పారిస్లో ముగిసిన ఆపరేషన్.. కోచీ బ్రదర్స్ హతం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి 12 మందిని కాల్చిచంపిన ఇద్దరు ఉగ్రవాద కోచీ సోదరులను భద్రత బలగాలు కాల్చిచంపాయి. ఉన్నతాధికారులు ఈ విషయాన్నివెల్లడించినట్టు ఓ వార్త సంస్థ తెలియజేసింది. ఉగ్రవాద దాడిలో నలుగురు చనిపోయారు.
పారిస్లో శుక్రవారం కమెండోలు ఒకేసారి రెండు చోట్ల ఆపరేషన్ కొనసాగించారు. పత్రికా కార్యాలయంపై దాడి అనంతరం సయీద్ కోచీ, చెరిఫ్ కోచీ సోదరులు ఓ కారులో పారిపోతుండగా పోలీసులు వెంబడించడంతో పారిస్ శివారున ఓ గౌడౌన్లో దాక్కున్నారు. సూపర్ మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్లో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేయిమంది కమెండోలను, హెలీకాప్టర్లను రంగంలోకి దించారు. రెండు చోట్ల కమెండోలు ఆపరేషన్ కొనసాగించారు. మార్కెట్, ప్రింటింగ్ ప్రెస్లో నాలుగు బాంబులు పేలినట్టు శబ్దాలు వినిపించాయి. మార్కెట్ లో ఉన్న ప్రజలను సురక్షితంగా బయటకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా ఉగ్రవాద దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చివరకు కమెండో ఆపరేషన్లో ఉగ్రవాద సోదరులు హతమయ్యారు. ఈ ఘటనలకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సివుంది.