shooters
-
సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్
మహారాష్ట్రతోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలకవిషయం వెలుగుచూసింది మాజీ మంత్రి అయిన సిద్ధిఖీని హత్య చేసే ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల ఉద్దేశం తెలియనప్పటీకి నిందితులు స్నాప్‌చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో సంభాషణలు జరిపినట్లు గుర్తించామని తెలిపారు.కెనడా, అమెరికాలకు చెందిన నిందితులతో అన్మోల్కు పరిచయం ఉందని, నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు స్నాప్‌చాట్ ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేవారని, మెసెజ్ వచ్చిన తర్వాత వారు దానిని వెంటనే తొలగించేవారని పేర్కొన్నారు.. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల స్నాప్‌చాట్‌ను నిశితంగా పరిశీలించగా.. షూటర్లు, ప్రవీణ్ లోంకర్ నేరుగా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి నిందితులు సంప్రదింపులు జరుపుకునేవారని, దానిద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవ్వడం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో చెట్లను లక్ష్యంగా చేసుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొన్నారన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.కాగా దసరా సందర్భంగా బాబా సిద్ధిక్ ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల బాణాసంచా పేలుస్తుండగా దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిచంపిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు పేర్కొంది. దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. -
పక్కా ప్రణాళికతోనే పతకాలు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటర్లు పతకాలతో సత్తా చాటుకున్నారు. సమర్థవంతమైన మౌలిక వసతులు, ప్రణాళికబద్ధమైన కృషి వల్లే ఇది సాధ్యమైందని షూటింగ్ బృందం నిరూపించింది. సమయానుకూలంగా మారాల్సిన ఆవశ్యకతను ఈ విజయాలు తెలియజేశాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పతకం లేకుండానే భారత షూటర్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ పతకాలతో 12 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో మన షూటర్లు చరిత్ర సృష్టించారు. మను ఖాతాలో రెండు పతకాలున్నాయి. మూడో పతకం గెలిచేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దురదృష్టం వల్లే అర్జున్ బబూతాకు కాంస్యం చేజారింది. దీన్ని వైఫల్యంగా చూడలేం. నిజానికి అతను అత్యుత్తమ ప్రదర్శనే చేశాడు. కాకపోతే ఏం చేస్తాం ఆ రోజు తనది కాదు! ఈ ఒలింపిక్స్‌లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది. పతకాలు ఏలా సాకారమయ్యాయంటే మాత్రం యువ షూటర్ల ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణం. క్రీడాగ్రామంలో నేను వారితో పోటీలకు ముందే భేటీ అయ్యాను. నేనో చెఫ్ డి మిషన్‌గా కాకుండా ఓ షూటర్‌గానే వాళ్లతో సంభాíÙంచాను. అప్పుడు వాళ్ల విశ్వాసం, పట్టుదల ఏంటో నాకు అర్థమైంది. ఓ సీనియర్ షూటర్‌గా నేను వారికి చెప్పేదొకటే... గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్రీడలపైనే దృష్టి సారించాలని చెప్పాను. ప్రస్తుత బృందంలోని 21 మందిలో 10 మంది ‘ఖేలో ఇండియా’ ద్వారా వెలుగులోకి వచ్చారు. మరో 11 మంది టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) అండదండలతో విశ్వక్రీడలకు అర్హత సాధించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడాకారులకు ఉన్న ఆరి్థక కష్టాలను తొలగించి ఆటపై దృష్టి పెట్టేలా పెద్ద ఎత్తున కృషి చేశారు. క్రీడాకారులకు సంబంధించి ప్రత్యేక, వ్యక్తిగత శిక్షణ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్చ కూడా కల్పిం చడం గొప్ప విషయం. విదేశీ కోచ్‌లు, విదేశాల్లో శిక్షణ వీటన్నింటి మీద క్రీడా శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఆరంభంలోనే రెండు పతకాలు (షూటింగ్) రావడంతో ఈ విశ్వక్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు గెలిచేందుకు పారిస్ ఒలింపిక్స్ దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. -
గురి అదరాలి... తీపి కబురు వినాలి
విశ్వ క్రీడల ప్రారంబోత్సవం ముగిసింది. ఇక నేటి నుంచి పతకాల వేట మొదలుకానుంది. భారత్ విషయానికొస్తే తొలి రోజు శనివారం షూటింగ్ క్రీడాంశంలో మన షూటర్లు పతకాల కోసం తమ తుపాకీలకు పని చెప్పనున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ నుంచి రెండు జోడీలు ముందుగా క్వాలిఫయింగ్‌లో పోటీపడనున్నాయి. క్వాలిఫయింగ్‌లో టాప్–4లో నిలిచిన నాలుగు జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. పారిస్: ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర్లు పతకాలు సాధించి పుష్కరకాలం గడిచింది. చివరిసారి 2012 లండన్ ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించగా... విజయ్ కుమార్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకం గెలిచాడు. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు గురి తప్పారు. ఒక్క పతకం కూడా నెగ్గకుండానే రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డుస్థాయిలో భారత్ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్ ఈవెంట్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మెడల్ ఈవెంట్ ఉంది. ఈ విభాగంలో భారత్ నుంచి అర్జున్ బబూటా–రమితా జిందాల్ జోడీ... సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ పోటీపడతాయి. ఓవరాల్‌గా 28 జోడీలు క్వాలిఫయింగ్‌లో ఉన్నాయి. క్వాలిఫయింగ్ ముగిశాక టాప్–4లో నిలిచిన జోడీలు మెడల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2లో నిలిచిన జంటలు స్వర్ణ–రజత పతకాల కోసం... మూడు–నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు కాంస్య పతకం కోసం పోటీపడతాయి. శనివారమే పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగుతుంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్: సందీప్ సింగ్/ఇలవేనిల్ వలారివన్; అర్జున్ బబూటా/రమితా జిందాల్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ఫైనల్: మధ్యాహ్నం గం. 2 నుంచి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం గం. 4 నుంచి). -
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా..సాహసంతో తరిమికొట్టింది!
తుపాకీతో కాల్పులు జరుపుతున్న నలుగురు దుండగులను ధైర్యంగా ఎదిరించిందో మహిళ. కేవలం పొడవాటి చీపురు కర్ర (దులుపు కర్ర)సాయంతో షూటర్లను తరిమి కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. హర్యానాలో భివానీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. షాకింగ్ దృశ్యాలకు సంబంధించిప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో హరికిషన్ తన ఇంటికి వెళ్ళే గేటు పక్కనే నిలబడి ఉన్నాడు. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బండిపై నుంచి దిగిన పిలియన్ రైడర్లు ఇద్దరు హరికిషన్‌పై కాల్పులు జరపడంతో, అతను లోపలికి పోయి, తప్పించుకున్నాడు. ఇంతలో పక్కనుంచి వచ్చిన మహిళ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించింది. కాల్పులు మోత మోగుతున్నాఏ మాత్రం వెనకడుగు వేయలేదు. షూటర్ల మీదికి కొబ్బరి పుల్లలతో కట్టిన దులుపు కర్రతో ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వారు ఆ ప్రదేశంనుంచి ఉడాయించిక తప్పలేదు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది. ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, హరికిషన్‌కు నాలుగు బుల్లెట్ గాయాలయ్యాయి. మహిళ హరికిషన్ కుటుంబసభ్యులా లేక పొరుగింటి మహిళా అనేది స్పష్టత లేదు. బాధితుడిని చికిత్స నిమిత్తం పీజీఐఎంఎస్ రోహ్తక్కు తరలించినట్లు పోలీసు అధికారి దీపక్ మీడియాకు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నారని, షూటర్లను, వారితో పాటు వచ్చిన ఇద్దరు రైడర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా రవి బాక్సర్ హత్య కేసులో హరికిషన్ నిందితుడు.ఇతనికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. హరికిషన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేశారట. Bravery. Haven't EVER seen anything close to this! 4 armed men, on a shooting spree, being chased by a middle aged woman, with a BROOM. pic.twitter.com/fbbboLW9jU — CA Mayank Parakh (@Mayank_Parakh) November 28, 2023 -
మన గురి అదిరె..
ఆసియా క్రీడల్లో ఐదో రోజూ భారత్ పతకాల వేట కొనసాగింది. ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి గురువారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు నాలుగో స్వర్ణం సాధించగా... వుషులో రోషిబినా దేవి రజతం, ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ కాంస్యం గెలిచారు. ఫలితంగా భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నేటి నుంచి అథ్లెటిక్స్ ఈవెంట్ కూడా మొదలుకానుండటం... టెన్నిస్, షూటింగ్, స్క్వాష్‌లలో కూడా మెడల్ ఈవెంట్స్ ఉండటంతో పతకాల పట్టికలో నేడు భారత్ నాలుగో స్థానానికి చేరుకునే అవకాశముంది. హాంగ్జౌ: భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత షూటర్లు నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. పోటీల ఐదో రోజు గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్‌లతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం సంపాదించి పసిడి పతకం గెల్చుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత జట్టు మొత్తం 1734 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. సరబ్జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లు స్కోరు చేశారు. సరబ్జోత్ ఐదో స్థానంలో, అర్జున్ సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అయితే వ్యక్తిగత విభాగంలో సరబ్జోత్, అర్జున్ సింగ్‌లకు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అర్జున్ 113.3 పాయింట్లు స్కోరు చేసి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలువగా... సరబ్జోత్ 199 పాయింట్లు సాధించి నాలుగో స్థానం దక్కించుకొని కాంస్య పతకానికి దూరమయ్యాడు. మరోవైపు స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్, గనీమత్ సెఖోన్‌లతో కూడిన భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. నేడు షూటింగ్లో నాలుగు మెడల్ ఈవెంట్స్ (పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్, వ్యక్తిగత విభాగం; మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత విభాగం) ఉన్నాయి. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు గెలిచారు. అనూష్ ఘనత.. ఈక్వె్రస్టియన్ (అశ్వ క్రీడలు)లో భారత్‌కు మరో పతకం దక్కింది. డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్వల్లా కాంస్య పతకం సాధించాడు. 14 మంది పోటీపడిన ఫైనల్లో అనూష్, అతని అశ్వం 73.030 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. మరోవైపు వుషు క్రీడాంశంలో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత క్రీడాకారిణి రోషిబినా దేవికి నిరాశ ఎదురైంది. వు జియోవె (చైనా)తో జరిగిన 60 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో రోషిబినా దేవి 0–2తో ఓడిపోయి రజత పతకం కైవసం చేసుకుంది. భారత్ ‘హ్యాట్రిక్’ విజయం భారత పురుషుల హాకీ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో గురువారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున అభిõÙక్ (13వ, 48వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మన్దీప్ (24వ ని.లో), అమిత్ రోహిదాస్ (34వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. క్వార్టర్ ఫైనల్లో సింధు బృందం.. మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగోలియాతో జరిగిన తొలి రౌండ్లో భారత్ 3–0తో గెలిచింది. పీవీ సింధు, అషి్మత, అనుపమ తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. స్క్వాష్ జట్లకు పతకాలు ఖాయం వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 0–3తో మలేసియా చేతిలో ఓడిపోగా.. భారత పురుషుల జట్టు 3–0తో నేపాల్‌పై నెగ్గింది. తమ గ్రూపుల్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ∙భారత జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు పొందాయి. నిశాంత్ పంచ్ అదుర్స్.. భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి పతకానికి విజయం దూరంలో నిలువగా... దీపక్ (51 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. నిశాంత్ పంచ్‌లకు అతని ప్రత్యర్థి బుయ్ తుంగ్ (వియత్నాం) తొలి రౌండ్లోనే చిత్తయ్యాడు. జాస్మిన్ పంచ్‌లకు హదీల్ గజ్వాన్ (సౌదీ అరేబియా) తట్టుకోలేకపోవడంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్‌ను ముగించాడు. దీపక్ 1–4తో ప్రపంచ మాజీ చాంపియన్ టొమోయా సుబోయ్ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. -
సింగర్ సిద్ధూ హత్య కేసు: వెలుగులోకి వచ్చిన మరో వీడియో!
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ సిద్ధూ హత్య కేసులో అసలు నిందుతుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసులు తేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది నిందితులను కూడా అరెస్టు చేశారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ షార్ప్ షూటర్ల ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బస్ టెర్మినల్‌లో 18 ఏళ్ల అంకిత్ సిర్సా అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడు దోషిగా తేలిని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అంకిత్ సిర్సా మొబైల్‌ని స్కాన్ చేసి చూడగా....సిద్ధూని హత్య చేసి అనంతరం నిందితులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూ హత్యలో ఆ యువకుడే ప్రధాన షూటర్‌గా పోలీసులు తెలిపారు. అంతేకాదు అంకిత్ సిర్సానే గాయకుడు సిద్ధూ వద్దకు వెళ్లి నేరుగా అతనిపై ఆరు బుల్లెట్టు కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతని సహచరుడు సచిన్ వీరమణిని కూడా అరెస్టు చేశారు. #WATCH | In a viral video, Sidhu Moose Wala's murder accused Ankit Sirsa, Priyavrat, Kapil, Sachin Bhivani, & Deepak brandished guns in a vehicle pic.twitter.com/SYBy8lgyRd — ANI (@ANI) July 4, 2022 (చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు) -
టీకా కోసం ఇటలీ నుంచి క్రొయేషియాకు...
న్యూఢిల్లీ: భారత స్కీట్ షూటర్లు మేరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్ వీర్ సింగ్ బాజ్వా కోవిడ్ వ్యాక్సిన్ కోసం సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇటలీ నుంచి క్రొయేషియాకు కారులో వెళ్లారు. దాదాపు 1000 కిలోమీటర్లు పయనించి టీకా తీసుకున్నారు. ఈ ఇద్దరు షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రత్యేక శిక్షణ కోసం ఇటలీకి వచ్చారు. తుది సన్నాహాల్లో నిమగ్నమైన మేరాజ్, అంగద్ ప్రస్తుతం క్రొయేషియాలోని ఒసిజెక్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. టోక్యో వెళ్లాలంటే అథ్లెట్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన ఉంది. ఇటలీలో వ్యాక్సిన్ లేకపోవడంతోపాటు మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు అథ్లెట్లు క్రొయేషియాకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నారు. -
షూటింగ్ ప్రపంచకప్‌లో కరోనా కలకలం..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నీలో కరోనా కలకలం రేపింది. ముగ్గురు షూటర్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా షూటర్లంతా హోటల్ గదుల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వర్గాలు శనివారం వెల్లడించాయి. వైరస్ బారినపడ్డ షూటర్లతో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నట్టు అధికారులు తెలిపారు. వారి ఫలితాలు రావాల్సి ఉండగా.. ముందస్తుగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు టోర్నీ నిర్వహకులు పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడ్డ ముగ్గురు షూటర్లలో ఇద్దరు భారతీయ క్రీడాకారులేనని సంబంధిత వర్గాల సమాచారం. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల్లో ఇప్పటికే నలుగురు వైరస్ బారినపడగా.. గురువారం మరో విదేశీ ఆటగాడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఈ ప్రపంచకప్‌లో భారత షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా సత్తాచాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ ఇద్దరూ ఫైనల్లో చోటు సంపాదించారు. శుక్రవారం జరిగిన 60 షాట్ల క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ (631.8 పాయింట్లు) మూడో స్థానం, పన్వర్ (629.1 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. వీరిలో పన్వర్ టోక్యో ఒలింపిక్స్ బెర్తును కూడా సాధించాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుం మౌద్గిల్ ఫైనల్ చేరింది. అర్హత పోటీలో అంజుమ్ 629.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
భారత షూటర్లకు ఐదు పతకాలు
కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత షూటర్లు ఐదు పతకాలు గెలి చారు. ప్రాచీ గడ్కరీ, గాయత్రి పవాస్కర్, ఆషి రస్తోగిలతో కూడిన భారత యూత్ మహిళల జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో ప్రాచీ గడ్కరీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మహిళల టీమ్ ఈవెం ట్లో మంపి దాస్, శ్రీయాంకలతో కూడిన భారత జట్టుకు రజతం దక్కింది. 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ జూనియర్ పురుషుల ఈవెంట్లో సుమేధ్ కుమార్ కాంస్యం సాధించాడు. ఇదే విభాగంలో టీమ్ ఈవెం ట్లో సుమేధ్, అర్జున్ దాస్, సూరజ్ భంబానీలతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. -
కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!
ఫ్రాన్సులో చార్లీ హెబ్డో పత్రికపై దాడులకు తెగబడ్డ నరహంతకులకు సంబంధించి తాజా వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. పత్రిక ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పారిస్ రోడ్డుపై చాలా ప్రశాంతంగా కనిపించారు. నిదానంగా తుపాకుల్ని తుడుచుకుంటా గడిపారు. ఒకతను కార్లో కూర్చునే ప్రయత్నం చేయగా మరొకడు... ప్రతీకారం తీర్చుకున్నామని నినాదాలు చేయడం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డయింది. ఎక్కడా తొందరగా వెళ్లాలనే ఆత్రం కానీ, తప్పు చేశామన్న భావన గానీ వాళ్లలో కనిపించలేదు. నిదానంగా కారు నడిపించుకుంటూ వెళ్లిన వాళ్లను ఓ పోలీసు కారు వెంబడించింది. పోలీసులు వెంటపడుతున్నారని గుర్తించిన ఉగ్రవాదులు కారు ఆపేసి ఆ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. దాంతో పోలీసు వ్యాన్ వెనక్కి వెళ్లిపోవాల్సిన వచ్చిన దృశ్యాలు ఈ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికపై గత వారం జరిగిన దాడిలో పది మంది ఆ పత్రిక ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు చనిపోయారు. -
తుపాకీ ‘రాయ్’డు
‘యత్రాహం విజయస్థత్రా’ ఇదీ భారత సైన్యంలోని ‘గూర్ఖా రైఫిల్స్’ నినాదం. ఒకరకంగా ‘గూర్ఖా రైఫిల్స్’ విజయానికి రూపకాలంకారం. ఓటమిని అస్సలు ఇష్టపడరు. ఎంతకష్టమైనా అనుకున్నది సాధిస్తారు. అందుకే గూర్ఖా రైఫిల్స్‌కు సైన్యంలో ప్రత్యేకమైన స్థానం. భారత సైన్యంలో ‘11 గూర్ఖా రైఫిల్స్’ రెజిమెంట్‌లో సిపాయిగా చేరిన జీతూ రాయ్.. ఇదే విజయ మంత్రాన్ని పుణికి పుచ్చుకున్నాడు. తుపాకీతో శత్రువులను తుద ముట్టించాల్సిన తను... అదే ఆయుధంతో పతకాల పంట పండిస్తూ దేశం గర్వించేలా విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా ఏషియాడ్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం గెలిచి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు సెప్టెంబర్ 20, 2014.. ఇంచియాన్లోని ఆంగ్నియాన్ షూటింగ్ రేంజ్... పురుషుల 50 మీ. ఎయిర్ పిస్టల్... అందరి కళ్లు స్టార్ షూటర్లు వాంగ్ ఝివీ (చైనా), జోంగో (దక్షిణ కొరియా)పైనే... కానీ ఈ ఇద్దరు ఫైనల్స్‌కు ముందే ఇంటిదారి పట్టారు. దీంతో చూపు హోంగ్ పుంగ్ (వియత్నాం)పై నిలిచింది. స్వర్ణంపై గురి అతనిదేనని అంతా భావించారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ భారత షూటర్ జీతూ రాయ్ చివరి ప్రయత్నంలో లక్ష్యంవైపు పిస్టల్ పేల్చి స్వర్ణం అందించాడు. అంతే షూటింగ్ రేంజ్లో ఒక్కసారిగా హర్షధ్వానాలు.. సాక్షాత్తు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ సైతం చప్పట్లు కొట్టారంటే జీతూ రాయ్ సాధించిన విజయం ఎంత అమూల్యమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పడిలేచిన కెరటం షూటింగ్ కెరీర్‌ను జీతూరాయ్ ఆకస్మికంగా ఎంచుకోవాల్సి వచ్చింది. గూర్ఖా రెజిమెంట్‌లో సిపాయిగా శిక్షణ సమయంలో రాయ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ బ్లడ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటడంతో ఓ అధికారి అతన్ని షూటింగ్ బృందంలోకి ఎంపిక చేశారు. ఇది సరిగ్గా నాలుగేళ్ల కిందట జరిగింది. అయితే ట్రైనింగ్‌లో చూపిన ప్రతిభను మహూలోని ఆర్మీ మార్క్స్మన్షిప్ యూనిట్ (ఏఎంయూ)లో కనబర్చలేకపోయాడు. ఫలితంగా ఏఎంయూ నుంచి తిరిగి రెజిమెంట్‌కు వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ సత్తా చాటడంతో తిరిగి ఏఎంయూలో శిక్షణకు ఎంపికయ్యాడు. ఈసారీ అదే ఫలితం. అధికారులు మళ్లీ తనని రెజిమెంట్‌కు పంపారు. ఏఎంయూ నుంచి నైపుణ్యం లేదన్న కారణంగా తనను బయటకు పంపడాన్ని రాయ్ జీర్ణించుకోలేక పోయాడు. పోయిన చోటే వెతుక్కున్నాడు. షూటింగ్ కెరీర్‌ను సవాలుగా తీసుకున్నాడు. లక్ష్యంపై గురిపెట్టాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. దేశవాళీ పోటీలనే ఇందుకు వేదికగా చేసుకున్నాడు. చివరికి సఫలమయ్యాడు. తనను వద్దన్న వాళ్లే తిరిగి ఏంఎంయూలోకి ఎంపిక చేసేలా చేశాడు. అదే ఉత్సాహాన్ని కొనసాగించి గత ఏడాది భారత్ బృందంలో చోటు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జీతూ రాయ్ వెనుదిరిగి చూడలేదు. పాల్గొన్న ప్రతీ చాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యంవైపు గురిపెట్టి విజయవంతమయ్యాడు. ఫలితంగా తాను పాల్గొన్న తొలి ఏషియాడ్‌లోనే స్వర్ణం సాధించి భారత్‌కు ఇంచియాన్‌లో తొలి స్వర్ణం దక్కేలా చేశాడు. పిస్టల్ కింగ్ లక్ష్యం దిశగా తుపాకీని గురిపెట్టి విజయం సాధించడంలో జీతూ రాయ్‌ని మించిన షూటర్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అతన్ని ‘పిస్టల్ కింగ్’ అని అంతా ముద్దుగా పిలుచుకుంటారు. 10 మీ. ఎయిర్ పిస్టల్, 50 మీ. ఫ్రీ పిస్టల్ ఈవెంట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది నిలకడగా మంచి ఫలితాలు సాధించడం ద్వారా మ్యూనిచ్ (జర్మనీ), చాంగ్వాన్ (దక్షిణ కొరియా) ప్రపంచ కప్‌లలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇక ఈ ఏడాదైతే అత్యంత విజయవంతమైన భారత షూటర్‌గా జీతూ రాయ్ రికార్డులకు ఎక్కాడు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్‌లో స్వర్ణాలు కైవసం చేసుకోవడం అతని ప్రతిభకు తార్కాణం. ఇంచియాన్లోనే 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గాడు. ఇక ప్రపంచకప్లలోనైతే తన షూటింగ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. తొమ్మిది రోజుల్లో ప్రపంచకప్‌లలో మూడు పతకాలు నెగ్గి ఔరా అనిపించుకున్నాడు. మ్యూనిచ్ ప్రపంచకప్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్‌లో రజతం గెలిచాడు. మరిబోర్ ప్రపంచకప్‌లో 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో బంగారు, 50 మీ. ఫ్రీ పిస్టల్‌లో రజత పతకాలు నెగ్గాడు. ఒక ప్రపంచకప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత షూటర్‌గా ఘనత సాధించాడు. ఈ రెండు ప్రపంచకప్‌లలో సత్తా చాటడంతో అంతర్జాతీయ ర్యాంకుల్లో ఈ భారత షూటర్ టాప్-5లో స్థానం సంపాదించగలిగాడు. ప్రస్తుతం 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో అగ్రస్థానం, 50 మీ. ఫ్రీ పిస్టల్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఏడు పతకాలు సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. 2014లో తన ప్రదర్శనపై జీతూ రాయ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. షూటింగ్లో తన విజయానికి ఆర్మీ సహకారమే కారణమని చెప్పాడు. ‘నేను ఎంతో సాధిస్తానని కొన్నేళ్ల కిందట అస్సలు అనుకోలేదు. నేను ఆర్మీకి ఎంతో రుణపడి ఉన్నా. అంతర్జాతీయంగా నేను రాణించడానికి ఆర్మీయే కారణం. ఒకవేళ ఆర్మీ సహకారమే లేకపోతే నేను బ్రిటన్‌లోనో లేదంటే స్వగ్రామంలో ఆలుగడ్డలు పండించుకుంటూ ఉండేవాడిని’ అని జీతూ రాయ్ అన్నాడు. లక్ష్యం ఒలింపిక్స్... భారత్ నుంచి 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి షూటర్ కూడా జీతూనే. షూటింగ్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న జీతూ రాయ్‌పై ఇప్పుడు అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న జోరును తను మరో రెండేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ భారత షూటర్ పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే రియో ఒలింపిక్స్ వరకు ఫామ్‌ను కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే భారత త్రివర్ణ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించడం ఖాయం. షూటర్ల ఫ్యాక్టరీ... ఆగస్ట్ 17, 2004.. ఏథెన్స్ ఒలింపిక్స్... మార్కోపోలో షూటింగ్ రేంజ్... పురుషుల డబుల్ ట్రాప్ పోటీల్లో భారత షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకం నెగ్గి చరిత్ర సృష్టించాడు. తను పతకం గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే రాథోడ్ విజయానికి కావడానికి మధ్యప్రదేశ్‌లోని మహూలో ఉన్న ఆర్మీ మార్క్స్మన్షిప్ యూనిట్ (ఏఎంయూ) కారణం. ఏథెన్స్ ఒలింపిక్స్‌కు నాలుగేళ్ల ముందటి నుంచి రాథోడ్ ఇక్కడే సాధన చేస్తున్నాడు. అంతర్జాతీయ షూటింగ్లో అలా మొదలైన ఏఎంయూ షూటర్ల ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. జీతూ రాయ్‌తో పాటు విజయ్ కుమార్, గుర్ప్రీత్ సింగ్, ఏడీ పీపుల్స్, ఇమ్రాన్ హసన్ ఖాన్, సీకే చౌదరి, హరి ఓం సింగ్, సుశీల్ గాలే, ప్రవీణ్ దాహియా, సీమా తోమర్ లాంటి అంతర్జాతీయ షూటర్లు ఏఎంయూలో శిక్షణ పొందిన వారే. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ భారత్‌కు పతకాలు అందించి పెడుతున్నారు. ఇంకా అంతర్జాతీయంగా తమ సత్తా చాటేందుకు ఎంతో మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో... మార్క్స్‌మన్ అంటే లక్ష్యాన్ని గురిచూసి కొట్టడం.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిపెట్టడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్‌లోని మహూలో ఆర్మీ మార్క్స్మన్షిప్ యూనిట్ (ఏఎంయూ)లో అత్యాధునిక సౌకర్యాలతో షూటింగ్ రేంజ్‌ను నెలకొల్పారు. 50 మీ. రేంజ్ (60 షూటింగ్ లేన్లు), 25 మీ. రేంజ్ ( 6 షూటింగ్ బేలు), 10 మీ. ఎయిర్ కండీషన్ రేంజ్ (60 షూటింగ్ లేన్లు), రెండు ట్రాప్, స్కీట్ రేంజ్‌లు, 250 మంది షూటర్లు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఆర్మీ షూటర్లకు అత్యాధునిక షూటింగ్ రేంజ్ అందుబాటులోకి వచ్చింది. సుశిక్షితులైన షూటింగ్ కోచ్‌ల సాయంతో అనతి కాలంలోనే ఏఎంయూకు చెందిన భారత షూటర్లు అంతర్జాతీయంగా సత్తా చాటడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే ఏఎంయూ భారత కీర్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. తండ్రి మరణంతో మారిన గమ్యం జీతూ రాయ్ పుట్టింది, పెరిగింది నేపాల్‌లోనే. సంకువసాబా జిల్లాలోని సిత్తల్పాటి-8 అనే మారుమూల గ్రామంలో పేదరికంలోనే పెరిగిన జీతూ... ఇంటికి సమీపంలోనే ఉన్న పొలంలో వ్యవసాయం చేసే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. వరి, మొక్కజొన్న, ఆలుగడ్డలు పండించడంలో తల్లికి సహకరించే వాడు. 2006లో తన తండ్రి మరణంతో అతని గమ్యం మారింది. స్థానికంగా చాలా మంది యువకులు భారత సైన్యంలో చేరడంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని తానూ ఆర్మీలో చేరాడు. టీనేజ్‌లో గూర్ఖా రైఫిల్స్‌లో సిపాయిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే తనలోని నైపుణ్యం బయట పడేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. అప్పటిదాకా సాధారణ సిపాయిలా గూర్ఖా రెజిమెంట్‌లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. అలా రాటుదేలిన జీతూ గమ్యం వైపు సాగి విజయవంతమయ్యాడు. శభాష్ గూర్ఖా... భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో నేపాల్ దేశస్తులైన గూర్ఖా సైనికులకు స్థానం ఉంటుంది. ఇందులో నేపాల్‌కు చెందిన రాయ్, లింబూ తెగలకు చెందిన వాళ్లే ప్రధానంగా ఉంటారు. అయితే ఈ తెగలకు చెందిన వారిని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. వీరిది అత్యంత దృడ నిర్మాణం, కఠినమైన స్వభావం. మహాభారత పురాణాల ప్రకారం అర్జునుడిని ఈ తెగలకే చెందిన కిరాంత్ వంశస్తులు ఓడించినట్లు చెబుతారు. ఇదే తెగలకు చెందిన జీతూ రాయ్ ఇప్పుడు అంతర్జాతీయ షూటింగ్లో రాణిస్తూ శభాష్ గూర్ఖా అనిపించు కుంటున్నాడు.