ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి.. ఇతర కేసుల్లో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. అయితే.. తాజాగా డేర్ డి లెస్ట్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు వచ్చింది. దాందో స్టేషన్ను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. కొత్తగా మరిన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతాయేమోనన్న అనుమానంతో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
ముందుజాగ్రత్త చర్యగానే రైల్వే స్టేషన్ మూసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్యారిస్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇది కూడా ఒకటి. తూర్పు ప్యారిస్కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య ఇది ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్యారిస్ దాడుల్లో 10 మంది అరెస్టు
Published Fri, Jan 16 2015 2:32 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM
Advertisement