charli hebdo
-
కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!
ఫ్రాన్సులో చార్లీ హెబ్డో పత్రికపై దాడులకు తెగబడ్డ నరహంతకులకు సంబంధించి తాజా వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. పత్రిక ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పారిస్ రోడ్డుపై చాలా ప్రశాంతంగా కనిపించారు. నిదానంగా తుపాకుల్ని తుడుచుకుంటా గడిపారు. ఒకతను కార్లో కూర్చునే ప్రయత్నం చేయగా మరొకడు... ప్రతీకారం తీర్చుకున్నామని నినాదాలు చేయడం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డయింది. ఎక్కడా తొందరగా వెళ్లాలనే ఆత్రం కానీ, తప్పు చేశామన్న భావన గానీ వాళ్లలో కనిపించలేదు. నిదానంగా కారు నడిపించుకుంటూ వెళ్లిన వాళ్లను ఓ పోలీసు కారు వెంబడించింది. పోలీసులు వెంటపడుతున్నారని గుర్తించిన ఉగ్రవాదులు కారు ఆపేసి ఆ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. దాంతో పోలీసు వ్యాన్ వెనక్కి వెళ్లిపోవాల్సిన వచ్చిన దృశ్యాలు ఈ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికపై గత వారం జరిగిన దాడిలో పది మంది ఆ పత్రిక ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు చనిపోయారు. -
ప్యారిస్ దాడికి పాల్పడింది మేమే
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్‌లో వ్యంగ్య వార్తాపత్రిక చార్లీ హెబ్డో మీద దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ప్రకటించుకుంది. యెమెన్‌లో అల్ కాయిదా నేతలు యూట్యూబ్ ద్వారా ఈ ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకే ఈ దాడి చేసినట్లు ఆ వీడియోలో తెలిపారు. ప్యారిస్ మీద జరిగిన పవిత్ర యుద్ధానికి అరేబియన్ ద్వీపకల్పంలోని అల్ కాయిదా అల్ జిహాద్ బాధ్యత తీసుకుంటోందని, దైవదూతను దూషించినందుకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టామని అల్ కాయిదా యెమెన్ శాఖకు చెందిన నాజర్ అలీ అల్ అన్సీ ఆ వీడియోలో తెలిపారు. -
పారిస్‌లో ముగిసిన ఆపరేషన్.. కోచీ బ్రదర్స్ హతం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి 12 మందిని కాల్చిచంపిన ఇద్దరు ఉగ్రవాద కోచీ సోదరులను భద్రత బలగాలు కాల్చిచంపాయి. ఉన్నతాధికారులు ఈ విషయాన్నివెల్లడించినట్టు ఓ వార్త సంస్థ తెలియజేసింది. ఉగ్రవాద దాడిలో నలుగురు చనిపోయారు. పారిస్‌లో శుక్రవారం కమెండోలు ఒకేసారి రెండు చోట్ల ఆపరేషన్ కొనసాగించారు. పత్రికా కార్యాలయంపై దాడి అనంతరం సయీద్ కోచీ, చెరిఫ్ కోచీ సోదరులు ఓ కారులో పారిపోతుండగా పోలీసులు వెంబడించడంతో పారిస్ శివారున ఓ గౌడౌన్లో దాక్కున్నారు. సూపర్ మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్‌లో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేయిమంది కమెండోలను, హెలీకాప్టర్లను రంగంలోకి దించారు. రెండు చోట్ల కమెండోలు ఆపరేషన్ కొనసాగించారు. మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్‌లో నాలుగు బాంబులు పేలినట్టు శబ్దాలు వినిపించాయి. మార్కెట్ లో ఉన్న ప్రజలను సురక్షితంగా బయటకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా ఉగ్రవాద దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చివరకు కమెండో ఆపరేషన్‌లో ఉగ్రవాద సోదరులు హతమయ్యారు. ఈ ఘటనలకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సివుంది. -
పారిస్‌లో మళ్ళీ కాల్పుల కలకలం
-
ప్యారిస్ ఉగ్రవాదులపై పోలీసు ఆపరేషన్
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి 12 మందిని కాల్చిచంపిన ఇద్దరు ఉగ్రవాద సోదరులను పోలీసులు వెంబడిస్తున్నారు. వాళ్లు ఓ కారులో వెళ్తుండగా పోలీసులు వెంబడించడంతో నిందితులైన సోదరులిద్దరూ ఓ గోడౌన్ ప్రాంతంలో దాక్కున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటపడటంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోందని.. ఉగ్రవాదుల చెంతకు పోలీసులు వెళ్లారని ఫ్రాన్సు హోంశాఖ మంత్రి తెలిపారు. ప్యారిస్ ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. డమార్టన్ ఎన్ గోయిల్ అనే ప్రాంతం వద్ద ఉదయం కాల్పులు జరగడంతో మళ్లీ ఏమయిందోనని స్థానికులు ఆందోళన చెందారు. అయితే.. కారును పోలీసులు వెంబడిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. చివరకు ఎట్టకేలకు పోలీసులు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్లు ఓ గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భారీ స్థాయిలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. -
ఏకే 47, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల దాడి
ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మిషన్ గన్లతో ప్యారిస్ నగరంలోని పత్రికా కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. ఫ్రాన్స్‌లోని అన్ని మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా పలు ఉగ్రవాద కుట్రలను ముందుగానే అడ్డుకున్నామని హోలండ్ అన్నారు. తాజాగా చార్లీ హెబ్డో కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత హేయమైనదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పత్రికా కార్యాలయంలోకి ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా మెట్లు ఎక్కి లోపలకు వెళ్లిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపి, లాంచర్లతో రాకెట్లు కూడా ప్రయోగించారు. దాంతో పదిమంది అక్కడికక్కడే మరణించారు. తిరిగి పారిపోతూ.. రోడ్డుమీద ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపారు. దాంతో ఓ పోలీసు అక్కడే మరణించారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు పత్రికా కార్యాలయం సమీపంలోని ఓ మెట్రో స్టేషన్ వైపు పారిపోయారు. కాగా, ప్యారిస్ ఘటన హేయమైన చర్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రెంచి వాసులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై పోరుకు తాము ఎప్పుడూ ముందుంటామని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.