కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు! | video footage shows paris shooters to be very free after shooting | Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!

Published Fri, Jan 16 2015 5:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!

కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!

ఫ్రాన్సులో చార్లీ హెబ్డో పత్రికపై దాడులకు తెగబడ్డ నరహంతకులకు సంబంధించి తాజా వీడియో ఫుటేజ్‌ బయటకొచ్చింది. పత్రిక ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పారిస్‌ రోడ్డుపై చాలా ప్రశాంతంగా కనిపించారు. నిదానంగా తుపాకుల్ని తుడుచుకుంటా గడిపారు. ఒకతను కార్లో కూర్చునే ప్రయత్నం చేయగా మరొకడు... ప్రతీకారం తీర్చుకున్నామని నినాదాలు చేయడం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డయింది.  

ఎక్కడా తొందరగా వెళ్లాలనే ఆత్రం కానీ,  తప్పు చేశామన్న భావన గానీ వాళ్లలో కనిపించలేదు. నిదానంగా కారు నడిపించుకుంటూ వెళ్లిన వాళ్లను ఓ పోలీసు కారు వెంబడించింది. పోలీసులు వెంటపడుతున్నారని గుర్తించిన ఉగ్రవాదులు కారు ఆపేసి ఆ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. దాంతో పోలీసు వ్యాన్‌ వెనక్కి వెళ్లిపోవాల్సిన వచ్చిన దృశ్యాలు ఈ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి.  ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికపై గత వారం జరిగిన దాడిలో పది మంది ఆ పత్రిక ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement