బీజింగ్ : అన్ని రంగాల్లో ఆధిపత్యం చూపించాలన్న చైనా యత్నం విపత్కర పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. ఏలియన్లతో సంభాషించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో డిష్ ప్రాజెక్టు ఏర్పాటు దాదాపు పూర్తి చేసేసింది. దాని ద్వారా అంతరిక్ష రంగంలో సూపర్ పవర్ దేశంగా నిలవాలని డ్రాగన్ కంట్రీ యత్నిస్తోంది.
2016లో టియాంగ్‌గాంగ్-2 ను ప్రయోగించి అమెరికా, రష్యాలను వెనక్కినెట్టి అతిపెద్ద స్పేస్ ఎక్స్ ప్లోరర్ పవర్‌హౌజ్‌గా నిలిచింది. ఇప్పుడు అతిపెద్ద రేడియో డిష్ ద్వారా మరో ఘనత సాధించాలని యత్నిస్తోంది. వందల కోట్ల ఖర్చుతో 500 మీటర్ల గోళాకార రేడియో డిష్‌ను నెలకొల్పగా.. ప్యూర్టో రికోలో ఉన్న దానికంటే ఇది రెండింతలు పెద్దదని తేలింది. ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్‌ను పంపగలదని తెలుస్తోంది. తద్వారా సుదూర పాలపుంతల్లోని ఏలియన్స్ ఉనికిని తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చైనా భావిస్తోంది. గత వారం ఓ యూఎఫ్‌ఓ(ఫ్లైయింగ్ సాసర్) చైనా గోడ వద్ద కనిపించిందన్న పుకార్ల నేపథ్యంలో అధికారులు మరింత దూకుడు ప్రదర్శించి ఈ రేడియో డిష్‌లోని కొన్ని విభాగాలను యాక్టివ్ చేశారు కూడా. అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ విషయంలో మొదటి నుంచి అత్యుత్సాహం చూపిస్తూ వస్తున్నారు.
చైనా ఏర్పాటు చేసిన రేడియో డిష్ ఇదే...
అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎలియన్స్ తో మానవాళికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు కూడా. అవి మనిషికంటే తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చు. ఇది ఎలాంటిదంటే ‘ ఇటాలియన్ నావికుడు కొలంబస్.. అమెరికాను కనిపెట్టడం లాంటిదే’ అని హాకింగ్ పేర్కొన్నారు. మరోవైపు చైనాకే చెందిన రచయిత, గ్రహాంతరవాసులపై సుదీర్ఘ అధ్యయనాలు చేసిన పరిశోధకారుడు లియూ సిక్సిన్ ‘‘ఒక్కసారి ఎలియన్లు-మానవాళి ఎదురుపడితే.. ఇక సృష్టి వినాశనమే’’ అని తేల్చేశారు. కానీ, చైనా మాత్రం తమది ఓ సాహసామంటూ గొప్పగా చెప్పుకుంటోంది. గత వారం మనిషికి తోడుగా మరోజీవి ఉందన్న విషయం నిర్ధారణ అవుతుందని వారు పేర్కొంటున్నారు.
గత వారం చైనా వాల్ దగ్గర గ్రహాంతర క్షిపణి(ఫ్లైయింగ్ సాసర్) అంటూ చైనా ప్రభుత్వం విడుదల చేసిన ఫోటో
Comments
Please login to add a commentAdd a comment