవలం తెలంగాణ నేతలు, పీసీసీ అధ్యక్షుడితో మాత్రమే మాట్లాడారని మండిపడ్డారు. -
సమస్యలు కమిటీకి చెప్పుకోమన్నారు: చిరంజీవి
సాక్షి, న్యూఢిల్లీ: విభజన విషయంలో సమస్యలేవైనా ఉంటే ఆంటోనీ కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పుకోవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారని కేంద్రమంత్రి చిరంజీవి చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారన్నారు. ‘ఒక ప్రాంతానికి న్యాయం చేసి మరో ప్రాంతానికి అన్యాయం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మాకు అంతా సమానమే. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం. సమస్యలేవైనా ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవచ్చు..’ అన్నారని తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సెటిలర్ల భవిష్యత్, వారి నమ్మకం, మూలాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయని, ఈ దృష్ట్యా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించాలని తాను కోరానన్నారు. యూటీ చేస్తే 80 శాతం వరకు ప్రజల ఉద్వేగాలు, కోపాలు శాంతిస్తాయని చెప్పానన్నారు. యూటీగా చేయని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయడంపై అందరినీ పిలిచి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. చిరంజీవి శుక్రవారం సోనియాతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్ కూడా పాల్గొన్నారు. సుమారు అరగంట సేపు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనల తీవ్రతను, రాష్ట్రంలో స్తంభించిన పాలనను పార్టీ అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లా. పార్టీ నిర్ణయం ప్రజలను షాక్‌కు గురి చేసిందని చెప్పా. సోనియా స్పందిస్తూ.. ఇది ఒక్క కాంగ్రెస్ నిర్ణయమే కాదని, అంద రినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వివిధ గ్రూపులతో కూర్చొని వారి అభ్యంతరాలు ఏమిటో విని వాటిపై చర్చించాలని, వాటిని తిరిగి తమకు చెప్పాలని సూచించారు. విభజనపై కాంగ్రెస్ వెనక్కి వెళుతుందా? లేదా? అనేది నేను చెప్పలేను. కానీ ఆంటోనీ కమిటీ తన సంప్రదింపులు పూర్తి చేసేవరకు మాత్రం విభజన ప్రక్రియ ముందుకు వెళుతుందని భావించడం లేదు’ అని చిరంజీవి చెప్పారు. సీమాంధ్ర ప్రజలు తీవ్రమైన కోపాగ్నితో ఉన్నారని, వారి కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని అన్నారు. లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ బాధాకరమని పేర్కొన్నారు. -
‘రాయల తెలంగాణ’నూ పరిశీలిస్తున్నాం: దిగ్విజయ్‌సింగ్
ఆంటోనీ కమిటీ సంప్రదింపులపై దిగ్విజయ్‌సింగ్ వెల్లడి విభజన ఏకపక్ష నిర్ణయం కాదన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఐ సమర్థించాయని వ్యాఖ్య విభజనపై ‘ఇంతవరకూ వచ్చాక వెనక్కు ఎలా వెళ్తామ’ని ప్రశ్న కమిటీ పరిశీలనలో ‘హైదరాబాద్ ప్రతిపత్తి’ కూడా ఉందని వెల్లడి ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలంటూ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసినప్పటికీ.. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన కూడా ఆంటోనీ కమిటీ పరిశీలనలో ఉందని ఆ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనటం సరికాదన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దిగ్విజయ్ బుధవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే విధంగా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికలకు ముందుగా హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న వాదనను ఆయన తిరస్కరించారు. ‘‘తెలంగాణ అంశంపై ఎంతో కాలంగా చర్చలు జరుపుతున్నాం.. అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించాం. దాదాపు అన్ని పార్టీలూ.. టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలు తెలంగాణ ఏర్పాటును సమర్థించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికంటే చివరిగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నిర్ణయం వెలువడిన తర్వాత ఇతర పార్టీలు తమ అభిప్రాయాలు మార్చుకొంటుంటే మేమేం చేస్తాం?’’ అని చెప్పుకొచ్చారు. అయితే.. సీమాంధ్ర ప్రాంత ప్రజానీకం, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరుతున్న విధంగా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని పున ఃపరిశీలించే అవకాశముందా అన్న ప్రశ్నకు.. ‘‘ఇంతవరకూ వచ్చాక వెనక్కు వెళ్లటం ఎలా సాధ్యం?’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. పరిశీలనలో ‘హైదరాబాద్ ప్రతిపత్తి’ కూడా విభజన నిర్ణయానంతరం ఎదురుకాగల సమస్యలపై రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలతో రక్షణమంత్రి ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ జరుపుతున్న సంప్రదింపుల్లో.. రాయల తెలంగాణ ఏర్పాటు, హైదరాబాద్ ప్రతిపత్తి వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయని.. వీటన్నింటినీ కమిటీ పరిశీలిస్తోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు లేవనెత్తే అన్ని అంశాలను ఆంటోని కూలంకషంగా పరిశీలిస్తుందని.. జలవనరుల పంపిణీ, ఉపాధి, ఆదాయ వనరుల సమస్యలపై కూడా కమిటీ దృష్టి సారిస్తోందని.. పరిష్కారాలు సూచిస్తుందని చెప్పారు. ఆంటోనీ కమిటీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ అంశాలపై ఒక తుది నిర్ణయం జరుగుతుందన్నారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవద్దని ఆయన విద్యార్థి సంఘాలను కోరారు. -
అది విభజన కమిటీయే!
రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు. ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది. -
అది విభజన కమిటీయే!
రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు. ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది. -
అది విభజన కమిటీయే!
రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు. ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది. -
అన్ని డిమాండ్లపై ఆంటోనీ కమిటీ చర్చ: దిగ్విజయ్
-
అన్ని డిమాండ్లపై ఆంటోనీ కమిటీ చర్చ: దిగ్విజయ్
ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి అందరి డిమాండ్లను ఆంటోని కమిటీ చర్చిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణకు అన్ని పార్టీ అనుకూలంగా చెప్పాయన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయంమార్చుకుంటే తామేమీ చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం లాంటి అంశాలు కూడా ఆంటోని కమిటి ముందు చర్చకు వస్తున్నట్లు తెలిపారు. వీటిన్నింటిపై ఆంటోని కమిటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచించుకోవాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. విద్యార్ధుల కౌన్సెలింగ్‌కు ఆటంకం కలిగించొద్దన్నారు. -
సీఎం కిరణ్‌పై నిప్పులు కక్కిన కేటీఆర్
సీఎం కిరణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు కిరణ్‌కుమార్ రెడ్డికి ఎంత మాత్రం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ సీఎం కిరణ్‌పై నిప్పులు కక్కారు. ఆంటోని కమిటీ ఎదుట హాజరైన సీఎం కిరణ్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కిరణ్‌కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దమ్ముంటే తమతో చర్చకు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం కిరణ్‌కు సవాల్ విసిరారు. అబద్దాలు మాట్లాడే కిరణ్ మంత్రి వర్గంలో ఎలా కొనసాగుతున్నారని ఈ సందర్భంగా టి.మంత్రులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. -
మొయిలీతో విజయశాంతి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మెదక్ ఎంపీ విజయశాంతి మంగళవారం నాడిక్కడ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆమె చర్చించినట్లు సమాచారం. తెలంగాణ నిర్ణయంపై సీమాంధ్రవాసుల నుండి వ్యక్తమౌతున్న అభ్యంతరాలు, విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే అధికారిక విభజన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కోరినట్లు తెలిసింది. తాను టీఆర్ఎస్ నుండి బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులను కూడా ఆమె వివరించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుతో విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన విజయశాంతి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం దాదాపు సిద్ధమైంది. ఇలావుండగా టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉంటూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఇద్దరు మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయరామారావు, ఎ.చంద్రశేఖర్లతో పాటు ఇటీవల ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మరో నేత రఘునందన్‌రావు మంగళవారం నాడిక్కడ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతగానే తాము ఆ పార్టీలో చేరామని వారు చెప్పారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని దిగ్విజయ్ వారికి సూచించారు. టీడీపీ కరపత్రాల పంపిణీకి బ్రేక్: రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని పేర్కొంటూ తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ముద్రించిన కరపత్రాల పంపిణీని పార్లమెంట్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తెలంగాణ నిర్ణయంతో ఎదురయ్యే సమస్యలపై రోజుకో బులెటిన్ విడుదల చేసి ఉభయ సభల సభ్యులకు అందజేయాలని భావించిన టీడీపీ నేతల ప్రయత్నానికి సోమవారం ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు. అయితే మంగళవారం సెంట్రల్ హాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీపీ కార్యాలయ సిబ్బందిని ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీ ఎంపీలే స్వయంగా ఇంగ్లిష్‌లో ముద్రించిన కరపత్రాలను సభ్యులకు అందజేశారు. -
ఏపి భవన్లో సీమాంధ్ర నేతల సమావేశం
ఢిల్లీ: ఏపీ భవన్లో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఈరోజు రాత్రి 8 గంటలకు వారు ఆంటోనీ కమిటీని కలవనున్నారు. ఆ కమిటీకి అందించే నివేదికపై వారు చర్చిస్తున్నారు. విభజన కారణంగా రెండు ప్రాంతాలకు జరిగే నష్టాలను వివరించాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు జరిగేనష్టాలతోపాటు పార్టీకి జరిగే నష్టాన్ని కూడా వారు కమిటీకి తెలియజేస్తారు. రాష్ట్రాన్ని విభజించినట్లయితే తమిళనాడులో మాదిరి కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండవని వారు చెప్పదలచుకున్నారు. ఒకవేళ విభజన తప్పనిసరైతే కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణలో కలపాలని ఆ జిల్లాల నేతలు కోరనున్నారు. మళ్లీ రాయల-తెలంగాణ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సమైక్యం సాధ్యం కాకుంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యక్తం చేస్తున్నారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, ఒకవేళ విభజించవలసివస్తే రాయల-తెలంగాణ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కోరుతున్నారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని పలువురు సీమాంధ్ర నేతలు కోరుతున్నారు. ఇంతకు ముందు పలువురు సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. వారు కూడా కమిటీకి చెప్పే విషయాలనే చర్చించినట్లు తెలుస్తోంది. సిఎంను కలిసిన వారిలో ఎంపిలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ని కలిశారు. ఆంటోనీ కమిటీకి చెప్పవలసిన విషయాలను వారు చర్చిస్తారని తెలుస్తోంది. సీమాంధ్ర నేతలు కలిసిన తరువాత రాత్రి 9 గంటలకు ఆంటోనీ కమిటీని సిఎం ప్రత్యేకంగా కలుస్తారు. -
ఢిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం ఉదయం ఆయన హస్తనకు పయనం అయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నట్లు సమాచారం. సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు నేడు కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. -
హైదరాబాద్ మాదే.. యూటీగా వద్దు
* ఆంటోనీ కమిటీతో కాంగ్రెస్ టీ-నేతలు * ఉమ్మడి రాజధానిగా కూడా ఒప్పుకోం * శాంతిభద్రతలను కేంద్రం తీసుకుంటే అభ్యంతరం లేదు * రాయల తెలంగాణకూ ఒప్పుకునేది లేదు.. మా సంస్కృతులు వేర్వేరు * పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి... ప్రక్రియలో వేగం పెంచాలి * నదీ జలాల పంపిణీపై రెగ్యులేటరీ అథారిటీ హామీ ఇస్తే సరిపోతుంది * సీమాంధ్ర ఉద్యమం వెనుక రాష్ట్ర పెద్దలు.. సీఎం, డీజీపీలపై ఆరోపణలు * అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై ప్రత్యేకంగా చర్చించిన ఆంటోనీ కమిటీ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో లేక శాశ్వత ఉమ్మడి రాజధానిగానో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంటోనీ నేతృత్వంలోని కాంగ్రెస్ కమిటీకి స్పష్టంచేశారు. కావాలంటే హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో శాంతిభద్రతలను పూర్తిగా కేంద్రం అజమాయిషీ కిందకి తెస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నేతలంతా ముక్తకంఠంతో తోసిపుచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు మాత్రమే తమకు సమ్మతమని తేల్చి చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇదే సమయంలో సీమాంధ్రలో ఆందోళనలను అదుపులోకి తెచ్చేలా వారికి త్వరగా రాజధాని, ప్యాకేజీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సీమాంధ్ర ఉద్యమం వెనుక పూర్తిగా రాష్ట్ర పెద్దలు ఉన్నారని, జాతీయ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా అక్కడి పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు కమిటీ ఎదుట ఆరోపించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సీమాంధ్రులు పలు అభ్యంతరాలు లేవనెత్తుతున్న తరుణంలో ఆంటోనీ కమిటీ సోమవారం రాత్రి తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయింది. ఈ సందర్భంగా.. విభజనలో నీటి పంపకాలు, హైదరాబాద్ అంశం, ఉద్యోగులు, విద్యార్థుల భద్రత, రాయల తెలంగాణ అంశం తదితరాలపై చర్చించారు. అలాగే.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో కమిటీ ప్రత్యేకంగా సమావేశమై.. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలిసింది. ఎంసీహెచ్ పరిధి కేంద్ర అజమాయిషీ ఓకే.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని.. మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ సీమాంధ్రులు వినిపిస్తున్నారని కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ప్రస్తావించినట్లు సమాచారం. దీనికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌ను సీమాంధ్రులు అభివృద్ధి చేశారనటం అవాస్తవం.. అక్కడ వారు చేసిందేమీ లేదు. అక్కడ వనరులను, అవకాశాలను వాడుకొని బాగుపడ్డారంతే. హైదరాబాద్‌లో రాజస్థాన్, సూరత్, మహారాష్ట్ర ప్రజలూ ఉన్నారు. వారికి లేని అభద్రత సీమాంధ్రులకు అక్కర్లేదు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలో శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారని.. ఎంసీహెచ్ పరిధిలో శాంతిభద్రతలను కేంద్ర అజమాయిషీ కిందకు తెస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. రాయల తెలంగాణకు నో.. రాయల తెలంగాణ అంశాన్ని మరోమారు దిగ్విజయ్‌సింగ్ ప్రస్తావిస్తూ.. రాయలసీమలోని రెండు వెనకబడిన జిల్లాలను తెలంగాణలో కలిపితే నదీ జలాల అంశం పరిష్కారమవుతుంది కదా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి నేతలంతా మూకుమ్మడిగా అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ‘సీమ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ప్రజల మనస్తత్వం పూర్తిగా సౌమ్యంగా ఉంటే వారు అందుకు భిన్నంగా ఉంటారు’ అని యాదవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కర్నూలు, అనంతపురం జిల్లాలు గతంలో తెలంగాణలో భాగమే కదా? అని దిగ్విజయ్ ప్రశ్నించగా.. దామోదర స్పందిస్తూ ‘1799లో టిప్పుసుల్తాన్ యుద్ధ సమయంలో తెలంగాణలో భాగంగా ఉన్న బళ్లారి, కర్నూలు, అనంతపురం, కడపలను సీడ్ చేశారు. ఇది జరిగి 200 ఏళ్లు గడిచింది. కాబట్టి వారికి, తెలంగాణ వారికి వైరుధ్యాలు అనేకం ఉన్నాయి’ అని చెప్పినట్లు తెలిసింది. సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే అంతా కోరుతున్నారని స్పష్టంచేసినట్లు సమాచారం. అలాగే.. నదీ జలాల వివాదాలకు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగాయని, ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయని భావిస్తే, రెగ్యులేటరీ అథారిటీ ద్వారా వాటిని పరిష్కారిస్తామని కేంద్రం వారికి బిల్లు సమయంలోనే హామీ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ తీరును కమిటీ వద్ద టీ-నేతలు తప్పుపట్టిన ట్లు సమాచారం. అక్కడ రాజీవ్, ఇందిర విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా సీఎం పట్టించుకోవటం లేదని, ఆందోళనలకారులు విచ్చలవిడిగా చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం చేతులు క ట్టుకుని చూస్తోందని ఆరోపించినట్లు తెలిసింది. దిగ్విజయ్ స్పందిస్తూ అక్కడి పరిణామాలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. ఎవరు వస్తే వారి వాదనలు వింటాం: దిగ్విజయ్ పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు బిజీగా ఉన్నందున హైదరాబాద్‌లో సమావేశం పెట్టలేకపోయామని దిగ్విజయ్‌సింగ్ భేటీ అనంతరం మీడియాతో పేర్కొన్నారు. ‘ఇలాంటి సమావేశం హైదరాబాద్‌లో జరగాల్సింది. అయితే పార్లమెంటులో సమావేశాల్లో మొయిలీ, ఆంటోనీ బిజీగా ఉన్నారు. అందువల్లఅక్కడికి వెళ్లలేకపోయాం. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇక్కడకు పిలిపించాం. వారి వాదనలు విన్నాం. రేపు కూడా ఈ సమావేశం జరుగుతుంది’ అని చెప్పారు. మంగళవారం ఎవరని పిలుస్తారు అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘నువ్వైనా రావచ్చు. ఎవరు వస్తే వారి వాదనలు వింటాం’ అని ఆయన బదులిచ్చారు. యూటీగా ఒప్పుకోం: ఉత్తమ్, గీతారెడ్డి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకునేది లేదని మంత్రులు గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు స్పష్టంచేశారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్కడ ఉన్న ఇతర ప్రాంతాల వారి మాదిరే సీమాంధ్రులకు భద్రత ఉంటుందని తాము భరోసా ఇస్తున్నామన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మధ్యలో వచ్చిన ఎంపీ రేణుకాచౌదరి సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. -
హస్తినకు నేడు సీఎం కిరణ్
* అధిష్టానం పిలుపు.. * సమైక్య ఉద్యమం, తాజా పరిస్థితులపై చర్చ * నేడు ఆంటోనీ కమిటీ ముందుకు సీమాంధ్ర ప్రతినిధులు * అంతకుముందే ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ కానున్న కమిటీ * ఢిల్లీ పర్యటనకు దూరంగా సీనియర్ మంత్రులు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ వెళ్లనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది. విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో ఇంత తీవ్ర నిరసన ఎదురవుతుందని అంచనా వేయలేకపోయిన పార్టీ పెద్దలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆదరాబాదరాగా వెలువరించిన అధిష్టానం... సీమాంధ్రనేతల ప్రతిఘటన నేపథ్యంలో దాని అమలులో మాత్రం నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలతో భేటీలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం ఆంటోనీ కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించారు. సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మంగళవారం కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. విభజన కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో అవి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని సీమాంధ్ర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రప్రాంత నేతలతో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశంలో వారంతా ఈ సమస్యలను ఏకరవుపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండుసార్లూ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ రెండింటిపైనా సీఎం, పీసీసీ అధ్యక్షులిద్దరూ సంతకాలు చేశారు. ఈ లేఖలు ఆంటోనీ కమిటీకి కూడా పంపించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో అంతకుముందుగానే సీఎం ఆ కమిటీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెలువరిస్తున్న అనుమానాలను ఆయన పార్టీ అధిష్టానానికి, ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయం అమలులో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలను కూడా ఆయన పార్టీ పెద్దలకు తెలియచేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీకి సీమాంధ్ర నేతలు ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పలువురు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం మంత్రులు శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి హస్తిన వెళ్లారు. గంటా శ్రీనివాసరావు, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, పార్థసారథి తదితర మంత్రులు మంగళవారం ఉదయం వెళ్లనున్నారు. విభజన వల్ల ఎదురయ్యే అంశాలపై సమగ్రమైన వివరాలతో ఒక నోట్‌ను ఆంటోనీ కమిటీకి అందించనున్నారు. అధిష్టానం కనుక తమ మాటను వినిపించుకోలేని పరిస్థితులు కనిపిస్తే మాత్రం అంతిమంగా తమ జిల్లాలను తెలంగాణతో పాటు కలిపి ఉంచాలన్న వాదనను తెరపైకి తేవాలని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు భావిస్తున్నారు. అయితే మంత్రి శైలజానాథ్, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి సమైక్యవాదులుగా ఉన్నందున వారిద్దరూ ఈ విషయంలో మౌనందాల్చే పరిస్థితి కనిపిస్తోంది. దూరంగా సీనియర్ మంత్రులు సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు దూరంగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఒకరిద్దరు మంత్రులు ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్నా... వారు జూనియర్లు కావడంతో పార్టీ అధిష్టానంలో కానీ, ఇటు రాష్ట్ర నేతలపై కానీ అంతగా ప్రభావం పడడం లేదు. అదే సీనియర్లు రంగంలోకి దిగి ఉంటే అధిష్టానం కూడా ఒకింత స్పందించేందుకు అవకాశముంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా సీమాంధ్ర నేతలందర్నీ పదేపదే ఢిల్లీకి తీసుకువెళ్లడం తలకు మించిన భారంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నా... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరైనా ఢిల్లీ యాత్రకయ్యే ఖర్చులు భరిస్తేనే వస్తామన్నట్లుగా వ్యవహరిస్తుండడం బాధ్యతలు తీసుకున్న మంత్రులకు సమస్యగా మారింది. ‘‘మేమెన్ని సార్లని భరిస్తాం. విమాన టిక్కెట్లు తీయడం, ఢిల్లీలో వసతి, భోజన రవాణా ఏర్పాట్లు చేయించడం మావల్ల అయ్యేది కాదు. ఒకటిరెండుసార్లు అంటే ఫర్వాలేదు కానీ వరుసగా అన్నీ మేమే భరించాలంటే కష్టమే. అందుకే ఢిల్లీ యాత్ర ఉంది రండని సమాచారమిస్తున్నాం. సొంత ఖర్చులతో వచ్చేవారు వస్తారు. లేని వారు మానేస్తారు. ఇంతకుమించి మేము కూడా ఏమీ చేయలేం’’ అని ఒక నేత తమ బాధలు వివరించారు. -
అధిష్టానం నుంచి సీఎంకు పిలుపు
-
అధిష్టానం నుంచి సీఎంకు పిలుపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు ఉదయం 9.45 గంటలకు బయలుదేరి ఆయన ఢిల్లీ వెళతారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత పార్టీ పెద్దలను కూడా ఆయన కలుస్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షించేందుకే సిఎంని పిలిపించినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను అధిష్టానానికి ఆయన వివరించే అవకాశం ఉంది. యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. -
అంటోని కమిటీకి చెపితే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే
-
హస్తినకు సీమాంధ్ర, తెలంగాణ నేతలు
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మళ్లీ హస్తిన బాటపట్టారు. ఇరు ప్రాంతాల నేతలు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై వెనకడుగు లేదంటూనే, తమ వాదనలు పార్టీ కమిటీకి వినిపించుకోవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ తెగేసి చెప్తోంది. ఈ పరిస్థితిలో ఏర్పాటైన ఆంటోనీ కమిటీకి తమతమ వాదనలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. సీమాంధ్ర ఒత్తిళ్ళకు తలొగ్గి విభజనపై వెనకడుగు వేయవద్దన్న వాదన వినిపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ బృందం సన్నద్ధమైంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి ఎకె ఆంటోని నేతృత్వంలోని పార్టీ కమిటీని టి.కాంగ్రెస్ బృందం కలిసి తమ వాదన వినిపించనుంది. రాత్రి ఎనిమిది గంటలకు ‘వార్ రూం’లో భేటీ జరగబోతోంది. ఇదిలావుంటే, ఆంటోని కమిటీని కలిసిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని ఇరు ప్రాంతాల నేతలూ భావిస్తున్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలు, సమస్యలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం ఆంటోనీ కమిటీని కలవనున్నారు. -
సమైక్య ఊసే వద్దు: బొత్స సత్యనారాయణ
‘‘రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం జరిగిపోయింది. ఈ విషయంలో ఇక వెనక్కు పోయే ప్రసక్తే లేదు. ఇకపై సమైక్యమనే ఊసే వద్దు. విడిపోతే సీమాంధ్రలో ఎదురయ్యే సమస్యలను మాత్రమే చెప్పండి. ఇది నా మాట కాదు... హైకమాండ్ మాటగా చెబుతున్నా’’ - పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ‘‘మా అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడానికి హైకమాండ్ ఎవరు? నిర్ణయం తీసుకున్నాక ఇక మాతో పనేముంది? మమ్మల్ని ఇక్కడికెందుకు పిలిచినట్టు? ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లి ఏం చేయాలి? హైకమాండ్ మాటలు మోసుకొచ్చే బదులు మీరెందుకు వాళ్లకు నచ్చజెప్పలేదు? హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అయితే పార్టీలో ఎవరూ ఉండరు. ఎవరి దారి వారే చూసుకుంటారు’’ - బొత్సపై సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ధ్వజం ‘‘విభజన విషయంలో తొందర పడాల్సిందేమీ లేదు. ఇంకా 10 శాతం కూడా ప్రక్రియ కాలేదు. మొత్తం ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుంది. కేబినెట్ నోట్ మొదలు అసెంబ్లీ, పార్లమెంటు బిల్లు, రాష్ట్రపతి ఆమోదం వరకు చాలా ప్రక్రియలున్నాయి. అసలు ప్రక్రియ ఇప్పటిదాకా మొదలే కాలేదు. విభ జిస్తే ఎన్ని సమస్యలొస్తాయో మేం చెప్పి చూశాం. ప్రజల నాడి ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. సీమాంధ్ర ఉద్యమాల గురించి, ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారనే విషయాన్ని ఆంటోనీ కమిటీకి చెప్పండి. ఢిల్లీ వెళ్లకపోతే సోనియాగాంధీని, ఇతర పెద్దలను కలిసే అవకాశం ఉండకపోవచ్చు’’ - సీమాంధ్ర నేతలను బుజ్జగించిన సీఎం కిరణ్ ‘‘ఆంటోనీ కమిటీ వద్దకు 10 నుంచి 15 మంది ప్రతినిధుల బృందం వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరదాం. విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ నివేదిక అందజేద్దాం. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిద్దాం. కే ంద్ర కేబినెట్‌కు తెలంగాణ బిల్లు నోట్ వస్తే కేంద్ర మంత్రులు కూడా వ్యతిరేకించాలి. అవసరమైతే వారితో రాజీనామాలు చేయించాలి’’ - సమావేశ ముగింపు సందర్భంగా నేతల మధ్య వచ్చిన ఏకాభిప్రాయమిది. ఈ మేరకు నేతలతోపాటు కిరణ్, బొత్స కూడా తీర్మానంపై సంతకాలు చేశారు సాక్షి, హైదరాబాద్: శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆరున్నర గంటలపాటు జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం నేతల మధ్య వాడివేడి చర్చకు వేదికైంది. 18 మంది మంత్రులు, 45 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్న సమావేశంలో ముందుగా బొత్స మాట్లాడారు. అందులో పాల్గొన్న నేతలు చెప్పిన మేరకు... హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తామన్న సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదని హైకమాండ్ తనకు చెప్పిందని ఆయనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే మాట తప్ప ఇతర సమస్యలేమైనా ఉంటే చర్చించేందుకు రావాలని కూడా సూచించిందన్నారు. తద్వారా సీమాంధ్ర ఆందోళనలను ఎలా తగ్గించాలి, ఏం చేయాలో సలహాలివ్వాలని కోరిందన్నారు. బొత్స మాటలు పూర్తయీ అవకముందే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడినట్టు తెలుస్తోంది. మంత్రులు వట్టి వసంతకుమార్, గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘మా అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడానికి హైకమాండ్ ఎవరు? వాళ్లకు ఏం తెలుసని నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం జరిగాక ఆంటోనీ కమిటీని ఎందుకు వేసినట్టు? ప్రక్రియ ఆగదని చెబుతున్నారు. అంటే ఈ కమిటీ బోగస్దా? దానికి విలువేమున్నట్టు? అసలే సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇకపై మేం నియోజకవర్గాలకు కూడా వెళ్లలేం. 2009 డిసెంబర్ 9న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే వెనక్కు తీసుకున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం ఎంత?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అలాగాక హైకమాండ్ నిర్ణయమే ఫైనలంటే ఇక ఎవరి దారి వారు చూసుకుంటారంటూ కుండబద్దలు కొట్టారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాక ఆంటోనీ కమిటీని ఎందుకు వేశారని ప్రశ్నించడమే గాక, ఢిల్లీ వెళ్లి తామేం చేయాలని కూడా నిలదీశారు. హైకమాండ్ మాటలను మోసుకొచ్చే బదులు పీసీసీ అధ్యక్షుడిగా, సీమాంధ్ర ఎమ్మెల్యేగా వాస్తవాలను వివరించి ఢిల్లీ పెద్దలకు ఎందుకు నచ్చజెప్పలేదంటూ బొత్సపై ధ్వజమెత్తారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున ఇక ఆంటోనీ కమిటీని కలవాల్సిన అవసరం కూడా తమకు లేదంటూ భీష్మించారు. సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్పి, ఆందోళనలను ఎలా కట్టడి చేయాలనే అంశాలపై సూచనలు చేయాలని హైకమాండ్ చెప్పినందునే సమావేశానికి పిలిచామని బొత్స వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా నేతలెవరూ శాంతించలేదు. దాంతో సీఎం వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘‘తొందరపడొద్దు. విభజన ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. ప్రక్రియ మొత్తం పూర్తవాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుంది. కేంద్ర కేబినెట్ నోట్ మొదలు పార్లమెంటులో బిల్లు, రాష్ట్రపతి ఆమోదం వరకు అనేక దశలున్నాయి. ఆవేశాలకు లోనుకాకుండా, విభజిస్తే ఎన్ని సమస్యలొస్తాయో హైకమాండ్‌కు చెప్పాలి. ఈ విషయంలో మేం చెప్పాల్సిందంతా చెప్పాం. ఇక క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. సీమాంధ్రలో ఆందోళనలెందుకు వచ్చాయో, జనం రోడ్లపైకి ఎందుకు వస్తున్నారో వివరించి హైకమాండ్‌కు నచ్చజెప్పేందుకైనా మీరు ఆంటోనీ కమిటీని కలవాలి. ఇప్పుడు ఆ కమిటీని కలవకపోతే భవిష్యత్తులో సోనియాగాంధీ, ఇతర పెద్దలను కలిసే అవకాశాన్ని కోల్పోతాం’’ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వట్టి, వరప్రసాద్ తదితరులు ఆగ్రహంతో సమావేశం నుంచి మధ్యలోనే నిష్ర్కమించగా, మిగతా నేతలు మాత్రం శాంతించినట్టు తెలిసింది. దాంతో ఒక్కో నేతనూ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కిరణ్, బొత్స కోరారు. నేతలంతా సమైక్యవాదం విన్పించినా...అనంతపురం, కర్నూలు జిల్లా నేతలు మాత్రం రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారు! ముఖ్యంగా ఏరాసు, జేసీ, అనంతపురం డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా తాము రాయల తెలంగాణకే మొగ్గు చూపుతున్నామని స్పష్టం చేశారు. వెంటనే గాదె లేచి, ‘‘మీరు రాయల తెలంగాణ అనడం వల్ల సమైక్య నినాదం నీరుగారిపోతోంది. దయచేసి అందరం ఒకే మాట మీద నిలబడదాం’’ అని కోరారు. జేసీ స్పందిస్తూ, ఆంటోనీ కమిటీ వద్ద తాము సమైక్య వాదానికే కట్టుబడి ఉంటామని చెబుతామన్నారు. ఒకవేళ కుదరదని చెబితే మాత్రం కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయాలని కోరతామని స్పష్టం చేశారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నేతలంతా ఇప్పటికే రాయల తెలంగాణ కోరుతూ సోనియాగాంధీకి వినతిపత్రం కూడా ఇచ్చారని ఏరాసు గుర్తు చేశారు. దాంతో నేతల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేస్తే తప్ప హైకమాండ్ దిగిరాదన్న భావన వ్యక్తమైంది. కేంద్ర కేబినెట్ వద్దకు తెలంగాణ నోట్ వస్తే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామా చేయాలని, పార్లమెంటులో బిల్లు వస్తే సీమాంధ్ర ఎంపీలూ రాజీనామా చేయాలని, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించి మంత్రులు, ఎమ్మెల్యేలంతా పదవుల నుంచి తప్పుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడమే గాక సమావేశంలో గందరగోళం నెలకొనడంతో కిరణ్ జోక్యం చేసుకున్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందరూ కోరండి. ఇప్పుడు హైకమాండ్‌పై ఒత్తిడి తేకపోతే తరవాత అసలే మాట వినే పరిస్థితి లేదు’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం రూపొందించడంతో పాటు సీఎం, పీసీసీ చీఫ్ కూడా దానిపై సంతకం చేశారు. అదే సమయంలో ఢిల్లీకి నేతలంతా కాకుండా 15 మందికి మించకుండా బృందంగా వెళ్లాలని నిర్ణయించారు. మంత్రుల తరఫున శైలజానాథ్, గంటా, ఏరాసు, ఎమ్మెల్యేల తరఫున గాదె, జేసీ, మధుసూదన్ గుప్తా, ఎమ్మెల్సీల తరపున పద్మరాజు తదితరులు కమిటీ ముందు హాజరవాలని నిర్ణయించారు. దీంతోపాటు సీమాంధ్రలో శాంతియుతంగా ఆందోళన చేయాలని ప్రజలను కోరుతూ మరో తీర్మానం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలని కూడా విజ్ఞప్తి చేద్దామని బొత్స ప్రతిపాదించగా నేతలు వ్యతిరేకించారు. వారికి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా విజ్ఞప్తి చేస్తామని ప్రశ్నించడంతో బొత్స మిన్నకుండిపోయారు. అనంతరం పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ, సమైక్యవాదాన్ని విన్పించేందుకు ఈ నెల 20న ఢిల్లీకి ప్రతినిధి బృందంగా వెళ్లాలని తీర్మానించినట్టు తెలిపారు. -
ఆంటోని కమిటీ ఉత్తుత్తి కమిటీయే..!
-
అది ఉత్తుత్తి కమిటీయే
-
అది ఉత్తుత్తి కమిటీయే
కాంగ్రెస్ ప్రకటనకు, కేంద్రం కదలికకు పొంతనే లేదు కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు వినడానికే ఆంటోనీ కమిటీ ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపు దేని పని దానిదే అన్నట్లుగా సాగిపోతున్నా నోరెత్తని కాంగ్రెస్ ముఖ్యులు కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టంచేసిన బొత్స సమైక్య ఉద్యమమూ మీడియాతోనే ఉధృతమవుతోందని అభిప్రాయం 19, 20 తేదీల్లో ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర నేతలతో కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానంతో ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీకి ఎలాంటి ప్రాధాన్యమూ లేదని, అది ఉత్తుత్తి కమిటీయేనని స్పష్టమవుతోంది. కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటనకు, తెలంగాణ ప్రక్రియపై కేంద్రం కదలికలకు పొంతనే కనిపించడం లేదు. తెలంగాణ తీర్మానంతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమ వేడిని తాత్కాలికంగా చల్లార్చడానికి ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ కంటితుడుపుగా తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. కమిటీ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నామనే పేరుతో ఉద్యమ ఉధృతిని తగ్గించి ఆపై తన పనిని సాఫీగా కొనసాగించేందుకే కాంగ్రెస్ పెద్దలు కమిటీ నాటకానికి తెరతీసినట్లు తాజా పరిస్థితి స్పష్టం చేస్తోంది. తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపునకు, ఆంటోనీ కమిటీ అభిప్రాయాల సేకరణకు సంబంధం లేదని, దేని దారి దానిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అభ్యంతరాలు, అభిప్రాయాలు మాత్రమే వింటుంది తప్ప ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం చేపట్టే ప్రక్రియతో ఈ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని బొత్స పేర్కొంటుండడం గమనార్హం. ‘‘కమిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలు వింటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియను కేంద్ర హోంశాఖ కొనసాగిస్తూ పోతుంది. ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రక్రియ ఆగబోదు. దేని పని దానిదే’’ అని బొత్స సత్యనారాయణ శుక్రవారం తనను కలసిన మీడియాతో అన్నారు. పైగా కమిటీ నివేదిక ఇవ్వడానికి గడువు లేదని ఆయన అంటున్నారు. కమిటీ స్వీకరించే అభిప్రాయాలతో కానీ, అది ఇచ్చే నివేదికలతో కానీ కేంద్రానికి సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. కమిటీకి సీమాంధ్ర ప్రాంత నేతలు చెప్పే అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే రాజ్యాంగపరమైన చర్యలను కేంద్రం కొనసాగించుకుపోతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు గొంతెత్తడం లేదు. సీడబ్ల్యూసీ తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినందున వారందరినీ ఏకాభిప్రాయంలోకి తెచ్చేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని బొత్స పేర్కొంటున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే అందరినీ నడిపించేందుకు తప్ప సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను వినడం ఈ కమిటీ లక్ష్యం కాదన్న అంశం బొత్స మాటల్లోనే తేటతెల్లమవుతోంది. అభిప్రాయాల స్వీకరణ తూతూమంత్రంగానే.. ఆంటోనీ కమిటీ అభిప్రాయాల స్వీకరణ తీరు కూడా ఏదో తూతూమంత్రంగానే అన్నట్లు సాగుతోంది. ఇలా అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత ఉద్యమవేడి చల్లారగానే కేంద్రం తన ప్రక్రియను ముందుకు తీసుకుపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ కమిటీ ఢిల్లీ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం పార్లమెంటు జరగని రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే ప్రయత్నం కూడా కమిటీలో కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాలున్నందున ఈనెల 30 వరకు కమిటీ ఎక్కడికీ వెళ్లదని, ఎవరైనా అక్కడికే వెళ్లి అభిప్రాయాలు చెప్పుకోవాలని, అది కాంగ్రెస్ అంతర్గతవ్యవహార కమిటీ కనుక ఆ పార్టీ నేతల కే అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా స్వేచ్ఛగా కమిటీ ముందు హాజరయ్యే పరిస్థితి అసలే లేదు. కమిటీని ఎవరు కలవాలన్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పాలి. కమిటీని కలుస్తామనే వారి వివరాలను వారిద్దరూ ఏఐసీసీకి పంపిస్తారు. ఆ తర్వాత కమిటీ అనుమతిని అనుసరించి ఎంపికచేసిన నేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. బయటి వ్యక్తులకు అసలు అవకాశమే ఇవ్వకుండా కమిటీతో చర్చల తతంగాన్ని పైపైనే ముగించాలన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. ఇదిలా ఉంటే అందుకు విరుద్ధంగా బయటి వ్యక్తులకు, సంస్థలకు అవకాశమిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స కొద్దిరోజులక్రితం చేసిన ప్రకటన పార్టీలో వివాదాస్పదమైంది. ఆ ప్రకటనలో ఒక ఫోన్ నంబర్‌ను కూడా ఆయన ఇచ్చారు. ఈ ప్రకటనపై ఏఐసీసీ అగ్ర నేతలు బొత్సపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో కంగుతిన్న బొత్స శుక్రవారం మాటమార్చారు. ఇది పార్టీ అంతర్గత కమిటీయేనని, పార్టీ నేతల్లోని అపోహలను తొలగించడానికే దీన్ని ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ ఇచ్చిన ఫోన్ నంబర్‌కు దాదాపుగా 200కు పైగా కాల్స్, 60కి పైగా ఎస్సెమ్మెస్‌లు వచ్చాయని తెలుస్తోంది. ‘‘మాకు వచ్చిన ఎస్సెమ్మెస్‌లలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. 13 గ్రూపులు మాత్రం అపాయింట్మెంటు కోరాయి. వాటిలోనూ స్పష్టత లేదు. చాలా మంది కమిటీ ముందు చెప్పాల్సిన అభిప్రాయాలను మెసేజ్ రూపంలో ఇచ్చారు’’ అని బొత్స పేర్కొన్నారు. పార్టీని సంప్రదించిన సంస్థలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేకపోవడం కారణంగానే అవేవీ ప్రతిష్టాత్మకమైనవి కావని పార్టీ నేతలు పక్కన పెట్టేస్తున్నారు. సీఎంతో బొత్స భేటీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈనెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో ఆంటోనీ కమిటీ.. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. ఆంటోనీకి నివేదించాల్సిన అంశాలపై చర్చించేందుకు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శనివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం, బొత్స పాల్గొంటారు. కాగా, ఆంటోనీ కమిటీతో సమన్వయం చేసుకునేందుకు ఈనెల 19న బొత్స ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం మాత్రం ఢిల్లీ వెళ్లాలా లేదా అన్న మీమాంసలో ఉన్నట్లు తెలిసింది. మీడియాపై కాంగ్రెస్ గుర్రు సీమాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ముద్దాయిగా మారడంతో ఆ పార్టీ నేతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పార్టీ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్మానాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నా గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయలేకపోతున్నారు. ఉద్యమం కారణంగా ప్రజల్లోనూ తిరగలేకపోతున్నారు. దీంతో ఉద్యమంపై వార్తలు, కథనాలు ప్రసారం చేస్తున్న మీడియాపై అక్కసును వెళ్లగక్కుతున్నారు. ‘‘ఈ పరిస్థితి అంతటికీ మీరే కారణం. మీడియా యాజమాన్యాలు సొంత ఎజెండాలు పట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. సీమాంధ్రలో ఉద్యమాన్ని ఎగదోస్తున్నాయి. అక్కడ జరుగుతున్న దాన్ని మరింతగా చూపిస్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలోనూ మీడియా సంస్థలు ఇలాగే వ్యవహరించాయి. ఇది మంచిది కాదు. ప్రజలకు న్యాయం జరిగేలా మీడియా ఉండాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. -
షిండే వచ్చేదాకా సాగదీత..!
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: ఓవైపు రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో మిన్నంటుతున్న నిరసనలు.. మరోవైపు హోంమంత్రి షిండే ఆసుపత్రిలో ఉండడంతో తెలంగాణపై ముందుకు వెళ్లలేని పరిస్థితి..! ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతలతో చర్చలు, సంప్రదింపుల పేరుతో వీలైనంత మేర కాలాన్ని సాగదీసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. అంతేగానీ సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలకు సమాధానం చెప్పడానికిగానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల డిమాండ్లను ఆలకించడానికి కాదని తెలుస్తోంది. పార్టీలోని అత్యున్నతస్థాయి వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. షిండే ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల చివరకు కూడా ఆయన ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదు. అప్పటిదాకా చర్చలు, సంప్రదింపుల పేరుతో సాగదీతను కొనసాగించాలని ఆంటోనీ కమిటీకి అధిష్టానం పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధ్యయనం పూర్తయింది. షిండే రాగానే తెలంగాణపై ముసాయిదా రూపొందిస్తాం. ఇందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముసాయిదా తయారయ్యే వరకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామన్న భావన కల్పించేందుకు ఆంటోనీ కమిటీ దోహదపడుతుంది’’ అని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలుద్దాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మనోభావాలను ఆంటోనీ కమిటీకి ప్రత్యేకంగా నివేదించాలని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. దీనిపై రూపొందించిన రహస్య నివేదికను కమిటీకి అందజే సేందుకు వారు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆంటోనీ కమిటీతో భేటీకి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్ శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఆంటోనీ కమిటీ తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలను వినేందుకు సిద్ధమైన నేపథ్యంలో బొత్స తెలంగాణ మంత్రులకు ఈ సమాచారం అందించారు. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చి బొత్సను కలిశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలుస్తామని, 19న అపాయింట్మెంట్ ఖరారు చేయాలని కోరారు. అప్పటికే అక్కడికి వచ్చిన దానం నాగేందర్ మాత్రం వారితో విభేదించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అనేక అనుమానాలు, ఆందోళనలు ఉన్నందున తాము ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలుస్తామన్నారు. ఈ మేరకు తమకు అపాయింట్మెంట్ కావాలని బొత్సను కోరారు. ఆంటోనీ కమిటీతో మాట్లాడిన తరువాత అపాయింట్మెంట్ ఖరారు చేస్తానని బొత్స బదులిచ్చినట్లు తెలిసింది. సమావేశానంతరం దానం మీడియాతో మాట్లాడుతూ ఆంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలవనున్న విషయం చెప్పారు. యథాతథంగా అమలు చేయాల్సిందే: టీ మంత్రులు పీసీసీ చీఫ్ బొత్సతో సమావేశమైన అనంతరం తెలంగాణ మంత్రులతో కలిసి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ, యూపీఏ చేసిన తీర్మానాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆంటోనీ కమిటీని కోరతామన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజన విషయంలో భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి అవసరమైన సాయం కూడా అందించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అందులో భాగంగా ఈ నెల 18న మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నందుకు సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ప్రజాప్రతినిధులను కూడా ఈ భేటీకి ఆహ్వానిస్తామని, ఈ విషయంలో వారిని ఒప్పిస్తామని జానా, శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం తమకు దైవ శాసనమని, మనసా వాచా అమలు చేయిస్తామని చెప్పారు. విభజన విషయంలో అందరికీ సమన్యాయం చేయాలని ఈనెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష చేయాలని తలపెట్టడాన్ని పొన్నం తప్పుపట్టారు. అందరికీ సమన్యాయమంటే ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఒకవైపు హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరోవైపు సీమాంధ్ర ఎంపీలతో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని పార్లమెంటులో నినాదాలు చేయిస్తూ సభను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. -
మళ్లీ తెరపైకి రాయల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన రాయలసీమను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుందని, ముఖ్యంగా నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందన్న విషయంలో ఆంటోనీ కమిటీకి నివేదించి తద్వారా రాయల తెలంగాణ ప్రతిపాదనను పరిశీలించాలని కాంగ్రెస్‌కు చెందిన కర్నూలు, అనంతపురం నేతలు కోరనున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలనూ సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారమిక్కడ మంత్రులు సాకే శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఏరాసు ప్రతాప్‌రెడ్డి తనతోపాటు నీటిపారుదల రంగ నిపుణుల్ని కూడా తీసుకొచ్చారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించినా, విభజన ద్వారా తలెత్తే సమస్యలను ఏకరువుపెడుతూ తమ పరిస్థితి దృష్ట్యా తెలంగాణతోనే కలసి ఉంటామని కమిటీ ఎదుట చెప్పాలన్న నేతలు అభిప్రాయానికి వచ్చారు. రాయలసీమ అత్యధిక శాతం పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చే కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉందని, రాష్ట్ర విభజనతో అక్కడినుంచి నీటి విడుదలలో చాలా సమస్యలు తలెత్తుతాయని, నీటి పంపకాల్లో తమకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిర్ణీత పరిధి మేరకు నీటిని నిలువ ఉంచడం ద్వారానే శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అందుతుందని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తికోసం నిర్ణీత ఎత్తులో నిలవ ఉంచకుండా నీటిని కిందికి వదిలేస్తే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు అందదని.. ఫలితంగా తాగు, సాగునీటికి కటకటలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. నికరజలాలు కేటాయింపులేని ప్రాజెక్టుల పరిస్థితి మరింత అయోమయంలో పడతాయని నేతలు అంచనాకు వచ్చారు. ఈ అంశాలన్నిటిపై నీటిపారుదల నిపుణుల నుంచి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ఆంటోనీ కమిటీ ముందు వీటన్నింటినీ వివరించాలని నిర్ణయించారు. -
‘సీఎం కిరణ్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు’
హైదరాబాద్: విద్యుత్ రంగం సమస్యలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీ.జేఏసీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో భాగంగా వారు డీప్యూటీ సీఎం రాజ నర్శింహను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై సీఎం అసత్యాలు మాట్లాడుతన్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. వాటి వివరాలను డీప్యూటీ సీఎంకు వివరించామన్నారు. ఈ నెల 19 వ తేదీన ఆంటోనీ కమిటీతో సమావేశమై తమ వాదనలను సమర్ధవంతంగా వినిపిస్తామన్నారు. తెలంగాణ కల సాకరమవడానికి రాజనర్శింహనకృషి చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృతసాయి సమావేశాన్ని నిర్వహించడానిక సన్నద్దమవుతున్నారు. -
విజయమ్మ దీక్షకు మంత్రి గంటా మద్దతు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిందని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నామని, తాము ఆశాజీవులమని...రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు గంటా తెలిపారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి అభిప్రాయాలు సేకరించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సహా విశాఖ, విజయవాడ, అనంతపురంలో ఆంటోనీ కమిటీ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నట్లు గంటా తెలిపారు. అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీ ఎన్జీవోల సమ్మెకు మంత్రి తన మద్దతు తెలిపారు. -
విభజన జరిగిపోయింది... మీకేం కావాలో చెప్పండి
-
విభజన జరిగిపోయింది... మీకేం కావాలో చెప్పండి
* సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఆంటోనీ కమిటీ స్పష్టీకరణ * మీ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడుకునే ప్రతిపాదనలు చేయండి * రెండో ఎస్సార్సీ ఏర్పాటు ప్రతిపాదనకు నో చెప్పిన హైకమాండ్ పెద్దలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రుల డిమాండ్‌ను ఆంటోనీ కమిటీ తిరస్కరించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని లేదా దేశంలో ‘ప్రత్యేక’ డిమాండ్లనన్నింటినీ పరిశీలించేందుకు రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్(ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసి సీమాంధ్రలో కాంగ్రెస్‌ను కాపాడుకొనే ప్రయత్నం చేయాలన్న సూచనను కూడా అధిష్టానం పెద్దలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. పార్టీలో అత్యున్నత స్థాయిలో నిర్ణయం జరిగిపోయినందున మీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అవసరమైన ప్రతిపాదనలు మాత్రమే చేయాలని ఆంటోనీ కమిటీ సీమాంధ్ర ప్రతినిధులకుస్పష్టంచేసింది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకే సంప్రదింపుల ప్రక్రియను చేపట్టామని తెలిపింది. గురువారం కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రాత్రి పొద్దుపోయిన తర్వాత కమిటీ సభ్యులైన ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, వి.కిశోర్‌చంద్ర దేవ్, ఎం.ఎం.పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జె.డి.శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, తిరుపతి ఎంపీ చింతా మోహన్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఈ భేటీ సాగింది. సమావేశంలో ముందుగా కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, వివిధ వర్గాలలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను వివరించినట్లు తెలిసింది. రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకోవడాన్ని కిశోర్‌చంద్ర దేవ్ ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నిర్ణయం వెలువడినప్పటి నుంచీ కోస్తా, రాయలసీమల్లో ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం తీరుతెన్నులను మిగిలిన మంత్రులు వివరించారు. రాష్ట్రాన్ని విడదీస్తూ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని, ప్రజలు తమంతట తాముగా స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తున్నారని, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాలు ప్రజల ఆందోళనలు చేస్తున్నారని, పార్టీని, పదవులను వదులుకోవాల్సిందిగా తమపై విపరీతమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాల శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా ఢిల్లీ తరహాలో ప్రకటించాలన్న వాదనను కూడా కమిటీ సభ్యులు కొట్టిపారేసినట్లు తెలిసింది. హైదరాబాద్ లేకుండా రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 80, 90 స్థానాలు మాత్రమే ఉంటాయని, దానివల్ల నిరంతరం రాజకీయ అస్థిరత సమస్య తలెత్తే ప్రమాదముందని ఆంటోనీ అభిప్రాయపడినట్లు సమాచారం. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించినంత కాలం మాత్రం ైెహ దరాబాద్ పరిధిలో శాంతిభద్రతల వంటి కొన్ని శాఖలు గవర్నర్ అధీనంలో ఉంచుతామని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం. ప్రజల ఆందోళనలను వివరించాం: పల్లంరాజు, చిరంజీవి రాష్ట్ర విభజనతో ఎదురయ్యే తీవ్రమైన సమస్యలను ఆంటోనీ కమిటీకి వివరించామని, ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని గట్టిగా కోరుకొంటున్నారన్న విషయాన్ని చెప్పినట్లు కేంద్ర మంత్రి పల్లంరాజు వెల్లడించారు. తాము ప్రస్తావించిన సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేస్తామని కమిటీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు, హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను కమిటీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాలని, తుది నిర్ణయం ఏదైనా ఉభయతారకంగా ఉండాలని చెప్పినట్లు మరో కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. సమన్యాయం అంటే రాష్ట్ర విభజనకు అంగీకరించి సమస్యలను పరిష్కరించమని కోరినట్లేనా అన్న విలేకరుల ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. సమన్యాయం అంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చూడడమని అర్థం అంటూ దాటవేశారు. వార్ రూమ్‌లో రేణుకా చౌదరి ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర నేతల సమావేశం ప్రారంభమైన సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కాంగ్రెస్ వార్‌రూమ్‌కు రావడం చర్చనీయాంశమైంది. అయితే, తాను ఇతర పార్టీ పనులపై మాత్రమే వార్‌రూమ్‌కు వచ్చానని, ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర నేతల సమావేశానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని పది నిమిషాలలో బయటకు వచ్చిన ఆమె చెప్పారు. త్వరలో హైదరాబాద్ వెళ్తా: దిగ్విజయ్ సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాలను, వాదనలను గట్టిగా వినిపించారని, వారు లేవనెత్తిన అంశాలన్నింటినీ కమిటీ అధ్యక్షుడు ఆంటోనీ నోట్ చేసుకొన్నారని భేటీ అనంతరం దిగ్విజయ్ విలేకరులకు తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యపై ఆంటోనీ కమిటీ సంప్రదింపులు ఈనెల 19, 20 తేదీల్లో కూడా కొనసాగుతాయని, ఈరోజు చర్చలకు హాజరు కాలేకపోయిన సీమాంధ్ర ఎంపీల వాదనలను సోమ, మంగళవారాలలో తెలుసుకొంటామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఇతర నేతలతో, వివిధ వర్గాలు, ప్రజాసంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించేందుకు కమిటీ తరపున త్వరలో హైదరాబాద్ సందర్శిస్తానని సీమాంధ్ర మంత్రులకు హామీ ఇచ్చారు. -
'సీమాంధ్ర నేతలు సమర్థంగా వాదనలు విన్పించారు'
న్యూఢిల్లీ: ఆంటోని కమిటితో సీమాంధ్రుల సమావేశం ముగిసింది. ఆంటోని కమిటీతో మంత్రులు కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశమైయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్.. విభజన తర్వాత ఉత్పన్నమైయ్యే సమస్యలను మంత్రులు వినిపించారన్నారు. మంత్రి తోట నరసింహం భార్య వాణి దీక్షను విరమించాల్సిందిగా దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఆంటోని కమిటీ తిరిగి సమావేశమవుతుందని ఆయన తెలిపారు. విభజన తర్వాతే వచ్చే పరిస్థితులపై సీమాంధ్ర ఎంపీలు తమ వాదనను బలంగా వినిపించారన్నారు. వారు చెప్పిన విషయాలను కమిటీ నమోదు చేసుకుందని దిగ్విజయ్ తెలిపారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించామని మంత్రి పల్లంరాజు తెలిపారు. ఈ సమావేశంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై చర్చించామన్నారు. సీమాంధ్రలో వాస్తవ పరిస్థితులను ఆంటోనికి కమిటీకి వివరించామని, దిగ్విజయ్ సింగ్ త్వరలో హైదరాబాద్‌కు వస్తానని చెప్పారని పల్లంరాజు తెలిపారు. అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరినట్లు చిరంజీవి తెలిపారు -
ఆంటోనితో తెలంగాణ మంత్రులు,ఎంపీలు భేటీ
-
ఆంటోనీ కమిటీని అంగీకరించం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సోనియాగాంధీకి సలామ్ కొట్టే నేతలతో వేసిన ఆంటోనీ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదని ఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ విమర్శించారు. ఎలా చెబితే అలా తలాడించే బసవన్నతో (గంగిరెద్దు) ఆంటోనీ కమిటీని పోలుస్తూ ఎన్జీఓలు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్జీఓలు తలపెట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగింది. తొలుత స్థానిక కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంగిరెద్దుకు ఆంటోని కమిటీ ప్లకార్డు కట్టారు. సోనియాగాంధీ చెప్పినట్లు వినే కమిటీ ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తుందని విమర్శించారు. కమిటీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే మొదట నష్టపోయేది ఉద్యోగులేనన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు ఏ త్యాగానికైనా వెనకాడేది లేదన్నారు. కేంద్రం దిగిరాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కోశాధికారి రాజ్యలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో జిల్లాలో రెండో రోజూ ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఉద్యోగులందరూ సమ్మె లో పాల్గొనడంతో కార్యాలయాలన్ని బోసిపోయాయి. ఎన్జీఓ నాయకులు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ఉద్యోగులను విధులకు హాజరుకావద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఓ, తహశీల్దార్, వ్యవసాయశాఖ, మెడికల్, గృహనిర్మాణ, ట్రెజరీ తదితర శాఖల కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ శాఖ సిబ్బంది నిరసన సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్జీఓల సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జయాకరరావు, కన్వీనర్ సాంబ శివరావు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ నాయకుల అరెస్టు రైల్‌రోకో నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైయిన వారిలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాయపాటి జగదీశ్, నాయకులు వూల వెంకటేశ్వర్లు, అశోక్, మహేష్ తదితరులు ఉన్నారు. వీరిని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్జీఓలు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులను వదిలేశారు. ఈ సందర్భంగా రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్‌రోకోలు చేసినా పట్టించుకోని పోలీసులు, ఇక్కడి ఉద్యమంలో ముందుగానే అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.