లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు ఇద్దరిని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పందిస్తూ.. లక్నోలో ఉగ్రవాదుల కుట్ర జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం నిజమైతే తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. అదే విధంగా ఈ విషయంలో ఎటువంటి రాజకీయలు చేయవద్దని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తాయని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరిని ఉగ్రవాద కుట్రలో భాగంనే అదుపులోకి తీసుకుంటే.. ఇన్ని రోజులుగా పోలీసులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారని, ప్రజల్లో అశాంతిని పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదని మాయావతి ట్విటర్‌లో పేర్కొన్నారు.
యూపీ పోలీసులపై నమ్మకం లేదు: అఖిలేశ్ యాదవ్
ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తనకు యూపీ పోలీసులు, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లక్నోకు చెందిన మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్‌లుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వారు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment