గగన్ నారంగ్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటర్లు పతకాలతో సత్తా చాటుకున్నారు. సమర్థవంతమైన మౌలిక వసతులు, ప్రణాళికబద్ధమైన కృషి వల్లే ఇది సాధ్యమైందని షూటింగ్ బృందం నిరూపించింది. సమయానుకూలంగా మారాల్సిన ఆవశ్యకతను ఈ విజయాలు తెలియజేశాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పతకం లేకుండానే భారత షూటర్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. మనూ భాకర్, సరబ్‌జోత్ సింగ్ పతకాలతో 12 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో మన షూటర్లు చరిత్ర సృష్టించారు. మను ఖాతాలో రెండు పతకాలున్నాయి. మూడో పతకం గెలిచేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది.
దురదృష్టం వల్లే అర్జున్ బబూతాకు కాంస్యం చేజారింది. దీన్ని వైఫల్యంగా చూడలేం. నిజానికి అతను అత్యుత్తమ ప్రదర్శనే చేశాడు. కాకపోతే ఏం చేస్తాం ఆ రోజు తనది కాదు! ఈ ఒలింపిక్స్‌లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది. పతకాలు ఏలా సాకారమయ్యాయంటే మాత్రం యువ షూటర్ల ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణం. క్రీడాగ్రామంలో నేను వారితో పోటీలకు ముందే భేటీ అయ్యాను. నేనో చెఫ్ డి మిషన్‌గా కాకుండా ఓ షూటర్‌గానే వాళ్లతో సంభాíÙంచాను. అప్పుడు వాళ్ల విశ్వాసం, పట్టుదల ఏంటో నాకు అర్థమైంది.
ఓ సీనియర్ షూటర్‌గా నేను వారికి చెప్పేదొకటే... గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్రీడలపైనే దృష్టి సారించాలని చెప్పాను. ప్రస్తుత బృందంలోని 21 మందిలో 10 మంది ‘ఖేలో ఇండియా’ ద్వారా వెలుగులోకి వచ్చారు. మరో 11 మంది టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) అండదండలతో విశ్వక్రీడలకు అర్హత సాధించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడాకారులకు ఉన్న ఆరి్థక కష్టాలను తొలగించి ఆటపై దృష్టి పెట్టేలా పెద్ద ఎత్తున కృషి చేశారు.
క్రీడాకారులకు సంబంధించి ప్రత్యేక, వ్యక్తిగత శిక్షణ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్చ కూడా కల్పిం చడం గొప్ప విషయం. విదేశీ కోచ్‌లు, విదేశాల్లో శిక్షణ వీటన్నింటి మీద క్రీడా శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఆరంభంలోనే రెండు పతకాలు (షూటింగ్) రావడంతో ఈ విశ్వక్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు గెలిచేందుకు పారిస్ ఒలింపిక్స్ దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment