లక్నో: తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని సోమవారం స్పష్టం చేశారు.తాను రాజకీయాల వైదొలగటం లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వంగా కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి శ్వాసవరకు తాను బీఎస్పీని ముందుకు తీసుకెళ్లటంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు.
‘‘డాక్టర్. అంబేద్కర్, కాన్షీరామ్ వారసులైన బహుజనులను బలహీనపరిచే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి నా చివరి శ్వాస వరకు ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం అవుతాను. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పార్టీని ఆకాష్ ఆనంద్ ముందుకు తీసుకువెళ్తారు. నాపై వస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా మాయావతి రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.
26-08-2024-BSP PRESS NOTE-SANYAS FAKE NEWS pic.twitter.com/nhbBIEJhUl
— Mayawati (@Mayawati) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment