paris shooting
-
పారిస్ నగరంలో మళ్లీ కిడ్నాప్ కలకలం
ఫ్రాన్సు రాజధాని పారిస్ నగరంలో మళ్లీ కిడ్నాప్ కలకలం రేగింది. అక్కడున్న ఓ పోస్టాఫీసులో ముగ్గురిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. తీవ్రవాదులు ఎంతమంది ఉన్నారో, అక్కడ ఏం జరుగుతోందోనన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పారిస్ శివార్లలోని నాన్టెర్రో ప్రాంతంలో ఉన్న పోస్టాఫీసులో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. మరోవైపు పాకిస్థాన్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో ఏఎఫ్‌పీ పాత్రికేయ సంస్థకు చెందిన ఓ ఫొటో జర్నలిస్టు మరణించారు. -
కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!
ఫ్రాన్సులో చార్లీ హెబ్డో పత్రికపై దాడులకు తెగబడ్డ నరహంతకులకు సంబంధించి తాజా వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. పత్రిక ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పారిస్ రోడ్డుపై చాలా ప్రశాంతంగా కనిపించారు. నిదానంగా తుపాకుల్ని తుడుచుకుంటా గడిపారు. ఒకతను కార్లో కూర్చునే ప్రయత్నం చేయగా మరొకడు... ప్రతీకారం తీర్చుకున్నామని నినాదాలు చేయడం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డయింది. ఎక్కడా తొందరగా వెళ్లాలనే ఆత్రం కానీ, తప్పు చేశామన్న భావన గానీ వాళ్లలో కనిపించలేదు. నిదానంగా కారు నడిపించుకుంటూ వెళ్లిన వాళ్లను ఓ పోలీసు కారు వెంబడించింది. పోలీసులు వెంటపడుతున్నారని గుర్తించిన ఉగ్రవాదులు కారు ఆపేసి ఆ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. దాంతో పోలీసు వ్యాన్ వెనక్కి వెళ్లిపోవాల్సిన వచ్చిన దృశ్యాలు ఈ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికపై గత వారం జరిగిన దాడిలో పది మంది ఆ పత్రిక ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు చనిపోయారు. -
పారిస్ ఉగ్రవాద దాడి దృశ్యాలివీ!
-
ప్యారిస్ దాడుల్లో 10 మంది అరెస్టు
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి.. ఇతర కేసుల్లో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. అయితే.. తాజాగా డేర్ డి లెస్ట్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దాందో స్టేషన్‌ను అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. కొత్తగా మరిన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతాయేమోనన్న అనుమానంతో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగానే రైల్వే స్టేషన్ మూసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్యారిస్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇది కూడా ఒకటి. తూర్పు ప్యారిస్‌కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య ఇది ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్యారిస్ దాడికి పాల్పడింది మేమే
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్‌లో వ్యంగ్య వార్తాపత్రిక చార్లీ హెబ్డో మీద దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ప్రకటించుకుంది. యెమెన్‌లో అల్ కాయిదా నేతలు యూట్యూబ్ ద్వారా ఈ ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకే ఈ దాడి చేసినట్లు ఆ వీడియోలో తెలిపారు. ప్యారిస్ మీద జరిగిన పవిత్ర యుద్ధానికి అరేబియన్ ద్వీపకల్పంలోని అల్ కాయిదా అల్ జిహాద్ బాధ్యత తీసుకుంటోందని, దైవదూతను దూషించినందుకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టామని అల్ కాయిదా యెమెన్ శాఖకు చెందిన నాజర్ అలీ అల్ అన్సీ ఆ వీడియోలో తెలిపారు. -
పారిస్‌కు మద్దతుగా.. ప్రపంచదేశాలు..!
-
మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరం మీద దాడిచేసి.. పలుప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఫ్రెంచి పోలీసులు మట్టుబెట్టారు. మరొకరు లొంగిపోయారు. అయితే.. ఈ ఆపరేషన్ నుంచి నేర్పుగా తప్పించుకున్నది మాత్రం.. ఓ మహిళా టెర్రరిస్టు. ఆమె పేరు హయత్ బౌముదీన్. ఆమె అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, సాయుధురాలని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు. ఆమెను పట్టుకోడానికి తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. మూడు దాడుల్లో పాల్గొన్నవాళ్లు ఒకరికొకరు అంతా తెలుసని, వారంతా కూడా యెమెన్ దేశంలోని అల్ కాయిదా శిబిరాల్లో శిక్షణ పొందారని అంటున్నారు. 'డబుల్ ట్యాప్' అంటే.. ఒక తుపాకి నుంచి ఒకేసారి రెండు బుల్లెట్లు కాల్చడం లాంటివి అత్యంత అధునాత ఆయుధాల ఉపయోగంలో ప్రొఫెషనల్ శిక్షణ పొందినవాళ్లు మాత్రమే చేయగలిగిన పని. అలాంటి తరహాలో వీళ్లు కాల్పులు జరిపారు. కౌచి సోదరులను పోలీసులు మట్టుబెట్టినా, మహిళా ఉగ్రవాది హయత్ బౌముదీన్ మాత్రం అక్కడినుంచి తప్పించుకోవడంతో ఫ్రాన్సుకు ఇంకా ఉగ్రవాద ముప్పు తప్పలేదనే అధికారులు భావిస్తున్నారు. ఫ్రెంచి ప్రధాని హోలండ్ కూడా ఇదే విషయం చెబుతున్నారు. -
పారిస్‌లో ముగిసిన ఆపరేషన్.. కోచీ బ్రదర్స్ హతం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి 12 మందిని కాల్చిచంపిన ఇద్దరు ఉగ్రవాద కోచీ సోదరులను భద్రత బలగాలు కాల్చిచంపాయి. ఉన్నతాధికారులు ఈ విషయాన్నివెల్లడించినట్టు ఓ వార్త సంస్థ తెలియజేసింది. ఉగ్రవాద దాడిలో నలుగురు చనిపోయారు. పారిస్‌లో శుక్రవారం కమెండోలు ఒకేసారి రెండు చోట్ల ఆపరేషన్ కొనసాగించారు. పత్రికా కార్యాలయంపై దాడి అనంతరం సయీద్ కోచీ, చెరిఫ్ కోచీ సోదరులు ఓ కారులో పారిపోతుండగా పోలీసులు వెంబడించడంతో పారిస్ శివారున ఓ గౌడౌన్లో దాక్కున్నారు. సూపర్ మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్‌లో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేయిమంది కమెండోలను, హెలీకాప్టర్లను రంగంలోకి దించారు. రెండు చోట్ల కమెండోలు ఆపరేషన్ కొనసాగించారు. మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్‌లో నాలుగు బాంబులు పేలినట్టు శబ్దాలు వినిపించాయి. మార్కెట్ లో ఉన్న ప్రజలను సురక్షితంగా బయటకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా ఉగ్రవాద దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చివరకు కమెండో ఆపరేషన్‌లో ఉగ్రవాద సోదరులు హతమయ్యారు. ఈ ఘటనలకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సివుంది. -
అమరులయ్యేందుకు మేం సిద్ధం: ప్యారిస్ ఉగ్రవాదులు
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో పత్రికపై దాడిచేసి 12 మందిని చంపిన ఉగ్రవాదులు.. తాము అమరులయ్యేందుకు సిద్ధమని చెబుతున్నారు. ఫ్రెంచి పోలీసులతో వాళ్లు మాట్లాడినట్లు అక్కడి వర్గాలు తెలిపాయి. ప్యారిస్ ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాద సోదరులు ఇద్దరినీ పోలీసులు వెంబడించగా వాళ్లు ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో దాక్కున్న విషయం తెలిసిందే. వారిని పట్టుకోడానికి తీవ్రస్థాయిలో పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నవారితో ఫోన్లో మాట్లాడినట్లు ఫ్రెంచి అధికారులు చెప్పారు. మరోవైపు.. తాము చేస్తున్న యుద్ధం ఉగ్రవాదం మీదనే తప్ప.. మతం మీద కాదని ఫ్రాన్సు ప్రధాని హోలండ్ తెలిపారు. -
పారిస్‌లో మళ్ళీ కాల్పుల కలకలం
-
ఐదు హెలికాప్టర్లతో ఆపరేషన్
ఫ్రాన్సులో కలకలం రేపిన ఉగ్రవాదులను పట్టుకోడానికి ఐదు హెలికాప్టర్లతో ఆపరేషన్ జరుగుతోంది. డమార్టన్ ఎన్ గోయిల్ వద్ద ఉన్న పారిశ్రామిక ప్రాంతం వెలుపల 88 వేల మంది పోలీసులు చేరుకున్నారు. అల్ కాయిదా సానుభూతిపరులైన ఇద్దరు ఉగ్రవాద సోదరులు శుక్రవారం ఉదయం ఓ కారును చోరీ చేశారు. పోలీసులు వాళ్ల కారును వెంబడించడంతో పారిపోయిన ఉగ్రవాదులు ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో దాక్కున్నారు. దాంతో భారీగా ఫ్రెంచి భద్రతా దళాలను అక్కడ మోహరించారు. అయితే.. కొంతమంది ఉద్యోగులను ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వాట్ బృందాలు కూడా ప్యారిస్ ఈశాన్య ప్రాంతానికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు అక్కడ మరోసారి దాడి చేసే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో భారీగా పోలీసు బృందాలు చేరుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఉగ్రవాదులు సాయుధులని, అత్యంత ప్రమాదకరమైన వాళ్లని ఫ్రాన్సులో ఇప్పటికే ప్రకటించారు. -
ప్యారిస్ ఉగ్రవాదులపై పోలీసు ఆపరేషన్
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి 12 మందిని కాల్చిచంపిన ఇద్దరు ఉగ్రవాద సోదరులను పోలీసులు వెంబడిస్తున్నారు. వాళ్లు ఓ కారులో వెళ్తుండగా పోలీసులు వెంబడించడంతో నిందితులైన సోదరులిద్దరూ ఓ గోడౌన్ ప్రాంతంలో దాక్కున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటపడటంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోందని.. ఉగ్రవాదుల చెంతకు పోలీసులు వెళ్లారని ఫ్రాన్సు హోంశాఖ మంత్రి తెలిపారు. ప్యారిస్ ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. డమార్టన్ ఎన్ గోయిల్ అనే ప్రాంతం వద్ద ఉదయం కాల్పులు జరగడంతో మళ్లీ ఏమయిందోనని స్థానికులు ఆందోళన చెందారు. అయితే.. కారును పోలీసులు వెంబడిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. చివరకు ఎట్టకేలకు పోలీసులు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్లు ఓ గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భారీ స్థాయిలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. -
పారిస్ ఉగ్రవాద దాడి జరిగిందిలా..!
-
పారిస్‌లో మళ్ళీ కాల్పులు!
-
ప్యారిస్‌లో మళ్లీ కాల్పులు: మహిళా పోలీసు మృతి
పత్రికా కార్యాలయంపై కాల్పుల ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరోసారి ప్యారిస్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. హై ఎలర్ట్ ఉన్నా కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని, ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా పోలీసు అధికారి మరణించారు. అనుమానితుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి ఫ్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ హుటాహుటిన చేరుకున్నారు. ఈ ఘటన ప్యారిస్ దక్షిణ ప్రాంతంలోని పోర్ట్ డి షాటిల్లన్ ప్రాంతంలో జరిగింది. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో కాల్పులు జరిపి 12 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఈ కాల్పులు జరిగాయి. -
'అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం'
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చార్లీ హెబ్డో మేగజీన్ న్యూస్ డైరెక్టర్ స్టీఫెన్ షార్బోనియర్ మృతి చెందారు. ప్రముఖ ఫ్రెంచి కార్టూనిస్టులు కాబు, ఛార్బ్, వోలినిస్కీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్టీఫెన్ షార్బోనియర్ ను హతమారిస్తు భారీగా నగదు బహుమతి ఇస్తామని అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ 2013లో ప్రకటించింది. కాగా, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఫ్రెంచిలో మాట్లాడుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఉగ్రవాదులు నినాదాలు చేసినట్టు వెల్లడించారు. ఏకే-47 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో దాడులకు తెగబడినట్టు తెలిపారు. మరోవైపు పారిపోయిన ఉగ్రవాదుల పట్టుకునేందుకు ప్యారిస్ అంతటా జల్లెడ పట్టారు. ఎక్కడిక్కడ రవాణా వ్యవస్థను నిలిపివేసి సోదాలు చేస్తున్నారు. -
పారిపోతూ కూడా.. కాల్పులు జరిపారు!!
-
పారిపోతూ కూడా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
ప్యారిస్: ఉగ్రవాద దాడితో ప్యారిస్ లోని విశ్వవిఖ్యాత సందర్శనీయ కేంద్రం ఈఫిల్ టవర్ ను మూసివేశారు. ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. బుధవారం ప్యారిస్ లోని ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దాడి చేసిన మరుక్షణం ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి తప్పించుకుని నల్ల రంగు కారులో పారిపోయారు. కారులో పారిపోతున్నప్పుడు కూడా రోడ్డుపైనున్నవారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ముష్కర మూకల దాడితో ప్యారిస్ ప్రజలు భీతిల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, కనీసం 9 మంది జర్నలిస్టులున్నట్టు తెలుస్తోంది. -
ఉగ్రవాద దాడిలో 12 మంది మృతి
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో బుధవారం జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు సమాచారం. కనీసం ఒక జర్నలిస్ట్, సంఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు పోలీసులు కాల్పుల్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గతంలో ఇదే ప్రతిక కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. కాల్పులు జరిపింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో మహ్మద్ ప్రవక్త, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కమాండర్ కు వ్యతిరేకంగా చార్లీ హెబ్డో కార్టూన్లు ప్రచురించింది. సిడ్నీలో కాల్పుల ఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే ఫ్రాన్స్ లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఫ్రాన్స్ ఘటనతో యూరప్, అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు.