terror activities
-
బంగ్లా అల్లర్లు: భారత్‌కు ఉగ్ర ముప్పు!
ఢిల్లీ: రిజర్వేషన్ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మైనర్టీలు, హిందూవులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షేక్ హహీనా ప్రభుత్వాన్ని దించడానికి నిరసనలు చేపట్టిన వారంతా విద్యార్థలుగా కనిపించినప్పటికీ.. మైనార్టీలు, హిందూవులపై దాడులను గమనిస్తే వారివెనక ఉగ్రసంస్థల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో కలిసి.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ మార్పు ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్ర, జమాత్-ఇ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్( ఏబీటీ) తో ఇతర నిషేధిత గ్రూపుల ప్రత్యక్ష మద్దతు ఉన్నట్ల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఎల్ఈటీ సహకారంతో ఏబీటీ 2022లో భారత్‌లో దాడులను చేయటమే లక్ష్యంగా బెంగాల్లో స్థావరాన్ని స్థాపించినట్లు నిఘా అధికారులు తెలిపారు. త్రిపురలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎల్ఈటీ ఏబీటీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు గతంలో ఇంటెలిజెన్స్‌కి సమాచారం వచ్చింది. దాదాపు 50 నుండి 100 మంది ఏబీటీకి చెందిన ఉగ్రవాదులు త్రిపురలోకి చొరబడాలని ప్లాన్ చేస్తున్నాయని 2022లో నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధం ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. -
ఉగ్రవాదుల దాడి : బస్సు డ్రైవర్, కండక్టర్లను అమరవీరులుగా గుర్తించాలి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో మరణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను అమరవీరులుగా ప్రకటించాలని బస్సు యజమాని సుజన్ సింగ్ విజ్ఞప్తి చేశారు.ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తోన్న బస్సుపై పాకిస్థాన్ లక్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.డ్రైవర్‌కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ (40), అతని 19 ఏళ్ల కండక్టర్ అరుణ్ కుమార్ మరణించారు. ఆ ఇద్దరి మరణంపై బస్సు యజమాని స్పందించారు. విజయ్ కుమార్, అరుణ్ కుమార్‌లను అమరవీరులుగా గుర్తించాలని కోరుతున్నారు. ‘విజయ్ నాకు ఒక కుటుంబం లాంటివాడు. నాతో సుమారు ఆరేళ్లుగా పని చేశాడు. బస్సులో ప్రయాణికులందరిని చంపకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే వాహనాన్ని రోడ్డుపై ఆపకుండా లోయలో పడేసి ఉంటారని నేను నమ్ముతున్నాను’ అని బస్సు యజమాని సుజన్ సింగ్ అన్నారు. విజయ్ తండ్రి రతన్ లాల్ ఆరు నెలల క్రితం చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు. వారి పెంపకం చూసేందుకు కుటుంబంలో మరెవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ బాధితుల తదుపరి బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. -
పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. బ్రిటన్ పత్రిక గార్డియన్ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌లోకి గనుక పారిపోతే.. వెంటాడుతాం. ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం. మాకు(భారత సైన్యానికి) ఆ సామర్థ్యం ఉంది. అది చేసి తీరతాం కూడా. పొరుగు దేశం(పాక్) కూడా అది గుర్తిస్తే మంచిది’’ అని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు. అయితే వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. గుర్తు తెలియని దాడుల్లో మృతి చెందడం గమనార్హం. దీంతో.. ఇందులో ఒక ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది. ఈ లోపు గార్డియన్ పత్రిక.. ‘‘విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తోంది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’ (రా) పర్యవేక్షణలో జరిగాయి. ఈ మేరకు భారత్, పాకిస్థాన్ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా (గార్డియన్) ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు’’ అని పెద్ద కథనం ప్రచురించింది ది గార్డియన్. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నట్లుగా కూడా గార్డియన్ ప్రస్తావించడం గమనార్హం. -
ఉగ్ర దాడులకు ప్లాన్.. బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు
బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పలుచోట్ల ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు చేపట్టింది. రెండు రోజులు క్రితం.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్ మాడ్యూల్ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పడఘా - బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదుతోపాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. The National Investigation Agency is conducting searches over half a dozen locations in Bengaluru in a terror conspiracy case. pic.twitter.com/az1k80U07m — ANI (@ANI) December 13, 2023 -
ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి
పాకిస్తాన్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్)తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్‌కు చీఫ్. లఖ్బీర్ గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు, అకల్ తఖ్త్ మాజీ నేత జస్బీర్ సింగ్ రోడే.. లఖ్బీర్ మరణాన్ని ధృవీకరించారు. లఖ్బీర్ సింగ్ రోడేకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వారు కెనడాలో నివసిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ రోడే భారతదేశంలోని పంజాబ్‌లోని మోగా జిల్లాలోని రోడే గ్రామంలో ఉండేవాడు. భారతదేశం నుండి దుబాయ్‌కి పారిపోయాడు. తరువాత దుబాయ్ నుండి పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. తన కుటుంబాన్ని కెనడాలో ఉంచాడు. 2002లో 20 మంది టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించేందుకు పాక్‌కు భారత్ ఒక జాబితాను అందజేసింది. అందులో లఖ్బీర్ సింగ్ రోడే పేరు కూడా ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం లఖ్బీర్ సింగ్ రోడే తన అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ శాఖలను బ్రిటన్, జర్మనీ, కెనడా,అమెరికాతో సహా అనేక ప్రాంతాలలో ప్రారంభించాడు. భారత్‌కు అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపినట్లు రోడేపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
రష్యా అధ్యక్షుడికి జేజేలు.. నైగర్‌లో భారీగా మద్దతుదారులు..
నియామే: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో సైనిక దళాలు తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ బజోమ్స్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సైనిక చర్యను ప్రాన్స్ తప్పుబట్టగా వాగ్నర్ దళాధిపతి ప్రిగోజిన్ మాత్రం మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సైన్యానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధానికి తరలి వచ్చారు. తిరుగుబాటు పర్వం.. కొద్దిరోజుల క్రితం నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు ఇరుగు పొరుగు దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల క్రితం 2021లో నైగర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ బజోమ్స్ గెలిచారు. కానీ ఆయన పరిపాలనలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద ముఠాలు పేట్రేగుతున్నాయని, అతని చేతగానితనంతో ఫ్రాన్స్ మళ్ళీ తమ గడ్డమీద పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని చెరలో బంధించామని కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే తెలిపారు. దేశమంతటా కర్ఫ్యూ.. ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ.. దేశ సరిహద్దులను మూసి వేస్తున్నామని, ఇది మా దేశ అంతర్గత వ్యవహారమని ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మహమ్మద్ బజోమ్స్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు టీవీ ద్వారా సందేశమిచ్చారు. COUP D'ETAT IN NIGER - Group of soldiers appear on state TV - Announce President Bazoum has been removed - Order 7 pm-5 am nationwide curfew - Borders closed until further notice - Bazoum appears to have been detained - Niger is Western ally in fight against terror pic.twitter.com/iHJ3XbaF1s — BNO News (@BNONews) July 26, 2023 అమెరికా కంగారు.. తిరుగుబాటు తదనంతరం సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించగా వారి గొంతు వెనుక స్వార్ధపూరిత కారణాలు కూడా లేకపోలేదంటున్నాయి నైగర్ సైనిక వర్గాలు. నైగర్‌లో అమెరికాకు రెండు డ్రోన్ స్థావరాలున్నాయని సుమారు 800 మంది వారి సైనికులు నైగర్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. జయహో పుతిన్.. ఇదిలా ఉండగా రష్యా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్‌గనీ ప్రిగోజిన్ నైగర్ సైన్యం తిరుగుబాటు సరైనదేనని మద్దతు తెలిపారు. దీంతో నైగర్ తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు భారీగా రాజధాని నియామేకి తరలి వచ్చి ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ రష్యా జెండాలను ప్రదర్శించారు. అనుమానమే నిజమైంది.. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి నైగర్‌లో తిరుగుబాట్లు జరిగాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత తిరుగుబాటు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా మహమ్మద్ బజోమ్స్ ఎన్నికైన తర్వాత పలుమార్లు ప్రెసిడెన్షియల్ గార్డ్స్ బృందం నుండి తనకు ముప్పు ఉందని తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఆయన అనుమానమే నిజమైంది. ఇది కూడా చదవండి: ఎత్తైన భవనంపై సాహాసం.. అంతలోనే పట్టుతప్పి.. -
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
ఢిల్లీ: అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం 14 మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్‌బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది. ఇదీ చదవండి: మన్‌కీ బాత్ టైంలో పురిటి నొప్పులు, ఆపై.. -
ఉగ్రవాద కుట్ర నిజమైతే.. రాజకీయాలు చేయొద్దు: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు ఇద్దరిని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పందిస్తూ.. లక్నోలో ఉగ్రవాదుల కుట్ర జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం నిజమైతే తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. అదే విధంగా ఈ విషయంలో ఎటువంటి రాజకీయలు చేయవద్దని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తాయని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరిని ఉగ్రవాద కుట్రలో భాగంనే అదుపులోకి తీసుకుంటే.. ఇన్ని రోజులుగా పోలీసులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారని, ప్రజల్లో అశాంతిని పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. యూపీ పోలీసులపై నమ్మకం లేదు: అఖిలేశ్ యాదవ్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తనకు యూపీ పోలీసులు, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లక్నోకు చెందిన మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్లుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వారు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. -
హైదరాబాద్ లోనే బాంబు తయారు NIA సీన్ రికన్ స్ట్రక్షన్
-
కరోనా విపత్తులో ఉగ్రదాడికి కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రక్కసితో ప్రజలంతా యుద్ధం చేస్తుంటే దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారు. ఢిల్లీలోని తిహార్ జైలు వేదికగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది దీనికి పథకం రచిస్తుండగా ఇరాన్‌కు చెందిన ఉద్రవాద జంట గుట్టువిప్పింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది తిహార్ జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు నేర్పుతున్నాడు. యువతను ఉద్రదాడులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాడు. అయితే అదే జైల్లో శిక్ష అనుభివస్తున్న ఇరాన్ ఖొరాసన్ మోడ్యూల్‌కు చెందిన జంట ఉగ్రదాడి కుట్ర గురించి పోలీసులుకు సమాచారం ఇచ్చి బయటపెట్టింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణ జరపగా.. ఉగ్రవాది కుట్రను బయపెట్టాడు. గతంలో ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిరియా వెళ్ళడానికి యత్నించి మహారాష్ట్రలో పోలీసులకు చిక్కింది కూడా ఇతనే అని పోలీసులు గుర్తించారు. దేశంలో స్వతహాగా దాడులకు దిగేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే నిందితున్ని 2018లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా ఘటనతో ఉగ్రవాదిని ఎన్ఐఏ కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చారు. (ఐసోలేషన్‌కు కాదు.. జైలుకు వెళ్లాడు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వలపు వలతో ఉగ్ర ఉచ్చు
జమ్ము : పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు భారత్‌లో విద్రోహ చర్యలకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. కశ్మీరీ యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగేందుకు యువతులతో హనీట్రాప్‌కు తెగబడుతున్నాయి. భారత్‌లోకి చొచ్చుకువచ్చే ఉగ్రవాదులకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు ఈ యువకుల సేవలను వినియోగించుకునేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. బండిపొర ప్రాంతంలో 30 ఏళ్లు పైబడిన సయ్యద్ సజియ అరెస్ట్‌తో హనీట్రాప్‌లపై ఇంటెలిజెన్స్ వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి. కశ్మీర్లో యువకులు అనుసరించే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సహా పలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు ఖాతాలున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గత కొద్దినెలలుగా ఆమె వాడుతున్న ఐపీ చిరునామాపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దృష్టిసారించాయి. యువకులతో ఆమె సంభాషిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తాము చెప్పిన కన్సైన్మెంట్ను చేరవేస్తేనే వారితో తాను కలుస్తానని ఆమె ముచ్చటించినట్టు వెల్లడైంది. మరోవైపు సరిహద్దు వెంబడి భద్రతా దళాల కదలికలను తెలుసుకునేందుకు ఆమె జమ్మూ కశ్మీర్‌లోని పలు పోలీస్ అధికారులతోనూ ఆమె పరిచయం పెంచుకున్నట్టు చెబుతున్నారు. కశ్మీరీ యువతను ఉగ్రవాదానికి ఆకర్షితులను చేసేందుకు మిలిటెంట్లలో తనలాగే పలువురు మహిళలున్నారని దర్యాప్తులో సజియ వెల్లడించింది. ఇక ఆమె అరెస్ట్‌కు వారం ముందు అసియా జన్ (28) అనే యువతిని జమ్ము కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసి ఆమె వద్ద గ్రనేడ్లు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
అందమైన అమ్మాయిలతో వల..
శ్రీనగర్: కశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపునకు ఆకర్షించేందుకు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అందమైన అమ్మాయిలను ఎరగా ఉపయోగించుకుంటున్నాయి. బందిపొరాకు చెందిన సయ్యద్ షాజియా అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈమె ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ పేర్లతో పలు ఖాతాలను సృష్టించి యువతతో పరిచయం పెంచుకుంటుందనీ, అనంతరం తాను చెప్పిన పని చేస్తే వారిని కలుస్తానని నమ్మబలుకుతుందని పోలీసులు వెల్లడించారు. షాజియా వలలో పడిన యువత, ఆమె చెప్పినట్లుగా ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాదులకు మార్గం చూపడం తదితరాలు చేస్తున్నారని తెలిపారు. ఇలా మరికొంత మంది అమ్మాయిలు కూడా ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని షాజియా విచారణలో వెల్లడించింది. ఆమెకు సమాచారం ఇస్తున్న పోలీస్ ఉద్యోగి ఇర్ఫాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ షాజియా నుంచి గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నరు. ఆమె ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ ఉగ్ర స్వర్గధామమే: నిక్కీ హేలీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించబోదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధినాయకత్వానికి అమెరికా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ మాట్లాడారు. ‘ఉగ్రవాదుల ఏరివేత విషయమై గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్‌తో అమెరికా ప్రభుత్వ వైఖరి మారింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాలు ప్రపంచానికి నాయకత్వం వహించాలని హేలీ ఆకాంక్షించారు. -
ఇండో-పాక్ సిరీస్ లేనట్టేనా ?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని, కాల్పులను విరమిస్తేనే ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుందని స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాలపై పార్లమెంట్ సంప్రదింపుల కమిటీ భేటీ సందర్భంగా సుష్మా ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య తటస్ధ వేదికలపై క్రికెట్ సిరీస్‌కు సంబంధించి సుష్మా స్పందిస్తూ పాక్ ఉగ్ర కార్యకలాపాలు, సరిహద్దుల్లో కాల్పులను నిలిపివేయకపోతే క్రికెట్ మ్యాచ్‌లు జరగబోవని సంకేతాలు పంపారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడవని మంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు భారత్‌లో పాక్ రాయబారితో ఇటీవల తాను భేటీ అయిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను సుష్మా ఈ భేటీలో వివరించారు. ఇరు దేశాల జైళ్లలో మగ్గుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, మానసిక పరిస్థితి సరిగా లేని ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయాలనే ప్రతిపాదనపై తాము చర్చించామని చెప్పారు. -
ట్రంప్ చేష్టలు.. ఘాటుగా స్పందించిన పాక్
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాక్ పేరును అమెరికా చేర్చిందన్న ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే... పాకిస్థాన్ ఘాటుగా స్పందించింది. మిత్రులతో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్ర దేశాలు ఒకరి పేరును మరొకరు నోటీసులో ఉంచడం భావ్యం కాదు. అదే సమయంలో శాంతిపై ఇరు దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది అని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య బంధాలను బలహీనం చేస్తాయని, ఆ ప్రభావం అంతర్జాతీయ సమాజంపై పడుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తమ అధ్యక్షుడు ట్రంప్ పాక్ పేరును ఉగ్రవాద దేశాల నోటీసులో ఉంచారంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపకపోతే, పాక్ కు అందిస్తున్న తాయిలాలు కూడా ఆగిపోతాయని ఆయన హెచ్చరించారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలను చేపట్టినా చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తిరిగి స్పందించింది. -
‘ఉగ్రవాదమే పాక్ విధానం’
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చివేసిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఉగ్రమూకలకు నిధులు, శిక్షణను అందించి భారత్‌పైకి ఉసిగొల్పుతోందని వ్యాఖ్యానించారు. మతంతో ఉగ్రవాదాన్ని ముడిపెడుతున్న ఆ దేశం ప్రజల్లో చీలికలు తెస్తోందని అన్నారు. ఏ మతం నుంచీ ఉగ్రవాదిని చూడాలని భారత్ కోరుకోదని, ఉగ్రవాదం మానవాళికి శత్రువని బీఎస్ఎఫ్ 52వ రైజింగ్ డే సందర్భంగా భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడారు. పొరుగుదేశంతో సఖ్యతగా మెలిగేందుకు ప్రభుత్వం చొరవ చూపుతున్నా మన భూభాగంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పాక్, బంగ్లా సరిహద్దుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని బీఎస్ఎఫ్ దళాలను వెంకయ్యనాయుడు ప్రశంసించారు. భారత్ అందరితో మెరుగైన సంబంధాలను కాంక్షిస్తూ వసుధైక కుటుంబాన్ని కోరుకుంటుందని చెప్పారు. -
ఇస్లాంలో ఉగ్రవాదానికి స్థానం లేదు
జమాతే ఇస్లామీ హింద్ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం పహాడీషరీఫ్: ఇస్లాం మతానికి, ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదని జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమర్ అన్నారు. పహాడీషరీఫ్ వాదే హుదా దాలోని జామియా దారుల్ హుదా మదర్సాలో నాలుగు రోజుల పాటు జరిగే జమాతే ఇస్లామీ హింద్ సర్వసభ్య సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేడు ప్రపంచంలో తీవ్రవాద సమస్య ప్రధానంగా నెలకొందన్నారు. ఇస్లాం మతంలో తీవ్రవాదానికి స్థానం లేదన్నారు. మోడీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు విద్వేషం పెంచి పోషించేలా నోరు పారేసుకుంటూ దేశంలో అసహనం పరాకాష్టకు చేరేలా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలను సంఘ్ పూర్తిగా కాషాయికరణ చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. దేశం నలుమూలల నుంచి జమాతే ఇస్లామీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ, శంషాబాద్ ఏసీపీ అనురాధ, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వి.వి.ఛలపతిల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జామియా దారుల్ హుదా మదర్సా ఆవరణలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ కళాఖండాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరిని ఆకట్టుకుంటుంది. నేడు బహిరంగ సభ ఈ సమావేశాలలో భాగంగా రెండో రోజైన 12వతేదీ సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జామాతే ఇస్లామి హిందూ సంస్థ సభ్యులు తెలి పారు. ‘సమాజ పునర్నిర్మాణం-మన బాధ్యతలు’ అనే అంశంపై రాజకీయ, ధార్మిక పండితులు, మేధావులు ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. -
ప్యారిస్ దాడుల్లో 10 మంది అరెస్టు
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి.. ఇతర కేసుల్లో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. అయితే.. తాజాగా డేర్ డి లెస్ట్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దాందో స్టేషన్‌ను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. కొత్తగా మరిన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతాయేమోనన్న అనుమానంతో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగానే రైల్వే స్టేషన్ మూసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్యారిస్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇది కూడా ఒకటి. తూర్పు ప్యారిస్‌కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య ఇది ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.