మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే! | French police decsribe woman terrorist more dangerous, still at large | Sakshi
Sakshi News home page

మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!

Jan 10 2015 3:38 PM | Updated on Sep 2 2017 7:30 PM

మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!

మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!

ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరం మీద దాడిచేసి.. పలుప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఫ్రెంచి పోలీసులు మట్టుబెట్టారు.

ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరం మీద దాడిచేసి.. పలుప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఫ్రెంచి పోలీసులు మట్టుబెట్టారు. మరొకరు లొంగిపోయారు. అయితే.. ఈ ఆపరేషన్ నుంచి నేర్పుగా తప్పించుకున్నది మాత్రం.. ఓ మహిళా టెర్రరిస్టు. ఆమె పేరు హయత్ బౌముదీన్. ఆమె అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, సాయుధురాలని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు. ఆమెను పట్టుకోడానికి తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. మూడు దాడుల్లో పాల్గొన్నవాళ్లు ఒకరికొకరు అంతా తెలుసని, వారంతా కూడా యెమెన్ దేశంలోని అల్ కాయిదా శిబిరాల్లో శిక్షణ పొందారని అంటున్నారు.

'డబుల్ ట్యాప్' అంటే.. ఒక తుపాకి నుంచి ఒకేసారి రెండు బుల్లెట్లు కాల్చడం లాంటివి అత్యంత అధునాత ఆయుధాల ఉపయోగంలో ప్రొఫెషనల్ శిక్షణ పొందినవాళ్లు మాత్రమే చేయగలిగిన పని. అలాంటి తరహాలో వీళ్లు కాల్పులు జరిపారు. కౌచి సోదరులను పోలీసులు మట్టుబెట్టినా, మహిళా ఉగ్రవాది హయత్ బౌముదీన్ మాత్రం అక్కడినుంచి తప్పించుకోవడంతో ఫ్రాన్సుకు ఇంకా ఉగ్రవాద ముప్పు తప్పలేదనే అధికారులు భావిస్తున్నారు. ఫ్రెంచి ప్రధాని హోలండ్ కూడా ఇదే విషయం చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement