న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చకు రావటం లేదని సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చిస్తారని ముందు అనుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు ఎదురయ్యే సమస్యల గురించి అధ్యయనం చేసేందుకు రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నలుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మంత్రివర్గంలో చర్చ జరగడం లేదని తెలిసింది.
ఒక వైపు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం, మరో వైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని కాంగ్రెస్ అధినాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం చర్చించనున్నట్లు తెలుస్తోంది.
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
Published Thu, Aug 8 2013 8:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement
Advertisement