most dangerous
-
ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్ ఎక్కడంటే?
కోల్‌కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలీదు.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా ట్రెండ్ అవుతోంది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలోని దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి..దక్షిణాఫ్రికాఇప్పటివరకు మహిళలకు రక్షణ లేని దేశాలలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోడ్లపై ఒంటరిగా నడిచే మహిళలకు భద్రత చాలా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, డ్రైవింగ్ లేదా కాలినడకలో బయటకు వెళ్లటం మంచిది కాదని పలు కథనాలు వెల్లడించాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రపంచంలోనే ఆడవారికి రక్షణ విషయంలో చాలా ప్రమాదకరమైన దేశం దక్షిణాఫ్రికా అని పేర్కొంది. ఇక్కడ కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే తాము ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించటం గమనార్హం.భారతదేశంఆసియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటీవల ఓ స్పానిష్ జంట భారత్‌తో తాము హింస అనుభవించినట్లు నమోదైన కేసు కూడా వైరల్‌గా మారింది. భారత్‌లో మహిళలు లైంగిక వేధింపులు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు పరిశీలిస్తే.. బలవంతంగా కార్మికులుగా మార్చటం, లైంగిక వేధింపు ఘటనలు పెరగటం, మానవ అక్రమ రవాణా ఇప్పటికీ దేశ భద్రతను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని రాయిటర్స్ నివేదించింది. అయితే ఇక్కడ లైంగిక హింస కంటే.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవటం, బాలికల చదువుపై నిషేధాలు విధించటం వంటి వాటివల్ల మహిళలు ఆఫ్ఘనిస్తాన్ తమకు సురక్షితమైన దేశం కాదని భావిస్తున్నట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ తాలిబన్లు అమలు చేసే నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.సిరియామహిళలు తీవ్రమైన లైంగిక, గృహ వేధింపులకు గురవుతున్న మరో దేశం సిరియా. ఇక్కడ మహిళలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. మధ్య ప్రాచ్య దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో సిరియా ఒకటి.సోమాలియామహిళల హక్కులు, భద్రతను పట్టించుకోని మరో దేశం సోమాలియా. రాయిటర్స్ నివేదించిన ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు పెంచుకోవటం పరంగా మహిళలకు ఇక్కడ చాలా సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. హానికరమైన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పాటించటం ఇక్కడి మహిళలకు శాపంగా మారుతోంది.సౌదీ అరేబియామహిళల హక్కులలో సౌదీ అరేబియా కొంత పురోగతి సాధించినప్పటికీ త్రీవమైన లింగ వివక్ష కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో ఉండే రక్షణ, ఆస్తి హక్కులకు సంబంధించి ఇక్కడి మహిళలకు సౌదీ అరేబియా సురక్షితంకాని దేశంగా మిగిలిపోయింది.పాకిస్తాన్‌ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, మహిళల పట్ల వివక్ష చూపించటంలో మహిళలకు రక్షణలేని దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు హానికరమైన మత, సాంప్రదాయ పద్ధతులు సవాలుగా మారుతున్నాయి. ఇక్కడి మహిళపై దారుణమైన పరువు హత్యలు నమోదు కావటం గమనార్హం.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోఈ దేశంలో చట్టవిరుద్ధం, కక్షపూరిత అల్లర్ల కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు.. ఇక్కడి మహిళలు తీవ్రమైన వేధింపుల బారినపడుతున్నారని పేర్కొంది.యెమెన్తరచూ మానవతా సంక్షోభాలకు గురవుతున్న యెమెన్ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులు మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ దేశం మహిళలకు సురక్షితమైన దేశం కాదని పలు వార్తలు వెలువడ్డాయి.నైజీరియా నైజీరియాలో మహిళలకు రక్షణ లేకపోవడాని అక్కడి ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సంస్థ కారణమని ప్రజలు నమ్ముతారు. తీవ్రవాదులు పౌరులను హింసించటం, మహిళలను అత్యాచారం, హత్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నైజీరియన్ మహిళలు హానికరమైన సాంప్రదాయ పద్ధతులు పాటించటం, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీంతో ఈ దేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మిగులుతోంది. -
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
బోర్ కొడుతోందని.. చావును పెంచి పోషిస్తున్నాడు
బోర్డమ్ను అధిగమించడానికి మనిషి ముందు మార్గాలెన్నో ఉన్నాయి. ఒక్కోసారి వాటిలో కొన్ని విచిత్రంగా కూడా అనిపించొచ్చు. కానీ, విసుగును పొగొట్టుకునేందుకు ఇక్కడో వ్యక్తి ఏకంగా తన ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నాడు. బ్రిటన్ వ్యక్తి డేనియల్ ఎమీలైన్ జోన్స్.. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రమాకరమైన స్టంట్ ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. విసుగును దూరం చేసుకునేందుకు ఈ భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన మొక్కను పెంచుతున్నాడు అతను. డెండ్రోస్నైడ్ మోరోయిడెస్.. ఆ మొక్కను ముద్దుగా జింపీ-జింపీ అని పిలుస్తారు. సూసైడ్ప్లాంట్గా దీనికి మరో పేరు కూడా ఉంది. దానికి ఉండే ముళ్లు గనుక గుచ్చుకుంటే.. ఆ నొప్పి కొన్ని నెలలపాటు ఉంటుంది. అంతేకాదు.. ఆ మొక్క ఒకరకమైన వాతావరణం సృష్టిస్తుంది. అందులో ఉంటే.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతాయంట. జింపీ-జింపీకి ఆస్ట్రేలియన్ స్టింగింగ్ ట్రీ అనే పేరు కూడా ఉంది. దీనిని అత్యంత విషపూరితమైన మొక్కగా వ్యవహరిస్తుంటారు. దాని ముళ్లు గనుక గుచ్చుకుంటే ఒకేసారి యాసిడ్ మీద పడినట్లు.. షాక్ తగిలినట్లు అనిపిస్తుంటుంది. డేనియల్.. ఆక్స్‌ఫర్డ్‌లో పని చేసే ఓ ట్యూటర్. తనకు విసుగు పెట్టి.. అది దూరం చేసుకునేందుకే ఆ మొక్కను పెంచుతున్నాడట. ఇందుకోసం ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకున్నాడు. తన బోర్డమ్ను దూరం చేసుకునేందుకు ఇలా ప్రమాదకరమైన మొక్కను తెచ్చుకుని.. చాలా జాగ్రత్తగా దానిని పెంచుతూ విసుగును పొగట్టుకుంటున్నాడట డేనియల్!. -
పత్రికా స్వేచ్ఛ.. దిగజారిన భారత్ స్థానం
World Press Freedom Day: న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది. భారత్‌లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ఎడిషన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయిన 3న విడుదలైంది. -
డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం
జెనీవా: భారత్‌లో మొట్టమొదటిసారిగా బయటపడిన బి.1.617 కోవిడ్–19 వేరియెంట్లో ఒక రకం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా అని పేరు పెట్టిన ఈ రకం జూన్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వ్యాపించిందని తెలిపింది. ఈ రకం కరోనాతో ఆసియా దేశాలకు ఎలాంటి ముప్పు ఉందో ఊహించడానికే కష్టంగా ఉందని తన వారాంతపు నివేదికలో పేర్కొంది. కరోనాలో బి.1.617 వేరియంట్ తొలిసారిగా భారత్‌లో బయట పడింది. ఆ తర్వాత అది తన జన్యు స్వరూపాన్ని మార్చుకొని బి.1.617.1, బి.1.617.2, బి.1617.3... ఇలా మూడు రకాలుగా మారి వ్యాపించడం మొదలైంది. వీటిలో బి.1.617.2 రకం (దీనిని డెల్టా వేరియెంట్‌గా పిలుస్తున్నారు) అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని, ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన రెండు రకాలతో పెద్దగా ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ప్రమాదంలో ఆసియా దేశాలు భారత్‌లో బయటపడిన డెల్టా రకంతో ఆసియా దేశాలకు పెను ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థులకు కూడా ఈ వైరస్ సోకుతూ ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) అధికార ప్రతినిధి ఆండ్రేజ్ మహెకిక్ అన్నారు. ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంగా లేకపోవడం, వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడంతో డెల్టా వైరస్ అత్యధిక దేశాలకు విస్తరిస్తోందని అన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా గత రెండు నెలల కాలంలోనే ప్రపంచ దేశాల్లో 3.8 కోట్ల కేసులు నమోదయ్యాయని, 5 లక్షలకు పైగా మరణాలు సంభవించాయన్నారు. అన్ని దేశాల్లోనూ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. -
టిక్టాక్స్టార్కు ఊహించని షాక్: తృటిలో తప్పిన ప్రాణాపాయం
టిక్‌టిక్ స్టార్, మహిళా టూరిస్ట్ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వణికిపోయింది. అందంగా ఉందికదా అని ఒక సముద్ర జీవిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయింది. బుజ్జి..బుజ్జిగా భలే ఉంది అనుకుంటూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి షాక్ అయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవినా ఇంతసేపు తాను పట్టుకున్నదీ అని గజగజ వణికిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. వివరాల్లోకి వెళితే...కైలిన్ మేరీ అనే మహిళ బాలీ దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి బీచ్‌లో గోధుమరంగు శరీరం, గుండ్రటి మచ్చలతో అందంగా కనిపించిన చిన్న అక్టోపస్‌ను అబ్బురంగా తన అరచేతితో పట్టుకుంది. ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరవాత ఆసక్తికొద్దీ దీనిపై ఆన్లైన్లో సెర్చ్ చేసింది. అప్పుడు అర్థమైంది అమెకు అసలు సంగతి. సముద్రంలో ప్రాణాంతక జంతువులలో ఒకటిగా పరిగణించే నీలిరంగు అక్టోపస్ అని. చూడ్డానికి చాలా చిన్నదిగా కనిపించినా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అని తెలుసుకొని నివ్వెరపోయింది. ఈ భయానక సంఘటనపై తన తండ్రికి ఫోన్ చేసి భావోద్వేగానికి లోనైంది. ఈ విషయాలను ఆమె నెటిజనులతో పంచుకున్నారు. దీంతో వారుకూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదృష్టవంతులు..మీకు ఎలాంటి ప్రమాదం జరగనందుకు సంతోషం వ్యక్తం చేశారు. నీలిరంగు చుక్కల ఆక్టోపస్ : కేవలం 12 నుండి 20 సెం.మీటర్ల పరిమాణంతో చిన్నగా ఉన్నప్పటికీ ఇది చాలా విషపూరితమైన సముద్ర జీవి. ఈ నీలిరంగు చుక్కల ఆక్టోపస్‌లు మానవులకు ఎంత ప్రమాదకర మైనవంటే 26 మందిని నిమిషాల్లో అంతం చేసేంత విషాన్ని కలిగి ఉంటాయి. ఇది కాటు వేసినపుడు ఎలాంటి నొప్పి తెలియదట. విష ప్రభావంతో శ్వాసకోస ఇబ్బంది, పక్షవాతం లాంటి లక్షణాలతో బాధితులు విల విల్లాడుతున్నపుడు తప్ప విషయం అర్థం కాదట. అంతేకాదు దీని విషయానికి ఇంతవరకూ విరుగుడు కూడా అందుబాటులో లేదట. -
మోస్టు డేంజరస్ రోడ్లు ఎక్కడున్నాయంటే?
జోహన్నెస్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారులు ఎక్కడున్నాయో తెలుసా? దక్షిణాఫ్రికాలో. అక్కడ ప్రయాణం అంటే బెంబేలెత్తిపోవాల్సిందే. ఇంటికి తిరిగొచ్చేదాకా ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. మోస్టు డేంజరస్ రోడ్లలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్నేషన్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబీ తాజా అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమయ్యింది. అపాయకరమైన రోడ్ల విషయంలో మొత్తం 56 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రెండో స్థానంలో థాయ్‌లాండ్, మూడో స్థానంలో అగ్రరాజ్యం అమెరికా, నాలుగో స్థానం ఇండియా నిలిచాయి. ఇక బాగా సురక్షితమైన రోడ్లు ఎక్కడున్నాయంటే నార్వేలో ఉన్నాయట. ఈ విషయంలో రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో స్వీడన్ నిలిచాయి. అపాయకరమైన, సురక్షితమైన రోడ్లు ఉన్న దేశాలో ఏమిటో తేల్చేందుకు అధ్యయనకర్తలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య, ప్రయాణంలో సీటు బెల్టు ధరించే వారి సంఖ్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించిన మరణాలు, రోడ్లపై చట్టబద్ధమైన గరిష్ట వేగ పరిమితి తదితర అంశాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. జుటోబీ అధ్యయనంలో వెల్లడైన విషయాలను దక్షిణాఫ్రికాలో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జస్టిస్ ప్రాజెక్టు ఎస్ఏ(జేపీఎస్ఏ) చైర్పర్సన్ హోవార్డ్ డెంబోవిస్కీ తోసిపుచ్చారు. జుటోబీ సంస్థ కాలంచెల్లిన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేసిందని చెప్పారు. చదవండి: పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ఇలాగైతే కష్టమే! -
భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!
దాదాపు మిలియన్ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. భూమిపై లోతైనా సముద్రాలు, పోడవైన నదులు, ఎతైనా పర్వతాలు వాటి పుర్వొత్తారాల గురించి అందరికి తెలుసు. కానీ మనం నివసించే ఈ భూమిపై ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది.. ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్ పాలియోంటాలజిస్టు(శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణం) శాస్త్రవేత్తలు ఇటివల ఆధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు. పోర్ట్స్మౌత్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని కెమ్ కెమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు. అంతేగాక ఈ నది వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల, భూసంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం పుస్తకం కూడా రచించించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్‌కు చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబెర్-టూత్ కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్లు, ఎగిరే సరిసృపాలు నీటి వేట జంతువులు నివసించేవని వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని, భూమిపై ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారని కూడా చెప్పారు. -
వాళ్ల అత్యుత్సాహంతో వినాశనం తప్పదా?
బీజింగ్ : అన్ని రంగాల్లో ఆధిపత్యం చూపించాలన్న చైనా యత్నం విపత్కర పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. ఏలియన్లతో సంభాషించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో డిష్ ప్రాజెక్టు ఏర్పాటు దాదాపు పూర్తి చేసేసింది. దాని ద్వారా అంతరిక్ష రంగంలో సూపర్ పవర్ దేశంగా నిలవాలని డ్రాగన్ కంట్రీ యత్నిస్తోంది. 2016లో టియాంగ్‌గాంగ్-2 ను ప్రయోగించి అమెరికా, రష్యాలను వెనక్కినెట్టి అతిపెద్ద స్పేస్ ఎక్స్ ప్లోరర్ పవర్‌హౌజ్‌గా నిలిచింది. ఇప్పుడు అతిపెద్ద రేడియో డిష్ ద్వారా మరో ఘనత సాధించాలని యత్నిస్తోంది. వందల కోట్ల ఖర్చుతో 500 మీటర్ల గోళాకార రేడియో డిష్‌ను నెలకొల్పగా.. ప్యూర్టో రికోలో ఉన్న దానికంటే ఇది రెండింతలు పెద్దదని తేలింది. ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్‌ను పంపగలదని తెలుస్తోంది. తద్వారా సుదూర పాలపుంతల్లోని ఏలియన్స్ ఉనికిని తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చైనా భావిస్తోంది. గత వారం ఓ యూఎఫ్ఓ(ఫ్లైయింగ్ సాసర్) చైనా గోడ వద్ద కనిపించిందన్న పుకార్ల నేపథ్యంలో అధికారులు మరింత దూకుడు ప్రదర్శించి ఈ రేడియో డిష్‌లోని కొన్ని విభాగాలను యాక్టివ్ చేశారు కూడా. అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ విషయంలో మొదటి నుంచి అత్యుత్సాహం చూపిస్తూ వస్తున్నారు. చైనా ఏర్పాటు చేసిన రేడియో డిష్ ఇదే... అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎలియన్స్ తో మానవాళికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు కూడా. అవి మనిషికంటే తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చు. ఇది ఎలాంటిదంటే ‘ ఇటాలియన్ నావికుడు కొలంబస్.. అమెరికాను కనిపెట్టడం లాంటిదే’ అని హాకింగ్ పేర్కొన్నారు. మరోవైపు చైనాకే చెందిన రచయిత, గ్రహాంతరవాసులపై సుదీర్ఘ అధ్యయనాలు చేసిన పరిశోధకారుడు లియూ సిక్సిన్ ‘‘ఒక్కసారి ఎలియన్లు-మానవాళి ఎదురుపడితే.. ఇక సృష్టి వినాశనమే’’ అని తేల్చేశారు. కానీ, చైనా మాత్రం తమది ఓ సాహసామంటూ గొప్పగా చెప్పుకుంటోంది. గత వారం మనిషికి తోడుగా మరోజీవి ఉందన్న విషయం నిర్ధారణ అవుతుందని వారు పేర్కొంటున్నారు. గత వారం చైనా వాల్ దగ్గర గ్రహాంతర క్షిపణి(ఫ్లైయింగ్ సాసర్) అంటూ చైనా ప్రభుత్వం విడుదల చేసిన ఫోటో -
కెల్లీబ్రూక్.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ!?
లండన్ః అంతర్జాలంలో ఇప్పుడు ఓ మాయాజాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సెలబ్రిటీల రూపంలో యూజర్ల వివరాలను హాక్ చేసేస్తోంది. అవునండీ... కనిపించింది కదాని అందంగా ఉన్న సెలబ్రిటీని చూస్తూ మైమరిచిపోతే ఇక అంతే... మీ నెట్ జీవితంలో హాకర్ టెర్రర్.. ప్రవేశించినట్లే... లండన్ కు చెందిన సెలబ్రిటీ కెల్లీబ్రూక్ ఇప్పుడు మోస్ట్ డేంజరస్ గా తయారైంది. ఇంటర్నెట్ అభిమానుల మనసుదోచేస్తూ... ఫోటోపై క్లిక్ మనిపిస్తే చాలు... ఏకంగా వారి ఖాతాల్లోకి చొరబడిపోతోంది. యునైటెడ్ కింగ్డమ్.. ఇప్పుడు కెల్లీబ్రూక్ ఫోటో చూస్తే భయపడిపోతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీగా ఆమె మారిపోయింది. కెల్లీ ఫొటోను హాకర్స్ డేంజరస్ సిగ్నల్ గా మార్చేశారు. కంప్యూటర్లలో వైరస్ గా వ్యాపింపజేసేస్తున్నారు. మోడల్ గా ఎంతో పేరున్న కెల్లీ బ్రూక్ ఫొటోను నెట్లో ముట్టుకుంటే చాలు... ఇన్ఫెక్షన్ లా వైరస్ వ్యాపించేస్తోంది. ఆమెతోపాటు మరి కొందరి ఫొటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లను గడగడలాడిస్తున్నాయి. ఫెర్నాండెజ్ వెర్శిని, డచ్ డ్యాన్స్ డీజే... ఆర్మిన్ వాన్ బూరెన్లు కూడ కెల్లీ సరసన చేరిపోయారు. ఇంటర్నెట్లో వీరిలో ఎవ్వరి ఫొటోపై క్లిక్ చేసినా డేంజర్ లో పడినట్లే... ఒకప్పుడు ప్రపంచాన్ని కైపెక్కించిన సెక్సీయస్ట్ మహిళగా కెల్లీ బ్రూక్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అంత కాకపోయినా.. గ్లామరస్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు నిలబెట్టుకుంది. అటువంటిది హాకర్ల బారిన పడి ప్రస్తుతం డేంజరస్ సెలబ్రిటీగా తయారైంది. యాక్టర్ గా మారిన మోడల్ కెల్లీ ఫొటోలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నారు నెట్ సెక్యూరిటీ నిపుణులు. ఆమె ఫొటోలను ఇప్పుడు హ్యాకర్లు ఎక్కువగా వాడుతున్నారని, తెలియక ఆమె ఫొటోలను క్లిక్ చేస్తే వారి వెబ్ సైట్లు వైరస్ తో నిండిపోతాయని హెచ్చరిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన వెబ్ సెక్యూరిటీ సంస్థ మెక్ ఎఫీ మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్టులో కెల్లీ బ్రూక్ తో పాటు ఫెర్నాండెజ్ వెర్శింట్ ను కూడ టాప్ లిస్టులో చేర్చింది. -
కాటేస్తే కానరాని లోకాలకే!
సాక్షి, స్కూల్ ఎడిషన్: పాము కాటుకు మనిషి ప్రాణాలు వదలడం చూశాం... కప్ప నోట్లో కూడా విషం ఉంటుందా? తేలు కొండెంలో విషం ఉంటుందని తెలుసు... సాలె పురుగు కూడా మనిషిని చంపుతుందా?... కింగ్ కోబ్రా విషం చిమ్మితే ఏనుగు లాంటి బలమైన జంతువు కొన్ని గంటల్లోనే చనిపోతుందని తెలుసు... నత్త నుంచి వచ్చే ఒక్క విషపు చుక్కతో 20 మందిని చంపవచ్చా? అంటే మాత్రం అవుననక తప్పదు. ఇలాంటి పది జీవుల గురించి తెలుసుకుందాం.. డార్ట్ ఫ్రాగ్... ఈ కప్ప చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ముదురు నీలం రంగులో ఉండి శరీరం అంతా నల్ల చుక్కలను కలిగి ఉంటుంది. ఈ కప్పలు మధ్య, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనపడతాయి. ఒక కప్పలో 10 మందిని చంపగలిగేంత విషం ఉంటుంది. ఇవి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పుప్ఫర్ ఫిష్... సముద్రాల్లో ఉండే ఈ పుప్ఫర్ ఫిష్ చాలా ప్రమాదకర జీవి. ముదురు నీలం రంగులో బంతి ఆకారంలో ఉండి శరీరం అంతా ముళ్లు ఉంటాయి. ఈ చేపలో దాదాపు 30 మందిని చంపేంత విషం ఉంటుంది. ఈ విషం లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అయితే అప్పుడే పుట్టిన ఈ చేపలు అంత విషపూరితం కావు. వీటితో చేసే వంటను చైనాలో బాగా తింటారు. ఆ వంటపేరు 'ఫుగు'. తేలు.. బంగారు వర్ణంలో ఉన్న ఈ కొండెం కలిగిన తేలు చాలా చురుకుగా ఉంటుంది. తూర్పు, ఉత్తర ఆఫ్రికాల్లోని ఎడారుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇది కుడితే చాలా నొప్పి ఉంటుంది. అంతేకాదు కుట్టిన వెంటనే సరైన వైద్యం అందకపోతే శరీరంలోని చాలా బాగాలు పనిచేయకుండా పోవడంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కింగ్ కోబ్రా... కింగ్ కోబ్రా 18 అడుగుల పొడవుతో ఎక్కువ విషం కలిగిన పాముగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆఫ్రికన్ ఏనుగును కూడా కొన్ని గంటల్లోనే చంపేంత శక్తి దీని విషానికి ఉంది. ఇది కాటు వేస్తే విపరీతమైన నొప్పి ఉంటుంది. అంతేకాదు వెంటనే వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం. ఇన్‌ల్యాండ్ తైపాన్... ఈ విషపూరిత తైపాన్లు మధ్య ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. మామూలు కోబ్రాలతో పోల్చితే ఈ పాములు 200 శాతం ప్రమాదకరమైనవి. 100 మందిని చంపగలిగేంత విషం ఈ పాముల్లో ఉంటుంది. అయితే ఇవి మనుషులపై దాడి చేసిన సంఘటనలు చాలా తక్కువ. ఇవి సారవంతమైన నేలలు, రాళ్లల్లో ఎక్కువగా ఉంటాయి. బాక్స్ జెల్లీ ఫిష్... క్యూబిక్ ఆకారంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ చాలా ప్రమాదకారి. సముద్ర జీవి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ 10 అడుగుల పొడువు ఉంటుంది. ప్రతి వైపు 15 స్పర్శాంగాలు ఉంటాయి. ఒక్కో స్పర్శాంగానికి 5000 జీవకణాలు ఉంటాయి. దీని విషం నరాలు, గుండెపై ప్రభావం చూపుతుంది. సముద్రపు ఒడ్డుకు చేరేలోపు చనిపోతారు. స్టోన్ ఫిష్.. కదలకుండా చూడడానికి రాయిలాగా ఉంటుంది కాబట్టి దీనిని రాయి ఆకారపు చేప (స్టోన్ ఫిష్) అంటారు. పసిఫిక్ సముద్రాల్లో ఈ చేపలు ఎక్కువగా ఉంటాయి. గడ్డకట్టిన మట్టి, బురదలాగా ఉండే చోట ఎక్కువగా ఉంటాయి. ఆహారం కోసం, అవసరమైనప్పుడు తప్ప మరే సమయాల్లో ఇది ఎక్కువగా కదలదు. అయితే నిశితంగా గమనిస్తూ ఉంటుంది. వెనుకభాగంలో వెన్నముక కలిగి ఉంటుంది. దీని విషం కూడా అక్కడే ఉంటుంది. ఈ చేప విషం మాత్రం మనపై పడితే విపరీతమైన నొప్పి ఉంటుంది. వాపు వస్తుంది. కండరాలు పనిచేయకుండా పోతాయి. దాదాపు పక్షవాతం వచ్చినంత పని అవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం. బ్లూ ఆక్టోపస్... ఆక్టోపస్ కుటుంబంలోనే ఈ బ్లూ ఆక్టోపస్ చాలా చిన్నది. 20 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది కానీ చాలా ప్రమాదకారి. తన ఉమ్మి ద్వారా రెండు రకాల విషాలను బయటకు పంపిస్తుంది. ఒకటేమో ఆహారం అవసరమైనప్పుడు పీతలను వేటాడడానికి, మరొకటి మనుషులను చంపడానికి. వీటి నుంచి వచ్చే 25 గ్రాముల విషంతో 10 మంది చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ విషం మీద పడితే ఎలాంటి నొప్పి ఉండదు. తిమ్మిరిగా ఉంటుంది. వాంతులు అవుతాయి. వికారంగా ఉంటుంది. శ్వాస కూడా సరిగా తీసుకోలేరు. సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణం పోయినట్లే. నత్త... పాలరాతి శంకువు ఆకారంలో ఉండే ఈ నత్తలు ఎక్కువగా భారతదేశ సముద్రాల్లో ఉంటాయి. వీటిల్లో ఎంత ప్రమాదకర విషం ఉంటుందంటే ఒక్క చుక్క విషంతో 20 మందిని చంపగలిగేంత. సముద్రాల్లోకి వెళ్లేవాళ్లు అజాగ్రత్తగా ఉంటే వీటికి బలి కావలసిందే. బ్రెజీలియన్ స్పైడర్... బ్రెజీలియన్ వండరింగ్ స్పైడర్ పేరుతో పిలిచే ఈ సాలెపురుగు చాలా డేంజరస్. ఇది ప్రమాదకర విష పూరిత సాలె పురుగుగా 2007లో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. నొప్పి తెలియకుండానే చంపేస్తుంది. దీనిని అరటిపండు సాలెపురుగు (బనానా స్పైడర్)గా కూడా పిలుస్తారు. నాలుగు నుంచి ఐదు అంగుళాల పొడవున్న కాళ్లు, 8 కళ్లు కలిగి ఉంటుంది. అందులో రెండు కళ్లు మాత్రం పొడవుగా ఉంటాయి. అడవుల్లోను, ఇళ్లల్లోనూ, జనసంచారం లేని ప్రదేశాల్లో ఇవి నివాసాలు ఏర్పరుచుకుంటాయి. అయితే ఈ సాలె పురుగులు తమ ఆత్మరక్షణకు మాత్రమే విషాన్ని వెదజల్లుతాయి. -
మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరం మీద దాడిచేసి.. పలుప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఫ్రెంచి పోలీసులు మట్టుబెట్టారు. మరొకరు లొంగిపోయారు. అయితే.. ఈ ఆపరేషన్ నుంచి నేర్పుగా తప్పించుకున్నది మాత్రం.. ఓ మహిళా టెర్రరిస్టు. ఆమె పేరు హయత్ బౌముదీన్. ఆమె అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, సాయుధురాలని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు. ఆమెను పట్టుకోడానికి తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. మూడు దాడుల్లో పాల్గొన్నవాళ్లు ఒకరికొకరు అంతా తెలుసని, వారంతా కూడా యెమెన్ దేశంలోని అల్ కాయిదా శిబిరాల్లో శిక్షణ పొందారని అంటున్నారు. 'డబుల్ ట్యాప్' అంటే.. ఒక తుపాకి నుంచి ఒకేసారి రెండు బుల్లెట్లు కాల్చడం లాంటివి అత్యంత అధునాత ఆయుధాల ఉపయోగంలో ప్రొఫెషనల్ శిక్షణ పొందినవాళ్లు మాత్రమే చేయగలిగిన పని. అలాంటి తరహాలో వీళ్లు కాల్పులు జరిపారు. కౌచి సోదరులను పోలీసులు మట్టుబెట్టినా, మహిళా ఉగ్రవాది హయత్ బౌముదీన్ మాత్రం అక్కడినుంచి తప్పించుకోవడంతో ఫ్రాన్సుకు ఇంకా ఉగ్రవాద ముప్పు తప్పలేదనే అధికారులు భావిస్తున్నారు. ఫ్రెంచి ప్రధాని హోలండ్ కూడా ఇదే విషయం చెబుతున్నారు.