సాక్షి, న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె హయాంలో ఏనుగు విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తన పార్టీ ప్రచారం కోసం మాయావతి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారంటూ యూపీకి చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్ విచారణ సందర్భంగా...‘ ప్రజా ధనాన్ని ఉపయోగించి మాయవతి తన పార్టీ గుర్తు, తన విగ్రహాలను ఆవిష్కరించారు. కాబట్టి రాష్ట్ర ఖజానాలో ఈ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది’ అని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 2న ఈ కేసు తుది విచారణ జరుగనుందని దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment