మాయావతి (ఫైల్)
లక్నో : మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపారు. అంతేకాకుండా బంగ్లాకు సంబంధించిన తాళం చెవిలను స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపారు. అయితే అధికారులు వాటిని తీసుకోవడానికి తిరస్కరించారు. తాము ఖాళీ చేయాల్సిందిగా కోరింది లాల్‌బహదూర్ శాస్త్రి మార్గ్‌లోని బంగ్లా కాదని(మాజీ సీఎంలకు కేటాయించిన బంగ్లా) విక్రమాదిత్య రోడ్‌లో ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న పది బెడ్‌రూమ్‌ల విలాసవంతమైన భవనాన్ని అని అధికారులు తెలిపారు.
ఆ బంగ్లా అయితే ఖాళీ చేసే ప్రసక్తే లేదు...
తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేది లేదని యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇదివరకే తెలిపారు. తాను నివాసం ఉంటున్న 13ఎ మాల్ ఎవెన్యూ బంగ్లా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మెమోరియల్‌గా అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఈ మేరకు మాయావతి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కి లేఖ రాశారు. 13ఎ మాల్ ఎవెన్యూ బంగ్లాను 2011లో కాన్షీరాం జ్ఞాపకార్ధం మార్చారని, బంగ్లాలో తనకు కేటాయించి రెండు గదులనే నివాసం కొరకు ఉపయోగించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బంగ్లా భద్రత, సంరక్షణను తాను క్షేమంగా చూసుకుంటానన్న నమ్మకంతోనే 2011లో తనకు ఆ బంగ్లాను కేటాయించారని అమె లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది మాయావతి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment