ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్‌ ఎక్కడంటే? | most dangerous countries for women 2024 | Sakshi
Sakshi News home page

ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్‌ ఎక్కడంటే?

Published Sun, Aug 25 2024 9:34 AM | Last Updated on Sun, Aug 25 2024 10:01 AM

most dangerous countries for women 2024

కోల్‌కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన  కారణం తెలీదు.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా ట్రెండ్ అవుతోంది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలోని దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి..


దక్షిణాఫ్రికా
ఇప్పటివరకు మహిళలకు రక్షణ లేని దేశాలలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది.  ఇక్కడ రోడ్లపై ఒంటరిగా నడిచే మహిళలకు భద్రత చాలా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, డ్రైవింగ్ లేదా కాలినడకలో బయటకు వెళ్లటం మంచిది కాదని పలు కథనాలు వెల్లడించాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రపంచంలోనే ఆడవారికి  రక్షణ విషయంలో  చాలా ప్రమాదకరమైన దేశం దక్షిణాఫ్రికా అని పేర్కొంది. ఇక్కడ కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే తాము ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించటం గమనార్హం.

భారతదేశం
ఆసియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటీవల ఓ స్పానిష్ జంట భారత్‌తో తాము హింస అనుభవించినట్లు నమోదైన కేసు కూడా వైరల్‌గా మారింది. భారత్‌లో మహిళలు లైంగిక వేధింపులు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు పరిశీలిస్తే.. బలవంతంగా కార్మికులుగా మార్చటం, లైంగిక వేధింపు ఘటనలు పెరగటం, మానవ అక్రమ రవాణా ఇప్పటికీ దేశ భద్రతను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్
తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని రాయిటర్స్ నివేదించింది. అయితే ఇక్కడ లైంగిక  హింస కంటే.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవటం, బాలికల చదువుపై నిషేధాలు విధించటం వంటి వాటివల్ల మహిళలు ఆఫ్ఘనిస్తాన్‌ తమకు సురక్షితమైన దేశం కాదని భావిస్తున్నట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ తాలిబన్లు అమలు చేసే నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.

సిరియా
మహిళలు తీవ్రమైన లైంగిక, గృహ వేధింపులకు గురవుతున్న మరో దేశం సిరియా. ఇక్కడ మహిళలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. మధ్య ప్రాచ్య దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో సిరియా ఒకటి.

సోమాలియా
మహిళల హక్కులు, భద్రతను పట్టించుకోని మరో దేశం సోమాలియా. రాయిటర్స్ నివేదించిన ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు పెంచుకోవటం పరంగా మహిళలకు ఇక్కడ చాలా సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. హానికరమైన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పాటించటం ఇక్కడి మహిళలకు శాపంగా మారుతోంది.


సౌదీ అరేబియా
మహిళల హక్కులలో సౌదీ అరేబియా కొంత పురోగతి సాధించినప్పటికీ త్రీవమైన లింగ వివక్ష కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో ఉండే రక్షణ, ఆస్తి హక్కులకు సంబంధించి ఇక్కడి మహిళలకు సౌదీ అరేబియా సురక్షితంకాని దేశంగా మిగిలిపోయింది.

పాకిస్తాన్
ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, మహిళల పట్ల వివక్ష చూపించటంలో మహిళలకు రక్షణలేని దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు హానికరమైన మత, సాంప్రదాయ పద్ధతులు సవాలుగా మారుతున్నాయి. ఇక్కడి మహిళపై దారుణమైన పరువు హత్యలు నమోదు కావటం గమనార్హం.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
ఈ దేశంలో చట్టవిరుద్ధం, కక్షపూరిత  అల్లర్ల కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు.. ఇక్కడి మహిళలు తీవ్రమైన వేధింపుల బారినపడుతున్నారని పేర్కొంది.

యెమెన్
తరచూ మానవతా సంక్షోభాలకు గురవుతున్న యెమెన్ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులు మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ దేశం మహిళలకు సురక్షితమైన దేశం కాదని పలు వార్తలు వెలువడ్డాయి.

నైజీరియా 
నైజీరియాలో మహిళలకు రక్షణ లేకపోవడాని అక్కడి ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సంస్థ కారణమని ప్రజలు నమ్ముతారు. తీవ్రవాదులు పౌరులను హింసించటం, మహిళలను అత్యాచారం, హత్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నైజీరియన్ మహిళలు హానికరమైన సాంప్రదాయ పద్ధతులు పాటించటం, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీంతో ఈ దేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మిగులుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement