లక్నో: మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని, వెంటనే వాటిని ఖాళీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. తాము ప్రస్తుతం ఉన్న బంగ్లా నుంచి ఖాళీ చేయలేమని, తమకు అదనపు నివాసలు లేవని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అఖిలేష్ యాదవ్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం లక్నోలో ప్రభుత్వం కేటాయించిన నివాసంలోనే ఉంటున్నారు.
ప్రభుత్వ బంగ్లాలు 15రోజుల్లో ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో మరో రెండేళ్ళు గడవు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లక్నోలో జనాభా ఎక్కవగా ఉన్నారని, సెక్యూరిటీ సమస్య వల్ల వారికి కొత్త భవనాలు దొరకడం ప్రస్తుతం చాలా కష్టమని వారు లేఖలో పేర్కొన్నారు. అఖిలేష్ ప్రసుత్తం విక్రమాధిత్య రోడ్‌లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉంటున్నారు. మాయవతి కూడా అదే రోడ్‌లో ఐదు ఎకరాల్లో రాజస్తాన్‌లో లభించే పింక్ మార్బుల్‌తో నిర్మించిన పది బెడ్‌రూమ్‌ల భవనంలో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment