Viral Video: Moose Wala Shooters Celebrated In Car Waving Guns - Sakshi
Sakshi News home page

Sidhu Moose Wala Murder Case: సంబరాలు చేసుకుంటున్న నిందితులు: వీడియో వైరల్‌

Published Mon, Jul 4 2022 8:41 PM | Last Updated on Mon, Jul 4 2022 9:15 PM

Viral Video: Moose Walas Shooters Celebrated In Car Waving Guns - Sakshi

న్యూఢిల్లీ: పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్య కేసులో అసలు నిందుతుడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ అని ఢిల్లీ పోలీసులు తేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది నిందితులను కూడా అరెస్టు చేశారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ షార్ప్‌ షూటర్ల ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బస్ టెర్మినల్‌లో 18 ఏళ్ల అంకిత్ సిర్సా అనే యువకుడిని అరెస్టు చేశారు.

అతడు దోషిగా తేలిని  గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అంకిత్ సిర్సా మొబైల్‌ని స్కాన్‌ చేసి చూడగా....సిద్ధూని హత్య చేసి అనంతరం నిందితులు ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్ధూ హత్యలో ఆ యువకుడే ప్రధాన షూటర్‌గా పోలీసులు తెలిపారు. అంతేకాదు అంకిత్‌ సిర్సానే గాయకుడు సిద్ధూ వద్దకు వెళ్లి నేరుగా అతనిపై ఆరు బుల్లెట్టు కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతని సహచరుడు సచిన్‌ వీరమణిని కూడా అరెస్టు చేశారు. 

(చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్‌ మైండ్‌ అతనేనన్న ఢిల్లీ పోలీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement