సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పునర్ విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో మాయపై దాఖలైన అక్రమాస్తుల కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న సీబీఐ పిటిషన్పై జస్టిస్ పి.సదాశివం, దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.
తాజ్ కారిడార్ కేసులో అనుమతి లేకుండా యూపీ ప్రభుత్వం రూ.17 కోట్లను విడుదల చేసిన కేసుపై తామిచ్చిన ఆదేశాలను సీబీఐ సరిగా అర్థం చేసుకోలేదని చెబుతూ సుప్రీంకోర్టు గతంలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే.