జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో మరణించిన బస్సు డ్రైవర్, కండక్టర్‌లను అమరవీరులుగా ప్రకటించాలని బస్సు యజమాని సుజన్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తోన్న బస్సుపై పాకిస్థాన్ లక్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్) ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
డ్రైవర్‌కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ (40), అతని 19 ఏళ్ల కండక్టర్ అరుణ్ కుమార్ మరణించారు. ఆ ఇద్దరి మరణంపై బస్సు యజమాని స్పందించారు. విజయ్ కుమార్, అరుణ్ కుమార్‌లను అమరవీరులుగా గుర్తించాలని కోరుతున్నారు.
‘విజయ్ నాకు ఒక కుటుంబం లాంటివాడు. నాతో సుమారు ఆరేళ్లుగా పని చేశాడు. బస్సులో ప్రయాణికులందరిని చంపకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే వాహనాన్ని రోడ్డుపై ఆపకుండా లోయలో పడేసి ఉంటారని నేను నమ్ముతున్నాను’ అని బస్సు యజమాని సుజన్ సింగ్ అన్నారు.
విజయ్ తండ్రి రతన్ లాల్ ఆరు నెలల క్రితం చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు. వారి పెంపకం చూసేందుకు కుటుంబంలో మరెవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ బాధితుల తదుపరి బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment